breaking news
Ward Secretariat
-
బాబు పాలనలో ఎన్ని విచిత్రాలో.. చనిపోయిన ఉద్యోగికి బదిలీ
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇష్టారాజ్యంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. చనిపోయిన ఉద్యోగిని కూడా చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు తప్పుల తడకగా మారింది. పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నామంటున్నా ప్రభుత్వం.. చనిపోయిన వారిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ లిస్టులో పేర్కొంది.మూడేళ్ల క్రితం, రెండేళ్ల క్రితం సచివాలయ ఉద్యోగం మానేసిన వాళ్లని కూడా బదిలీల లిస్ట్‌లో పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కొంత మందిని పాత సచివాలయమే కేటాయించారు. ఇలా.. తమకు అనుకూలమైన వారికి ఉన్న చోటే పోస్టింగ్‌లు ఇచ్చారు.కొండ ప్రాంతాలకు దివ్యాంగులను బదిలీ చేసింది. కౌన్సిలింగ్ నిర్వహించకుండానే ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం అంటూ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. బదిలీలన్నీ రద్దుచేసి కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న(శనివారం) విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌ను సచివాలయ ఉద్యోగులు ముట్టడించారు. -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 30లోగా వీరి విధుల హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియను పూర్తిచేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు స్పష్టంచేస్తూ బదిలీ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి కె. భాస్కర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం మే 31 నాటికి ఒకే గ్రామ, వార్డు సచివాలయంలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీచేయాలి. ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగులను కూడా వారి అభ్యర్థన మేరకు బదిలీ చెయ్యొచ్చు. అలాగే..⇒ ఉద్యోగులను వారి సొంత మండలానికి బదిలీ చేయకూడదు. n దృష్టిలోపం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. మానసిక వికలాంగ పిల్లలు ఉన్న ఉద్యోగులను సంబంధిత వైద్య సౌకర్యాలు అందుబాటులో చోటుకు లేదా వారు కోరుకునే ప్రాంతానికి బదిలీచేయాలి. ⇒ గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులకు, 40 శాతం వైకల్యంగల ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ⇒ క్యాన్సర్, ఓపెన్‌హార్ట్ ఆపరేషన్, న్యూరో సర్జరీ, కిడ్ని ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి వ్యాధులతో బాధపడే ఉద్యోగులను లేదా ఆ ఉద్యోగులపై ఆధారపడిన భార్య లేదా పిల్లలుంటే అటువంటి వారిని ఆయా వైద్య సౌకర్యాలున్న ప్రాంతాలకు బదిలీచేయాలి. ⇒ కారుణ్య ప్రాతిపదికన నియమించిన వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ⇒ దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు బదిలీ నుంచి మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ బదిలీ కోసం అభ్యర్థిస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ కేటగిరిలో స్పష్టమైన ఖాళీ లభ్యత ఆధారంగా కోరుకున్న చోటుకు బదిలీచేయాలి. ⇒ భార్యాభర్తలు ఉద్యోగులైతే ఇద్దరినీ ఒకే స్టేషన్‌కు లేదా దగ్గరగా ఉన్న స్టేషన్లకు బదిలీచేయాలి. ⇒ గిరిజన, మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి కలెక్టర్లు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులు నిర్ధేశిత గడువులోగా విధుల్లో చేరాలి. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ⇒ ఇక నిధులు చెల్లింపు పెండింగ్ ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేయకూడదు. ⇒ ఉద్యోగుల బదిలీలను ఈ మార్గదర్శకాల మేరకు అత్యంత పారదర్శకంగా ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు అవకాశంలేకుండా గడువులోగా పూర్తిచేయాలి.సొంత మండల పరిధిలోనే బదిలీలు చేయాలి..గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కోరుకున్న వారిని మినహాయించి మిగిలిన వారినందరినీ సొంత మండలాల పరిధిలోనే బదిలీలు కల్పించాలని గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం.డి. జానీపాషా, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు ప్రభుత్వాన్ని కోరారు.ఇతర మండలాలకు వారిని బదిలీ చేయాలనే నిబంధనతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. -
సచివాలయానికి ‘పచ్చ’ రంగు
‘ఎదుటివాడికి చెప్పేందుకే నీతులు’ అన్నట్టు... వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీలకు, సచివాలయాలకు పార్టీ రంగు వేశారంటూ గగ్గోలుపెట్టిన తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తాము అధికారంలోకి వచ్చిన తరువాత.. వరుసపెట్టి ప్రభుత్వ భవనాలకు ‘పచ్చ’రంగు పులుముతోంది. తాజాగా కృష్ణాజిల్లా, యనమలకుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని పలు సచివాలయాలకు పసుపు రంగులు వేస్తోంది. దీంతో జనాలంతా పై విధంగా విమర్శిస్తున్నారు.– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడనాన్నా... సాధించా..!గుంటూరు వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ డే (Graduation Day) వేడుకలు మంగళవారం గుంటూరు వైద్య కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్డి.ఎస్.వి.