Kurnool District News
-
ఆధిపత్యం కోసమే అంతమొందించారు
● వీడిన టీడీపీ నేత సంజన్న హత్యకేసు మిస్టరీ ● ఐదుగురు నిందితుల అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు: టీడీపీ నాయకుడు షరీన్‌నగర్‌కు చెందిన కాశపోగు సంజన్న హత్య కేసు మిస్టరీ వీడింది. షరీన్‌నగర్‌లో ఆధిపత్యం కోసమే సంజన్నను వడ్డె రామాంజనేయులు అలియాస్ అంజి కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వడ్డె రామాంజనేయులు, వడ్డె శివకుమార్, వడ్డె తులసి, రేవంత్, వారి అనుచరుడు మాల అశోక్‌ను నాల్గవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరు పరిచారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో దర్యాప్తు అధికారి మహిళా పీఎస్ డీఎస్పీ కే శ్రీనివాసాచారి, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్‌తో కలిసి ఎస్పీ విక్రాంత్ పాటిల్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన రాత్రి 9.30 గంటల ప్రాంతంలో షరీన్‌నగర్‌లో అల్లీపీరా, వీరాస్వామి భజన మందిరంలో భజన ముగించుకుని బయటకు వస్తున్న కాశపోగు సంజన్నపై అదే వీధికి చెందిన వడ్డె రామాంజనేయులు అతని కుమారులు కొంత మంది అనుచరులు కలిసి పిడిబాకులు, కత్తులు, వేటకొవళ్లతో దాడి చేసి హత్య చేశారు. 30వ వార్డు కార్పొరేటర్ జయరాముడుకు హతుడు సంజన్న తండ్రి. జయరాముడు ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించుకొని నిందితుల కదలికలు, వారు వినియోగించిన వాహనాలు, సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించి కాదాంబరి టౌన్షిప్ సమీపంలోని నిర్జన ప్రదేశంలో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. హత్యకు వాడిన వేట కొడవళ్లు, పిడిబాకు, రక్తం మరకలు ఉన్న దస్తులు, సెల్ఫోన్లు, కర్రలు, హత్య సమయంలో వాడిన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని, ప్రతి వారం స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చేలా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ చెప్పారు. శిక్షలు పడే విధంగా చర్యలు ... విచారణ వేగవంతం చేసి నిందితులపై కఠిన శిక్షలు పడేటట్లు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. మృతుడు సంజన్న కుటుంబం, హంతుకులు వడ్డె రామాంజనేయులు కుటుంబం మధ్య ఉన్న పాతకక్షలు, వార్డులో ఆధిపత్య పోరే కారణంగా దర్యాప్తులో తేలిందని వివరించారు. చాకచక్యంగా, వేగంగా కేసును ఛేదించి త్వరగా నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐలు మధుసూదన్‌గౌడ్, శేషయ్య, చంద్రబాబునాయుడు, శ్రీధర్, తబ్రేజ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు మార్కెట్లో వరి ధాన్యం క్రయవిక్రయాలు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం క్రయవిక్రయాలకు శ్రీకారం చుట్టారు. మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు శుక్రవారం పూజలు నిర్వహించి కొనుగోళ్లను ప్రారంభించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉన్నప్పటికీ మార్కెటింగ్ సదుపాయం లేదు. దళారీలకు, మిల్లులకు తీసుకెళ్లి అమ్మకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మార్కెటింగ్ శాఖ కర్నూలు మార్కెట్లో వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. మార్కెట్‌కు మొదటి రోజు ఇద్దరు రైతులు మాత్రమే 23 క్వింటాళ్ల ధాన్యం తీసుకొచ్చారు. క్వింటాకు రూ.2,529 ధర లభించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఏప్రిల్ 1 నుంచి ధాన్యం క్రయవిక్రయాలు రెగ్యులర్‌గా చేపడతామని జేడీ తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ జయలక్ష్మి, అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ శాఖలో ఎస్ఐల పదోన్నతికి దేహదారుఢ్య పరీక్ష
కర్నూలు: ఎకై ్సజ్ శాఖ ఫోర్త్ జోన్ పరిధిలో ఎస్ఐ పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. సీమ జిల్లాల్లో 52 ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉండగా 48 పోస్టులను హెడ్ కానిస్టేబుళ్లు, క్లర్కులకు అడ్హాక్ పద్ధతిలో పదోన్నతి కల్పించి పోస్టింగులు కేటాయించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎకై ్సజ్ కార్యాలయ ఆవరణలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. రాయలసీమ జిల్లాల నుంచి 17 మందికి గాను 16 మంది హాజరయ్యారు. వారికి బరువు, ఎత్తు, ఛాతీ కొలతలను తీసుకున్నారు. వీరంతా అర్హత సాధించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, లీగల్ మెటరాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రాములు, జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు, ఏఈఎస్ రాజశేఖర్ గౌడ్, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ రామకృష్ణ, సీఐలు రాజేంద్రప్రసాద్, చంద్రహాస్ తదితరులు పాల్గొన్నారు. ●16 మంది జూనియర్ అసిస్టెంట్లు ఉత్తీర్ణత -
పొలంలో పేలుడు.. ముగ్గురికి గాయాలు
● ఒకరి పరిస్థితి విషమం సి.బెళగల్: పొలంలో అడ్డుగా ఉన్న బండరాళ్లను తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి ముగ్గురు యువకులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సి.బెళగల్‌కు చెందిన పింజరి ఖాజా పొలంలో బండరాళ్లు అడ్డుగా ఉన్నాయి. వీటిని కాంప్రెసర్తో పగులగొట్టడానికి గ్రామానికి చెందిన వాహన యజమాని వడ్డె రాజుతో ఒప్పందం చేసుకున్నాడు. గురువారం కాంప్రెసర్ వాహన యజమాని గ్రామానికి చెందిన బలిగేరి కుంటిచేయి లక్ష్మన్న కుమారుడు బలిగేరి వీరాంజనేయులు, సురపురం మునిస్వామి కుమారుడు సురపురం శ్రీరాములు, కేశారం కుమారుడు మద్దిలేటి అనే యువకులతో కలసి పొలానికి వెళ్లారు. పొలంలోని మూడు ప్రాంతాల్లో బండరాళ్లను పేల్చేందుకు ప్రయత్నించగా రెండు మాత్రమే పేలాయి. శుక్రవారం మరోసారి వెళ్లగా మూడో బండరాయి నుంచి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. రాళ్లు ఎగిరి పడటంతో పనిలో నిమగ్నమైన ముగ్గురు యువకులు బలిగేరి వీరాంజనేయులు, సురపురం శ్రీరాములు, మద్దిలేటి గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బలిగేరి వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారిస్తున్నట్లు ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపారు. -
మెడికల్ షాపుల్లో ‘ఆపరేషన్ గరుడ’
కర్నూలు: ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయేదాకా విస్తృత తనిఖీలు నిర్వహించారు. దుకాణం లైసెన్స్, నిల్వలకు సంబంధించిన రిజిస్టర్లతో పాటు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయాలు జరుపుతున్న విషయాలపై పరిశీలన జరిపారు. దాదాపు 20కి పైగా దుకాణాల్లో తనిఖీలు చేయగా కొన్నింటిలో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే భౌతిక నిల్వలకు రికార్డులో పొందుపరచిన నిల్వలకు తేడాలు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. -
మోక్ష మార్గానికి శుభ రాత్రులు
రహదారులపై నీళ్లు కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్లి చూస్తే ఏమీ కనిపించవు. తీవ్ర ఉష్ణోగ్రతల ఫలితంగా ఏర్పిడిన ఎండమావులని తేలుతోంది. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40 డిగ్రీలు దాటి పోయాయి. కర్నూలు నగరం సమీపంలోని బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎండమావులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు మధ్యాహ్నం వేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలను కాసేపు ఆపుకుని వెళ్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు నంద్యాల(వ్యవసాయం): పవిత్ర రంజాన్ మాసం చివరి ఘట్టానికి చేరుకుంది. ముస్లింలు ఈ మాసమంతా మహిమతో కూడినదిగా భావిస్తారు. ఇందులో మొదటి పది రోజులు అల్లాహ్ కరుణ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తే... రెండవ పది రోజుల్లో తమ తప్పులను క్షమించాలని ప్రార్థిస్తారు. ఇక మూడవదైన ముఖ్యమైన చివరి పదిరోజులు మొదటి రెండు విభాగాల కంటే కొంచెం భిన్నమైనవిగా భావిస్తారు. నరకం నుంచి బయట పడేయాలని అల్లాను శరుణు కోరుకునేందుకు ఈ పదిరోజులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో చివరి పదిరోజులు ఏకాగ్రతతో అల్లాను ఆరాధిస్తే ఎక్కువ ఫలితాలు లభిస్తాయని, మోక్షానికి మార్గం లభిస్తుందని భావించి ముస్లింలు మసీదులు, ఇళ్లల్లో ఎతెకాఫ్, తాఖ్‌రాత్ చేపట్టనున్నారు. పుణ్య ఫలాల శుభరాత్రులు.. రంజాన్ మాసం చివరి పది రోజుల్లో పవిత్ర బడీరాత్ వస్తుంది. దీన్నే షబ్ ఏ ఖదర్ లేదా లైలతుల్ ఖద్ర్ అనికూడా అంటారు. ఈ పవిత్ర రాత్రి చివరి పది రోజుల్లో బేసి రాత్రుల్లో (ఈనెల 24, 25, 27, 29వ తేదీ) ఉంటుందన్న నమ్మకంతో ముస్లింలు తాఖ్రాత్గా నిర్వహిస్తారు. మరీ ముఖ్యంగా ఈనెల 27వ రోజు రాత్రే లైలతుల్ ఖద్ర్ ఉంటుందని ముస్లింల విశ్వాసం. లైలతుల్ ఖద్ర్ రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేయడంతో వెయ్యి నెలలపాటు ఉపవాస దీక్షలు చేసినంత ఫలం లభిస్తుందని పెద్దలు పేర్కొంటున్నారు. ప్రజల పాపాలను క్షమించాలని కోరుతూ మహమ్మద్ ప్రవక్త ప్రార్థించారని పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఉండడంతో ముస్లింలు జాగరణ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైనవిగా, అధిక పుణ్యాన్ని ఇచ్చే తాఖ్ రాత్‌లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా రోజుల్లో రాత్రుల నుంచి తెల్లవారుజామున ఫజర్ నమాజ్ వరకు పవిత్ర రంజాన్ విశిష్టత, మహాప్రవక్త గుణగణాలు, ఖురాన్ పఠనం, జికార్, తహజూద్, నమాజ్‌లతో గడుపుతారు. ఇందుకోసం ఆయా మసీదులకు ఇతర ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, గురువులు, వక్తలను పిలిపించి దైవసందేశాలను భక్తులకు వివరిస్తారు. ఇందుకుగాను పట్టణంలోని పలు మసీదు కమిటీ నిర్వాహకులు ఈ పదిరోజుల పాటు వక్తలను ఆహ్వానిస్తారు.. ఈ సమయాల్లో మసీదులకు హాజరయ్యే భక్తులకు తెల్లవారుజామున సహేరి ఏర్పాట్లు చేస్తారు. అల్లాహ్ ఇంటి ఆతిథ్యం ఎతెకాఫ్.. రంజాన్‌లో బడీరాత్ ఎంత ప్రాధాన్యత ఉంటుంతో ఎతెకాఫ్కు కూడా అంతే ఉంటుంది. అల్లాహ్ ఇంటి (మసీదు) ఆతిథ్యం ఈ ఎతెకాఫ్ కల్పిస్తుందంటారు. ‘రంజాన్ కే మహినేమె..జిస్ గావ్మే ఏక్బీ ఆద్మీ ఎతెకాఫ్ నా రహేత.. ఉస్ గావ్ పర్ లానత్ హై. ఔర్ మేరి రహ్మత్ నహీ రహేగి’. అంటే రంజాన్ మాసంలో ఒక ఊర్లో ఒక వ్యక్తి కూడా ‘ఎతెకాఫ్’ ఉండకపోతే.. ఆ ఊరిపై నా కరుణ, ప్రేమాభిమానాలు ఉండవు అని పవిత్ర ఖురాన్లో అల్లాహ్ స్పష్టం చేశారు. ఎతెకాఫ్‌ను చివరి పది రోజుల్లో పాటించాలి. ఇల్లు, కుటుంబం, వృత్తిని పక్కన పెట్టి వీలు పడిన రోజులు (కనీసం 24 గంటలు) మసీదులో గడపడమే ఎతెకాఫ్ అంటారు. అన్నింటినీ త్యాగం చేసి ఆధ్యాత్మికతతో ఉండే మనుషులపై అల్లాహ్ అత్యంత కరుణ చూపి మొరను ఆలకిస్తారని మౌల్వీలు అంటున్నారు. ప్రజాప్రతినిధుల ఇంటికెళ్లి మనం సమస్య చెప్పుకుంటాం. ఆయన అభయం ఇస్తే ధైర్యం వస్తుంది. మన ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధి అభయానికే ఊరట కలిగితే.. సృష్టికర్త అల్లాహ్‌కు మొరపెట్టుకుంటే లభించే ఆనుగ్రహానికి హద్దు ఉండదంటారు. పది రోజులు పవిత్రమైన రోజులు రంజాన్ మాసంలో చివరి పదిరోజులు మోక్ష మార్గానికి తరావి, ఎతెకాఫ్, తాఖ్ రాత్‌లు ఎంతో పవిత్రమైన రోజులు. ఈ రోజుల్లో కఠోర దీక్షలు రాత్రింబవళ్లు ఖురాన్, దైవ బోధనలతో నియనిష్టతో ఉంటే ఎన్నో మాసాల నుంచి చేయనటువంటి పుణ్యం, మోక్షాలు లభిస్తాయన్నారు. – అబ్దుల్‌ఖాదీర్, మౌల్వి, ఆర్టీసీ బస్టాండ్ మసీదు, నంద్యాల రంజాన్ మాసం ఆఖరి పది రోజులు ప్రత్యేకం ఎతెకాఫ్, తాఖ్రాత్ల నిర్వహణలో ముస్లింలు -
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
వెలుగోడు: మోత్కూరు గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మోత్కూరు గ్రామానికి చెందిన గుండెపోగు ఏసేపు కుమారుడు అశోక్(28) బైక్‌పై వెలుగోడుకు వస్తుండగా మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వెలుగోడులోని ఓ మందుల దుకాణంలో పని చేస్తున్నాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా వెలుగోడుకు చెందిన వాహనం బైక్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. -
జిల్లా కోర్టుల్లోనూ మధ్యవర్తిత్వం
కర్నూలు(సెంట్రల్): సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశించిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు/ జిల్లా ప్రధానన్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి తెలిపారు. జిల్లా కోర్టుల్లోనూ మధ్యవర్తిత్వం విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులు, ఎన్జీఓలకు ఇచ్చిన 40 గంటల శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు భావన, మధ్యవర్తిత్వం, సాంకేతిక అంశాలపై న్యాయవాదులకు కేరళల నుంచి వచ్చిన గోపీనాథన్ బృంద సభ్యులు 40 గంటలపాటు శిక్షణ తరగతులను నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ..సివిల్ ప్రోసిజర్ కోడ్‌లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని, కోర్టుల్లో కేసు విచారణ వరకు వెళ్లకుండానే పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి -
పోలీసుల స్ఫూర్తి.. సామరస్య దీప్తి
కర్నూలు: శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు వారు. రంజాన్ నెల సందర్భంగా సామరస్యాన్ని చాటారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయగా.. హిందూ, ముస్లింలు పోలీసులు అందరూ కలసి వచ్చారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా హాజరయ్యారు. మండ్లెం పీఠాధిపతి కరీముల్లా ప్రార్థన చేయించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందు మతసామరస్యాన్ని చాటిందని ఎస్పీ తెలిపారు. ప్రజలు అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో కలసి మెలసి ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలని సూచించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు, ఎస్ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
కొత్త జిల్లాల్లో ట్రెజరీ భవన నిర్మాణాలు
కర్నూలు(అగ్రికల్చర్): కొత్త జిల్లాల్లో ట్రెజరీ కార్యాలయాల భవన నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఖజానా, లెక్కల శాఖ డైరెక్టర్ మోహన్‌రావు తెలిపారు. అదేవిధంగా సబ్ ట్రెజరీ కార్యాలయాలకు కూడా సొంత భవనాలు నిర్మిస్తామని, కలెక్టర్లు అవసరమైన స్థలాలు కేటాయించాల్సి ఉందన్నారు. శుక్రవారం ఆయన కర్నూలు జిల్లా ట్రెజరీ, కర్నూలు డివిజన్ సబ్ ట్రెజరీలను తనిఖీ చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించారు. గత నెల ‘సాక్షి’లో ‘ట్రెజరీల్లో లంచావతారాలు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై తీసుకున్న చర్యలపైనా ఆరా తీసినట్లు సమాచారం. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీల్లో కొంతమంది ఏళ్ల తరబడి ఒకేచోట పని చేస్తున్నారని, ఇందువల్లనే అక్రమాలకు అవకాశం ఏర్పడిందనే విషయాన్ని విలేకర్లు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఇందులో వాస్తవం ఉందని, అయితే ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయన్నారు. మరో నెల, రెండు నెలల్లో బదిలీలకు అవకాశం ఉందని, ఆ సమయంలో ఇలాంటి వారిని బదిలీ చేస్తామన్నారు. ఆయన వెంట జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు, ఏటీవో జయలక్ష్మి, ఎస్టీవో పలనాటి సునీల్ తదితరులు ఉన్నారు. మోహన్‌రావును పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు కలిశారు. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వారిని త్వరలో బదిలీ చేస్తాం ఖజానా, లెక్కల శాఖ డైరెక్టర్ మోహన్‌రావు వెల్లడి -
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
కర్నూలు సిటీ: జిల్లాలోని 172 కేంద్రా ల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం మొత్తం 31,686 మంది విద్యార్థులకుగాను 31,393 మంది హాజరుకాగా.. 293 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ తెలిపారు. ఒపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు 821 మందికిగాను 728 మంది విద్యార్థులు హాజరు కాగా.. 93 మంది గైర్హాజరయ్యారు. బ్యాంకుల సమ్మె వాయిదా కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 24, 25 తేదీల్లో చేపట్టనున్న బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపు మేరకు ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకుల సమ్మెకు అన్ని బ్యాంకు యూనియన్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఉన్నతస్థాయిలో ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ప్రతినిధులు చర్చలు జరిపారు. అందులో భాగంగా రెండు నెలల సమయం ఇస్తే డిమాండ్లపై సానుకూలంగా చర్యలు తీసుకుంటామని కోరినట్లు జిల్లా కన్వీనర్ నాగరాజు తెలిపారు. ఇందుకు అనుగుణంగా రెండు రోజుల సమ్మెను వాయిదా వేసినట్లు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ముగిసిన సుయతీంద్రతీర్థుల సమారాధన
మంత్రాలయం: నవ మంత్రాలయం శిల్పి, రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థుల ఉత్తరారాధనతో వేడుకలు ముగిశాయి. గురువారుం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో మధ్యారాధన వేడుకలు అంగరంగా వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవతో ఆరాధనకు అంకురార్పణ పలుకగా.. వేద పఠనం గావిస్తూ సుయతీంద్రతీర్థుల మూల బృందావనానికి శాస్త్రోక్తంగా విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆధ్యాత్మిక పరిమళాలు విరబూసేలా మధ్యారాధన పూజోత్సవాలు గావించారు. కర్ణాటకలోని మత్తూరు మఠం పీఠాధిపతి బోధానంద సరస్వతీ శ్రీమఠాన్ని సందర్శించి పీఠాధిపతులు సుబుధేంద్రతీర్థులను సన్మానించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విధ్వాంసులు, కళాకారులను స్వామిజీ సన్మానించారు. -
నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 25, 26 తేదీల్లో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు అవసరమైన సమాచార సేకరణపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మీని ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 50 శాతం సబ్సిడీతో యంత్ర పరికరాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సాయిల్ టెస్టు ఫలితాలను వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి పెండింగ్‌లోని గోకులాల నిర్మాణాలకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. పరిశ్రమల శాఖకు సంబంధించి విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధిదారులకు త్వరగా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన వసతి గృహాల మరమ్మతులను త్వరగా చేపట్టాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 24 హాస్టళ్లకు సంబంధించి రూ.7.89 కోట్లు మంజూరయ్యాయని, ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఐసీడీఎస్‌కు సంబంధించి 146 అంగన్వాడీ సెంటర్లను అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ సీపీఓ హిమప్రభాకరరాజు, కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు. -
జీజీహెచ్‌కు హైరిస్క్ కేసులే ఎక్కువ
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రసూతి విభాగానికి గతంలో సాధారణ కాన్పులకు కూడా వచ్చేవారు. ఇప్పుడు ఎక్కువ శాతం హైరిస్క్ కేసులే వస్తున్నాయి. గతంలో 40 దాకా ప్రసవాలు జరుగుతుండగా, ఇప్పుడు 15 నుంచి 20 శాతానికి మించని పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం నంద్యాల జిల్లా విడిపోవడం, అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు లక్ష్యాలు విధించడం, ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య పెరగడం, అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఉండటమే. కర్నూలు చుట్టుపక్క మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ప్రసవాలు జరుగుతుండంతో జీజీహెచ్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గింది. – డాక్టర్ శ్రీలక్ష్మి, హెచ్ఓడీ, గైనకాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు -
ప్రభుత్వాసుపత్రుల్లో తగ్గిన ప్రసవాలు
