కర్నూలు: ఈనెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో వీలైనన్ని కేసులను పరిష్కరించి విజయవంతం చేద్దామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆధ్వర్యంలో 17 బెంచీలతో కేసుల పరిష్కారం చేయాలని నిర్ణయించామన్నారు. లోక్‌అదాలత్‌లో పరిష్కా రం జరిగిన కేసుల్లో అప్పీల్ సమస్య ఉండదని, లోక్ అదాలత్ ఉత్తర్వు తుది ఆదేశాలన్నారు. కక్షిదారులు తమ అపరిష్కృత కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు.
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ సహాయకులు, టైపిస్టు పోస్టులను కారుణ్య నియామకాల కింద అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించారు. గురువారం స్థానిక జెడ్పీ చైర్మన్ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం ఎనిమిది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కోరుకున్న ప్రదేశాలకు పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా కార్యాలయాల్లో ప్రజలకు ఉత్తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉంటూ మృతి చెందితే కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించడం జరుగుతోందన్నారు.
జూనియర్ అసిస్టెంట్‌లు:
ఎ.వినయ్‌రాజు(పీఆర్‌ఐ సబ్ డివిజన్, నంద్యాల), టి. రంగస్వామి(జెడ్పీహెచ్‌ఎస్, రామళ్లకోట), పి.శ్రీచందన(జెడ్పీహెచ్‌ఎస్, హుసేనాపురం), వై.వైష్ణవి(జెడ్పీహెచ్‌ఎస్, కోవెలకుంట్ల), హెచ్.అశ్వథ్‌బాషా(జెడ్పీహెచ్‌ఎస్ దీబగుంట్ల).
టైపిస్టులు: బి.జ్ఞాన సందీప్(ఎంపీపీ, వెల్దుర్తి), ఎం.అజయ్ డానియల్ ప్రకాష్(ఎంపీపీ, మంత్రాలయం), ఎల్.ఫాతిమాబేగం(పీఆర్ క్యూసీ పీఆర్ సబ్ డివిజన్, కర్నూలు).


