సాక్షి, అమరావతి: దిశా చట్టాన్ని రద్దు చేయాలని చంద్రబాబు కేబినెట్ నిర్ణయించింది. దిశా చట్టం ప్రత్యేకంగా అవసరం లేదని రద్దుచేస్తున్నట్టు హోంమంత్రి ప్రకటించారు. దిశ చట్టం లేకుండానే దిశ వ్యవస్థను ఆచరణలో పెట్టినట్టు వెల్లడించారు. బిఎన్‌ఎస్ చట్టాలు చాలు కాబట్టి దిశ చట్టం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మహిళలను వేధించే వారికి త్వరగా శిక్షపడేలా గత ప్రభుత్వం దిశా బిల్లు తీసుకొచ్చింది. అయితే, 21 రోజుల్లో శిక్ష పడేలా తీసుకొచ్చిన మార్పును హోంమంత్రి అనిత తప్పుపట్టారు.
అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్
కాగా, అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్‌కి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,433 ఎకరాల భూ సమీకరణ చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మోతడక గ్రామంలో భూ సమీకరణ చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైస్పీడ్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ పేరుతో భూ సమీకరణకు నిర్ణయించింది. హైకోర్టు భవనాన్ని మళ్లీ రీ డిజైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 206 కోట్లతో అదనపు కన్సల్టెంట్‌ను నియమించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.


