పెంపుడు శునకంతో యువకుడి శ్రీశైలం యాత్ర | Man Takes Pet Dog On Padayayatra To Srisailam | Sakshi
Sakshi News home page

పెంపుడు శునకంతో యువకుడి శ్రీశైలం యాత్ర

Mar 13 2026 11:33 AM | Updated on Mar 13 2026 11:49 AM

Man Takes Pet Dog On Padayayatra To Srisailam

శ్రీశైలం: పాదయాత్రగా  శ్రీశైలం చేరుకుంటున్న కన్నడిగుల్లో ఒక్కొక్కరిది ఒక్కో మొక్కు. అలా వెళ్తున్న వారిలో ఈ ఓ యువకుడు ప్రత్యేకం. ఆ శునకానికి ఒక కాషాయ వ్రస్తాన్ని చుట్టి ఒక పవిత్ర భావం కలిగేలా ప్రయాణిస్తున్నాడు. కర్ణాటకలోని రాయచూరు పట్టణానికి చెందిన వ్యోమకేశ్‌ అనే యువకుడి తల్లి ఇటీవల తీవ్రమైన అనారోగ్యానికి గురైయ్యింది. అదే సమయంలో బెంగతో తమ ఇంటి పెంపుడు శునకం కూడా అస్వస్థత పాలైంది. 

దీంతో ఆవేదన చెందిన వ్యోమకేశ్‌ తన తల్లి, పెంపుడు శునకం ఆరోగ్యం కుదుట పడితే శ్రీశైల మల్లికార్జునుని పాదయాత్రతో వెళ్లి దర్శించుకుంటానని మొక్కుకున్నాడు. అంతే కాక తన శునకాన్ని కూడా భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం ఇవ్వాలని భావించాడు. అందుకే ఇలా పాదయాత్రా ప్రారంభించాడు. గురువారం ఆత్మకూరు పట్టణం మీదుగా వెళ్తూ ఇలా శునకంతో కనిపించాడు.  

Advertisement
 
Advertisement
Advertisement