హెరిటేజ్‌కి రాయితీలు.. ఏపీ కేబినెట్‌ ఆమోదం | AP Cabinet Approves Massive Subsidies And GST Reimbursements For Heritage Foods Unit In Chandragiri, More Details Inside | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌కి రాయితీలు.. ఏపీ కేబినెట్‌ ఆమోదం

Mar 13 2026 5:09 PM | Updated on Mar 13 2026 5:45 PM

Ap Cabinet Approves Concession For Heritage Foods

సాక్షి, విజయవాడ: హెరిటేజ్‌కి రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు హెరిటేజ్ ఫుడ్స్ నిర్వహిస్తుండగా.. చంద్రగిరి మండలం కాశీపెంట హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్‌కి కేబినెట్‌ రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెరిటేజ్ టెక్నాలజీ అప్ గ్రేడేషన్ కోసం సబ్సిడీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఐదేళ్ల పాటు 100 శాతం జీఎస్టీ రియంబర్స్‌మెంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరెంట్ బిల్లులో యూనిట్ కి రూ.1 రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. హెరిటేజ్ నెయ్యి ఉత్పత్తి 566 శాతం, ఫ్లేవర్డ్‌ పాలు 131, పన్నీర్ 400 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద భారీ రాయితీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హెరిటేజ్ రాయితీలను మంత్రి పార్థసారధి మీడియా సమావేశంలో వెల్లడించలేదు. అజెండాలో చివరి అంశంగా పెట్టి.. ఏపీ కేబినెట్‌ ఆమోదించింది.

Advertisement
 
Advertisement
Advertisement