ఫైల్‌ఫోటో
విజయవాడ: రేపు గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల జరప తలపెట్టిన ఛలో విజయవాడకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వారిని నిర్బంధించే దిశగా పోలీసుల కార్యాచరణ కనిపిస్తోంది. తమ డిమాండ్ల సాధనకై ఇప్పటికే ప్రభుత్వంతో రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే దీన్ని అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు.
ప్రతీ జిల్లాలోనూ ఎస్పీల ద్వారా ప్రెస్‌మీట్‌లు పెట్టించి మరీ వారిని బెదిరిస్తున్నారు. ఎవరైనా ఛలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారు. దాంతో రేపటి గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమంపై సందిగ్థం కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదే లేదని ఆ ఉద్యోగుల సంఘం జేఏసీ హెచ్చరిస్తోంది. తమ డిమాండ్ పై స్వష్టమైన ఆదేశాలు వొచ్చే వరకు వెనక్కి తగ్గమని అంటోంది.
ఇదీ చదవండి: పడితే మొదటి కత్తిపోటు నా మీదే పడాలి’


