‘ఏపీ రైతుల మోయలేని రుణభారానికి చంద్రబాబే కారణం’ | YSRCP Leader Kurasala Kannababu Takes On Chandrababu Over AP Farmer Debt Burden And Cuts To Welfare Programs | Sakshi
Sakshi News home page

‘ఏపీ రైతుల మోయలేని రుణభారానికి చంద్రబాబే కారణం’

Mar 13 2026 4:21 PM | Updated on Mar 13 2026 4:47 PM

YSRCP Leader Kurasala Kannababu Takes On Chandrababu

కాకినాడ:   ఏపీలోని రైతులు రుణభారాన్ని మోయలేని స్థితిలోకి రావడానికి చంద్రబాబు సర్కారే కారణమని  వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.  ఏపీలో రైతులపై అత్యధిక రుణభారం ఉందనే విషయాన్ని ఇటీవల కేంద్ర మంత్రి పార్లమెంట్‌ వేదికగా వెల్లడించారని  కురసాల ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

 మీ నిర్లక్ష్యం కారణంగా... రుణాభారంలో ఏపీ రైతులు రెండవ స్ధానంలో ఉన్నారు. 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సగటున నలుగురు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారు.  మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ... వైఎస్ జగన్ అమలు చేసిన రైతు భరోసకు కాపీ.మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు మంగళం పాడేశారు. రెండవ ఏడాది రూ.10 వేలు ఇచ్చారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయంలో 53 లక్షల 58 వేల మందికి ఏటా పెట్టుబడి సాయం అందించారు. మీ హయంలో ఏడు లక్షల మంది రైతులు తగ్గిపోయారు.  పథకమే పూర్తిగా అమలు చేయ్యకుండా ఏడు లక్షల‌మందికి కోత విధించారు. గడిచిన రెండేళ్ళల్లో కౌలు రైతుకు ఒక్క సహయం అందించలేదు. కౌలు రైతుల పట్ల ఎందుకు అంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. 

కూటమి పాలన లో ఇప్పటి వరకు 16 సార్ల ప్రకృతి విపత్తు వచ్చాయి. ఏ రైతుకు సాయం అందించారో చెప్పండి. వందల కోట్లు ప్రీయమం కట్టడానికి డబ్బులు లేకపోతే ...రెండేళ్ళ కాలంలో చేసిన రూ.3 లక్షల కోట్ల అప్పులు ఏమైయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న రైతులకు సహయం చేయడ్యానికి బడ్జెట్ లో ఇది పెట్టామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు.

*కోవిడ్‌లో కూడా పంటలకు మార్కెట్ స్ధిరికరణ చేసి..చివరకు మేము బూడిద గుమ్మడి కాయాలు కూడా కొనుగోలు చేశాం. ఏ సీజన్ లో పంట నష్టపోతే ... ఆ సీజన్ లోనే వైఎస్ జగన్ నష్టపరిహారం అందించారు.

ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులను కొనే పరిస్ధితిలో ప్రభుత్వం లేదు. అరటిని ఇప్పుడు టన్ను రూ.ఐదు వేలకు అమ్ముకునే దుస్ధితికి రైతు వచ్చాడు. టమాటకు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పాడేసుకుంటున్నాడు. ఇది రైతుల పట్ల మీ నిర్లక్ష్యం కాదా? చంద్రబాబు’ అని ప్రశ్నించారు కురసాల కన్నబాబు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement