‘వ్యవస్థల్ని ధ్వంసం చేస్తే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది’ | YSRCP Leader Sailajanath Lashes Out At Chandrababu Sarkar | Sakshi
Sakshi News home page

‘వ్యవస్థల్ని ధ్వంసం చేస్తే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది’

Sep 26 2026 3:56 PM | Updated on Sep 26 2026 4:04 PM

YSRCP Leader Sailajanath Lashes Out At Chandrababu Sarkar

విజయవాడ: డీఎస్సీ అక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ చేసిన తప్పులు బయటపడ్డాయని, వారు తప్పు చేశామని ఒప్పుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. ‘దౌర్జన్యంతో డీఎస్సీ అంశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీ అధ్వర్యంలో జరిగిన డీఎస్సీలో ఏం చేశారో అందరికీ అర్థమైంది. 

మేం తప్పు చేయలేదంటే సీబీఐ విచారణ చేయించుకుని కడిగిన ముత్యంలా బయటకు రండి. ఈ అంశంలో మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

సాయికృష్ణ ఉదంతంలో పోలీసులకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అసలు గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఊచకోతల వల్లే అట్రాసిటీ చట్టం వచ్చింది. తిరిగి ఆ చట్టాలు మా మీద ప్రయోగం చేస్తున్నారు. దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికల్లో మా మీద పోటీ చేసి గెలవాలి. వ్యవస్థల్ని ధ్వంసం చేయాలి అనుకుంటే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది.

ఇదీ చదవండి:  సీపీకి ఆధారాలిచ్చాం.. లోకేశ్‌పైనా రౌడీషీట్‌ తెరవాల్సిందే!: అంబటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement