‘ ఆ ఘనత మా అధినేత కేసీఆర్‌దే’ | BRS Leader Jagadish Reddy Slams Congress Govt | Sakshi
Sakshi News home page

‘ ఆ ఘనత మా అధినేత కేసీఆర్‌దే’

Sep 26 2026 3:39 PM | Updated on Sep 26 2026 3:50 PM

BRS Leader Jagadish Reddy Slams Congress Govt

హైదరాబాద్‌:  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అటకెక్కించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత కేసీఆర్‌ తెలంగాణను చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్తే, ఇప్పుడు కాంగ్రెస్‌ ఆ వెలుగును నిలబెట్టడంలో విఫలమైందన్నారు. ప్రధానంగా సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. 

తెలంగాణ భవన్‌ నుంచి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ సాధ్యం కాదన్న 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాలకు కొన్ని నెలల్లోనే అందించిన ఘనత కేసీఆర్‌ది. రూ. 36 వేల కోట్లను ట్రాన్స్ కో పై వెచ్చించిన నేత కేసీఆర్. ఎక్కడ కరెంటు పోయినా ఒక చోటి నుంచి ఇంకో చోటుకు విద్యుత్ అందించే వ్యవస్థను  హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. 

పవర్ ఉన్నా ఇవ్వలేము అని రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్ళలో అధికారులు అనే వారు. కేసీఆర్ సీఎంగా మొదటి రివ్యూ చేసింది విద్యుత్‌పైనే. మూడేళ్ల లోనే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మెరుగు పరిచి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారు. 28 వేల కిలోమీటర్లు  విద్యుత్ లైన్లు వేశాం. అన్ని రకాల కేవీ సబ్ స్టేషన్ల సంఖ్యను ఎన్నో రెట్లు పెంచాం .ట్రాన్స్ కో లాభాల్లో నడుస్తోంది. ఈ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తోంది. అవినీతి సొమ్ముకు ఆశపడి ప్రైవేటు పరం చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: బీజేపీకి అవసరమైన చోటే ఓట్ల చోరీ: టీపీసీసీ చీఫ్‌


.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement