
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇష్టారాజ్యంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. చనిపోయిన ఉద్యోగిని కూడా చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు తప్పుల తడకగా మారింది. పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నామంటున్నా ప్రభుత్వం.. చనిపోయిన వారిని కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తూ లిస్టులో పేర్కొంది.
మూడేళ్ల క్రితం, రెండేళ్ల క్రితం సచివాలయ ఉద్యోగం మానేసిన వాళ్లని కూడా బదిలీల లిస్ట్‌లో పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కొంత మందిని పాత సచివాలయమే కేటాయించారు. ఇలా.. తమకు అనుకూలమైన వారికి ఉన్న చోటే పోస్టింగ్‌లు ఇచ్చారు.
కొండ ప్రాంతాలకు దివ్యాంగులను బదిలీ చేసింది. కౌన్సిలింగ్ నిర్వహించకుండానే ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం అంటూ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. బదిలీలన్నీ రద్దుచేసి కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న(శనివారం) విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌ను సచివాలయ ఉద్యోగులు ముట్టడించారు.