● ఈ ఆర్థిక సంవత్సరంలో 22.8 శాతానికే పరిమితం ● సరైన సేవలు అందకపోవడమే ప్రధాన కారణం ● 77 శాతం పైగా ప్రయివేట్ ఆసుపత్రుల్లోనే.. ● ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొక్కుబడి సేవలు ● పరిస్థితి విషమిస్తేనే కర్నూలు జీజీహెచ్‌కు తరలింపుకర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రసూతి విభాగంపత్తికొండ నియోజకవర్గం: తుగ్గలి పీహెచ్సీ పరిధిలో 2024 జూన్ నుంచి 638 మంది గర్భిణిలను గుర్తించారు. వీరిలో 25 మంది మాత్రమే పీహెచ్సీలో డెలివరీ అయ్యారు. మరో 28 మందిని రెఫర్ చేశారు. కోడుమూరు నియోజకవర్గం: గూడూరు పీహెచ్సీ పరిధిలో మొత్తం 476 మంది గర్భిణిలను గుర్తించగా.. వీరిలో 67 మంది పీహెచ్‌సీలోనే డెలివరీ అయ్యారు. మరో ఆరుగురిని కర్నూలుకు రెఫర్ చేశారు. ఆలూరు నియోజకవర్గం: మొలగవల్లి పీహెచ్సీ పరిధిలో మొత్తం 210 మంది గర్భిణిలను గుర్తించగా.. 8 మంది మాత్రమే పీహెచ్సీలో డెలివరీ చేయించుకున్నారు. 15 మందిని రెఫర్ చేశారు.గత ఆర్థిక సంవత్సరంలో 45,040 మంది గర్భిణిలు రిజిష్టర్ అయ్యారు. ఇందులో 10,072 మంది(22.36శాతం) హైరిస్క్‌లో ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. ఇదే గత ప్రభుత్వంలో ప్రసవాల సంఖ్య ప్రభుత్వాసుపత్రుల్లో 60శాతం వరకు ఉండగా.. హైరిస్క్ గర్భిణిల శాతం కూడా 19లోపే. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం సన్నగిల్లడంతోనే గర్భిణిలు ప్రయివేట్‌ను ఆశ్రయిస్తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.20,479 ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో ప్రసవాల సంఖ్య ప్రభుత్వ సర్వజన వైద్యశాల: కర్నూలు ఏరియా ఆసుపత్రి: 1 (ఆదోని) ఎంసీహెచ్ ఆసుపత్రి: 1 సీహెచ్‌సీలు: 5 పీహెచ్‌సీలు: 44 అర్బన్ హెల్త్ సెంటర్లు: 28 జరిగిన ప్రసవాలు: 4,671 మంది (22.80శాతం) ప్రయివేట్ ఆసుపత్రులు: 120 జరిగిన ప్రసవాలు: 15,808 (77.19శాతం) కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వాసుపత్రుల్లో సకాలంలో వైద్యులు ఉండకపోవడం.. ఉన్న సిబ్బంది నుంచి మాటల తూటాలు.. అరకొర వైద్య సేవలు.. సాయంత్రం దాటితే ఆయా ఆసుపత్రుల్లో ఎవ్వరూ కనిపించకపోవడం.. ఇదీ జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల తీరు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చక్కబెట్టిన సేవలను కూటమి ప్రభుత్వం దూరం చేస్తోంది. ఇందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగ్గిన ప్రసవాల సంఖ్యే నిదర్శనం. గత ప్రభుత్వంలో 60 శాతం వరకున్న ప్రసవాలు.. ఇప్పుడు ముక్కుతూ మూలుగుతూ 25 శాతం మించకపోవడం గమనార్హం. అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉన్నా ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయించడం క్రమంగా తగ్గుతోంది. మరీ ముఖ్యంగా కర్నూలు సర్వజన ప్రభుత్వాసుపత్రిలో అధునాతన కొత్త భవనంతో పాటు ప్రత్యేక వసతులతో కూడిన ఐసీయూ సేవలందిస్తోంది. ఉచితంగా రక్తం ఇచ్చేందుకు బ్లడ్ బ్యాంకు కూడా ఉంది. వైద్యులు, పీజీ విద్యార్థులు, నర్సుల సంఖ్య గణనీయంగా పెరిగినా పరిస్థితి విషమంగా ఉన్న గర్భిణిలు మాత్రమే ప్రసవానికి వస్తుండటం గమనార్హం. ప్రైవేటు ఆసుపత్రుల్లో 76 శాతం ప్రసవాలు జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) 20,479 ప్రసవాలు జరిగితే అందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో 15,808(77.19శాతం) ప్రసవాలు జరగడం గమనార్హం. గర్భం దాల్చినప్పటి నుంచి పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని గైనకాలజిస్టుల వద్ద గర్భిణిలు చికిత్స చేయించుకుంటున్నారు. ప్రసవానికి కూడా వారి సూచన మేరకు ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ వార్డులు, బాత్రూమ్లు శుభ్రంగా ఉండటం, నర్సింగ్ కేర్ బాగుండటం, వైద్యులు అందుబాటులో ఉండటం వల్ల ప్రయివేట్‌ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతేనే కర్నూలు జీజీహెచ్‌కు.. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రసూతి విభాగానికి ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో ప్రతిరోజూ 35 నుంచి 40 దాకా ప్రసవాలు జరిగేవి. ఇక్కడ అనుభవజ్ఞులైన వైద్యులు, ఎప్పుడూ పీజీల సేవలు, నర్సింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని నమ్మి ఇతర ప్రాంతాల నుంచి సైతం ప్రసవానికి ఇక్కడికే వచ్చేవారు. కానీ ఆరోగ్యశ్రీ ప్రైవేటులోనూ వర్తిస్తుండటంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రతిరోజూ 15 నుంచి 20 ప్రసవాలు మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 80 శాతం సిజేరియన్ కాన్పులే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 80 శాతం సిజేరియన్ కాన్పులే ఉంటున్నాయి. గర్భిణిలు, కుటుంబసభ్యులు ప్రసవ వేదనకు తట్టుకోలేక సిజేరియన్ చేయాలని కోరడం, కొంత మంది వైద్యులు, చాలా మంది గర్భిణిలకు హైబీపీ, రక్తహీనత, షుగర్, థైరాయిడ్, గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం, ఉమ్మునీరు తక్కువగా ఉండటం వంటి హైరిస్క్ కారణాలతో సిజేరియన్ ఆపరేషన్లు చేయాల్సి వస్తోందని అధికారులకు ఆయా ఆసుపత్రుల నిర్వాహకులు వివరణ ఇస్తున్నారు. అయితే కొన్ని ఆసుపత్రులు, వైద్యులు సిజేరియన్ చేస్తే ప్యాకేజి, డబ్బులు ఎక్కువ వస్తాయని కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో 60శాతం ప్రభుత్వాసుపత్రుల్లోనే! సంవత్సరం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు ప్రసవాల శాతం హైరిస్క్ గర్భిణిల శాతం 2019-20 39,140 61.33 19.69 2020-21 36,170 57.60 19.32 2021-22 27,305 58.47 19.08 2022-23 26,433 51.42 17.10 2023-24 28,108 54.39 21.30 † గత ప్రభుత్వంలో ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరేసి మెడికల్ ఆఫీసర్లు ఉండగా.. ఒకరు క్షేత్రస్థాయికి వెళ్లినా మరొకరు ఆసుపత్రిలోనే ఉండి రోగులకు చికిత్సలు అందించే పరిస్థితి. రాత్రివేళల్లోనూ నర్సింగ్ సిబ్బంది తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టారు. వైద్యులు ఫోన్ చేస్తే వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం ప్రసవాల సంఖ్య తగ్గేందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ప్రత్యేకం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్థానిక తుంగభద్ర నది, శ్రీమఠం ప్రాంగణం, మధ్వాచార్ కారిడార్లు భక్తులతో కిక్కిరిశాయి. స్వామి మూల బృందావన దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. రాఘవేంద్రస్వామి, గ్రామ దేవత మంచాలమ్మ, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాద కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరడం కనిపించింది. ఫార్మసీ ఉద్యోగ నియామక ప్రక్రియ నిలిపివేత కర్నూలు(హాస్పిటల్): కడప జోన్–4 పరిధిలో కాంట్రాక్టు ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగాల నియామక ప్రక్రియ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ అధికారి డాక్టర్ బి.రామగిడ్డయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత నియామక ప్రక్రియ చేపడతామన్నారు. ఈ విషయాన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గమనించాలని కోరారు. డీఈఓ బ్లాగ్‌లో టీచర్ల సీనియారిటీ జాబితా కర్నూలు సిటీ: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా డీఈఓ బ్లాగ్‌లో ఉంచామని డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు(అన్ని సబ్జెక్టులు), ఎస్జీటీ తత్సమాన అర్హత కలిగిన వారి సీనియారిటీ జాబితా సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ జాబితాలను https://deokrnl13blogspot.com అనే బ్లాగ్‌లో అందుబాటులో ఉన్నాయని, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోపు ఆధారాలతో సంప్రదించాలని తెలిపారు. చెత్త వాహనాలతో నిరసన కర్నూలు (టౌన్): నగరంలో మొండి బకాయిలు రాబట్టేందుకు మున్సిపల్ సిబ్బంది వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక దేవనగర్లోని ఉమ్మడి ఎంఎస్ 9– గెస్ట్ ఇన్ లాడ్జి నిర్వాహకులు ఏడు సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్సులు నగరపాలక సంస్థకు చెల్లించడం లేదు. దీంతో గురువారం మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చెత్త వాహనాన్ని తీసుకొని లాడ్జి ఎదుట నిలిపేశారు. అక్కడే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ట్రేడ్ లైసెన్సుల బకాయిలు రూ.3,31,250 చెల్లించాలని నిర్వాహకులకు తెలియజేశారు. నగరపాలక సంస్థ నుంచి ప్రయోజనాలు పొందుతూ పన్నులు చెల్లించకుండా ఉండటం తగదని పారిశుద్ధ్య పర్యవేక్షకులు నాగరాజు వెల్లడించారు. పారిశుద్ధ్య తనిఖీదారులు అనిల్ పాల్గొన్నారు. నేడు ఖజానా శాఖ డైరెక్టర్ రాక కర్నూలు (అగ్రికల్చర్): ఖజానా, లెక్కల శాఖ డైరెక్టర్ మోహన్‌రావు శుక్రవారం కర్నూలుకు రానున్నారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీల్లో 2024–25లో జరిగిన లావాదేవీలపై ఖజానా శాఖ వార్షిక తనిఖీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఖజానా శాఖ డైరెక్టర్ మోహన్‌రావు కర్నూలుకు రానున్నారు. శుక్రవారం ఉదయం 9:30 గంటలకు కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్‌ను తనిఖీ చేయనున్నారు. అనంతరం బి.క్యాంప్‌లోని ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి వార్షిక తనిఖీలలో భాగంగా ఇంతవరకు చేపట్టిన తనిఖీలను పరిశీలిస్తారు. -
సాంకేతికతతో నేరాలను నియంత్రిద్దాం
కర్నూలు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను పట్టుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వర్చువల్ విధానంలో పాల్గొన్న సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌తో ఎస్పీ మాట్లాడారు. సీసీ టీఎన్ఎస్ గురించి ఐజీ ఎస్పీతో చర్చించారు. అనంతరం కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలో దీర్ఘకాలంగా పెండింగ్‌లోని కేసుల గురించి ఎస్పీ ఆరా తీశారు. స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు కారణాలను తెలుసుకొని పరిష్కారానికి పలు సూచనలు, సలహాలు చేశారు. సీసీటీఎన్ఎస్ అప్లికేషన్లో నమోదు తప్పనిసరి కేసు నమోదు నుంచి అభియోగ పత్రాల దాఖలు వరకు ప్రతి అంశాన్ని సీసీటీఎన్ఎస్ అప్లికేషన్లో నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. పోలీస్స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సీసీ టీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు. హత్య కేసుల్లో, 174 సీఆర్పీసీ కేసుల్లో త్వరితగతిన పురోగతి పొందేలా చూసుకుంటూ అభియోగ పత్రాలను వీలైనంత త్వరగా కోర్టులో దాఖలు చేయాలన్నారు. స్టేషన్లో పనిచేసే సీసీ టీఎన్ఎస్ పోలీస్ సిబ్బందితో ఈ అంశాలపై మాట్లాడారు. నేర సమీక్ష సమావేశంలో అధికారులకు ఎస్పీ ఆదేశంసైబర్ నేరాలపై అవగాహన కల్పించండి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్టేషన్ల వారీగా సదస్సులు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాద నియంత్రణ చర్యలతో పాటు డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై స్టేషన్ల వారీగా ముమ్మర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ జి.హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు బాబుప్రసాద్, శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు, హేమలత, భాస్కర్‌రావు, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
దేవదాయ శాఖ ఈఓల పవర్‌కు ‘చెక్’
కర్నూలు కల్చరల్: దేవదాయ శాఖకు సంబంధించిన ఆలయాలు, సంస్థలకు చెందిన నిధులు దుర్వినియోగం కాకుండా ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇకపై ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్ ఈఓతో పాటు సంబంధిత దేవదాయశాఖ అధికారితో కలిపి సంయుక్త పేరిట ఉండాలనే మార్గదర్శకాలను జారీ చేశారు. ఆలయాలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) నిధులను కొందరు ఈఓలు గుట్టుచప్పుడు కాకుండా తీసుకుని సొంతంగా వాడుకుంటున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇద్దరు ఈఓలు వారి పరిధిలోని దేవాలయాల ఎఫ్డీలను స్వాహా చేశారు. వారిపై కేసులు పెట్టి సస్పెండ్ చేశారు తప్ప నిధులు రీకవరీ చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఎఫ్డీలు స్వాహా కావడంతో మేల్కొన్న దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఈఓల పరిధిలో ఉన్న ఆలయాల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లను గ్రూప్‌ల వారీగా తనిఖీ చేయించారు. దీనికి పైతం కొందరు ఈఓలు సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒక్కొక్కరు, వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు ఈఓలు వారి ఆలయాల ఎఫ్‌డీల పరిశీలనకు సహకరించడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్ ఈఓతో పాటు సంబంధిత దేవదాయశాఖ అధికారితో కలిపి సంయుక్త పేరిట ఉండాలనే ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్ ఆదేశాలు పాటించాలి కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో ని ఈఓలు నలుగురు ఇంకా వారికి సంబంధించిన గ్రూప్ టెంపుల్స్ ఎఫ్‌డీల ఫైల్స్‌ను చూపించడం లే దు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశాం. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. – పి. గురుప్రసాద్, డిప్యూటీ కమిషనర్, దేవాదాయ శాఖ ఈఓ, జిల్లా దేవదాయ శాఖ అధికారి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లు -
అనుమతి లేని బోట్లు నడిపితే చర్యలు
పగిడ్యాల: కృష్ణా నదిలో అనుమతి లేని బోట్లు నడిపితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శివరాముడు హెచ్చరించారు. ‘నిబంధనలు నీట ముంచి.. ప్రయాణికుల రక్షణ మరిచి’ అన్న శీర్షికను గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై తహసీల్దార్ స్పందించారు. ఉదయం పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలసి మూర్వకొండ ఘాట్‌ను పరిశీలించి ఘాట్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణానది బ్యాక్‌వాటర్‌లో ఎలాంటి ఇంజిన్ బోట్లు తిప్పరాదని ఆదేశించారు. ఫోర్ట్ అధికారులు జారీ చేసి న బోటుకు ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, బోట్ లైసెన్స్ తెచ్చుకోవాలన్నారు. బోట్లు తిప్పకుండా ప్రతి రోజు మూర్వకొండ ఘాట్ వద్ద రెవెన్యూ అసిస్టెంట్లకు బందోబస్తు విధులు వేస్తామన్నారు. తహసీల్దార్ వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీరంగారెడ్డి, వీఆర్వో వెంకటస్వామి, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అసిస్టెంట్లు ఉన్నారు. ఆదర్శ పాఠశాల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ● 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల ● ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ నంద్యాల(న్యూటౌన్): ఆదర్శ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈనెల 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్, కార్డులు, యూపీఐ ద్వారా ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు సమర్పించేందుకు www. cse.ap.gov.in, www.apms. apcfss.in వెబ్సైట్ సంప్రదించాలి. ఆరో తరగతిలో ప్రవేశానికి గతేడాది మాదిరిగానే పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్లోనే ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్ 27న మెరిట్ లిస్ట్, అదే రోజు సెలక్షన్ లిస్ట్‌ను సైతం వెల్లడిస్తారు. ఏప్రిల్ 30న సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ రూల్స్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ పాఠశాలల్లో ఒక్కసారి సీటు దక్కితే ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకూ చదువుకోవచ్చాన్నారు, ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనే తపన ఉండే గ్రామీణ విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు వరంగా చెప్పవచ్చు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ప్రతిభకనబరిస్తే సీటు దక్కుతుంది. -
అడవి తల్లి చల్లగా ఉండాలని..
● ఐస్‌క్రీమ్ పుల్లపై 90 సూక్ష్మ చిత్రాలు ఆవిష్కరణ ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ఐస్‌క్రీమ్ పుల్లపై 90 సూక్ష్మ చిత్రాలు గీచి అబ్బుర పరిచారు. మైక్రో పెన్ను, బ్రష్‌తో పోస్టర్ కలర్స్ ద్వారా ఐస్‌క్రీమ్ పుల్లపై 3 గంటలు శ్రమించి 90 సూక్ష్మ చిత్రాలు వేశారు. చిత్రంలో అడవిలో చెట్లు లేక వన్యప్రాణులు అలమటించిపోయే వేదన, వారి వేదనను వనదేవతకు మొరపెట్టుకోవడం, వన దేవత కన్నీరు పెట్టడం, చెట్లు, నీరు లేక వన్యప్రాణులు విలవిలలాడుతుండటం, ఎండిపోయిన చెట్లు, జంతు కళేబరాలు, నరికివేసిన చెట్లు, తదితరాలతో పాటు జంతువులు, ఖడ్గమృగాలు, నెమళ్లు, కొంగలు, పక్షులు, చేపలు, తాబేళ్లు, తదితర వన్యప్రాణులను సూక్ష్మ చిత్రాల్లో చూపించారు. – నంద్యాల(అర్బన్) -
పశువైద్యానికి ‘పరీక్ష’!
బహుళార్ధ పశువైద్య శాలలో అరకొర సేవలు ● మూగజీవాలకు పరీక్షలన్నీ బయటికే ● పశువులను ఎక్కడెక్కడో తిప్పాల్సిన పరిస్థితి ● వేధిస్తున్న మందుల కొరత ● చికిత్సకోసం యజమానుల జేబులు ఖాళీ ● మూలనపడిన అధునాతన యంత్రాలు అన్నీ బయటికే రాస్తున్నారు దాదాపు పది నెలల ఒంగోలు జాతి కోడెదూడ కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉంది. మేత కూడా తినడం లేదు. స్థానిక పశువైద్యలలో చూపించినా ఫలితం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం కర్నూలు బహుళార్ధ పశువైద్యశాలకు తీసుకొచ్చాం. డాక్టర్లు వైద్య సేవలు బాగా అందిస్తున్నా మందులు, సూదులు, పరీక్షలు అన్నింటినీ బయటికే రాశారు. దీనివల్ల ఖర్చు ఎక్కువగానే వచ్చింది. – నారాయణ, మిట్టకందాల, పాములపాడు మండలం కర్నూలు(అగ్రికల్చర్): బహుళార్థ పశువైద్యశాల.. కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని మూగజీవుల పాలిట వరం. ఏరియా పశువైద్యశాలలు, వెటర్నరీ డిస్పెన్సరీల్లో చేతులెత్తేసిన కేసులకు ఇక్కడి వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో పాటు శస్త్ర చికిత్సలు చేస్తూ ప్రాణం పోస్తున్నారు. అత్యవసర వైద్యం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూగజీవులను కొండారెడ్డిబురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల కు తీసుకొస్తారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో వైద్య సేవల్లో ఎలాంటి లోపం లేకుండా అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆసుపత్రి నిర్వహణ అటకెక్కింది. అధునాతన యంత్ర పరికరాలు మరుగునపడటంతో వైద్య సేవలు అధ్వాన్నమయ్యాయి. గతంలో యజమానులకు ఒక్క రూ పాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందించారు. నేడు వైద్య సేవలు మినహాయిస్తే.. పరీక్షలు, మందు లు ఇతరత్రాలన్నీ బయటకే రాస్తుండటం గమనార్హం. సేవలు నిర్వీర్యం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక బహుళార్ధ పశువైద్య శాల ఉంది. ఒక డీడీ పోస్టు, రెండు ఏడీ పోస్టులు, రెండు వెటర్నరీ అసిస్టెంటు సర్జన్ పోస్టులు ఉన్నాయి. సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు. ప్రధానమైన సమస్య చికిత్సకు ఏది అవసరమైన బయటికి వెళ్లి తెచ్చుకోవాల్సిందే. సాంకేతిక సమస్యల కారణంతో సేవలను నిర్వీ ర్యం చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్ ఎక్స్‌రే యూనిట్ ఉన్నా.. కొన్ని నెలలుగా పూర్తిగా మరుగున పడిపోయింది. ఎక్స్‌రే మిషన్ దుమ్మూ, ధూళితో నిండిపోయింది. రక్తం, యూరిన్ పరీక్షలను కూడా బయటికే పంపుతున్నారు. ఎక్స్‌రే కోసం గాంధీనగర్‌కు.. రక్త, యూరిన్ పరీక్షలకు గాయత్రీ ఎస్టేటుకు వెళ్లాల్సి వస్తోంది. అరకొరగా మందులు ప్రస్తుతం ఆసుపత్రిలో రెండు, మూడు మందులు ఇస్తే.. మరో రెండు, మూడు బయటికి రాస్తున్నారు. ఆసుపత్రిలో సేవలు గాడితప్పినా పశువైద్యశాల డీడీ, జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ పట్టించుకున్న దాఖలాలు లేవు. కాస్త చొరవ తీసుకుంటే అన్ని రకాల వైద్య సేవలు బయటకు పంపకుండానే అందించే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఆసుపత్రికి ప్రతి రోజు కుక్కలు, పిల్లులు, పందులు ఇతర పశువులను 130 వరకు తెస్తుంటారు. ఇందులో 10 శాతం వాటికి ఎక్స్‌రే అవసరం అవుతుంది. మరో 10 శాతం వాటికి రక్త, పేడ పరీక్షలు నిర్వహిస్తారు. ఎక్స్‌రే తీయడానికి రూ.800–రూ.1000 వరకు ఖర్చు అవుతుంది. పరీక్షలకు మరో రూ.1000 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని చూస్తే ఆసుపత్రి అధికారులు రైతులపై ఏ స్థాయిలో ఆర్థిక భారం మోపుతున్నారో స్పష్టమవుతోంది. కుక్కలు, పిల్లులకు ఉచితంగా టీకాలు వేయాల్సి ఉన్నా.. వాటిని కూడా బయటకే రాస్తుండటం విమర్శలకు తావిస్తోంది. మరుగున పడిన ప్రతిపాదనలు బహుళార్ధ పశువైద్యశాలను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్పు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇందులో భాగంగానే రూ.4 కోట్లతో అన్ని రకాల సదుపాయాలతో జి+3 అంతస్తుల భవనాన్ని నాబార్డు నిధులతో నిర్మించారు. 24 గంటలు మూగ జీవులకు వైద్య సేవలు అందించే విధంగా డాక్టర్లను కూడా పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదనలు మరుగున పడిపోగా.. స్థాయికి తగినట్లుగా కూడా సేవలు అందించకపోవడం గమనార్హం. మెరుగైన వైద్య సేవలే అందిస్తున్నాం బహుళార్ధ పశువైద్యశాలలో మెరుగైన వైద్య సేవలే అందిస్తున్నాం. డిజిటల్ ఎక్స్‌రే యూనిట్లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో కొంత అంతరాయం కలిగింది. ఇతర పరీక్షల కోసం శాంపిల్స్ తీసి వ్యాధి నిర్ధారణ కేంద్రానికి పంపుతున్నాం. అక్కడ చేయని వాటిని బయటకు పంపుతున్నాం. – డాక్టర్ హేమంత్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్, బహుళార్ధ పశువైద్యశాల, కర్నూలు -
నోట మాట రావడం లేదు
● ధరలు భారీగా పతనం ● పొలాల్లోనే దిగుబడిని వదిలేసిన రైతులుటమాట పంట సాగు చేసిన రైతుల నోట మాట రాక మూగబోయింది. పంట ఆరంభం నుంచి కోత దశ వరకు అష్ట కష్టాలు పడి సాగు చేసినా ఒకవైపు తెగుళ్లు.. మరో వైపు నిలకడలేని ధరల కారణంగా నష్టాలు మూట గట్టుకున్నారు. ఆఖరికి పంటపై పెట్టిన పెట్టుబడి కూడా చేతి కందే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచక సతమతమవుతున్నారు. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి భగవంతుడా..! అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రబీలో మండల వ్యాప్తంగా దాదాపుగా 150 ఎకరాల్లో పంట సాగు చేయగా ధర మాత్రం గత మూడు నెలలుగా ఒడిదుడుగులకు గురవుతుంది. 25 కేజీల బాక్స్ కేవలం రూ.80 లకే మార్కెట్లో ధర పలకుతుండటంతో కోత కోసిన కూలీల ఖర్చు కూడా రావడం లేదని పంటను పొలాల్లో వదిలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – కృష్ణగిరి -
టీడీపీ నేతలా.. మజాకా
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు అధికారులపై టీడీపీ నాయకులు జులం ప్రదర్శిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ తమ వాళ్లకే దక్కాలని, మళ్లీ టెండర్లు పిలవాలని, లేదా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏదో ఒకటి తమ వాళ్లకే ఇవ్వాల్సిందేనని ఏకంగా సీఈవో చాంబరులోకి చొచ్చుకెళ్లి రభస సృష్టించారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు అధికారులు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. టెండరుదారుల సమక్షంలోనే గురువారం టెండర్లు ఓపెన్ చేశారు. ఐదుగురు టెండర్లు వేయగా.. టెక్నికల్ బిడ్‌లో ఇద్దరికి మాత్రమే అర్హత లభించింది. పైనాన్సియల్ బిడ్‌లో ఎవ్వరు తక్కువ సర్వీస్ చార్జీలతో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని నిర్వహిస్తామని కోట్ చేసి ఉంటారో వారికే టెండరు ఖరారు చేస్తారు. డీసీసీబీలో జీవీఎల్ మ్యాన్ పవర్ సప్లయి ఏజెన్సీస్ సర్వీస్ చార్జీ కేవలం 2 శాతం మాత్రమే కోట్ చేసింది. మరో ఏజెన్సీ 8 శాతం సర్వీస్ చార్జీలను కోట్ చేసింది. దీంతో డీసీసీబీ అధికారులు జీవీఎల్ సంస్థకే టెండరు ఖరారు చేశారు. డీసీసీబీలో 106 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ఈ సంస్థ తరుఫున పని చేస్తారు. ఈ సంస్థ మూడు నాలుగేళ్లుగా పని చేస్తోంది. ఎలాంటి రిమార్కులు లేవు. టెండర్లు పిలిచే ముందు ఈ సంస్థను కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నుంచి తప్పించారు. తాజాగా పిలిచిన టెండర్ల ద్వారా అతి తక్కువ సర్వీస్ చార్జీ కోట్ చేయడం ద్వారా ద్వారా మళ్లీ దక్కించుకున్నారు. జీవీఎల్ సంస్థపై వైఎస్సార్సీపీ ముద్ర వేసిన నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యే వర్గీయులు బ్యాంకు అధికారులపై అక్కసు వెల్లగక్కుతున్నారు. పథకం ప్రకారం జీవీఎల్‌కే టెండరు దక్కే విధంగా చేశారని ఆక్రోశం వ్యక్తం చేశారు. కాగా పాలక వర్గాలు ఉంటే వాళ్లు చెప్పిన సంస్థను ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పాలక వర్గాలు లేవు. జాయింట్ కలెక్టర్ నవ్య అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. ఈ సమయంలో పారాదర్శకంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని టెండరు ద్వారా ఎంపిక చేశారు. దీనిని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నరనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతల చేసిన రభసను బ్యాంకు అధికారులు మూడవ పట్టణ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. డీసీసీబీలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ టెండర్లపై రభస అతి తక్కువ సర్వీస్ చార్జీ కోట్ చేసిన జీవీఎల్‌కు సంస్థకు ఖరారు తమ వారికే ఏజెన్సీ దక్కాలని టీడీపీ నేతల పట్టు -
దైవ దర్శనానికి వెళ్తూ..
జూపాడుబంగ్లా/కొత్తపల్లి: సప్తనదుల సంగమేశ్వరంలో వెలిసిన సంగమేశ్వరుడి దర్శనానికి వెళ్లిన ఓ యువకుడు కృష్ణానదిలో మునిగి మృత్యువాత పడ్డాడు. మండ్లెం గ్రామానికి చెందిన పోతులరాజు మద్దిలేటి, బాలావతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన సందీప్కుమార్బాబు తిరుపతిలోని ఐఎఫ్ ఎఫ్టీ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రికి ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. కాగా బుధవారం తన మిత్రుడు తంగడంచ గ్రామానికి చెందిన శివకుమార్‌తో కలిసి బైక్‌పై సప్తనదుల సంగమేశ్వరాలయానికి వెళ్లారు. నదిలో స్నానం చేసిన అనంతరం ఆలయ అర్చకుడు తగ్గిన కృష్ణా జలాల్లో నడుచుకొంటూ ఆలయం వద్దకు వెళ్లి పూజలు చేసి రావటాన్ని గమ నించారు. వారు కూడా ఆలయం వద్దకు వెళ్లి స్వామిని దర్శించుకునేందుకు కృష్ణాజలాల్లో నడుచుకొంటూ వెళ్లసాగారు. కొద్దిదూరం వెళ్లాక శివకుమార్ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఒడ్డుపై పెట్టివస్తానని బయటకు వచ్చాడు. సందీప్కుమార్బాబు ఒక్కడే నీళ్లల్లో నడుచుకుంటూ ఆలయం వద్దకు వెళ్లాడు. ఆలయం సమీపిస్తుండగానే అక్కడ లోతైన గుంతలోని పూడికలో కూరుకపోయి మునిగిపోయాడు. శివకుమార్ గమనించి కేకలు వేయటంతో సమీపంలోని మత్స్యకారులు పుట్టిల్లో వెళ్లి నీట మునిగిన సందీప్కుమార్బాబును ఒడ్డుకు చేర్చారు. కాగా అప్పటికే అతను మృతిచెందాడు. సమాచారం అందుకన్న యువకుడి తల్లిదండ్రులు సంగమేశ్వరానికి చేరుకుని విలపించారు. సమాచారం అందుకున్న కొత్తపల్లి ఎస్ఐ ఎం.కేశవ సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి బాబాయి బుజ్జన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ సంజామల: మండల పరిధిలోని మంగపల్లె గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని ఎస్ఐ రమణయ్య బుధవారం అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు రైల్వే ట్రాక్ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో సిబ్బందితో కలసి దాడి చేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.3150 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
సెల్ ఫోన్ హ్యాక్ చేసి.. రూ. 90 వేలు కాజేసి!
వెల్దుర్తి: సైబర్ నేరగాళ్లు రోజుకో పంథాలో దోచుకుంటున్నారు. సెల్‌ఫోన్‌ను హ్యాక్ చేసి, ఓటీపీలు తెలుసుకుని బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును అపహరించారు. వెల్దుర్తి పట్టణానికి చెందిన రేమడూరు రామిరెడ్డికి స్థానిక యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. సైబర్ నేరగాళ్లు అతని సెల్ ఫోన్‌ను ఈనెల 17న హ్యాక్ చేసి ఓటీపీలు తెలుసుకుంటూ బ్యాంకు ఖాతాలోని రూ.99 వేలను అమేజాన్ పే ద్వారా బదిలీ చేసుకున్నారు. తన ఖాతా నుంచి నగదు మాయమైనట్లు గుర్తించిన బాధితుడు బుధవారం బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. సైబర్ నేరగాళ్ల పనేనని తెలుసుకుని తన ఖాతాను లాక్ చేయించారు. బాధితుడు సైబర్ పోలీసులు, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫోన్లకు వచ్చే కొత్త లింకులు ఓపెన్ చేయవద్దని, ఫోన్లు హ్యాక్ అయి నగదు మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎస్ఐ అశోక్ హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టండి ఆదోని సెంట్రల్: ప్రయాణికుల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రైల్వే సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రైల్వే అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా ఆయన బుధవారం సులహాళ్లి నుంచి గుంతకల్లు వరకు రైల్వే స్టేషన్లను పరిశీలిస్తూ ఆదోని రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. అమృత్ భారత్ పథకం కింద స్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. ఈయన వెంట ప్రిన్సిపల్ చీఫ్ అప్రంటీస్ మేనేజర్ పద్మజ, గుంతకల్లు డీఅర్ఎం చంద్ర శేఖర్ గుప్త ఆదోని స్టేషన్ మాస్టర్ వెంకటేశ్వర్లు, చీఫ్ క్యాంప్ సూపరింటెండెంట్ త్రిభువన్, రైల్వే పోలీసులు తదితరులు ఉన్నారు. పట్టణంలోని నల్లగేటు వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మా ణం చేపట్టాలని బీజేపీ నాయకులు నాగరాజు గౌడ్, మధుసూనద్ శర్మ తదితరులు అరుణ్ కుమార్ జైన్‌కు వినతి పత్రం అందజేశారు. ఒద్దెల వాగులో యువకుడి గల్లంతు ● గాయాలతో బయటపడిన మరొకరు పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యం–కొణిదేడు గ్రామాల మధ్య ఉన్న వొద్దెలవాగులో ఓ యువకుడు గల్లంతు కాగా మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. కొణిదేడు సమీపంలో రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పనులు చేస్తున్న ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన రాహూల్, మరో యువకుడు పని మీద బుధవారం సాయంత్రం బైక్‌పై పాణ్యం వచ్చారు. రాత్రి పని ముగించుకుని పని చేసే చోటుకు తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఒద్దెలవాగులో పడిపోయారు. గమనించిన వాహనదారులు రాహుల్ అనే వ్యక్తికి బయటకు తీశారు. మరో యువకుడు గల్లంతైనట్లు తెలిపారు. సమాచారం తెలుసుకు న్న 108 సిబ్బంది గాయపడిన రాహుల్‌ను నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. స్థానికులు వాగు వెంట మరో యువకుడికి కోసం గాలిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం డోన్ టౌన్: పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. మల్లెంపల్లె గ్రామానికి చెందిన సలీంద్ర వీరాంజనేయులు (30) డోన్ పట్టణం నుంచి కొత్తపల్లె వైపు ట్రాక్టర్లో వెళ్తుండగా వెనుక వస్తున్న మరో ట్రాక్టరు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరాంజనేయులు ట్రాక్టర్ నుంచి ఎగిరి పక్కనే ఉన్న డివైడర్‌పై పడటంతో తలకు తీవ్రగాయమైంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య మంజుల, నెలల వయస్సు కుమారుడు ఉన్నారు. -
దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు హాజరు
ఆలూరు: బాల్యంలో చేయి పట్టుకుని ప్రపంచాన్ని చూపించిన, మంచి నేర్పించిన తండ్రి ఇక లేరు..పుట్టినప్పటి నుంచి లాలన పంచి, మమకారంతో పెంచిన అమ్మ ఇక రాదు.. ఎంతో కష్టాన్ని భరించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు లేరనే దుఃఖంలోనే ఇద్దరు పదో తరగతి విద్యార్థులు బుధవారం పరీక్ష రాశారు. కంట నీరు వస్తున్నా అమ్మానాన్నలు పెట్టుకున్న ఆశలు, తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు పరీక్షకు హాజరయ్యారు. ఆలూరు మండలం మొలగవెల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన సాయి పోగు భగీరత, భార్య శ్రీదేవి దంపతుల నాలుగో కుమారుడు సాయిపోగు రామకృష్ణ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదివారు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుమారుడిని చదివించారు. ఈ నెల 18న హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో మిర్చి పంటను కోసేందుకు శ్రీదేవి (47) కూలి పనికి వెళ్లారు. పొలం సమీపంలోని ఎల్లెల్సీలో నీటిని తాగేందుకు వెళ్లి కాలు జారి పడి మృతి చెందారు. తల్లి మృతి చెందిన బాధను దిగమింగుకుని ఆలూరు ప్రభుత్వ బాలికల ఉన్న పాఠశాల పరీక్ష కేంద్రంలో సాయిపోగు శివరామకృష్ణ బుధవారం హిందీ పరీక్ష రాశారు. తండ్రి మరణించినా.. ఆలూరులోని మెయిన్ ఉర్దూ పాఠశాలలో మహ్మద్ ముజమల్ అనే విద్యార్థి పదో తరగతి చదివారు. మంగళవారం తెల్లవారు జామున విద్యార్థి తండ్రి నూర్‌మహ్మద్ (50) అనారోగ్యంతో మృతి చెందారు. ఆ బాధతోకూడా బుధవారం ఉదయం పరీక్ష కేంద్రానికి మహ్మద్ ముజమల్ చేరుకున్నారు. హిందీ పబ్లిక్ పరీక్షను రాశారు. తండ్రి మరణించిన దుఃఖంలోనూ పరీక్షకు హాజరైన విద్యార్థి మహ్మద్ ముజమల్ను ఉపాధ్యాయులు అభినంధించారు. -
పెద్దాయనా.. మన్నించు !
సంజీవయ్య జయంతి ఉత్సవాలకు రూ.3 లక్షలు ● ఫిబ్రవరి 14న ఘనంగా నిర్వహించిన జిల్లా అధికార యంత్రాంగం ● నేటికీ నయాపైసా విదల్చని ప్రభుత్వం కర్నూలు(అర్బన్): దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి నిర్వహణకు సంబంధించిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేటికీ విడుదల చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంజీవయ్య సొంత జిల్లా అయిన కర్నూలులో ఆయన జయంతిని అంగరంగ వైభవంగా అధికారికంగా రాష్ట్ర స్థాయి పండుగ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే స్టేట్ హెడ్ క్వార్టర్స్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.లక్ష, సంజీవయ్య సొంత జిల్లా కర్నూలుకు రూ.3 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 2 విడుదల చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో దామో దరం సంజీవయ్య విగ్రహం ఉన్న ప్రాంతంలో జయంతి వేడుకలను ఫిబ్రవరి 14న ఘనంగా నిర్వహించారు. నేడో రేపో నిధులు విడుదలైన వెంటనే చెల్లించవచ్చనే ధైర్యంతో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన పలువురు అధికారులు సప్లయర్స్ షాపు, పూల దుకాణాలు, కిరాణ తదితర షాపుల్లో అప్పులు చేసి జయంతిని ఘనంగా చేశారు. జయంతి నిర్వహించి నెల రోజులు గడచిపోయినా, ప్రభుత్వం నుంచి నేటికీ నయాపైసా విడుదల కాకపోవడంతో అప్పులు ఇచ్చిన షాపుల వారికి ముఖాలు చూపించలేక, అపద్దాలు చెప్పలేక పలువురు అధికారులు ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా షాపుల యజమానులు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం గమనార్హం. -
రైతు ఇంట మెరిసిన ఆణిముత్యాలు
● ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ముగ్గురు కుమారులు ● చిన్నారులకు ఉచితంగా బోధన చేస్తున్న రైతు బేతంచెర్ల: ఆ రైతుకు చదువు అంటే ఎంతో ఇష్టం. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువుకు దూరమయ్యాడు. అయితే వ్యవసాయం చేస్తూనే తన కలను కుమారులతో సాకారం చేసుకున్నాడు. ముగ్గురు కొడుకులను బాగా చదివించడంతో వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తన బిడ్డల్లానే గ్రామంలో చిన్నారులు కూడా శ్రద్ధగా చదువుకుని ప్రయోజకులు కావాలని ఆకాంక్షిస్తూ సాయంత్రం వేళ ఉచితంగా విద్యను బోధిస్తున్నాడు. ఎంబాయి గ్రామం పాడి పంటలకు ప్రసిద్ధి. ఆ గ్రామంలో ఈడిగ వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరమ్మ దంపతులది సాధారణ వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గరగా చూసిన ముగ్గురు కుమారులు పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించారు. పెద్ద కుమారుడు తులసీ రామ్ గౌడ్ డిగ్రీలో బీజెడ్సీ పూర్తి చేసి 2014లో ఎయిర్ ఫోర్స్‌లో మెడికల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం బెంగళూరులో పని చేస్తున్నారు. రెండవ కుమారుడు బెనర్జీ గౌడ్ వెటర్నరీలో డిప్లొమో పూర్తి చేసి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అనిమల్ హస్బెండరీగా ఎంపికయ్యారు. కొలుములపల్లె సచివాలయంలో పని చేస్తూ.. ఇటీవల వెటర్నరీ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది ముద్దవరంలో విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు తరుణ్‌కుమార్ గౌడ్ 2019లో అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఇటీవల కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మాణిక్యరావు చేతుల మీదుగా డాక్టర్ పట్టా అందుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రభుత్వ కొలువులు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టుదలతో సాధించారు నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఆర్థిక పరిస్ధితుల కారణంగా ఉన్నత చదువులకు వెళ్లలేక గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను బాగా చదివించాలనుకున్నా. వారు కూడా పట్టుదలతో చదివి ప్రయోజకులయ్యారు. చిన్నప్పటి నుంచి పిల్లలు పాఠశాలకు వెళ్లి వచ్చిన తరువాత బోధన ఆంశాలపై చర్చించి, సందేహాలను నివృత్తి చేసేవాడిని. మా పెద్ద కుమారుడు తులసీరామ్ గౌడ్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం సాధించిన తరువాత తమ అన్నను ఇద్దరు తమ్ములు ఆదర్శంగా తీసుకుని ఉద్యోగాలు సాధించారు. నా కొడుకుల మాదిరిగానే గ్రామంలోని చిన్నారులు కూడా బాగా చదువుకోవాలని నా వంతుగా సాయంత్రం వేళలో ఉచితంగా బోధన చేస్తున్నాను. – వెంకటేశ్వర్లు గౌడు, ఎంబాయి -
ప్రజల రక్షణ మరిచి !
నిబంధనలు నీట ముంచి.. ● యథేచ్ఛగా ఇంజిన్ బోటు ప్రయాణం ● కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ ● కెపాసిటీకి మించి లైఫ్ జాకెట్స్ లేకుండా ప్రయాణికుల తరలింపు ● ఘాట్ నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలు పగిడ్యాల: శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో ఇంజిన్ బోటులో ప్రయాణికుల తరలింపును అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. మూర్వకొండ ఘాట్, అర్లపాడు ఘాట్ నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కృష్ణానదికి ఇరువైపులా బంధువర్గాలు ఉన్న ప్రజలు ఆయా ప్రాంతాలకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే వ్యవప్రయసాలు కావడంతో చాలా మంది ఇంజిన్ బోట్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఘాట్ నిర్వాహకులు కెపాసిటీకి మించి ప్రయాణికులను పడవలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కనీసం లైఫ్ జాకెట్లు లేకుండా ప్రయాణికులను పంపుతున్నారు. మూడు నెలలుగా కొనసాగుతున్న అనధికారిక ఇంజిన్ బోటు ప్రయాణంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఘాట్ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇంజిన్ బోట్లలో కెపాసిటీకి మించి 25 నుంచి 30 మంది ప్రయాణికులను తరలించడమే కాకుండా బైక్‌లను అందులో తరలించి ఒక్కొక్కరి నుంచి రూ. 200ల ప్రకారం వసూలు చేస్తున్నారు. 2007 జనవరి 18న ఇదే మూర్వకొండ ఘాట్ నుంచి సింగోటం జాతరకు నాటు పడవలో వెళ్తూ 60 మంది జల సమాధి అయిన ఘటన నేటికి కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినా కాలం చెల్లిన ఫిట్నెస్ లేని ఇంజిన్ బోట్లపై ప్రయాణికులు భయం భయంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి (లైసెన్స్) లేకపోయినప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యే వర్గీయుల కనుసన్నల్లో అనధికార ప్రయాణానికి పచ్చ జెండా ఊపడంతో ఘాట్ నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. ఈ విషయమై తహసీల్దార్ శివరాముడును వివరణ కోరగా.. ఇంజిన్ బోటు ప్రయాణానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
అవిశ్వాస తీర్మానం
ఆదోని మునిసిపల్ చైర్‌పర్సన్‌పై కర్నూలు(సెంట్రల్): ఆదోని మునిసిపల్ చైర్పర్సన్ బోయ శాంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికై నా కౌన్సిలర్ల మాటకు విలువ ఇవ్వకుండా విశ్వాసం కోల్పోయారని, ఆమైపె అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇవ్వా లని కోరుతూ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కలెక్టర్‌ను కలిశారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ పి.రంజిత్బాషాను ఆయన చాంబర్లో కలసి 35 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సంతకాలు చేసిన లేఖను అందజేశారు. ఈ లేఖపై కలెక్టర్ 15 రోజుల్లో విచారణ జరిపి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రత్యేకంగా మునిసిపల్ససర్వసభ్య సమావే శా న్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే నూతన ౖచైర్మన్‌ను ఎన్నుకునే వీలుంటుంది. కౌన్సిలర్ల మాటకు విలువ లేకుండా చేశారు... ఆదోని మునిసిపల్ చైర్పర్సన్ బోయ శాంత కౌన్సిలర్ల మాటకు విలువ లేకుండా చేయడంతోనే ఆమైపె అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైనట్లు కౌన్సిలర్లు గౌస్, రఘునాథఽరెడ్డి, లక్ష్మీదేవి, లోకేశ్వరి, నరసింహులు, సందీప్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ఆమె ఇటీవల బీజేపీలోకి వెళ్లి ఎమ్మెల్యే డాక్టర్ బి.పార్థసారథి మాటలు విని తమ తీర్మానాలను పట్టంచుకోవడంలేదన్నారు. ఇదేసమయంలో ఆదోని ఎమ్మెల్యే అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా, కౌన్సిలర్లపై పెత్తనం చేస్తున్నారని, బలవంతంగా పార్టీ మారాలని ఒత్తిళ్లు చేస్తున్నట్లు వాపోయారు. బెదిరించి పార్టీ మార్పిస్తున్నారు అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ మునిసిపల్ మేయర్లు, చైర్మన్లను దౌర్జన్యంగా బెదిరించి టీడీపీ, బీజేపీ, జనసేనల్లోకి చేర్చుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, మేయర్ బీవై రామయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల తిరుపతిలో కనీస బలం లేకుండా డిప్యూటీ మేయర్ పోస్టును టీడీపీ కై వసం చేసుకోవడాన్ని చూశామని, అదే తరహాలో ఆదోనిలో కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. చైర్పర్సన్ సహా ఐదుగురు కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. పార్టీ మారిన వారంతా అవిశ్వాసం సందర్భంగా వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలని, లేదంటే విప్‌ను జారీ చేసి డిస్క్వాలిఫై చేస్తామన్నారు. మొత్తం వార్డులు: 42 వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు: 41 టీడీపీ కౌన్సిలర్లు: 01 కలెక్టర్‌కు లేఖను అందించిన 35 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆదోని మున్సిపాలిటీలో పార్టీల బలాబలాలు (కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చైర్పర్సన్ సహా ఐదుగురిని బెదిరించి బీజేపీలో చేర్చుకున్నారు. ఒకరు చనిపోయారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీకి 35 మంది కౌన్సిలర్ల బలం ఉంది.) -
రాష్ట్రంలో అరాచకపాలన
● వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టడం దారుణం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి కోడుమూరు రూరల్: రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజల గుండెల్లో నుంచి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తొలగించాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు బుధవారం కోడుమూరు వెళ్లారు. మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని పరిశీలించి అక్కడే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడిన వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టడం దారుణమన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ‘కూటమి’ నేతలు హామీలను అమలు చేయలేక.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైఎస్సార్ విగ్రహాలపై దాడులు చేయిస్తున్నారన్నారు. యూనివర్సిటీలకు వైఎస్సార్ పేరు ఉండగా మార్చడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఒకే వ్యక్తిపై పలు జిల్లాల్లో ఒకే విధమైన కేసులు నమోదు చేయించి వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది అనాగరిక చర్య అన్నారు. అధికారం శాశ్వతం కాదని, భవిష్యత్‌లో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడుమూరులో వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు రఘునాథ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్‌రెడ్డి, కృష్ణాపురం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వెఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్, మండల అధ్యక్షుడు రమేష్‌నాయుడు, మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్‌కుమార్, స్థానిక నాయకులు జగదీష్, గోపి, విజయభాస్కరరెడ్డి, బందె నవాజ్, డీజె రాజు, బజారి, వెంకటేశ్వర్లు, ఈరన్న, మాసుమ్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
27న ‘స్థానిక’ ఖాళీల భర్తీకి ఎన్నికలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్, మండల పరిషత్తుల్లో ఖాళీగా ఉన్న కోఆప్షన్ సభ్యులు, ఎంపీపీ పదవుల భర్తీకి ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు వెలుగోడుకు చెందిన సయ్యద్ సులేమాన్ గత ఏడాది మార్చి 28న, క్రిష్ణగిరి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ షాలీసాహెబ్ ఈ ఏడాది జనవరి 1న మృతి చెందారన్నారు. అదేవిధంగా వెల్దుర్తి, తుగ్గలి మండల పరిషత్ అధ్యక్షులు బి.శారద, ఆదెమ్మ వ్యక్తిగత కారణాలతో 2024 మార్చి 29న తమ పదవులకు రాజీనామా చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ ఏర్పడిన నాలుగు పోస్టులకు ఎన్నికలను నిర్వహించునున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 23న నోటీసులు జారీ చేస్తామని, ఆ రోజు నుంచి కోఆప్షన్ సభ్యుల స్థానాలకు 27వ తేది ఉదయం 10 గంటల వరకు, ఎంపీపీ స్థానాలకు ఉదయం 11 గంటల వరకు నామినేషన్లు దాఖాలు చేసుకోవచ్చన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం యథావిధిగా నామినేషన్ల ఉపసంహరణ, బరిలో ఉన్న వారి జాబితాలను ప్రకటిస్తామన్నారు. అదే రోజున మధ్యాహ్నం 1 గంటకు జెడ్పీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయాల్లో కూడా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎంపీపీ, కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకుంటారన్నారు. ఆరు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచులకు.. జిల్లాలోని ఆరు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. దేవనకొండ మండలం వెలమకూరు, పత్తికొండ మండలం జూటూరు, ఓర్వకల్ మండలం గుట్టపాడు, కర్నూలు మండలం సుంకేసుల, ఆలూరు మండలం మొలగవెళ్లి, వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 27న ఉదయం 11 గంటలకు ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఖాళీగా మూడు జెడ్పీటీసీ స్థానాలు .... జిల్లా పరిషత్‌లో కూడా మూడు జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కల్లూరు జెడ్పీటీసీ వి.ప్రభాకర్‌రెడ్డి 2023 అక్టోబర్ 20న మృతి చెందారు. చిప్పగిరి జెడ్పీటీసీగా ఉన్న బి.విరుపాక్షి ఆలూరు ఎమ్మెల్యేగా ఎన్నికవడం వల్ల తన జెడ్పీటీసీ పదవికి 2024 జూన్ 14న రాజీనామా చేశారు. ప్యాపిలి జెడ్పీటీసీగా ఉన్న బోరెడ్డి శ్రీరాంరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఈ నెల 10న మరణించారు. ఈ మూడు స్థానాలతో పాటు జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచు, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. -
అందరూ చూస్తుండగానే ఆత్మహత్య
● గుత్తి రైల్వే స్టేషన్లో రైలు కింద పడి మృతి ● మృతుని స్వగ్రామం గొర్విమానుపల్లె ● ఆర్థిక సమస్యలే కారణమని సమాచారం కొలిమిగుండ్ల: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ బుధవారం మధ్యాహ్నం ప్రయాణికులతో రద్దీగా ఉంది.. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు పట్టాలపైకి చేరుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హఠాత్తు సంఘటనతో అక్కడి ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లెకు చెందిన రామదాసు శ్రీరాములు, మునెమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం కాగా కూతురుకు వివాహమైంది. కుమారుడు మహేంద్ర (25) గతంలో గ్రామంలో వలంటీర్‌గా పని చేశాడు. ప్రస్తుతం అనంతపురం జిల్లా యాడికి సమీపంలోని ఓ సిమెంట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే మార్గం లేక ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం గుత్తి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న యువకుడు రైలు వేగంగా వస్తుండగా ప్రయాణికులు చూస్తుండగానే ప్లాట్‌ఫామ్ పైనుంచి దూకి పట్టాలపై తల పెట్టి పడుకోవడంతో రైలు అతనిపై వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీయగా గొర్విమానుపల్లెకు చెందిన మహేంద్రగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
నేడు నేర సమీక్ష సమావేశం
దుకాణానికో రేటు ఖరారు ● కర్నూలులో రూ.70 వేలు ఇవ్వాల్సిందేనని పట్టు ● మధ్యవర్తిత్వం చేసిన ఓ మంత్రి ● ప్రస్తుతానికి రూ.40వేలు చెల్లించేలా ఒప్పందం ● వ్యాపారాన్ని బట్టి కూడా వసూళ్లు ●● ప్రతినెలా 10లోపు లావాదేవీల పూర్తి కర్నూలు: ఉమ్మడి జిల్లాలోని మద్యం దుకాణాల్లో పోలీసుల మామూళ్ల దందా శృతి మించుతోంది. వ్యాపారం సాగుతుందా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా అన్ని చోట్టా వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. నెలకు దుకాణానికి రూ.40 వేలు, మరికొన్ని చోట్ల రూ.50 వేలు చొప్పున కప్పం కట్టాల్సిందేనంటూ అనధికారిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. వచ్చిన మొత్తాన్ని వాటాలేసి పంచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 225 మద్యం దుకాణాలు, 60 బార్లు ఉన్నాయి. వీటిలో 90 శాతం దుకాణాల్లో పోలీసులు మామూళ్లు వసూలు చేస్తున్నారు. నెలకు రూ.40 వేల చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కర్నూలు అర్బన్‌లో 21, రూరల్‌లో 11 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కొక్క దుకాణానికి రూ.70 వేల చొప్పున ఇవ్వాలని ఓ పోలీసు అధికారి హుకూం జారీ చేయగా మద్యం సిండికేట్‌దారులు ఓ మంత్రిని ఆశ్రయించారు. వ్యాపారంలో ఎదురవుతున్న కష్టాల గురించి చెప్పుకున్నారు. దీంతో మంత్రి మధ్యవర్తిత్వం చేసి ఒక్కొక్క దుకాణానికి రూ.40 వేలు ఇచ్చేలా డీల్ కుదిర్చినట్లు వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. ఒక్క కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 32 మద్యం దుకాణాలు, 18 బార్ల నిర్వాహకులు కలసి నెలకు రూ.20 లక్షల దాకా పోగేస్తున్నారంటే వసూళ్ల పర్వం ఏస్థాయిలో సాగుతుందో అర్థమవుతోంది. వ్యాపారం బాగా సాగితే అదనపు వసూళ్లు కోడుమూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 15 మద్యం దుకాణాలు ఉన్నాయి. జిల్లాలోనే అత్యధిక వ్యాపారం జరిగే నాగలాపురం మద్యం దుకాణం నుంచి నెలకు రూ.లక్ష చొప్పున ఇవ్వాల్సిందేనంటూ ఓ అధికారి హుకూం జారీ చేసినట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వందకు పైగా దుకాణాల్లో అత్యధిక వ్యాపారం జరుగుతుండటంతో వాటి నిర్వాహకుల నుంచి పోలీసులు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. సిండికేట్ నిర్వాహకుల లెక్కల్లో ఏయే స్టేషన్‌కు ఎంత మొత్తం మామూళ్లు ఇస్తున్నారో పొందుపరచిన వివరాలపై ఇటీవల ఎకై ్సజ్ అధికారులు, మద్యం వ్యాపారుల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రతినెలా 10వ తేదీలోపే! కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వసూళ్ల దందా జోరుగా సాగుతోంది. ప్రతినెలా 10వ తేదీ లోపే వసూళ్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. రెండు జిల్లాల్లో నెలకు రూ.కోటికి పైగా మామూళ్ల రూపంలో పోలీసులకు అందుతున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చిన మొత్తాన్ని రెండు వాటాలు వేసి ఎస్‌హెచ్‌లు, ఆపై అధికారులు పంచుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. స్టేషన్, సబ్ డివిజన్ పరిధిలో ఉండే మద్యం దుకాణాల సంఖ్యను బట్టి మామూళ్లు ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది. అధిక ధరలకు అమ్మకాలు ●పోలీసులను మామూళ్ల మత్తులో పెట్టి నిర్వాహకులు నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ● అధిక ధరలకు అమ్ముకునేందుకు రూరల్ ప్రాంతాల్లో బెల్టు షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ● ఈ క్రమంలో అర్బన్ ప్రాంతాల్లో దుకాణానికి నెలకు రూ.40 నుంచి రూ.50 వేలు, రూరల్ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి రూ.80 వేల దాకా మామూళ్ల రూపంలో పోలీసులు పోగేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ● ప్రతి మద్యం దుకాణం నుంచి వాటి అనుబంధ బెల్టు షాపులకు క్వార్టర్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే రూ.20 నుంచి రూ.50 వరకు ఎక్కువ ధరకు వ్యాపారులు సరఫరా చేస్తున్నారు. ● బెల్టు దుకాణాల్లో జరిగే దందాను చూసీచూడనట్లు ఉండేందుకు వ్యాపారాన్ని బట్టి ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేసుకుని వసూలు చేస్తున్నట్లు సమాచారం. కర్నూలు: జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం నేర సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గత నెలలో జరిగిన నేరాలతో పాటు పెండింగ్ కేసులపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమీక్షించనున్నారు. ముందుగా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణ కేంద్రంలో పోలీసు అధికారులకు ఫైరింగ్‌పై శిక్షణ, 10 గంటల నుంచి వ్యాస్ ఆడిటోరియంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లాలోని పోలీసు అధికారులకు ఆదేశాలు అందాయి. -
యోగా అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): పీఎం యోగా అవార్డులు ఇచ్చేందుకు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు, ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు సెట్కూరు సీఈఎ డాక్టర్ కె.వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యోగాలో జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి, యోగా అభివృద్ధికి కృషి చేసిన సంస్థలకు అవార్డులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు https:// innovateindia. mygov. in/ pm& yoga& awards–2025 ను సందర్శించాలన్నారు. క్వింటా పత్తి రూ.7,666 ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో పత్తి ధర క్రమంగా పెరుగుతోంది. బుధవారం క్వింటా ధర రూ.7,666గా నమోదైంది. రైతులు 517 క్వింటాళ్లు అమ్మకానికి తీసుకురాగా.. గరిష్ట ధర రూ.7,666, మధ్య ధర రూ.7,380, కనిష్ట ధర రూ.5,389 పలికింది. ● వేరుశనగలు 5,100 సంచులు విక్రయానికి రాగా.. గరిష్ట ధర రూ.6,827, మధ్య ధర రూ. 6,469, కనిష్ట ధర రూ.3,399 నమోదైంది. ● ఆముదాలు 32 సంచులు రాగా గరిష్ట ధర రూ.5,970, మధ్య ధర రూ.5,970, కనిష్ట ధర రూ.5,077 పలికింది. ● ఎండుమిర్చి 2,057 సంచులు రాగా గరిష్ట ధర రూ.10,206, మధ్య ధర రూ.8,300, కనిష్ట ధర రూ.2,009 నమోదైంది. మధ్యవర్తిత్వంపై శిక్షణ కర్నూలు(సెంట్రల్): సుప్రీంకోర్టు నూతనంగా ప్రవేశపెట్టిన మధ్యవర్తిత్వంపై బార్ అసోసియేషన్ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కబర్థి ఆదేశాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, కేరళ నుంచి వచ్చిన రిసోర్స్పర్స్న్లు సురేష్, జ్యోతిగోపీనాథన్ న్యాయవాదులకు అవగాహన కల్పించా రు. మధ్యవర్తిత్వంతో కేసులను ఎలా పరిష్కరించాలనే అంశాలు, ఉన్న చట్టాలపై శిక్షణ ఇచ్చారు. పది పరీక్ష కేంద్రాల తనిఖీ కర్నూలు సిటీ: నగరంలోని పదోతరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తనిఖీ చేశారు. బిషప్ సెంట్ జోసెఫ్ ఇంగ్లిషు మీడియం హైస్కూల్, గుడ్ షెప్పర్డ్ ఇంగ్లిషు మీడియం హైస్కూల్లో ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 172 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు 219 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 31,535 మంది విద్యార్థులకుగాను 31,316 మంది హాజరు అయ్యారని డీఈఓ ఎస్. శామ్యూల్ తెలిపారు. రెండో రోజు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలకు 809 మంది విద్యార్థులకుగాను 721 మంది పరీక్షకు హాజరుకాగా 88 మంది గైర్హాజరయ్యారు. -
దివ్యాంగులకు యూడీఐడీ
శాశ్వత ఐడీ తప్పనిసరి దివ్యాంగులకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసేవారు. అయితే ఇకపై శాశ్వతంగా ఆధార్‌కార్డు తరహాలో కేంద్ర ప్రభుత్వం యూడీఐడీను ప్రవేశపెట్టింది. దివ్యాంగులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ కార్డు తప్పనిసరి కానుంది. దివ్యాంగులు ఆన్లైన్లో నమోదు చేసుకొని ఈ కార్డును పొందితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – రయిస్ ఫాతిమా, ఏడీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ కర్నూలు(అర్బన్): దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ఇతరత్రా సేవలకు సదరం స్థానంలో యూడీఐడీ (యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు )ని అందించనుంది. దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే చేయూత, ఇతర ప్రయోజనాలకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. దీని కోసం దివ్యాంగులు గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సదరం శ్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్య నిర్ధారణ అనంతరం సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లకు స్వస్తి పలికింది. ఆ స్థానంలో యూడీఐడీని పొందేందుకు స్వాలంబన్‌కార్డు.జీఓవీ.ఇన్ (https://swavlambancard. gov.in) అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో దివ్యాంగులు నేరుగా ఇంటి వద్ద నుంచే ఫోన్, ఇంటర్నెట్ సెంటర్, మీ సేవా కేంద్రాల నుంచి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సులభతరంగా సేవలు ... కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన యూడీఐడీ పోర్టల్ వల్ల సేవలు చాలా సులభతరం కానున్నాయి. ఇకపై సదరం శిబిరాల కోసం మీ సేవతో పాటు యూడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి సదరం శిబిరాలకు సంబంధించి ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం దివ్యాంగుల ఫోన్ నెంబర్‌కు సంక్షిప్త సందేశం రూపంలో వస్తుంది. దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి తప్పులు, అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఐదు రకాల వైకల్యం ఉన్న వారికే మీ సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఇక యూడీఐడీ పోర్టల్‌లో 21 రకాల వైకల్యాలను చేర్చారు. తలసేమి యా, ఆటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం శిబిరాల కోసం యూడీ ఐడీ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సదరం శిబిరంలో వైకల్య నిర్ధారణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లను స్మార్ట్ కార్డు రూపంలో పోస్టల్‌శాఖ ద్వారా ఇంటికే పంపించనున్నారు. ఈ కార్డు ద్వారా చేయూత పింఛన్లతో పాటు ఇతర పలు సంక్షేమ ప్రయోజనాలకు దేశ వ్యాప్తంగా చెల్లుబాటు కానుంది. యూనిక్ డిజేబులిటీ ఐడీ కార్డులను ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇప్పటి వరకు ఉన్న సదరం సర్టిఫికెట్లు మన రాష్ట్రంలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. ఇలా దరఖాస్తు చేసుకోండి ... ఆన్లైన్లో స్వాలంబన్‌కార్డు.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్లయ్ బటన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకొని తరువాత అంగీకరిస్తు సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. దివ్యాంగులు వారికి చెందిన పూర్తి సమాచారాన్ని అక్కడ అడిగిన విధంగా నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. వైద్య పరీక్షల అనంతరం వెబ్సైట్లో అర్జీల స్టేటస్‌ను నిత్యం పరిశీలించుకోవచ్చు. కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం 21 రకాల సేవలు సులువుగా పొందే అవకాశం -
ప్రశాంతంగా ఏఎన్ఎంల పదోన్నతి కౌన్సెలింగ్
కర్నూలు(హాస్పిటల్): సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎం–3లకు ఎంపీహెచ్ఏ–ఎఫ్‌గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు వీరికి కర్నూలు మెడికల్ కాలేజీలోని నూతన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. కౌన్సెలింగ్‌లో స్థానం పొందిన వారికి డీఎంహెచ్‌వో డాక్టర్ పి. శాంతికళ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ఆర్డర్ కాపీలు అందజేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 172 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళతో పాటు ఏవో అరుణ, సూపరింటెండెంట్ పి. శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్‌లు కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. -
అన్నదానం పేరుతో అక్రమ వసూళ్లు
● కాశినాయన ఆశ్రమమంటూ విరాళాల సేకరణ ● రాజమండ్రి పోలీసులకు చిక్కిన వెలుగోడు ముఠా ఆత్మకూరురూరల్: అన్నదానం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. వెలుగోడు మండలానికి చెందిన నిందితులు కర్ణాటక, తమిళనాడుతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రా ల్లో కాశిరెడ్డి నాయన పేరిట నిత్యాన్నదానం చేస్తున్నామని, శ్రీశైలంలో ఒక వసతి గృహం నిర్మిస్తున్నామని నమ్మబలుకుతూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న విషయాన్ని రాజమండ్రి పోలీసులు బట్టబయలు చేశారు. వెలుగోడు మండల కేంద్రంలో నివసించే శంకర్ అనే వ్యక్తి శంకర్ రెడ్డి, భవనం రమణారెడ్డి అనే పేర్లతో చెలామణి అవుతూ దాదాపు లక్షలాది రూపాయలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇతను అతని కులస్తులను కొందరిని తన ముఠాలో చేర్పించుకుని ఖరీదైన దుస్తులు, వేషధారణతో వాహనాల్లో తిరుగుతూ పలు ప్రాంతాల్లో విరాళాలు సేకరించారు. వీరు రెండు రోజుల క్రితం రాజమండ్రిలో తాము ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామంలో వైఎస్సార్ స్మృతివనం సమీపంలో కాశిరెడ్డి నాయనం ఆశ్రమం ఏర్పాటు చేశామని, అక్కడ నిత్యాన్నదానం జరుగుతుందని చెబుతూ.. చందాలు వసూలు చేసే యత్నం చేశారు. వీరి పోకడ గమనించిన రాజమండ్రికి చెందిన త్రినాథరెడ్డి అనే వ్యక్తి ఈ ముఠాను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు నంద్యాల ఎస్పీగా పని చేసిన రఘువీరారెడ్డి అక్కడ ఉండడంతో ఆయన ఈ విషయంపై విచారణ జరిపించారు. దీంతో శంకర్ ముఠా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలడంతో వారిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద ఉన్న రసీదు పుస్తకాలు, డిజిటల్ లావాదేవీలను పరిశీలిస్తే ఈ మధ్య కాలంలోనే రూ. 20 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శంకర్ ముఠాలో వెలుగోడు మండలం రేగడగూడూరు గ్రామానికి చెందిన వారు కూడా ఇద్దరు ఉన్నట్లు తెలిసింది. నల్లకాల్వలో కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఉన్న విషయం నిజమే అయినప్పటికీ ఈ ఆశ్రమ నిర్వాహకులు వేరే వారు కావడం గమనార్హం. ఇందులో వారు ప్రచారం చేసుకుంటున్నంత స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు జరగడం లేదు. -
సూర్య @ 42.7 డిగ్రీలు
కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకవైపు సుర్రుమంటున్న ఎండలు, మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఎండల నుంచి ప్రజలకు కొంతైనా ఉపశమనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏ మాత్రం చొరవ తీసుకోవడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు కర్నూలు నగరంలోని ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. 2024లో ఫిబ్రవరి నెల చివరి నాటికే చలువ పందిళ్లు ఏర్పాటు అయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చలువ పందిళ్లు, చలి వేంద్రాల జాడ కనిపించడం లేదు. బండిఆత్మకూరు మండలంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత... రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే నమోదు అవుతున్నాయి. బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవళాపురం గ్రామంలో 42.7 డిగ్రీలు, కల్లూరులో 42.6, చాగలమర్రిలో 42.4 డిగ్రీలు, గోస్పాడులో 41.9, దొర్నిపాడులో 41.7, ఆత్మకూరులో 41.5, కొత్తపల్లిలో 41.4, కోడుమూరులో41.2, కోసిగిలో 41.2, పెద్దకడు బూరులో 41.1 కర్నూలులో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత లు నమోదైంది. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. రానున్న రోజుల్లో వడగాల్పులు, ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మార్చి నెలలో నే ఉష్ణోగ్రతలు గతంలో ఎపుడూ లేని విధంగా 44 డిగ్రీలను అధిగమించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. పెద్ద దేవళాపురంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కల్లూరులో 42.6 డిగ్రీలు నమోదు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి -
దాహం తీర్చుకునేందుకు వెళ్లి..
● ఎల్లెల్సీలో పడి మహిళా కూలీ మృత్యువాత హాలహర్వి: వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీ ప్రమాదవశాత్తూ ఎల్లెల్సీ కాల్వలో పడి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆలూరు మండల మొలగవల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి(40) మంగళవారం గూళ్యం గ్రామానికి చెందిన ఓ రైతు మిరప పంట కోసేందుకు తోటి కూలీలతో కలసి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తూ పచ్చారపల్లి వద్ద నీళ్లు తాగేందుకు ఎల్లెల్సీ కాలువలోకి దిగింది. ప్రమాదవశాత్తూ కాలు జారి శ్రీదేవి కాలువలో పడిపోయింది. పక్కనే ఉన్న ఆటో డ్రైవర్ మునిస్వామి రక్షించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సమాచారం అందుకున్న హాలహర్వి ఎస్ఐ చంద్ర వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బంది, గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. గూళ్యం 48వ డీప్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతురాలికి భర్త భగీరథ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్ర తెలిపారు. రెండు బైక్‌లు ఢీకొని.. ● వృద్ధుడి మృతి ● యువకుడికి తీవ్ర గాయాలు పత్తికొండ రూరల్: అతి వేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. టిఫిన్ చేసేందుకు హోటల్ వెళ్లిన వృద్ధుడు తిరిగిరాని లోకాలకు చేరాడు. పత్తికొండ పట్టణంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా, మరో యువకు డు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక దాసరి వీధిలో బోయ హనుమన్న, తిమ్మక్కలు నివాసముంటున్నారు. వారి కుమారుడు భార్యా పిల్లలతో బతుకుదెరువుకు గుంటూరు వలస వెళ్లారు. ఇంటి వద్ద వున్న తిమ్మక్క మంగళవారం మిరపకాయలు తెంపేందుకు కూలికి వెళ్లగా.. హనుమన్న టిఫిన్ చేసేందుకు టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై ప్రభుత్వ బీసీ హాస్టల్ సమీపంలోని ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌కు వెళ్లాడు. టిఫిన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేందుకు వాహనాన్ని తీస్తుండగా పత్తికొండకు చెందిన కూరగాయల వ్యాపారి అభిరాం పల్సర్ బైక్‌తో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా కోలు కోలేక వృద్ధుడు మృతి చెందాడు. యువకుడు అభి రాం చికిత్స పొందుతున్నాడు. భర్త మృతితో భార్య తిమ్మక్క రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మత్తు పదార్థాలను సమష్టిగా నిర్మూలిద్దాం
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో గంజాయి సాగు, మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని సమష్టి కృషితో నిర్మూలిద్దామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్(ఎన్సీఓఆర్డీ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలతో కలిగే అనార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై ప్రజలు కూడా సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనార్థాలపై పాఠశాలల్లో వ్యాసరచన, వక్తృత్వ పోఈలను నిర్వహించాలన్నారు. ప్రజలకు అవగాహన కోసం ర్యాలీలు నిర్వహించాలని, ప్రతిజ్ఞలు చేయించాలని డీఈఓను కోరారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లాకల్యాణి, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ, డీఈఓ శామ్యూల్‌పాల్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, అదనపు మునిసిపల్ కమిషనర్ ఆర్ర్జీవీ కృష్ణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్‌కుమార్ పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణతో మాల, మాదిగలకు నష్టమే
కర్నూలు(అర్బన్): రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదికల ఆధారంగా ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్, రాష్ట్ర యూనిట్‌గా చేసినా.. రాష్ట్రంలోని మాల మాదిగలకు నష్టం జరుగుతుందని ఏపీ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక కార్యాలయంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్సీహెచ్ బజారన్నతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్‌గా విద్యా, ఉద్యోగాల్లో మూడు కేటగిరీలుగా వాటాలు చేస్తామని ప్రకటించిందన్నారు. అయితే ఏకసభ్య కమిషన్ వర్గీకరణను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అమలు చేసేందుకు రాష్ట్రం యూనిట్‌గా చేయనున్నట్లు ప్రకటించారన్నారు. ఈ నేపథ్యంలోనే ఏ కేటగిరీలోని రెల్లి, ఉపకులాలకు 1 శాతం, బీ కేటగిరీలోని మాదిగ, ఉపకులాలకు 6.50 శాతం, సీ కేటగిరిలోని మాల, ఉపకులాలకు 7.50 శాతం రిజర్వేషన్ ప్రతిపాదిస్తు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించిందన్నారు. ఏ విధంగా వర్గీకరణ చేపట్టినా రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మాలలకు, వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాదిగలకు నష్టం జరుగుతుందన్నారు. జిల్లా యూనిట్‌గా అమలు చేసినా ఎస్సీ జాబితాలోని 59 ఉప కులాలు భారీగా విద్య, ఉద్యోగాలను కోల్పోతారన్నారు. ఈ అంశంపై ఈ నెల 20న అసెంబ్లీలో చర్చ జరిగిన అనంతరం రాయలసీమలోని మేధావులను కలిసి ఎస్సీలకు ఎలాంటి నష్టం జరగకుండా నేషనల్ ఎస్సీ కమిషన్‌ను కలిసి వివరించనున్నట్లు తెలిపారు. ఏపీ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు -
రూ.330 కోట్లకు చేరుతున్న నిరర్ధక ఆస్తులు
రైతుల మెడపై జప్తుల కత్తి ● నష్టాల బాటన కేడీసీసీ బ్యాంకు ● కూటమి ప్రభుత్వ పాలనలో మళ్లీ చీకటి రోజులు ● ఇప్పటికే 90 మంది రైతుల ఆస్తులు స్వాధీనం ● 800 మంది ఆస్తుల వేలానికి రంగం సిద్ధం ● రికవరీ పేరిట రైతుల ఆత్మాభిమానంతో ఆటలు ● వైఎస్సార్సీపీ పాలనలో కేడీసీసీబీ లాభాల బాట ● నేడు నిరర్థక ఆస్తులే రూ.330 కోట్లు వడ్డీ రూ.20 లక్షలు చిప్పగిరి మండలం ఏరూరు గ్రామానికి చెందిన ఒక రైతు 2021లో కర్షక జ్యోతి కింద రూ.25 లక్షలు, దీర్ఘకాలిక రుణం కింద గొర్రెల పెంపకానికి రూ.15 లక్షల ప్రకారం మొత్తం రూ.40 లక్షల రుణం తీసుకున్నారు. వివిధ కారణాల వల్ల రుణాలను చెల్లించలేదు. నాలుగేళ్లలో వడ్డీ రూ.20 లక్షలు అయింది. మొత్తం రూ.60 లక్షలు చెల్లించాలని, లేకపోతే ఆస్తులు వేలం వేస్తామని నోటీసు జారీ చేశారు. ఇటీవల గ్రామానికి వెళ్లిన ప్రత్యేక టీమ్ రైతుకు చెందిన ట్రాక్టరును జప్తు చేసి బెల్డోణలోని పీఏసీఎస్‌కు స్వాధీనం చేశారు. బైక్‌ను జప్తు చేశారు చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామానికి చెందిన ఒక మహిళ 2014లో దీర్ఘకాలిక రుణం కింద డెయిరీ లోన్ తీసుకున్నారు. కంతుల ప్రకారం కొంత మొత్తం కూడా చెల్లించారు. అసలు రూ.2.70 లక్షలు, అయితే ఇప్పుడు ఈ మహిళ చెల్లించాల్సిన మొత్తం వడ్డీతో కలిపి రూ.7 లక్షలు దాటింది. ఇటీవల గ్రామానికి వెళ్లిన రికవరీ టీమ్ ఈ మహిళ కుటుంబానికి చెందిన బైకును జప్తు చేసి సొసైటీకి తరలించింది. మహిళ తాకట్టు పెట్టిన స్థిరాస్తులను వేలంలో విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది.కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ) బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల మెడపై జప్తుల కత్తి పెట్టింది. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు డీసీసీబీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. రైతాంగాన్ని 2024–25లో అధిక వర్షాలు, అనావృష్టి పరిస్థితులు కోలుకోలేని దెబ్బతీశాయి. అంతంతమాత్రం పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేక నష్టాలను మూటకట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా సహకార కేంద్రబ్యాంకు రైతుల ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే రైతుల ఆస్తుల వేలానికి చర్యలను వేగవంతం చే యడం గమనార్హం. రుణాల రికవరీకి వెళ్లిన అధికారులు ఏది కనిపిస్తే దానిని స్వాధీనం చేసుకుంటుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 90 మంది రైతుల ఆస్తుల స్వాధీనం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వత డీసీసీబీ జప్తుల తీవ్రత మొదలైంది. 2014–15 నుంచి 2018–19 వరకున్న టీడీపీ ప్రభుత్వంలో వరుస కరువు రైతులను నిలువునా ముంచింది. పంటలు పండక రైతులు అల్లాడుతుంటే అప్పట్లో కూడా జప్తుల పర్వం కొనసాగింది. నాడు ఆస్తులను వేలం వేయడంతో పాటు రైతుల ఇళ్లలోని చరాస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మళ్లీ నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 90 మంది రైతుల ఆస్తులను డీసీసీబీతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు స్వాధీనం చేసుకున్నాయి. 2024–25లో మొత్తం 800 మంది రైతుల ఆస్తులు వేలం వేయడం, స్వాధీనం చేసుకోవాలనేది లక్ష్యంగా తెలుస్తోంది. ఈ నెల చివరిలోపు రైతుల ఆస్తుల వేలానికి ముమ్మర కసరత్తు జరుగుతోంది. డీసీసీబీలో ప్రధానంగా ఆలూరు బ్రాంచీలో బకాయిలు అత్యధికంగా ఉన్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఆలూరు ప్రాంతంలోని 18 మంది రైతుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధమైంది. ముమ్మరంగా చరాస్తుల జప్తు బకాయిలను రాబట్టుకునేందుకు ముందుగా రైతులకు సంబంధించిన చరాస్తులను జప్తు చేయాలని జాయింట్ కలెక్టర్, డీసీసీబీ పర్సన్ ఇన్చార్జి చైర్మన్ నవ్య స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చరాస్తుల జప్తు తర్వాత స్థిరాస్తుల వేలానికి శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. జప్తులు, వేలంపాట, రికవరీలపై జేసీ ప్రతి రోజు డీసీసీబీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. దీంతో అధికారులు జప్తుల పర్వాన్ని వేగవంతం చేయడం గమనార్హం. ఇప్పటికే ఆలూరు బ్రాంచి పరిధిలోని చిప్పగిరి మండలం ఏరూరు గ్రామంలో ట్రాక్టరు, బైకు.. కుందనగుర్తి గ్రామంలో ఒక బైకు, రామదుర్గం గ్రామంలో రెండు బైకులను జప్తు చేసినట్లు స్పష్టమవుతోంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిరర్థక ఆస్తులు కొండలా పెరిగిపోతున్నాయి. 2024 ఏప్రిల్ నెలలో రూ.193 కోట్ల నిరర్ధక ఆస్తులు ఉన్నాయి. ఈ నెల 15 నాటికి నిరర్థక ఆస్తులు రూ.267 కోట్లకు చేరుకోగా.. మార్చి చివరి నాటికి రూ.330 కోట్లకు చేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆలూరు, డోన్, ఆదోని, పత్తికొండ, కృష్ణానగర్, కోడుమూరు, కోవెలకుంట్ల, నందికొట్కూరు, వెలుగోడు, ఆత్మకూరు బ్రాంచీల్లో నిరర్థక ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
కర్నూలు: ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేసి గౌరవప్రదమైన జీవితం గడపాలని న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. మంగళవారం కర్నూలు శివారులోని పురుషుల కేంద్ర కారాగారం, మహిళా కారాగారాలను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీలకు న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. ఖైదీలకు అందించే ఆహారం, రేషన్‌తో పాటు ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే కర్నూలు న్యాయ సేవాధికార సంస్థను, లేదంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు. కొందరు ఖైదీలు బెయిల్ మంజూరైనప్పటికీ జామీనుదారులు లేక జైలులోనే ఉంటున్నామని జిల్లా జడ్జి దృష్టికి తీసుకురాగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైభవంగా సుయతీంద్రతీర్థుల పూర్వారాధన మంత్రాలయం: నవ మంత్రాలయ శిల్పి, రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు పూర్వారాధన వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో మంగళవారం వేకువ జామున సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పీఠాధిపతి గురువులైన సుయతీంద్రతీర్థుల వేడుకలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ముందుగా స్వామిజీ మూల బృందావనానికి నిర్మల్య విసర్జన గావించి పుష్ప, పంచామృతాభిషేకం చేపట్టి ప్రత్యేక పూలతో విశేష అలంకరణ గావించారు. వేడుకల్లో భాగంగా యాగ మంటపంలో సుయతీంద్రతీర్థుల ప్రశస్థితి భక్తులకు ప్రవచించారు. పత్తికొండ కళాశాలకు ఏ గ్రేడు పత్తికొండ రూరల్: పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ గ్రేడు వచ్చినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మాధురి తెలిపారు. పాణ్యం డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ ఎం.ఫరీదా బేగం, డోన్ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ జి.చంద్రశేఖర్ అకడమిక్ ఆడిట్లో భాగంగా మంగళవారం కళాశాలను పరిశీలించారన్నారు. అకడమిక్ రిజిస్టర్లు, తరగతి గదులు, ప్రయోగశాలలు, కళాశాల మైదానంలో స్పోర్ట్స్, విద్యార్థులకు తాగునీటి సదుపాయం వంటి వాటిని పరిశీలించి సంతృప్తి చెందినట్లు తెలిపారు. -
దివ్యాంగులకు యూడీఐడీ
శాశ్వత ఐడీ తప్పనిసరి దివ్యాంగులకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసేవారు. అయితే ఇకపై శాశ్వతంగా ఆధార్‌కార్డు తరహాలో కేంద్ర ప్రభుత్వం యూడీఐడీను ప్రవేశపెట్టింది. దివ్యాంగులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ కార్డు తప్పనిసరి కానుంది. దివ్యాంగులు ఆన్లైన్లో నమోదు చేసుకొని ఈ కార్డును పొందితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – రయిస్ ఫాతిమా, ఏడీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ కర్నూలు(అర్బన్): దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ఇతరత్రా సేవలకు సదరం స్థానంలో యూడీఐడీ (యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు )ని అందించనుంది. దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే చేయూత, ఇతర ప్రయోజనాలకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. దీని కోసం దివ్యాంగులు గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సదరం శ్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్య నిర్ధారణ అనంతరం సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లకు స్వస్తి పలికింది. ఆ స్థానంలో యూడీఐడీని పొందేందుకు స్వాలంబన్‌కార్డు.జీఓవీ.ఇన్ (https://swavlambancard. gov.in) అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో దివ్యాంగులు నేరుగా ఇంటి వద్ద నుంచే ఫోన్, ఇంటర్నెట్ సెంటర్, మీ సేవా కేంద్రాల నుంచి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సులభతరంగా సేవలు ... కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన యూడీఐడీ పోర్టల్ వల్ల సేవలు చాలా సులభతరం కానున్నాయి. ఇకపై సదరం శిబిరాల కోసం మీ సేవతో పాటు యూడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి సదరం శిబిరాలకు సంబంధించి ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం దివ్యాంగుల ఫోన్ నెంబర్‌కు సంక్షిప్త సందేశం రూపంలో వస్తుంది. దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి తప్పులు, అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఐదు రకాల వైకల్యం ఉన్న వారికే మీ సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఇక యూడీఐడీ పోర్టల్‌లో 21 రకాల వైకల్యాలను చేర్చారు. తలసేమి యా, ఆటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం శిబిరాల కోసం యూడీ ఐడీ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సదరం శిబిరంలో వైకల్య నిర్ధారణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లను స్మార్ట్ కార్డు రూపంలో పోస్టల్‌శాఖ ద్వారా ఇంటికే పంపించనున్నారు. ఈ కార్డు ద్వారా చేయూత పింఛన్లతో పాటు ఇతర పలు సంక్షేమ ప్రయోజనాలకు దేశ వ్యాప్తంగా చెల్లుబాటు కానుంది. యూనిక్ డిజేబులిటీ ఐడీ కార్డులను ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇప్పటి వరకు ఉన్న సదరం సర్టిఫికెట్లు మన రాష్ట్రంలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. ఇలా దరఖాస్తు చేసుకోండి ... ఆన్లైన్లో స్వాలంబన్‌కార్డు.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్లయ్ బటన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకొని తరువాత అంగీకరిస్తు సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. దివ్యాంగులు వారికి చెందిన పూర్తి సమాచారాన్ని అక్కడ అడిగిన విధంగా నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. వైద్య పరీక్షల అనంతరం వెబ్సైట్లో అర్జీల స్టేటస్‌ను నిత్యం పరిశీలించుకోవచ్చు. కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం 21 రకాల సేవలు సులువుగా పొందే అవకాశం -
లాభాల బాట పట్టించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
నష్టాల ఊబిలో చిక్కుకున్న డీసీసీబీకి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీ చేసే ఏర్పాటు చేసింది. కస్టమ్స్ హయరింగ్ సెంటర్లు, మల్టీపర్పస్ గోదాముల నిర్మాణాలకు డీసీసీబీ రుణాలు అందచేసింది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా బ్యాంకు లోనింగ్ భారీగా పెరిగింది. వైఎస్ఆర్సీపీ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచ్చింది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో ఏకంగా రూ.10కోట్ల లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్‌లకు రూ.4 కోట్లు డివిడెండ్ ఇచ్చింది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్ కలిగిన బ్యాంకుగా రెండేళ్లు వరుస అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. ● నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోపే మళ్లీ నష్టాల్లోకి వచ్చి బలహీనమైన బ్యాంకుగా రికార్డు నమోదు చేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024–25లో రుణాల పంపిణీ నామమాత్రంగా చేపట్టారు. పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ పేరుతో రైతులకు అవసరమైన రుణాల పంపిణీ విషయంలో కనీస చొరవ కరువైంది. ఇదే సమయంలో బకాయిలు పేరుకుపోవడంతో బ్యాంకు మళ్లీ నష్టాల బాట పట్టింది. -
ప్రశాంతంగా ఏఎన్ఎంల పదోన్నతి కౌన్సెలింగ్
కర్నూలు(హాస్పిటల్): సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎం–3లకు ఎంపీహెచ్ఏ–ఎఫ్‌గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు వీరికి కర్నూలు మెడికల్ కాలేజీలోని నూతన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. కౌన్సెలింగ్‌లో స్థానం పొందిన వారికి డీఎంహెచ్‌వో డాక్టర్ పి. శాంతికళ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ఆర్డర్ కాపీలు అందజేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 172 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళతో పాటు ఏవో అరుణ, సూపరింటెండెంట్ పి. శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్‌లు కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. -
సూర్య @ 42.7 డిగ్రీలు
కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకవైపు సుర్రుమంటున్న ఎండలు, మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఎండల నుంచి ప్రజలకు కొంతైనా ఉపశమనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏ మాత్రం చొరవ తీసుకోవడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు కర్నూలు నగరంలోని ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. 2024లో ఫిబ్రవరి నెల చివరి నాటికే చలువ పందిళ్లు ఏర్పాటు అయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చలువ పందిళ్లు, చలి వేంద్రాల జాడ కనిపించడం లేదు. బండిఆత్మకూరు మండలంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత... రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే నమోదు అవుతున్నాయి. బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవళాపురం గ్రామంలో 42.7 డిగ్రీలు, కల్లూరులో 42.6, చాగలమర్రిలో 42.4 డిగ్రీలు, గోస్పాడులో 41.9, దొర్నిపాడులో 41.7, ఆత్మకూరులో 41.5, కొత్తపల్లిలో 41.4, కోడుమూరులో41.2, కోసిగిలో 41.2, పెద్దకడు బూరులో 41.1 కర్నూలులో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత లు నమోదైంది. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. రానున్న రోజుల్లో వడగాల్పులు, ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మార్చి నెలలో నే ఉష్ణోగ్రతలు గతంలో ఎపుడూ లేని విధంగా 44 డిగ్రీలను అధిగమించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. పెద్ద దేవళాపురంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కల్లూరులో 42.6 డిగ్రీలు నమోదు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి -
క్లస్టర్ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీగా వి.వెంకట బసవరావు
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా సోమవారం రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య వి. వెంకట బసవరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు క్లస్టర్ వర్సిటీ వీసీగా పని చేస్తున్న ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్ పదవీ కాలం ఇటీవలే ముగిసింది. అయితే రెండు వారాలకుపైగా ఖాళీగా ఉన్న వీసీ పోస్టును ఆర్యూ వీసీకి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయనకు క్లస్టర్ వర్సిటీ రిజిస్ట్రార్ డా.కె వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. వర్సిటీ అనుబంధ కాలేజీల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. -
కమనీయం.. కల్యాణోత్సవం
● వైభవంగా గోరంట్ల మాధవుడి గరుడోత్సవంకోడుమూరు రూరల్: శ్రీలక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోరంట్ల గ్రామంలో సోమవారం వేకువజామున కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాధవస్వామి తరఫున ఎర్రగుడి గ్రామస్తులు, అమ్మవార్ల తరఫున గోరంట్ల వాసులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఆలయ పండితులు ఆగమశాస్త్ర ప్రకారం కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వందలాదిగా తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈఓ గుర్రెడ్డి, వేద పండితులు వందవాసి రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, పురుషోత్తం, హరి, శ్రీనివాస ఆచారి, వెంకటరమణ, రమణమూర్తి, వెంకట్రామయ్య, రాజేష్, పద్మానాభ ఆచారి, ఎస్ఐ శ్రీనివాసులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఘనంగా గరుడోత్సవం కల్యాణోత్సవం అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీలక్ష్మి, భూదేవి, మాధవస్వామిని గరుడ వాహనంపై అధిష్టింపజేశారు. డప్పువాయిద్యాలు, మేళతాళాల మధ్య గ్రామ వీధుల్లో గరుడోత్సవం నిర్వహించారు. గరుడ వాహనానికి ముందు ఎర్రగుడి వాసులు, వెనుక గోరంట్ల వాసులు నిలబడ్డారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గరుడోత్సవాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ఎర్రగుడి గ్రామానికి చెందిన సుధాకర్ అనే భక్తుడి కాలికి గాయమైంది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
పలుమార్లు అర్జీలు ఇచ్చినా స్పందించడం లేదు
నేను దివ్యాంగుడిని. నాకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తప్ప వేరే ఆదాయ మార్గాలు లేవు. రెండు కాళ్లు లేకపోవడంతో ఏ పనీ చేసుకోలేను. సొంత ఇల్లు కూడా లేదు. వచ్చిన పింఛన్‌తో ఇంటి బాడుగ, కరెంటు బిల్లు, ఇంటి ఖర్చులు, అనారోగ్యం కోసం ఖర్చు పెట్టుకోవాలి. నా పరిస్థితిని చూసి ఇంటి స్థలంతోపాటు, ఏదైనా ఔటు సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని పలుమార్లు కలెక్టర్‌కు అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. – బోయ మద్దిలేట్టి, ఉల్చాల గ్రామం, కర్నూలు పెన్షన్ కోసం ఐదుసార్లు అర్జీ నాకు షుగర్ ఎక్కువై ఒక కాలు ను ఆపరేషన్ చేసి తొలగించారు. రెండేళ్ల నుంచి కాలు లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నా. బతుకు భారమైంది. దివ్యాంగుల పెన్షన్ కోసం ఐదుసార్లు కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నా. ఎంపీడీఓను కలవమన్నారు.. అక్కడ కూడా ఎవరూ పట్టించుకోరు. – వెంకటేశ్వర్లు, కులుమాల, గొనెగండ్ల మండలం -
ప్రసవ వేదనతో ఉపాధ్యాయిని మృతి
కోసిగి: మండల కేంద్రంలోని చాకలిగేరి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని కవిత(28) ప్రసవ వేదనతో ఆత్మకూరు ఆస్పత్రిలో ఆదివారం రాత్రి మృతి చెందిందారు. సోమవారం ఉదయం ఎంఈఓ శోభరాణి, హెచ్ఎం సుబ్బలక్ష్మి తెలిపిన వివరాలు.. పాములపాడు మండలం బానుముక్కల గ్రామానికి చెందిన కవిత 2018 డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికై 2020 సెప్టెంబర్ 27న కోసిగి చాకలిగేరి ప్రాథమిక పాఠశాలలో చేరింది. ఏడాది క్రితం సచివాల ఉద్యోగి వినోద్‌తో వివాహం కాగా మూడు నెలల క్రితం మెటర్నిటీ సెలవుల్లో సొంత గ్రామం బానుముక్కలకు వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆత్మకూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రసవ సమయంలో ఆమె హైబీపీతో ఆస్పత్రిలోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. మహిళ ఆత్మహత్యాయత్నం బండి ఆత్మకూరు: మండల పరిధిలోని కడమల కాలువ గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మహిళపై కొన్నిరోజుల క్రితం ఆర్ఎంపీ సుబ్బరాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇదే విషయమై గతంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఆర్‌ఎంపీతోపాటు అతని తండ్రి సోమవారం తెల్లవారుజామున మహిళ ఇంటి మీదకు వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన మహిళ పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయంపై ఎస్ఐ జగన్మోహన్ను వివరణ కోరగా జరిగిన ఘటనపై విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. జలవనరుల శాఖలో పదోన్నతులు కర్నూలు (సిటీ): జలవనరుల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వారికి అడ్‌హక్ విధానంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించి పోస్టింగులు ఇస్తూ ఆ శాఖ ప్రత్యేక స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 11 మంది ఇంజినీర్లు పదోన్నతులు పొందారు. ఎస్ఆర్బీసీ సర్కిల్1లోని సబ్ డివిజన్3లో డీఈఈగా పనిచేస్తున్న సీహెచ్ శ్రీనివాసరావు, ఎన్.నాగేంద్రకుమార్ (తెలుగు గంగ), ఎం.రమేష్ బాబు(ఎస్ఆర్బీసీ క్వాలిటీ కంట్రోల్), ఎస్.గుణకర్రెడ్డి (సీఈ ఆఫీస్, కర్నూలు), ఎం.వేణుగోపాల్ రెడ్డి(ఎస్ఆర్బీసీ సర్కిల్1), ఎస్.మురళి (జీఆర్పీ), ఎం.మల్లికార్జున రెడ్డి(ఎస్ఆర్బీసీ సర్కిల్1), పి.శరత్‌కుమార్ (తెలుగు గంగ), బి.మహేష్ (సీఈ ఆఫీస్, కర్నూలు), ఎస్.శివప్రసాద్ (హెచ్ఎన్ఎస్ఎస్ సర్కిల్1), టి.రాధాకృష్ణ (ఎస్ఆర్బీసీ సర్కిల్1) పదోన్నతి పొందారు. వీరందరికీ పదోన్నతులు కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. మృతదేహం లభ్యం పెద్దకడబూరు: మండల పరిధిలోని పులికనుమ ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి మృతదేహం సోమవారం రాత్రి లభ్యమైంది. మండల పరిధిలోని హులికన్వీ గ్రామానికి చెందిన మస్కి నాగేంద్ర శనివారం రాత్రి చేపలు పట్టడానికి పులికనుమ ప్రాజెక్టులో దిగి గల్లంతైన విషయం విధితమే. ఆదివారం గాలించినా మృతదేహం ఆచూకీ దొరక్క పోవడంతో సోమవారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి మృతదేహం లభ్యమైంది. మృతుడి కుమారుడు చిన్న లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథ్, ఎస్ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. -
ఎకై ్సజ్‌లో అసోసియేషన్ ఎన్నికల కోలాహలం
కర్నూలు: ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్ల అసోసియేషన్ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. మూడేళ్లకోసారి జరగాల్సిన అసోసియేషన్ ఎన్నికలు తొమ్మిదేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఓబులేసు, వైవీ గిరిబాబు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 ఎకై ్సజ్ పోలీస్స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఓబులేసు నంద్యాల డీటీఎఫ్‌లో పనిచేస్తుండగా మరో అభ్యర్థి గిరిబాబు కర్నూలు ఏసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ 1995 బ్యాచ్‌కు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు. ఎకై ్సజ్ శాఖలోకి డిప్యూటేషన్‌పై వచ్చి ఇక్కడే విలీనమయ్యారు. 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్లతో పాటు 2014 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు ఐఎంఎల్ డిపో, కారుణ్య నియామకం కింద ఎంపికై నవారు వివిధ విభాగాల్లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 135 మంది కానిస్టేబుళ్లు, 75 మంది హెడ్ కానిస్టేబుళ్లు కలిపి 210 మంది తమ ఓటు ద్వారా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంది. అధ్యక్ష పదవికి ఓబులేసు, గిరిబాబు పోటీ పడుతుండగా, ప్రధాన కార్యదర్శి పదవికి విజయ్‌కుమార్, జగన్నాథం పేర్లు వినిపిస్తున్నాయి. ఈనెల 23న కర్నూలు ఎకై ్సజ్ కార్యాలయ ఆవరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఎన్నికల తేదీ గడువు సమీపిస్తుండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు.. ఎకై ్సజ్ స్టేషన్లతో పాటు ఈఎస్టీఎఫ్, మొబైల్ పార్టీ, చెక్‌పోస్టు, ఎన్ఫోర్స్మెంట్, నంద్యాల, కర్నూలు ఈఎస్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని కలిసి తమ విజయానికి దోహదపడాలని అభ్యర్థిస్తున్నారు. ఎకై ్సజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఇటీవలనే ఎన్నికలు నిర్వహించి ఆ సంఘం అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకున్న విషయం తెలిసిందే. జోరుగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు ఈనెల 23న పోలింగ్ -
సమస్య పరిష్కారం అయితే బాధితులు తిరిగి అర్జీ ఇచ్చేందుకు ఎందుకు వస్తారు? అర్జీల పరిష్కారం 93 శాతం ఉంటే.. వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చుట్టూ ఎందుకు తిరుగుతారు? బాధితులతో మాట్లాడినంతనే పరిష్కారం అయినట్లు చూపుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా
నామమాత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ● కలెక్టరేట్ చుట్టూ బాధితుల ప్రదక్షిణ ● రాజకీయ జోక్యంతో ఎక్కడి అర్జీలు అక్కడే.. ● కనీసం పింఛన్లు కూడా ఇవ్వలేని దైన్యం ● భూ సమస్యలతో వృద్ధుల పడరానిపాట్లు ● జిల్లా కలెక్టర్‌కు చెప్పుకున్నా క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం కర్నూలు(సెంట్రల్)/కర్నూలు రూరల్/కల్లూరు: ప్రతి సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి బాధితులు వస్తున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరిస్తుండటంతో తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వీరిలో ఎక్కువగా 50 ఏళ్లకు పైబడిన వారే ఉంటున్నారు. చాలా మంది బీపీ, షుగర్‌తోపాటు ఒళ్లు, కాళ్ల నొప్పులతో బాధ పడుతున్నా ఎంతో ఆశతో కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు అందజేస్తున్నారు. అయితే వాటి పరిష్కారాలపై క్షేత్రస్థాయిలో వేరుగా.. అధికారిక లెక్కల్లో మరో రకంగా ఉంటోంది. వచ్చిన అర్జీల్లో దాదాపు 93 శాతం అర్జీలకు పరిష్కారాలు చూపినట్లు అధికారులు చెబుతుండగా బాధితులు మళ్లీ మళ్లీ అవే అర్జీలతో కలెక్టరేట్‌కు వస్తుండటం గమనార్హం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇచ్చిన వారితో మాట్లాడినంతనే పరిష్కారం అయినట్లు అధికారులు రికార్డుల్లో చూపుతున్నారు. కొందరైతే కలెక్టర్, వారి శాఖల ఉన్నతాధికారుల భయంతో కూడా సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపకపోయినా చూపినట్లు లాగిన్‌లో ఎంట్రీ చేస్తున్నట్లు బాధితుల మాటలను బట్టి అర్థమవుతోంది. విపరీతమైన రాజకీయ జోక్యం.. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన విషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ● ఏకంగా సీఎం చంద్రబాబునాయుడే వైఎస్ఆర్సీపీ నాయకులకు సాయం చేస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరించిన నేపథ్యంలో పాలనలో పక్షపాతం కనిపిస్తోంది. ● కూటమి నేతలు నేరుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఎవరూ ఏమి అనడంలేదు. ● పట్టున్న గ్రామాల్లో పేదల ఆధీనంలో ఉన్న భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని గెంటేస్తున్నారు. ● పోలీసు స్టేషన్‌కు వెళ్లినా బాధితులకు న్యాయం జరగడంలేదు. ● రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఏమి చేయలేకపోతున్నారు. ● ఈక్రమంలో కలెక్టరేట్, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను బాధితులు ఆశ్రయిస్తుండడంతో అక్కడ కూడా తమకు తెలియకుండా పరిష్కారాలు చూపరాదని అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. సీఎంఓ పంపే అర్జీలపైనే ప్రత్యేక దృష్టి సీఎంఓ పంపే అర్జీలపైనే అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నిర్దేశించిన గడువులోపు వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 317 అర్జీలు రాగా, 259 అర్జీలను పరిష్కరించారు. అయితే ఆయా సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి విచారణ చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్జీలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. ప్రతిరోజూ అర్జీలను పరిశీలించి పరిష్కారాలు చూపాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ జోక్యాన్ని సహించం. – పి.రంజిత్ బాషా, జిల్లా కలెక్టర్ 2024 జూన్ 15 నుంచి ఇప్పటి వరకు అర్జీల వివరాలు అర్జీలు 40,072 పరిష్కారం 37,415 పెండింగ్ 2657 -
పొలం వద్దే ప్రాణాలొదిలిన రైతు
కొత్తపల్లి: పైరు కాపలా కోసమని పొలానికెళ్లిన రైతు అక్కడే ప్రాణాలొదిలన ఘటన ఆదివారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన రైతు చాకలి మధు(38) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని 3 ఎకరాల్లో వేరుశనగ, 3 ఎకరాల్లో మినుము సాగు చేశాడు. సమీపంలో నల్లమల అటవీ ప్రాంతం ఉండటంతో అడవి పందుల బెడద నుంచి వేరుశనగ పైరును కాపాడుకునేందుకని రాత్రి కాపలా కోసమని పొలానికి వెళ్లి అక్కడే నిద్రించాడు. సోమవారం ఉదయం అతని స్నేహితుడు పాతకోట వెంకటరమణ డీజిల్ కోసమని మధు పొలం వద్దకు వెళ్లి చూడగా విగత జీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఎం.కేశవ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. విషపురుగు కాటుతో మృతిచెంది ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
కర్నూలు: జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రత్యేక పోలీసు బృందాలచే పెట్రోలింగ్ నిర్వహించి విద్యార్థులు గుంపులుగా చేరకుండా చర్యలు చేపట్టారు. విద్యార్థులు సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకుండా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమతించారు. ఖరీఫ్ సీజన్‌కు విత్తనాల కేటయింపు కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఖరీఫ్ సీజన్‌కు సబ్సిడీ విత్తనాలను కేటాయిస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధరలు, సబ్సిడీలు మే నెలలో ఖరారు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ( ఏపీసీడ్స్) విత్తనాలను సరఫరా చేస్తుంది. కర్నూలు జిల్లాకు వేరుశనగ 13,804 క్వింటాళ్లు.. కందులు 892.5 క్వింటాళ్లు, మినుములు 25, పెసర 10, కొర్ర 70, దయంచా 154, పిల్లి పెసర 11 క్వింటాళ్ల ప్రకారం మొత్తం 14,955.61 క్వింటాళ్లు కేటాయించింది. ● నంద్యాల జిల్లాకు వేరుశనగ 3,063 క్వింటాళ్లు, దయంచ 3,023, సన్‌హెంప్ 5, పిల్లి పెసర 19, కందులు 2,550, మినుము 745, పెసర 20, కొర్ర 91, వరి 380 క్వింటాళ్ల ప్రకారం మొత్తం 9,896 క్వింటాళ్లు కేటాయించింది. రెండు జిల్లాలకు ఏపీ సీడ్స్ విత్తనాలు సరఫరా చేయనుంది. నేటి నుంచి సుయతీంద్ర తీర్థుల సమారాధన మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి, నవ మంత్రాలయ రూపశిల్పిగా పేరుగాంచిన సుయతీంద్రతీర్థుల సమారాధన వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల గురువులైన సుయతీంద్రతీర్థుల 12వ సమారాధన వైభవంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా మంగళవారం పూర్వారాధన, బుధవారం మద్యారాధన, గురువారం ఉత్తరారాధన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతి రోజూ ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మద్యారాధన రోజు మహా పంచామృతాభిషేకం, స్వర్ణ రథోత్సవాలు జరపనున్నారు. పలువురు విద్వాన్లచే రోజూ ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపించనున్నారు. పెద్దాసుపత్రిలో ఓపీ విభాగాల తనిఖీ ● విధుల్లో లేని ఇద్దరు వైద్యులకు మెమోలు కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పలు ఓపీ విభాగాలను సోమవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం, జనరల్ సర్జరీ విభాగాల తనిఖీ సమయంలో విధి నిర్వహణలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారికి మెమోలు జారీ చేసి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో రోగుల రద్దీ దృష్ట్యా అదనంగా మరో ఓపీ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
మధ్యవర్తిత్వంతో త్వరితగతిన కేసుల పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): మధ్యవర్తిత్వంతో కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు/జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధ్థి అన్నారు. సోమవారం జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులు, ఎన్జీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రితో కలసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రవేశపెట్టాలని తీర్మానించినట్లు చెప్పారు. అందులో భాగంగా ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు న్యాయవాదులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరరం కేరళ నుంచి వచ్చిన జ్యోతిగోపీనాథన్ మధ్యవర్తిత్వంపై శిక్షణనిచ్చారు. -
అంతర్గత బదిలీలకు తిలోదకాలు
శ్రీశైల దేవస్థానంలో అంతర్గత బదిలీలకు అధికారులు తిలోదకాలిచ్చారు. మూడు నెలలకోసారి అంతర్గత బదిలీలు చేయాలనే దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలను గాలికొదిలేశారు. ఫలితంగా కొందరు ఫెవికాల్ వీరులు దాదాపు తొమ్మిది నెలలుగా కొన్ని విభాగాల్లో తిష్టవేశారు. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో వెలసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే భక్తులకు సేవలందించేందుకు రాష్ట్ర దేవదాయశాఖ సుమారు 300 మంది రెగ్యులర్ సిబ్బందిని, 1000 మందికి పైగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఇతర ఉద్యోగులను నియమించింది. దేవస్థానంలో విధులు నిర్వహించే రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకోసారి ఇతర దేవస్థానాలకు బదిలీ చేస్తారు. ఇక పరిపాలన సౌలభ్యం కోసం, ప్రతి అధికారికి, సిబ్బందికి పాలనలో అనుభవం కోసం ప్రతి మూడు నెలలకోసారి రొటేషన్ పద్ధతిన అంతర్గత బదిలీలు చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాటించకుండా అధికారులు తమకు నచ్చిన సమయంలో ఇష్టానుసారంగా అంతర్గత బదిలీలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈఓల మాట వినని అధికారులు, సిబ్బందిపై కక్ష తీర్చుకునేందుకు మాత్రమే కమిషనర్ ఆదేశాలు ఉపయోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జూలై 8న పర్యవేక్షకులు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, పలువురు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు పరిచారకులను ఒకేసారి 52 మందిని బదిలీ చేశారు. మరికొన్ని రోజులకు ఏఈఓ, పర్యవేక్షకులను సైతం అంతర్గత బదిలీలు చేస్తూ ఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత సుమారు తొమ్మిది నెలలవుతున్నా అంతర్గత బదిలీల ఊసే లేదు. దీంతో వసతి విభాగంలో కొందరు పాతుకుపోయారనే విమర్శలున్నాయి. ఈ విభాగంలోని వారు ప్రొటోకాల్ వ్యవహారాలు, సిఫార్స్ లేఖలకు వసతి గదులు, దర్శనం టికెట్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రాధాన్యత ఉన్న విభాగం కాబట్టి ఇక్కడి నుంచి కొందరు కదలడం లేదనే ఆరోపణలున్నాయి. మల్లికార్జున సదన్ కౌంటర్లో పనిచేసే ఓ ఉద్యోగి రెండేళ్లకు పైగా అక్కడే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రమోషన్లు ఇచ్చి..పోస్టింగులు మరిచి! దేవస్థానంలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరికి సహాయ కార్యనిర్వహణాధికారులుగా, సీనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి పర్యవేక్షకులుగా గత ఏడాది డిసెంబరు 27న ప్రమోషన్లు ఇచ్చారు. కానీ ఇంతవరకు పోస్టింగులు ఇవ్వలేదు. గత మూడు నెలలుగా వారు గతంలో వారికి కేటాయించిన సీటులోనే విధులు నిర్వహిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం అంతర్గత బదిలీలు పరిపాలన సౌలభ్యం కోసం చేపట్టే అంశం. ఈ విషయం పరిపాలనకు సంబంధించిన అంశం. నేను ఈఓగా వచ్చి మూడు నెలలు మాత్రమే అవుతుంది. అప్పటి నుంచి సంక్రాంతి, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపైనే ప్రత్యేక దృష్టి సారించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎవరెవరు ఎన్ని నెలలుగా ఒకే సీటులో ఉంటున్నారనే విషయంపై పరిశీలించి, చర్యలు తీసుకుంటాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి మూడు నెలలకోసారి బదిలీలు చేయాలని కమిషనర్ ఆదేశాలు పట్టించుకోని శ్రీశైలం దేవస్థానం అధికారులు -
నంద్యాలలో జిల్లా కేంద్రంలో..
బొమ్మలసత్రం: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికకు 72 ఫిర్యాదులు అందాయి. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కార మార్గాన్ని చూపుతున్నామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● ఆస్తి కోసం తన పెద్ద కుమారుడు శివశంకర్‌గౌడ్ తప్పుడు కేసులు పెట్టి మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నారని పగిడ్యాల మండల కేంద్రానికి చెందిన లక్ష్మన్నగౌడ్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ● చుక్కల భూమి జాబితాలో నుంచి తన పొలాన్ని తీసేయిస్తానని నమ్మించి పూజారి నాగేంద్రయ్య రూ. 1.50 లక్షలు కాజేశాడని దొర్నిపాడు మండలం ఉమాపతి గ్రామానికి చెందిన మల్లికార్జున ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. యించాడు. -
గర్భదారణ సమస్యలపై దృష్టి సారించాలి
కర్నూలు(హాస్పిటల్): గర్భం దాల్చినప్పుడు మహిళలకు అనేక సమస్యలు వస్తాయని, వాటిని ఎప్పటికప్పుడు వైద్యులు గమనిస్తూ తగిన చికిత్సలు అందించాలని, అప్పుడే తల్లీబిడ్డలు పూర్తిగా క్షేమంగా ఉంటారని వైద్యనిపుణులు అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్ట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఫాగ్సి) ఆధ్వర్యంలో కర్నూలు కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాయలసీమలోని వైద్యులకు నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు (సీఎంఈ) నిర్వహించారు. కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు చెందిన దాదాపు 200 మంది వరకు గైనకాలజిస్టులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గైనకాలజిస్టు డాక్టర్ కేపీ. శిల్పా మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సదుపాయాలతో గర్భస్థ మహిళలతో పాటు వారి కడుపులో ఉండే శిశువులకు వచ్చే ఎలాంటి సమస్యలైనా పరిష్కరించవచ్చని చెప్పారు. పీడియాట్రిక్ కార్డియాలజిస్టు డాక్టర్ కె.మహమ్మద్ ఫారూక్ మాట్లాడుతూ గర్భస్థ శిశువులకూ గుండెకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చని, ప్రసవం అయిన తర్వాత వీలైనంత వెంటనే వాటికి తగిన చికిత్సలు అందించాలని తెలిపారు. అనంతరం గర్భిణిలకు వచ్చే పచ్చకామెర్లు, గుండె సమస్యలు, హైబీపీ, మధుమేహం, ఇతర సమస్యలు, వాటిని గుర్తించి చికిత్స చేసే పద్ధతుల గురించి నిపుణులు వివరంగా చర్చించారు. కార్యక్రమంలో ఫాగ్సీ ప్రెసిడెంట్ ఎస్.వెంకటరమణ, కార్యదర్శి వి.రాధాలక్ష్మి, గర్భస్థ శిశు సమస్యల నిపుణురాలు కె.నివేదిత, గైనకాలజిస్ట్, వై.కుసుమ, కె.లక్ష్మీప్రసన్న, ఎ.సుధారాణి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు కె.నవీన్, ఎస్.జె. జానకీరామ్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు జి.సందీప్‌కుమార్, నియోనెటాలజిస్టు ఎన్.భారతి పాల్గొన్నారు. -
క్వింటాకు రూ.10 వేల వరకే ధర
గత ఏడాది పండించిన మిర్చి ఇప్పటికీ గోదాముల్లో ఉంది. ఈ సారి 3.50 ఎకరాల్లో మిర్చి సాగు చేశాం. ఎకరాకు పెట్టుబడి వ్యయం రూ.1.50 లక్షల వరకు వస్తోంది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి ధర కనీసం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు లభిస్తేనే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇందులో 20 క్వింటాళ్లు తాలు కాయలే. ప్రస్తుతం దళారీలు క్వింటా రూ.10 వేల చొప్పున అడుగుతున్నారు. ఈ ధరతో అమ్ముకుంటే పెట్టుబడి కూడా దక్కదనే భయంతో ఏసీ గోదాముల్లో నిల్వ చేశాం. – ఎర్ర చిన్న సతీష్, బసలదొడ్డి, పెద్దకడుబూరు మండలం -
టీడీపీలో ఇరువర్గాల ఘర్షణ
సంజామల: గ్రామాల్లో అధిపత్యం కోసం తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ విషయంలోనే సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో ఆదివారం రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. గ్రామ సంఘం పెద్దను ఎన్నుకునే విషయంలో అధికారపార్టీలో విభేదాలు తలెత్తాయి.సంఘం పెద్ద కోసం మల్లు మహేశ్వర్ రెడ్డి, దుబ్బ రామగోవింద్ రెడ్డి వర్గాల మధ్య పోరు నడుస్తోంది.అయితే, ఆదివారం ఉదయం పాత వారే కొన సాగుతారని మల్లు మహేశ్వర్‌రెడ్డి వర్గం దండోర వేయిస్తుండగా ప్రత్యర్థి వర్గం అడ్డుకుంది. ఈ విషయంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా మల్లు మహేశ్వరరెడ్డి, ఆయన వర్గానికి చెందిన కై పరమణారెడ్డి, కై ప మోహన్‌రెడ్డికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో దుబ్బ రామగోవింద్‌రెడ్డి, యనకండ్ల తిమ్మయ్యతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రమణయ్య తెలిపారు. గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య మంత్రాలయం: స్థానిక ఎమ్మిగనూరు రోడ్డులోని జగ నన్న కాలనీ సమీపంలో ఓ గుర్తు తెలియని యువకు డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.టవల్‌తో వేప చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ శివాంజల్ అ క్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆచూకీ కోసం గుర్తించేందుకు ప్రయత్నించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. యువకుడి వయస్సు దా దాపు 35 నుంచి 40 ఏళ్లు ఉండి, గళ్ల చొక్కా ధరించా డు. మృతదేహం ఉబ్బిపోయి ఉండటంతో మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. గల్లంతైన బాలుడు శవమై తేలాడు ఆదోని అర్బన్: రెండు రోజుల క్రితం బసాపురం ఎల్లెల్సీ కాలవలో గత్లంతైన పట్టణంలోని బోయగేరికి చెందిన శేఖర్ కుమారుడు హరికృష్ణ (16) ఆదివారం శవమై కనిపించాడు. అగ్నిమాపక సిబ్బంది సంజీవ్‌కుమార్, మల్లికార్జునరెడ్డి, అనీఫ్, వెంకటేశ్వర్లు, చిదంబరంరెడ్డి, నరసింహులు, మహమ్మద్ శుక్రవారం నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాలుడు గల్లంతైన ప్రాంతానికి కొద్ది దూరంలో ఆదివారం ఉదయం మృతదేహం కనిపించడంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఇస్వీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ కార్యదర్శిగా అబ్దుల్ గఫార్
ఓర్వకల్లు: వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా అబ్దుల్ గఫార్‌ను నియమించినట్లు పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వైఎస్సార్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మైనార్టీ విభాగంలో జిల్లాకు చెందిన కొందరికి స్థానం లభించినట్లు తెలిపారు. అందులో భాగంగా రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా నన్నూరు గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు అబ్దుల్ గఫార్‌ను నియమించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈయన నియామకం పట్ల జిల్లా మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. క్రెడాయ్ నూతన చైర్మన్‌గా గోరంట్ల రమణ కర్నూలు (టౌన్): క్రెడాయ్ (కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నూతన చైర్మన్‌గా గోరంట్ల రమణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక కల్లూరు రోడ్డులో ఉన్న క్రెడాయ్ భవనంలో క్రెడాయ్ సభ్యుల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కర్నూలు చాప్టర్ నూతన చైర్మన్‌తో పాటు అధ్యక్షుడిగా సురేష్ రెడ్డి, కార్యదర్శిగా గోవర్దన్రెడ్డిని ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అర్కిటెక్ రంగనాథ రెడ్డి వ్యవహరించారు. నూతనంగా ఎన్నికై న చైర్మన్ గోరంట్ల రమణ మాట్లాడుతూ 2015 నుంచి 2021 వరకు క్రెడాయ్ సంస్థలో కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశానన్నారు. క్రెడాయ్ సంస్థ ద్వారా ప్రాపర్టీషోలు నిర్వహించామన్నారు. నూతన కార్యవర్గంతో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొంటున్న నిర్మాణ రంగానికి నూతనోత్సాహం తీసుకువస్తామని స్పష్టం చేశారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ● పోలీస్ స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ కర్నూలు: కర్నూలు శివారుల్లోని షరీన్‌నగర్‌లో టీడీపీ నాయకుడు సంజన్న హత్య సంఘటన నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. హంతకుడు వడ్డే రామాంజనేయులు అలియాస్ అంజిపై అనేక కేసులు ఉండడమే గాక, రౌడీ షీట్ కూడా ఉండడంతో రౌడీ షీటర్ల కదలికలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా అంతటా పోలీస్ స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి గౌరవ ప్రదమైన జీవితం కొనసాగించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇస్తునే, కొత్తగా కేసుల్లో ఇరుక్కున వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లు జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై కూడా ఆరా తీస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే, పోలీస్ శాఖ పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
కర్నూలు సిటీ: ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని ఓ కాలేజీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా బి.లక్ష్మీ నరసింహులు (దేవనకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, జువాలజీ లెక్చరర్), ఉపాధ్యక్షుడిగా జేవీ రమణగుప్తా (ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కర్నూలు ఇంగ్లిష్ లెక్చరర్), కార్యదర్శిగా కె.రామాంజనేయులు (ప్రభుత్వ జూనియర్ టౌన్ మోడల్ కాలేజీ, కర్నూలు, కెమిస్ట్రీ లెక్చరర్), జాయింట్ సెక్రటరీగా పి.డేవిడ్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కౌతాళం, కెమిస్ట్రీ లెక్చరర్), కోశాధికారిగా జె.రాహుల్ కుమార్ (ప్రభుత్వ టౌన్ మోడల్ జూనియర్ కాలేజీ, కర్నూలు), మహిళ కార్యదర్శిగా ఎస్.రేష్మా (ప్రభుత్వ జూనియర్ బాలికల కాలేజీ, కర్నూలు), రాష్ట్ర కౌన్సిలర్‌గా పి.శ్రీనివాసులు(ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ), ఆర్.రవీంద్ర బాబు (ప్రభుత్వ జూనియర్ బాలురు కాలేజీ, కర్నూలు) ఎన్నికై నట్లు ఎన్నికల అధికారిగా మహమ్మద్ వాయిజ్ ప్రకటించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. -
సముద్ర శాస్త్రవేత్త ఎంపీఎం రెడ్డి సేవలు చిరస్మరణీయం
కర్నూలు కల్చరల్: సుప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ ఎంపీఎం రెడ్డి సేవలు చిరస్మరణీయమని అరుణ భారతి అధ్యక్షుడు బీసీ రాజారెడ్డి అన్నారు. సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం తెలుగు కళా స్రవంతి ఆఽధ్వర్యంలో డాక్టర్ ఎంపీఎం రెడ్డి సంస్మరణ సభను నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ రాజారెడ్డి మాట్లాడుతూ.. భారతీయ తొలి సముద్ర శాస్త్రవేత్తగా ఎదిగిన ఎంపీఎం రెడ్డి ఆదర్శనీయులు అన్నారు. ప్రపంచంలోని అన్ని సముద్రాలు సందర్శించి పరిశోధనలు చేశారని గుర్తు చేసుకున్నారు. సముద్ర శాస్త్రంపై ఈయన రాసిన పుస్తకాలను కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రచురించడం గర్వకారణమన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ రెడ్డి రచించిన సముద్ర శాస్త్ర గ్రంథాలే ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీల్లో సముద్ర శాస్త్ర, మత్య్స శాస్త్ర విద్యార్థులు పాఠ్యగ్రంథాలుగా చదువుకోవడం ఉమ్మడి కర్నూలు జిల్లాకు గర్వకారణమన్నారు. ఎంపీఎం రెడ్డి కూతురు మాలతి, కుమారుడు డాక్టర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి కెనడాలో ఉండి కూడా భారతీయ సంస్కృతికి పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో తెలుగు కళా స్రవంతి అధ్యక్షుడు ఇనాయతుల్లా, సాహితీ స్రవంతి అధ్యక్షులు కెంగార మోహన్, కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, రచయిత గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, గజల్ గాయకుడు మహమ్మద్ మియ్యా, మద్దిలేటి యాదవ్ మాట్లాడారు. ఎంపీఎం రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
మిర్చి రైతుకు దక్కని భరోసా
● కాయకుళ్లుతో భారీగా పెరిగిన పెట్టుబడి వ్యయం ● ఎకరాకు రూ.1.50 లక్షల వరకు ఖర్చులు ● సగటు దిగుబడి 15 క్వింటాళ్లకే పరిమితం ● ఇందులోనూ 30–40 శాతం తాలు కాయలు ● నేడు మిర్చికి లభిస్తున్న ధర రూ.10 వేలలోపే -
అమరజీవికి ఘన నివాళి
కర్నూలు: జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయ మైదానంలో చిత్రపటానికి అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్‌పీరా పూలమాల వేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను, సేవలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని ఆడిషనల్ ఎస్పీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు సీఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నెలాఖరులోపు రుణాలు చెల్లిస్తే అపరాధ వడ్డీ మినహాయింపు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకులో నిరర్థక ఆస్తులుగా మిగిలి పోయి న దీర్ఘకాలిక రుణాల రికవరీల కోసం ఉద్దేశించిన ఉపశమన పథకం గడువు ఈ నెల చివరి వరకు మాత్రమే ఉందని సీఈఓ విజయకుమార్ తెలిపారు. డీసీసీబీ బ్రాంచీల ద్వారా దీర్ఘకాలిక రుణాలు తీసుకొని.. రికవరీ చేయక నిరర్థ్ధక ఆస్తులుగా మిగిలిపోయిన బకాయిలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల చివరిలోపు అప్పు మొత్తాన్ని చెల్లిస్తే.. అపరాధ వడ్డీ మినహాయింపు ఉంటుందని, వడ్డీ మీద వడ్డీలో గరిష్టంగా రూ.50 వేల వరకు మాఫీ ఉంటుందన్నారు. ఇటువంటి బకాయిలు ఉమ్మడి జిల్లాలో రూ.15 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. దీర్ఘకాలిక రుణాలు అంటే డెయిరీ, గొర్రెల, మైనర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ వంటి వాటికి తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. రూ.61.22 కోట్ల పన్ను వసూళ్లు కర్నూలు (టౌన్): 2024–2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కర్నూలు నగరపాలక సంస్థ ఆస్తి, నీటి పన్నులను రూ.61.22 కోట్లు వసూలు చేసినట్లు ఆ సంస్థ మేనేజర్ చిన్నరాముడు తెలిపారు. ఆదివారం ఆయన పన్ను వసూళ్ల కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. పన్ను వసూళ్లు నగరంలో ముమ్మరంగా సాగుతుందన్నారు. సెలవు రోజైన ఆదివారం రెవెన్యూ, సచివాలయాల సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టారన్నారు. ఈ నెలాఖరుకు 100 శాతం పన్నులు వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం పేరుతో రూపొందించిన నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని శ్రీశైల దేవస్థానం ఈఓ ఎం. శ్రీనివాసరావు భక్తులకు సూచించారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ దేవస్థానం వసతిని ముందస్తుగా రిజర్వు చేసుకునేందుకు, ఆర్జితసేవలు, దర్శనం టికెట్లు పొందేందుకు దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. అయితే, ఈసేవలు పొందేందుకు దేవస్థానం వెబ్సైట్ www.srisailadevasthanam. org, దేవదాయ శాఖ అధికారిక వెబ్సైట్ www. aptemples. ap. gov. inలను మాత్రమే వినియోగించుకోవాలని చెప్పారు. ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351/52/53ను సంప్రదించాలన్నారు. 26 నుంచి హ్యాండ్‌బాల్ పోటీలు కర్నూలు (టౌన్): ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు బిహార్ రాష్ట్రాంలోని జహీరాబాద్‌లో 46 వ జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ జూనియర్ బాలుర చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి. శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పది పరీక్షలకు అంతా సిద్ధం
● నేటి నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు ● జిల్లాలో 172 కేంద్రాలు ఏర్పాటు ● పరీక్షలకు హాజరుకానున్న 40,776 మంది విద్యార్థులు ● సమస్యాత్మకమైన కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కర్నూలు సిటీ: పాఠశాల విద్యలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లిషు మీడియం, ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో విద్యార్థులు మొదటిసారి పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 40,776 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 31,410 మంది, ప్రైవేటు 7,038 మంది, ఓపెన్ టెన్త్ విద్యార్థులు 2,328 మంది హాజరుకానున్నారు. ఇందులో 23,486 మంది ఇంగ్లిషు మీడియం, 5,068 మంది తెలుగు, 379 మంది ఉర్దూ, 477 మంది కన్నడ మీడియంలో నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. గత ప్రభుత్వం మన బడి నాడు–నేడు కింద అన్ని రకాల వసతులు కల్పించడంతో సదుపాయాల కొరత తీరింది. రెగ్యులర్ టెన్త్‌తో పాటు, ఒపెన్ స్కూల్ పది పరీక్షలు సైతం ఒకే సమయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 172 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు 20 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 172 మంది ముఖ్య పర్యవేక్షకులను, 172 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 1,840 మంది ఇన్విజిలెటర్లను, సీ సెంటర్లకు 11 మంది కస్టోడియన్స్, 7 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లోని గార్గేయపురం జెడ్పీ హైస్కూల్, రామళ్లకోట జెడ్పీ హైస్కూల్, ఉల్చాల జడ్పీ హైస్కూల్, ఆస్పరి జడ్పీ హైస్కూల్ ఏ సెంటర్, బీ సెంటర్, ఏపీ మోడల్ స్కూల్ గాజులదిన్నెలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆల్ ది బెస్ట్ ఉజ్వల భవిష్యత్తుకు మొదటి మెట్టు పదవ తరగతి. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు పాజిటివ్ ఆలోచనతో పరీక్షలు రాయాలి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేయాలి. పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. – పి.రంజిత్ బాషా, జిల్లా కలెక్టర్ పకడ్బందీగా ఏర్పాట్లు పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. మాప్ కాపీయింగ్‌కు పాల్పడితే చట్ట రీత్యా చర్యలు ఉంటాయి. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించారు. కేంద్రా ల్లోకి ఎలాంటి సెల్ఫోన్లు అనుమతించం. పరీక్షల్లో ఏవైన సమస్యలు తలెత్తినా, సందేహాలు ఉన్నా డీఈఓ ఆఫీస్‌లో కంట్రోల్ రూం నంబర్ 98855716544ను సంప్రదించవచ్చు. – ఎస్.శామ్యూల్ పాల్, డీఈఓ -
గ్యాస్ డెలివరీలో నిలువు దోపిడీ!
● కనీసంగా రూ.30 వసూలు ● అంతస్తులు పెరిగే కొద్ది రూ.10 పెంచుతున్న వైనం ● 15 కిలోమీటర్ల వరకు ఎలాంటి రుసుం వసూలు చేయరాదంటున్న నిబంధనలు ● దోపిడీకి డెలివరీ బాయ్స్‌కు అనుమతి ఇస్తున్న గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యాలు ● ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు సృష్టిస్తున్న డెలివరీ బాయ్స్ ● చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న పౌరసరఫరాల అధికారులు కర్నూలు(సెంట్రల్): గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం 15 కిలోమీటర్ల వరకు ఎలాంటి రుసుం వసూలు చేయరాదు. 15 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వరకు సిలిండర్‌కు రూ.30 వసూలు చేయాలి. అయితే ఎక్కడా ఆ నిబంధనలు అమలు కావడం లేదు. ఐదు కిలోమీటర్ల లోపే సిలిండర్లు డెలివరీ అవుతున్నా కనీసంగా రూ.30 వసూలు చేస్తున్నారు. అపార్టుమెంట్లలో అంతస్తుకు రూ.15 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారు. మొదటి అంతస్తులోకి సిలిండర్ రావాలంటే రూ.45, రెండో అంతస్తులోకి రావాలంటే రూ.50, మూడో అంతస్తులోకి రావాలంటే రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. ఎదురిచ్చి గ్యాస్ సిలిండర్ల డెలివరీ! జిల్లాలో దాదాపు 30 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇందులో 6,67,456 మందికి గ్యాస్ కనెక్షన్లు ఉండగా, భారత్, హెచ్‌పీ, ఐఓసీ కంపెనీలు గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాయి. ఎక్కువగా ప్రజలు భారత్ గ్యాస్ కంపెనీ సిలిండర్లనే వినియోగిస్తున్నారు. నిబంధనలు ప్రకారం ఒక వినియోగదారుడు బుక్ చేసుకున్న సిలిండర్‌ను డెలివరీ చేసేందుకు నిర్వహణలో ఉన్న ఏజెన్సీలు వాహనాలు, బాయ్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. బాయ్స్‌కు వారే జీతా లు ఇవ్వాలి. అయితే ఏజెన్సీలలు ఇక్కడే మోసం చేస్తున్నాయి. సొంతంగా ఆటోలు ఉన్న వారితో కలసి సిలిండర్లను డోర్ డెలివరీ చేసే బాధ్యతను వారికి అప్పగిస్తున్నారు. ఇలా వారి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఏజెన్సీ నిర్వాహకులు ఆటోగాని, డెలివరీ బాయ్కుగాని ఎలాంటి బాడుగ, జీతాలు చెల్లించరు. ఆటో యజమానే డెలివరీ చేసి వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలి. దీంతో ఆటో యజమానులు గిట్టుబాటు కోసం దోపిడీ చేస్తున్నారు. ఎక్కువ కనెక్షన్లు ఉన్న ఏజెన్సీలకు అయితే ఆటో యజమానులే ఎదురు చెల్లించి డెలివరీ చేసేందుకు ఒప్పందం చేసుకుంటారట. దీంతో డెలివరీ బాయ్స్ కనీసంగా రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేసుకొని గిట్టుబాటు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో సిలిండర్ బిల్లింగ్‌లో డెలివరీ కోసం కేటాయించిన మొత్తం ఏజెన్సీల ఖాతాలోకి వెళ్లిపోతోంది. మొత్తంగా వినియోగదారుడే ఏజెన్సీ, డెలివరీ బాయ్ చేతిలో మోసపోయి దగాపడుతున్నాడు. నోటీసులతో సరి.. గ్యాస్ పంపిణీపై నెలరోజులుగా 60కి పైగా ఫిర్యాదులు అందాయి. వీటిలో గ్యాస్ డెలివరీ కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులే అధికం. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో ఏజెన్సీలకు అధికారులు నోటీసులు ఇచ్చిసరిపెట్టారు. వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఇటీవల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి డెలివరీ కోసం డబ్బులు తీసుకోరాదని స్వయంగా జేసీ డాక్టర్ బి.నవ్య చెప్పారు. ఫిర్యాదు చేస్తేనే చర్యలు గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీని పౌర సరఫరాల అధికారులు పరిశీలించడం లేదు. నెలవారీగా ఏజెన్సీ నిర్వాహకుల నుంచి వస్తున్న డబ్బులు తీసుకొని మిన్నకుండి పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిలిండర్ డెలివరీ విషయంలో చాలామంది వినియోగదారులు బాయ్స్‌తో గొడవ పడి ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో దోపిడీ యథాతథంగా కొనసాగుతోంది. నిబంధనలు పాటించాలి 15 కిలోమీటర్ల వరకు గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం ఎలాంటి రుసుం వసూలు చేయరాదు. అలా వసూలు చేస్తే మాకు ఫిర్యాదు చేయాలి. వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నాం. వచ్చిన ఫిర్యాదులను వచ్చినట్లుగానే పరిష్కరిస్తున్నాం. 15 కిలో మీటర్లు దాటితే సిలిండర్‌కు రూ.30 వసూలు చేయాలని ప్రభుత్వం నిబంధనలు ఉన్నాయి. ఏజెన్సీలు విధిగా నిబంధలను పాటించాలి. –రాజారఘువీర్, డీఎస్ఓ, కర్నూలు -
హాస్టల్ విద్యార్థినులకు తప్పిన ప్రమాదం
నంద్యాల(అర్బన్): స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని జూనియర్ కళాశాల గిరిజన బాలికల వసతి గృహం విద్యార్థినులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉన్నట్టుండి హాస్టల్ రెండో అంతస్తు కిటికి దిమ్మె విరిగి కింద పడింది. అయితే, ఆ సమయంలో విద్యార్థినులంతా బయట వరండాలో ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఉండటంతో ప్రమాదం తప్పింది. హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, పలు గదులు పెచ్చులూడి వర్షానికి కారుతున్నాయని విద్యార్థినులు వాపోయారు. ప్రమాదం జరగకముందే అధికారులు భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
వాగులో మునిగి గొర్రెల కాపరి మృతి
ఆళ్లగడ్డ/రుద్రవరం: చందలూరు–నల్లగట్ల గ్రామ పొలిమేర మధ్యలో వక్కిలేరు వాగు నీటిలో మునిగి ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం గొర్రెలను ఏరు దాటిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రుద్ర వరం మండలం నక్కలదిన్నెకు చెందిన శివరాం, పాపారాయుడు, నారబోయిన కృష్ణుడు (54) అనే ముగ్గురు దాదాపు 700 గొర్రెలను పెంచుతున్నారు. వాటిని మేపేందుకు ప్రతి రోజు చుట్టు పక్కల గ్రామాల పొలాల్లోకి వెళ్లేవారు. ఈక్రమంలోనే ఆదివారం నక్కలదిన్నె నుంచి చందలూ రు–నల్లగట్ల పొలిమేర మధ్యకు వెళ్లారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో గొర్రెలను సమీపంలోని వక్కిలేరు వాగులోకి తోలారు. అందులో వాటికి ఈత నేర్పి తీసుకొస్తున్న సమయంలో కొన్ని గొర్రెలు వారిపై దూకాయి. ఈ ఘటనలో శివరాం, పాపారాయుడు అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకోగా నారబోయిన కృష్ణుడు మాత్రం నీటిలో మునిగిపోయాడు. ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. నారబోయిన కృష్ణుడుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని పోలీసులు చందలూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆళ్లగడ్డ పోలీసులు తెలిపారు. -
పెద్దాసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుడి మృతి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికుడు జె.నాగేష్(41) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. మూడు రోజుల క్రితం తను పనిచేసే క్యాజువాలిటీలో అస్వస్థతకు గురి కాగా అక్కడే వైద్యులు చికిత్స అందించి ఇంటికి పంపించారు. ఆదివారం ఉదయం నుంచి మళ్లీ ఆరోగ్యం బాగాలేక పోవడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే నాగేష్ మరణించాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. మరణించిన అతని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు డిమాండ్ చేశారు. సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం వల్లే కార్మికులు శారీరక, మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చర్చించి పంపించారు. కార్యక్రమంలో సుజాత, సునీత, విజయ్‌కుమారి, మల్లేశ్వరి, మురళి, ప్రసాద్, మహేష్, డేవిడ్, డ్రైవర్ భాషా, రంగన్న పాల్గొన్నారు. -
గొంతులు ఎండుతున్నాయ్ !
