వైఎస్ జగన్‌ని కలిసిన దేవరపల్లి హోటల్ నిర్వాహకులు | Devarapalli Hotel Organizers Meet YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌ని కలిసిన దేవరపల్లి హోటల్ నిర్వాహకులు

Aug 6 2026 4:20 PM | Updated on Aug 6 2026 4:33 PM

Devarapalli Hotel Organizers Meet YS Jagan

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హోటల్ నిర్వాహకులు ఇవాళ(గురువారం) కలిశారు. తమ హోటల్‌ని పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని హోటల్ నిర్వాహకురాలు లక్ష్మీ ఖండించారు. వైఎస్‌ జగన్‌ పర్యటనలో జనం రద్దీ వల్లే తోపులాట జరిగిందన్న లక్ష్మీ.. అంతేకానీ వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనే తమ కుటుంబం లబ్ధిపొందిందని హోటల్ నిర్వాహకులు అన్నారు.

టీడీపీ నేతలు మాపై ఒత్తిడి చేశారు. మా షాపులో ఏదో జరిగిందంటూ చెప్పమన్నారు. తర్వాత తహశీల్దారు మా దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు రమ్మన్నారని చెప్పారు. కారు పంపిస్తామనీ అందులో రావాలనీ చెప్పారు. మాకు భయం వేసింది. జగన్ హయాంలో మాకు ఇంటి స్థలాలు వచ్చాయి. ఆయన హయాంలో మాకు చాలా మేలు జరిగింది. ఇవాళ వైఎస్‌ జగన్‌ని కలిసినందుకు ఆనందంగా ఉందని నిర్వాహకులు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement