సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు తమపై ఒత్తిడి చేశారని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హోటల్ నిర్వాహకులు లక్ష్మీ అన్నారు. ‘‘మా హోటల్‌లో ఏదో జరిగిందంటూ చెప్పమన్నారు. తర్వాత తహశీల్దారు మా దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు రమ్మన్నారని చెప్పారు. కారు పంపిస్తామనీ అందులో రావాలనీ చెప్పారు. మాకు భయం వేసింది. వైఎస్ జగన్ హయాంలో మాకు ఇంటి స్థలాలు వచ్చాయి. ఆయన హయాంలో మాకు చాలా మేలు జరిగింది’’ అని ఆమె మీడియాకు వివరించారు.
ఇవాళ.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దేవరపల్లి హోటల్ నిర్వాహకులు కలిశారు. వైఎస్ జగన్ దేవరపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రం పర్యటనలో జనం రద్దీ వల్లే తోపులాట జరిగిందని.. అంతేకానీ వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ జగన్‌కు హోటల్ నిర్వాహకులు చందన వరలక్ష్మి, చందన దివ్య వివరించారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తమ హోటల్ ధ్వంసం చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదన్న నిర్వాహకులు.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తమ కుటుంబం లబ్ధిపొందినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.