ఎల్. నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ఎంబీబీఎస్ డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఓ విద్యార్థి డిగ్రీ సాధించిన క్రమంలో తన ఉత్సాహాన్ని తండ్రితో ఈ విధంగా పంచుకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరుఆకర్షిస్తున్న అడుగు ఎత్తు పుంగనూరు గిత్త దూడ పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పట్టణం, గునుపూడిలోని పురోహితుడు వేలూరి రామకృష్ణ గోశాలలో నందిని అనే ఆవుకు అడుగు ఎత్తు ఉన్న పుంగనూరు గిత్త దూడ పుట్టింది. ఒక్క అడుగు ఎత్తుతో చూడముచ్చటగా కనిపిస్తోంది. సాధారణంగా పుంగనూరు ఆవు ఎత్తు సుమారు 1.5 నుంచి 3 అడుగుల మధ్య ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న ఆవుగా పుంగనూరు ఆవు గుర్తింపు పొందింది. – భీమవరం (ప్రకాశంచౌక్) నేలపై నింగి నీలిముద్ర పరిశీలించి చూస్తే ప్రకృతిలో ప్రతిదీ ఓ సుందర దృశ్యమే. మండుటెండలో ఈ నీలినీడ చూపరులను ఆకట్టుకుంది. కడప నగరంలోని చెమ్ముమియాపేట–రాయచోటి వంతెనపై మంగళవారం మధ్యాహ్నం ఈ నీలి నీడలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్ కడపవేసవితాపం.. వీటితో దూరం వేసవి వచ్చిందంటే రోడ్లపై ఎక్కడికక్కడ పుచ్చకాయలు కుప్పలుపోసి అమ్ముతుంటారు. వేసవితాపం నుంచి సేదతీరేందుకు ప్రజలు కూడా వీటినే ఎక్కువగా తీసుకుంటారు. నెల్లూరు మినీ బైపాస్‌లో అమ్మకం కోసం పెట్టిన పసుపు రంగు పుచ్చకాయలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరుపిలవని అతిథి విరిసిన పూలపైకి పిలవని అతిథిగా వచ్చి ఊటలూరే మకరందాన్ని ఒడుపుగా సేకరిస్తుంది తేనెటీగ. ఇలా మైళ్లకొద్ది ప్రయాణించి సేకరించిన మకరందాన్ని తేనెపట్టులో భద్రపరుస్తుంది. గుంటూరు జిల్లా ఈపూరు సమీపంలో తేనెటీగ (Honey Bee) పూల నుంచి మకరందాన్ని సేకరిస్తున్న దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు -
ఆత్మాభిమానం కోసం మా పోరాటం
-
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఉద్యమ బాట!
సాక్షి, అమరావతి/గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రేషనలైజేషన్ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని నిర్ణయించిన కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. 20కి పైగా ఉద్యోగ సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. మూడు రోజుల క్రితం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 1.34 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంపై ఒక కమిటీ వేసి.. సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా రేషనలైజేషన్ నిర్ణయం తీసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం మారినప్పుడల్లా జాబ్ చార్ట్ మార్చేస్తారా?ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసి గ్రామ స్వరాజ్యానికి సిసలైన అర్థం చెబుతూ ఐదేళ్ల క్రితం వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా విప్లవాత్మక వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ వ్యవస్థను బలహీనపరిచే దిశగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న రేషనలైజేషన్ నిర్ణయంతో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ అంటూ కేటగిరీలుగా వర్గీకరించడం వల్ల.. తమ విధులు పూర్తిగా మారే అవకాశం ఉందంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారగానే జాబ్ చార్ట్ మారుతుంటే తమలో అభద్రతా భావం పెరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 అక్టోబర్ నాటికి ఉద్యోగాల్లో చేరిన వారికి అప్పటి ప్రభుత్వం స్పష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించడంతో పాటు పదోన్నతుల ప్రక్రియను కూడా నిర్ధారించింది. అలాగే కొంత మంది పదోన్నతులు కూడా పొందారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో మార్పులు చేయడం వల్ల.. జాబ్‌చార్ట్ పూర్తిగా మారిపోయి.. పదోన్నతుల ప్రక్రియకు భంగం కలిగే అవకాశం ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే లక్ష్యం తప్ప.. రేషనలైజేషన్ ప్రక్రియలో ఎక్కడా తమ సంక్షేమం గురించిన ఆలోచన కనిపించలేదని వారు మండిపడుతున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించాలి..ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే రేషనలైజేషన్ ప్రక్రియపై తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండీ జానీ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు కోరారు. ఉత్తర్వులను రద్దు చేయాల్సిందే..గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్‌కు సంబంధించి.. సిబ్బంది అభిప్రాయాలు సేకరించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులివ్వడం దారుణమని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉద్యోగులంతా భయాందోళనకు, అభద్రతకు గురవుతున్నారని తెలిపారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులనుద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు సచివాలయాల ఉద్యోగులను గందరగోళంలోకి నెట్టింది. రేషనలైజేషన్‌ను మేము వ్యతిరేకించడం లేదు. ప్రభుత్వం చేపట్టే మార్పులు ఉద్యోగుల సమస్యలను పెంచే విధంగా కాకుండా.. వాటిని పరిష్కరించే విధంగా ఉండాలి. ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోతే సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలకు సిద్ధమవ్వాలి’ అని వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. -
సచివాలయ ఉద్యోగులకూ బదిలీలు!
