రూట్‌ సారథ్యంలో... | Joe Root Named England Test Captain; Dan Lawrence Returns for Pakistan Series | Sakshi
Sakshi News home page

రూట్‌ సారథ్యంలో...

Aug 7 2026 4:37 AM | Updated on Aug 7 2026 11:55 AM

Joe Root named captain of England Test team

లండన్‌: రెండేళ్ల విరామం అనంతరం డాన్‌ లారెన్స్‌ ఇంగ్లండ్‌ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నెల 19 నుంచి పాకిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ గురువారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. బెన్‌ స్టోక్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం తిరిగి జో రూట్‌ సారథిగా ఎంపిక కాగా... గాయం కారణంగా జాకబ్‌ బెథెల్‌ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. 2024లో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడిన లారెన్స్‌... బ్యాటింగ్‌ ఆర్డర్‌లో స్టోక్స్‌ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఆఫ్‌స్పిన్‌ వేయగలగడం లారెన్స్‌కు అదనపు బలం.

బ్రెండన్‌ మెకల్లమ్‌ స్థానంలో ఇటీవల ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌గా ఎంపికైన స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ గైర్హాజరీలో ట్రెస్కోథిక్‌ జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. గత తొమ్మిది టెస్టుల్లో ఏడింట ఓడిన ఇంగ్లండ్‌... 2024 డిసెంబర్‌ తర్వాత టెస్టు సిరీస్‌ గెలవలేదు. ఇంగ్లండ్‌ జట్టు: రూట్‌ (కెప్టెన్‌), ఆర్చర్, అట్కిన్సన్, బషీర్, బ్రూక్, కార్స్, సామ్‌ కుక్, కాక్స్, డకెట్, ఫిషెర్, ఎమిలియో, లారెన్స్, పోప్, రాబిన్‌సన్, జేమీ స్మిత్, టంగ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement