వేసవిలో గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ సమయంలో ధరలు ఉంటేనే రాణించగలం. ఉన్నట్టుండి యుద్ధం రావడంతో తమిళనాడులోని నమ్మకల్ జోన్ నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ గుడ్లు పెద్ద ఎత్తున డంప్ అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోకి కూడా గుడ్ల సరఫరా పెరిగింది. ఫలితంగా ఇక్కడ ఉత్పత్తి అయిన గుడ్లకు ధర తగ్గిపోతోంది. యుద్ధానికి ముందుకు 100 గుడ్ల ధర రూ.600 ఉండగా.. నేడు రూ.420 మించని పరిస్థితి. దళారీలకు ధరలను పూర్తిగా తగ్గించేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నష్టాలు మూటకట్టుకుంటున్నాం. – వెంకటేష్, గుడ్ల ఉత్పత్తి రైతు, ప్యాలకుర్తి, కోడుమూరు మండలం


