800 మీటర్ల సెమీస్‌లో వెంకట్రామ్‌రెడ్డి
యుజీన్ (అమెరికా): ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఈరోజు పతకాల బోణీ చేసే అవకాశముంది. మహిళల డిస్కస్ త్రో ఈవెంట్‌లో అమానత్ కంబోజ్... పురుషుల జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్, ధరణీధరన్ ఫైనల్లోకి ప్రవేశించారు. డిస్కస్ త్రో క్వాలిఫయింగ్‌లో అమానత్ డిస్క్‌ను 52.58 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా 12వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. డిస్కస్ త్రో ఫైనల్ నేడు జరుగుతుంది.
ఆశిష్ జావెలిన్‌ను 69.87 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో, ధరణీధరన్ 68.07 మీటర్ల దూరం విసిరి 12వ స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొగలి వెంకట్రామ్ రెడ్డి పురుషుల 800 మీటర్ల విభాగంలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించాడు. హీట్–5లో వెంకట్రామ్ 1 నిమిషం 52.81 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు.


