కృష్ణా జిల్లా: వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు | Krishna District: Police Restrictions On Ysrcp Protest Rally | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లా: వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు

Sep 20 2026 10:03 PM | Updated on Sep 20 2026 10:03 PM

Krishna District: Police Restrictions On Ysrcp Protest Rally

సాక్షి, కృష్ణా జిల్లా: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ రేపు(సోమవారం) నిర్వహించనున్న ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. నిరసన ర్యాలీకు అనుమతి లేదంటూ పోలీసులు నోటిసులు జారీ చేశారు. ఇవాళ పెనమలూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. డీఎస్సీ నిరసనలో పాల్గొంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

కాగా, నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌కు శనివారం మాచవరం ఎస్‌ఐ యోగేష్‌ నోటీసు అందించారు. విజయవాడలో ఎలాంటి ర్యాలీకి అనుమతి లేదని సెంట్రల్‌ ఏసీపీ పేరుతో ఆ నోటీసును అందజేశారు. ర్యాలీ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కూటమి పార్టీలకు మద్దతుగా చేసే ర్యాలీలకు అనుమతించే పోలీసులు, ప్రతిపక్షాల ర్యాలీలపై ఉక్కుపాదం మోపడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఇదీ చదవండి: భేతాళ కేసులో ‘స్క్రిప్టెడ్‌ సాక్ష్యం’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement