సీజేపీ జాతీయ కార్యవర్గం ఇదే.. తెలుగు వ్యక్తికి చోటు | Cockroach Janata Party Announces National Executive | Sakshi
Sakshi News home page

సీజేపీ జాతీయ కార్యవర్గం ఇదే.. తెలుగు వ్యక్తికి చోటు

Aug 6 2026 7:31 PM | Updated on Aug 6 2026 7:53 PM

Cockroach Janata Party Announces National Executive

ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) గురువారం జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దేశవ్యాప్త కార్యక్రమం ‘క్యా బోల్తీ పబ్లిక్’ను కూడా ఇవాళే ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నుంచి పార్టీ దేశమంతా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతుందని తెలిపారు. సీజేపీ ఇకపై నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను తమ రాజకీయ కార్యాచరణలో ప్రధానంగా నిలపనుంది.

సీజేపీ జాతీయ కార్యవర్గం

జాతీయ కన్వీనర్‌- అభిజీత్ దీప్కే

కో-కన్వీనర్లు - అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్

నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్‌చార్జ్ - అజింక్యా షిండే

ఆర్గనైజేషన్ కో ఇన్‌చార్జ్- దీపక్ బలియన్

జాతీయ కార్యదర్శి- ఆఫ్రీన్ నవాజ్

సీజేపీ మీడియా లీడ్  -విజయ్ రెడ్డి మల్లంగి (తెలుగు వ్యక్తి )

న్యాయ వ్యవహారాల ఇన్‌చార్జ్ - రత్న సింగ్

రీసెర్చ్ & పాలసీ లీడ్ - వైష్ణవి గౌర్

టెక్నాలజీ లీడ్- రోహన్ దేశ్‌పాండే

ఫైనాన్స్ లీడ్ -యోగేష్ ఇంగాలే

జోనల్ లీడర్‌షిప్‌గా..

నార్త్ జోన్- దీపక్ బలియన్

దక్షిణ జోన్ -విజయ్ రెడ్డి మల్లంగి (తెలుగు వ్యక్తి)

తూర్పు & ఈశాన్య జోన్లు- అంకిత్ భరద్వాజ్

పశ్చిమ జోన్- యోగేష్ ఇంగలే

రాబోయే ఆరు నెలల్లో, సీజేపీ భారతదేశవ్యాప్తంగా రాష్ట్ర సమన్వయ కమిటీలతో పాటు లోక్‌సభ, నగర స్థాయి సమన్వయ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. 

Image

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement