● 110 డొమెస్టిక్, 30 కమర్షియల్ సిలిండర్లు స్వాధీనం
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని హోటల్స్, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లపై బుధవారం జిల్లా సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు చేశారు. ఐదు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న 110 డొమెస్టిక్ సిలిండర్లు, 30 కమర్షియల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సివిల్ సప్లై అఽధికారి ఎం. రాజారఘువీర్ మాట్లాడుతూ అయిల్ కంపెనీల్లు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసి వాడుకుంటున్నట్లు సమాచారం రావటంతో డాదులు చేశామన్నారు. మొత్తం 90 హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లపై దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇంటి అవసరాల కోసం తీసుకున్న సిలిండర్లను అనధికారికంగా హోటళ్లకు వాడుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా చేస్తూ ఎవరైనా పట్టుబడితే చర్యలుంటాయన్నారు. వినియోగదారులు గ్యాస్ సిలిండర్లను పొదుపుగా ఉపయోగించుకోవాలని, సింగిల్ సిలిండర్ ఉన్నవారు బుకింగ్ 21 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారికి బుకింగ్‌కు 31 రోజులకు చేసుకోవాలన్నారు. కాగా సిలిండర్లను సీజ్ చేసి యజమానులపై 6ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఏఎస్‌వో వెంకటరాజు, డిప్యూటీ తహసీల్దార్లు రుద్రగౌడ్, షహనీషా, నవీన్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు రాజశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.