సాక్షి, అమరావతి: ప్రజలకు ప్రభుత్వ పాలనను అత్యంత చేరువ చేసే నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలిస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన విషయం విదితమే. అయితే ప్రస్తుత చంద్రబాబునాయుడి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సైతం రంగం సిద్ధం చేసింది. బదిలీలు కోరుకునే ఉద్యోగులు తమ వివరాలతో ఆన్లైన్ విధానంలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారిక పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలంటూ ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31వ తేదీలోగా వివిధ శాఖల్లోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి తెలిపిన నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేశారు. అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఒకేచోట ఐదేళ్ల పాటు పనిచేస్తున్న వారికి తప్పనిసరి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేయగా.. మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు జరిగి ఇంకా ఐదేళ్లు పూర్తి కాని నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు అవకాశం లేకుండా పోయింది. అయితే, నిర్ణీత నిబంధనల మేరకు బదిలీ కావాలని కోరుకునే వారికి బదిలీలకు అవకాశం కల్పించడంతో పాటు.. అత్యవసర పరిపాలన అవసరాల రీత్యా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ఆయా జిల్లా పరిధిలోని ఏ సచివాలయానికైనా బదిలీ చేసే అవకాశం ఉంటుందని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.మార్గదర్శకాలివే.. » బదిలీ కోరుకునే ఉద్యోగులు ఆన్లైన్లో ఈ నెల 27లోగా దరఖాస్తులు చేసుకోవాలి » దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు సంబంధిత ఉమ్మడి జిల్లాల పరిధిలో వేర్వేరుగా ఈ నెల 29, 30 తేదీలో ఆఫ్‌లైన్ (వ్యక్తిగతంగా హాజరయ్యే విధానం)లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. రిక్వెస్టు బదిలీల ప్రాధాన్యత క్రమం.. » మొదట దివ్యాంగులకు, మానసిక వైకల్యం ఉండే పిల్లలు కలిగిన ఉద్యోగులకు రెండో ప్రాధాన్యత, గిరిజన ప్రాంతాల్లో కనీసం రెండేళ్ల పాటు పనిచేస్తున్న ఉద్యోగులకు మూడో ప్రాధాన్యత, ఆ తర్వాత ప్రాధాన్యతలుగా భార్య, భర్తలకు, పరసర్ప అంగీకార బదిలీలకు క్రమ పద్ధతిలో వీలు కల్పించనున్నారు. » గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఉద్యానవన అసిస్టెంట్లు, ఫిషరీస్ అసిస్టెంట్లు, వెటర్నరీ అసిస్టెంట్లు, మహిళా పోలీసు ఉద్యోగుల బదిలీలకు జిల్లా కలెక్టర్లు బదిలీల అ«దీకృత అధికారులుగా వ్యవహరిస్తారు.» విలేజీ సర్వేయర్లకు సర్వే శాఖ ఏడీలు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్లకు వ్యవసాయ శాఖ జేడీలు, సెరికల్చర్ అసిస్టెంట్లకు జిల్లా సెరికల్చర్ అధికారులు, ఏఎన్ఎంలకు జిల్లా డీఎంహెచ్‌వో, ఎనర్జీ అసిస్టెంట్లకు డిస్కంల ఎస్ఈ అ«దీకృత అధికారులుగా వ్యవహరిస్తారు. వార్డు సచివాలయాల్లో పనిచేసే ఇతర ఉద్యోగులకు సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు బదిలీల అ«దీకృత అధికారులుగా ఉంటారు. » 50 ఏళ్ల లోపు వయస్సు ఉద్యోగులనే గిరిజన ప్రాంతాలకు బదిలీ చేస్తారు. » ఆన్లైన్లో బదిలీకి దరఖాస్తు చేసుకుని, నిరీ్ణత తేదీలో కౌన్సెలింగ్‌కు హాజరు కాని పక్షంలో ఆ ఉద్యోగి దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.