● తాగునీటి సమస్యపై అధికార, ప్రతిపక్ష సభ్యులు గగ్గోలు ● హామీ ఇవ్వకుండా మంత్రి టీజీ భరత్ వెళ్లిపోవడంపై అసహనం ● నీటి పారుదలపై సుదీర్ఘ చర్చ కర్నూలు(అర్బన్): వేసవి ప్రారంభంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అనేక గ్రామాల ప్రజల గొంతులు ఎండుతున్నాయని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆలూరు, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు బి. విరూపాక్షి, గౌరు చరితారెడ్డి, జి. జయసూర్య, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు పి. రంజిత్‌బాషా, రాజకుమారి గణియా, కర్నూలు జేసీ డా.బి. నవ్య, ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, జెడ్పీ సీఈఓ జి. నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. అజెండాలో పొందుపరిచిన విధంగా తాగునీరు, వ్యవసాయం, ఇరిగేషన్ శాఖలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా ఏళ్ల క్రితం నిర్మించిన 60కి పైగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయని, వాటి నిర్వహణను ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారా? అని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ప్రశ్నించారు. కట్టలు బలహీనపడి పోవడం, లీకేజీలను పరిశీలించకుంటే సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందన్నారు. వాటిని తనిఖీ చేసి నివేదికలు అందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ల విస్తరణ చేపట్టాలి.. ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. జనాభా పెరిగిన నేపథ్యంలో చింతకుంట, బాపురం రిజర్వాయర్లను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే ఆలూరు చెరువు అన్యాక్రాంతం కాకుండా ఎస్ఎస్ ట్యాంకును నిర్మించాలన్నారు. సమ్మతగేరిలో ఎస్ఎస్ ట్యాంకు నిర్మించాలని, కోగిలతోట గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఓహెచ్‌ఎస్‌ఆర్‌ను తొలగించి కొత్త ఓహెచ్‌ఎస్‌ఆర్‌ను నిర్మిస్తుండడం వల్ల గ్రామంలో తీవ్ర మంచినీటి సమస్య ఉందన్నారు. పందికోన రిజర్వాయర్ నుంచి పైప్‌లైన్ వేస్తే ఆస్పరి మండలంలోని పలు గ్రామాల నీటి సమస్య తీరే అవకాశం ఉందన్నారు. అలాగే తుంగభద్ర డ్యామ్ గేట్లకు సంబంధించిన చైన్ లింకులను మొత్తం మార్చాలని కేంద్ర బృందం సూచించిందని, ఇందుకు రూ.150 కోట్ల వరకు వ్యయం కానుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నయాపైసా కూడా కేటాయించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. మంత్రికి ప్రజల సమస్య పట్టదా.. సమావేశం జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, జయసూర్య వెళ్లిపోవడం పట్ల ఆలూరు ఎమ్మెల్యే బి. విరుపాక్షితో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత వేసవిలో నెలకొన్న తాగునీటి సమస్యపై సుదీర్ఘ చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రిగా ఎలాంటి హామీ ఇవ్వకుండా వెళ్లడం ఏమిటని వారు ప్రశ్నించారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు సంబంధించి పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో తమ వాణిని వినిపించాల్సిన ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా వెళ్లిపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. నీటి వృథాను అరికట్టేందుకు రిజర్వాయర్లు అవసరం ... జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కర్నూలు జిల్లాకు పైభాగాన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన అధిక వర్షాల వల్ల గత ఏడాది జూరాల నుంచి 1200 టీఎంసీలు, సుంకేసుల నుంచి 300 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలైందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు లేని కారణంగా ప్రతి ఏడాది దాదాపు 540 టీఎంసీల నీరు వృథా అవుతుందన్నారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి అయితే నీటి వృథాను కొంతమేర అరికట్టడంతో పాటు సాగు, తాగునీటికి ఉన్న ఇబ్బందులు తొలగే అవకాశం ఉంటుందన్నారు. అలాగే రబీ సీజన్లో ఏర్పడిన ఎరువుల కొర త ఖరీఫ్‌లో రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రూ.6.47 కోట్ల పనులకు ఆమోదం జిల్లా పరిషత్ సాధారణ నిధులు, 2024–25 ఆర్థిక సంవత్సరం నిధులు, మిగులు నిల్వలు కలిపి మొత్తం రూ.6.47 కోట్లతో వివిధ అభివృద్ది పనులకు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. ఆదివారం జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 147 పనులను చేపట్టేందుకు సభ్యులు ఆమోదం తెలిపారు. -
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం
కర్నూలు(సెంట్రల్): జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దామని జిల్లా ఇన్చార్జ్ ఆఫీసర్.. రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కాంతిలాల్ దండే సూచించారు. సమర్థవంతమైన పరిపాలనను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లా ఇన్చార్జ్ ఆఫీసర్లుగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారులను జోనల్ ఇన్చార్జ్ ఆఫీసర్లుగా నియమించింది. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఇన్చార్జ్ అధికారిగా నియమితులైన రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే శనివారం కర్నూలు వచ్చారు. ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పేదరిక నిర్మూలన, ఎంఎస్ఎంఈల ఏర్పాటు, విద్య, వైద్య రంగాల అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాపై కలెక్టర్.. ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో వెంకట నారాయణమ్మ, సీపీఓ హిమ ప్రభాకరరాజు పాల్గొన్నారు. ఆర్అండ్బీ అధికారులతో.. జిల్లా ఇన్చార్జ్ ఆఫీసర్ కాంతిలాల్ దండే ఆర్అండ్బీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో ముఖ్యమైన రోడ్ల నిర్మాణాలు అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపాలని, మిషన్ పాట్ హోల్ కింద పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్ఈ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. వాహనాల రిజిస్ట్రేన్లను పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్, రిజిస్ట్రేషన్ అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆయన డీటీసీ శాంతికుమారికి సూచించారు. జిల్లా ఇన్చార్జ్ ఆఫీసర్ సెక్రటరీ కాంతిలాల్ దండే -
రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను అందజేయవచ్చన్నారు. సోమవారం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. చేపల పెంపకంతో స్వయం ఉపాధి కర్నూలు(అగ్రికల్చర్): స్వయం ఉపాధిలో రాణించేందుకు చేపల పెంపకం చక్కటి అవకాశమని మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్ తెలిపారు. శనివారం ఆయన కర్నూలు, సుంకేసుల డ్యామ్, గాజులదిన్నె ప్రాజెక్టుల్లో పర్యటించారు. కర్నూలు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 2024–25 సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని సమీక్షించారు. జిల్లా ప్రగతిని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్యామల కమిషనర్‌కు వివరించారు. కర్నూలు పాత బస్టాండు సమీపంలోని చేపల మార్కెట్‌ను తనిఖీ చేశారు. బంగారుపేటలోని దేశీయ మత్స్య శిక్షణా కేంద్రం(ఐఎఫ్‌టీసీ)లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేడు మార్కెట్లో చేపలకు విశేషమైన డిమాండ్ ఉందని, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేపల మార్కెటింగ్‌కు అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పొదుపు మహిళల అనుసంధానంతో చేపల ఉత్పత్తిని పెంచడం, వినియోగాన్ని విస్తృతం చేయనున్నట్లుగా పేర్కొన్నారు. బోధనలో ఇంటి వాతావరణం కల్పించాలి కల్లూరు: పాఠశాలలు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లోని విద్యార్థులకు ఇంటి వాతావరణంలో ఉన్నట్లుగా బోధన చేయాలని డీఈఓ శామ్యూల్‌పాల్ సూచించారు. శనివారం కల్లూరు మండలం పెద్దపాడు ఏపీ మోడల్ స్కూల్లో సమగ్ర శిక్ష ద్వారా కేజీబీవీ ప్రిన్సిపాళ్లకు, ఎన్ఎమ్లు, పీఈటీలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురి కాకుండా ఉపాధ్యాయులు సూచనలివ్వాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర ఏపీసీ శ్రీనివాసులు, జీసీడీఓ స్నేహలత పాల్గొన్నారు. రైతుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు పత్తికొండ రూరల్: టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న రైతుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య ఆరోపించారు. శనివారం స్థానిక చదువుల రామయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ఇక్కడి పాలకుల ఉదాసీన వైఖరి వల్ల టమాటా ప్రాసెసింగ్ యూనిట్‌గా మార్చారన్నారు. ప్రాసెసింగ్ యూనిట్‌ను వ్యాపార దృక్పథంతోగాకుండా రైతుల ప్రయోజనార్థం విస్తృతం చేసి, అందులో రైతులను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ మండల కార్యదర్శి రాజాసాహెబ్, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి సురేంద్రకుమార్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ఉమాపతి, కారన్న, నెట్టికంటయ్య పాల్గొన్నారు. -
నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
ఈ నెల 16వ తేదీన (ఆదివారం) జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన ఉదయం 9.30 గంటలకు స్థానిక మినీ సమావేశ భవనంలో 1వ స్థాయి సంఘ సమావేశాలను నిర్వహించనున్నామన్నారు. అనంతరం 10.30 గంటలకు స్థానిక జెడ్పీ సమావేశ భవనంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అజెండాలో పొందుపరిచిన గ్రామీణ నీటి సరఫరా – పారిశుద్ధ్యం, వ్యవసాయం, జలవనరుల శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. -
షుగర్ వ్యాధి బారిన పడకుండా ఒక్కొక్కరు ఒక్కో ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తుంటారు. ఒకరు రైస్ తినకూడదంటారు.. ఇంకొకరు నడక మంచిదంటారు.. ఒక వయస్సుకు వచ్చిన తర్వాత వ్యాధి బారిన పడటం ఒక ఎత్తయితే, రాకుండా జాగ్రత్త పడటం ఇంకొక ఎత్తు. మరి పుట్టుకతోనే ఈ వ్యాధి తోడుగా వస
కోవిడ్ తర్వాత పెరిగిన కేసులు కోవిడ్–19 అనంతరం టైప్–1 డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగింది. గతంలో డయాబెటిస్ రోగులు 5 శాతం ఉండగా ఇప్పుడు 10శాతానికి చేరుకుంది. కోవిడ్ వైరస్ నేరుగా బీటా కణాలపై దాడి చేయడమే ఇందుకు కారణం. ఈ కారణంగా కోవిడ్‌కు గురైన వారికి జన్మించే పిల్లల్లో టైప్–1 డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తోంది. – డాక్టర్ పి.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్‌వోడి, జీజీహెచ్, కర్నూలు ఇన్సులిన్‌తో మాత్రమే చికిత్స చిన్నపిల్లల్లో వచ్చే టైప్–1 డయాబెటిస్‌కు ఇన్సులిన్‌తో మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది. ఆయాసం, కడుపునొప్పి, వాంతులు లక్షణాలతో చిన్నపిల్లలను ఆసుపత్రికి తీసుకొస్తారు. అన్నిరకాల పరీక్షలు నిర్వహించి డయాబెటిస్ నిర్దారణ అయ్యాక చికిత్స ప్రారంభిస్తాం. ఈ పిల్లలకు ఇన్సులిన్‌తో పాటు ఆహార నియమావళి తప్పనిసరి. – డాక్టర్ ఎం.మల్లికార్జున, అసోసియేట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు● కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన యువకునికి పుట్టుకతోనే షుగర్ వ్యాధి వచ్చింది. వైద్యులు పరిశీలించి టైప్–1 డయాబెటిస్‌గా నిర్ధారించారు. అప్పటి నుంచి ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్నారు. ప్రస్తుతం ఇతని వయస్సు 30 ఏళ్లు. రోజూ ఇంజెక్షన్ వేయించుకోవాలంటే బాధగా ఉంటోందని, కానీ బతకాలంటే తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్వీట్లు అంటే ఇష్టమని, కానీ తింటే పరిస్థితి దారుణంగా ఉంటుందని వాపోతున్నాడు.● పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మల్లయ్య, మానస దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు వెంకట ఉమామహేష్, రెండవ కుమారుడు లిఖిత్. 9 నెలల వయస్సు కలిగిన లిఖిత్‌కు పుట్టుకతోనే చక్కెర వ్యాధి తోడుగా వచ్చింది. తరచూ అపస్మారక స్థితికి చేరుకోవడం గమనించి కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. షుగర్ లెవెల్స్ గుర్తించేందుకు మిషన్ తెచ్చుకుని వారానికోసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేయించాల్సిన పరిస్థితి. వారానికి సుమారు రూ.5వేల దాకా ఖర్చవుతోందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): పేరులో తియ్యదనం దాచుకున్న మహమ్మారి మధుమేహం. ఇది పెద్దలనే కాదు.. చిన్నారులనూ వదలని పరిస్థితి. పుట్టుకతోనే తోడుగా వచ్చి జీవించినంత కాలం వేధిస్తోంది. అందరిలా జీవించాలంటే రోజూ సూదిపోటుతో ఇన్సులిన్ మందు వేసుకోవడం తప్పనిసరి. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలను తల్లిదండ్రులే స్వయంగా ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడం వారికీ నరకంతో సమానం. ఇలాంటి బాధితుల సంఖ్య సమాజంలో రోజురోజుకూ పెరుగుతోంది. శరీరంలోని క్లోమగ్రంధిలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను(బీటా కణాలు) వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని టైప్–1 మధుమేహం(డయాబెటిస్) అంటారు. సాధారణంగా పిల్లలు, యువకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు బీటా కణాలను రోగినిరోధక వ్యవస్థ నిర్వీర్యం చేయడం కాకుండా క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు లేదా గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి. దీనిబారిన పడిన వారికి క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంత మందికి జన్యుపరంగా కూడా రావచ్చు. మరికొంత మందికి పలు రకాల వైరల్ వ్యాధులు, ఇతర ప్రమాదకర అనారోగ్యాల కారణంగా కూడా ఈ పరిస్థితి ఎదురవ్వొచ్చు. అంతేకానీ ఆహారం, జీవనశైలి అలవాట్లు టైప్–1 డయాబెటిస్‌కు కారణం కావు. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఇన్సులిన్ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సతో పాటు ఇన్సులిన్‌ను ఉచితంగా అందించాల్సి ఉంది. అయితే గత 10 నెలలుగా వీరికి అరకొరగా ఇన్సులిన్ ఇస్తున్నారు. కేవలం కర్నూలు, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో మాత్రమే అధికారులు స్థానికంగా కొనుగోలు చేసి ఇన్సులిన్‌ను కొద్దిమొత్తంలో అందజేస్తున్నారు. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో చాలా మంది మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో చిన్నారికి వ్యాధి తీవ్రతను బట్టి నెలకు రెండు నుంచి నాలుగు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. పెరుగుతున్న చికిత్స వ్యయం మెడికల్‌షాపుల్లో ఒక్కో ఇన్సులిన్ ఖరీదు రూ.180 వరకు ఉంటోంది. ఈ మేరకు ప్రతి చిన్నారికి నెలకు రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల వద్ద చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆధునిక వైద్యవిధానాల మేరకు వారికి నొప్పి తక్కువగా ఉండే ఇన్సులిన్ పెన్నుల ద్వారా ఇంజెక్షన్ చేస్తున్నారు. వీటి ఖరీదు సాధారణ ఇన్సులిన్‌తో పోలిస్తే రెట్టింపుగా ఉంటుంది. లక్షణాలు టైప్–1 డయాబెటిస్ లక్షణాలు బయటపడటానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. విపరీతమైన దాహం, తిన్న తర్వాత కూడా బాగా ఆకలివేయడం, నోరు తడి ఆరిపోవడం. కడుపునొప్పి, వాంతులు, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం. ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం, అలసట, కంటిచూపు తగ్గిపోవడం. శ్వాస తీసుకోవడానికి ఎక్కువ కష్టపడటం, తరచుగా చర్మ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు. మూడ్ మారిపోవడం, నిద్రలో మూత్రవిసర్జన చేయడం. చిన్నారుల్లో ‘తియ్యని’ బాధ పుట్టుకతోనే తోడవుతున్న షుగర్ వ్యాధి కోవిడ్ తర్వాత పెరిగిన టైప్–1 రోగులు వంశపారంపర్యం, పలు రకాల ఇన్ఫెక్షన్లు కారణం ఇన్సులిన్ తీసుకోవడం తప్పనిసరి పెరిగిన చికిత్స వ్యయంతో సతమతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50లక్షల వరకు జనాభా ఉంటుంది. ఇందులో 15 నుంచి 20 శాతం వరకు మధుమేహ బాధితులు. వీరిలో టైప్–2 మధుమేహ బాధితులు 90 శాతం కాగా.. టైప్–1 బాధితులు 10 శాతం పైనే. ఈ లెక్కన 7.50లక్షల నుంచి 10లక్షల వరకు మధుమేహ బాధితులు ఉండగా.. 75వేల నుంచి లక్ష దాకా చిన్నారులు ఉంటున్నారు. -
ఎస్టేటు అధికారుల బదిలీ
కర్నూలు(అగ్రికల్చర్): రైతుబజార్ల ఎస్టేటు అధికారుల బదిలీలు జరిగాయి. కీలకమైన సి.క్యాంపు రైతుబజారు ఎస్టేటు అధికారిగా కళ్యాణి నియమితులయ్యారు. అమీన్ అబ్బాస్‌నగర్ రైతుబజారు ఎస్టేటు అధికారిగా పనిచేస్తున్న కళ్యాణిని సి.క్యాంపునకు బదిలీ చేస్తూ రాష్ట్ర రైతుబజార్ల సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సి.క్యాంపులో పనిచేస్తున్న హరీష్‌కుమార్ ఆదోని రైతుబజారుకు బదిలీ అయ్యారు. కొత్తపేట రైతుబజారు ఎస్టేటు అధికారిగా పనిచేస్తున్న జయమ్మను అమీన్ అబ్బాస్‌నగర్ రైతుబజారుకు బదిలీ చేశారు. ఆదోని రైతుబజారులో ఎస్టేటు అధికారిగా పని చేస్తున్న అక్తర్షరీఫ్ను కొత్తపేట రైతుబజారుకు బదిలీ చేశారు. సి.క్యాంపు రైతు బజారులో నిజమైన రైతులకు స్థానం కల్పిస్తామని ఎస్టేటు అధికారి కళ్యాణి వెల్లడించారు. శ్రీగిరి భద్రతపై సమీక్ష శ్రీశైలంటెంపుల్: ‘సాక్షి’ దిన పత్రికలో శనివారం ‘భగవంతుడా.. ఇదేమి భద్రతా’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు స్పందించారు. దేవస్థాన భద్రతా విషయాలపై సమగ్ర పరిశీలన చేయాలని దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహారెడ్డిని ఈఓ ఆదేశించారు. ఈ మేరకు ఆయన క్యూలైన్ల వద్దకు చేరుకుని, క్యూలైన్ ఏఈఓ, పర్యవేక్షకులు, భద్రతా పరికరాల పర్యవేక్షణ చేపట్టే ఇంజినీర్లు, సెక్యూరిటీ సూపర్ వైజర్లతో సమీక్షించారు. మెటల్ డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లు కొన్ని పనిచేయడం లేదని, హ్యాండ్ డిటెక్టర్లు ఉన్నా వినియోగించేందుకు సిబ్బంది తక్కువ ఉన్నారని గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లు మరింత మెరుగుపరుస్తామన్నారు. లగేజ్ స్కానర్లు సైతం వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సోమవారం ఈఓ స్వయంగా క్షేత్ర భద్రతపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లోపాలను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటారన్నారు. -
ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో ఆది, సోమవారాల్లో జరగనున్న ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జేసీ డాక్టర్ బి.నవ్య అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆమె ఎఫ్ఆర్ఓ, ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అభ్యర్థులు హాల్ టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్నాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుందన్నారు. గంట మందుగానే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, జిల్లా వైద్య అధికారి శాంతికళ, ఏపీపీఎస్సీ అధికారివెంకట్రావు, ఆర్వీ రమణ పాల్గొన్నారు. జేసీ డాక్టర్ బి.నవ్య -
నిర్లక్ష్యానికి మందేది?
● విధి నిర్వహణలో అధికారి వేళాకోలం గోస్పాడు: నంద్యాల జిల్లా ఔషధ నియంత్రణ అధికారి బాబా ఖలందర్ విధులకు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియక ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. తనిఖీలు, ఉన్నతాధికారుల సమావేశాలు.. అంటూ విధుల్లో సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కార్యాలయానికి తరచూ మెడికల్ షాపుల నిర్వాహకులు వారి అవసరాల నిమిత్తం వస్తుంటారు. అయితే కార్యాలయంలో సిబ్బంది అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే విధుల్లో కనిపిస్తారు. రిలీవింగ్ సర్టిఫికెట్ కోసం, ఇప్పటికే ఉన్న మెడికల్ షాపులను ఒకచోటి నుంచి మరొక చోటకు మార్పు కోసం, కొత్తగా షాపు పర్మిషన్ కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని అక్కడికి వచ్చే వారు ఆవేదన చెందుతున్నారు. కింది స్థాయి సిబ్బందిని అడిగితే పనుల నిమిత్తం పెద్దసారు బయటకు వెళ్లారని, సార్ ఎప్పు డు వస్తారు తెలియదని చెబుతుండటం గమనార్హం. జిల్లా కేంద్రంలో ఓ అధికారి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఇది కల్తీ ప్రపంచం
● నాణ్యతా లోపాలపై అవగాహన తప్పనిసరి ● బిల్లు తీసుకుంటేనే రక్షణ ● నేరుగా లేదా ఆన్లైన్లో ఫిర్యాదుకు అవకాశం ● రూ.5లక్షల్లోపు కేసులకు ఫీజు లేకుండానే న్యాయం ఆహార కల్తీపై కేసులు సంవత్సరం : 2024-25సేకరించిన శాంపిల్స్ : 510కల్తీ నిర్ధారణ : 38 కేసులు : 9జరిమానా : రూ.2.10లక్షలుఅవగాహన కల్పించేందుకు చర్యలు -
నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం
కర్నూలు: నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యమని కర్నూలు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు అన్నారు. జిల్లాలో 110 నాటుసారా ప్రభావిత గ్రామాలు ఉండగా.. ఆయా గ్రామాల్లో నాటుసారా నిర్మూలనలో ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఎకై ్సజ్ శాఖ ప్రచార రథాన్ని ప్రారంభించింది. స్థానిక కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సుధీర్ బాబు ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. సారా వినియోగం వల్ల కలిగే అనర్థాలు, మానుకుంటే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రచార రథాన్ని ప్రారంభించినట్లు సుధీర్ బాబు తెలిపారు. కర్నూలు పట్టణంలోని సారా ప్రభావిత ప్రాంతాలైన బంగారుపేట, బుధవారపేటలో సాయంత్రం ప్రచార రథం కలియతిరిగింది. కార్యక్రమంలో ఏఈఎస్‌లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, సీఐలు చంద్రహాస్, జయరాం నాయుడు, రాజేంద్రప్రసాద్, ఎస్ఐ దుర్గానవీన్ బాబు, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. ● ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు -
అండగా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్
వస్తు సేవల్లో నాణ్యత లోపించినా.. కల్తీ ఆహార పదార్థాలను విక్రయించినా.. బీమా, బ్యాంకులు మోసానికి పాల్పడినా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అండగా ఉంటుంది. జిల్లా స్థాయిలో రూ.5 లక్షల వరకు మోసాలకు ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించకుండానే వినియోగదారుడు తగిన పరిహారం పొందవచ్చు. న్యాయవాది అవసరం లేకుండానే పోరాటం చేయవచ్చు. రూ.5 లక్షల పైన వివాదాలకు కోర్టు ఫీజులతో పాటు న్యాయవాదులను నియమించుకునే అవకాశం ఉంది. జిల్లా కమిషన్ గత మూడ్లేలో 635 కేసులను పరిష్కరించగా.. రూ.15 కోట్లను పరిహారంగా వినియోగదారులకు అందించింది. ప్రస్తుతం 119 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నిర్భయంగా ఫిర్యాదు చేయాలి వినియోగదారుల హక్కులు కాపాడడం మా ప్రథమ కర్తవ్యం. మోసపోయిన వారు కమిషన్‌ను ఆశ్రయిస్తే తగిన న్యాయం చేస్తాం. రూ.5 లక్షల వరకు ఎలాంటి ఫీజు ఉండదు. ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు తీసుకుంటాం. మార్టులు, మాల్స్‌లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేస్తే పరిష్కారానికి కమిషన్ సిద్ధంగా ఉంటుంది. – కరణం కిశోర్, చైర్మన్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
కర్నూలు: నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కల్లూరు మండలం దేవేంద్ర నగర్లో నివాసముంటున్న అనురాధ, సుదర్శన్ యాదవ్ దంపతులకు ఇద్దరు కూతుర్లు, కొడుకు సంతానం. చిన్నకూతురు సుప్రియ (19) కర్నూలుకు చెందిన కరీంను ప్రేమించింది. ఈ విషయం తెలిసి ఆమె తండ్రి మదనపడుతుండేవాడు. చివరకు పెళ్లికి అంగీకరించినప్పటికీ తన ప్రేమ విషయంలో తండ్రి మదన పడుతున్న విషయాన్ని గ్రహించి సుప్రియ తీవ్ర మనస్తాంతో ఈనెల 8వ తేదీన పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందింది. ఈ మేరకు మృతురాలి తల్లి అనురాధ నాల్గవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహానందిలో వైభవంగా పదహారు రోజుల పండుగ
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం మహానందిలో గురువారం పదహారు రోజుల పండుగను వైభవంగా నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, దేవికల ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, హనుమంతుశర్మ, శాంతారాంభట్, అర్చకులు జనార్ధన్, మహేశ్వరయ్య ముందుగా యాగశాలలో అంకురాలకు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల తొలిరోజు పుట్టమన్ను తెచ్చి పాలల్లో తడిపిన నవ ధాన్యాలతో చేసిన అంకురార్పణలో వచ్చిన మొలకలను రుద్రగుండం కోనేరులో శాసీ్త్రయంగా కలిపారు. ఈ ఏడాది మొలకలు బాగా వచ్చాయని, పంటలు బాగా పండుతాయని పండితులు చెప్పా రు. అనంతరం రథం వద్దకు చేరుకుని రథాంగ దేవతలను పూజించి వారిని స్వస్థానాలకు పంపి రథాన్ని రథమండపంలోకి చేర్చారు. దీంతో శ్రీ కామేశ్వరీదేవి, మహానందీశ్వరుల కళ్యాణ, బ్రహ్మోత్సవ దీక్ష ముగిసిందని వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. మహానంది, నంద్యాల ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్య మహిళలు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వారి దంపతులకు వడిబియ్యం(చీర,సారె) సమర్పించి పూజలు చేశారు. -
ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సర ప్రధాన పరీక్షలు ముగిశాయి. గురువారం జరిగిన పరీక్షలకు 23,114 మంది విద్యార్థులకుగాను 22,479 మంది హాజరుకాగా.. 635 మంది గైర్హాజరు అయ్యారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు చివరి దశకు చేరుకోవడంతో బోర్డు అధికారులు మూల్యాంకనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం మొదలు కానుంది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం కర్నూలు: రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపట్టారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా వెంటనే డయల్ 100 , 112కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని తెలిపారు. రోడ్డు భద్రత నిబంధన ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో భద్రతా భావం పెంపొందిస్తున్నామని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై నిరంతరం డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. సామరస్యంతో హోలీ జరుపుకోవాలి కర్నూలు: మతసామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పండుగ వేడుకల్లో ఎదుటి వారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దని సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. మద్దతు ధరతో శనగల కొనుగోలు కర్నూలు(సెంట్రల్): మద్దతు ధరతో శనగల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు జేసీ డాక్టర్ బి.నవ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. క్వింటా శనగకు మద్దతు ధర రూ.5,650గా నిర్ణయించామన్నారు. జిల్లాలో 29వేల మంది రైతులు 1,04,43.25 ఎకరాల్లో శనగ సాగు చేసినట్లు పేర్కొన్నారు. లా సెమిస్టర్ ఫలితాల విడుదల కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో లా సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం సీఈ వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. థర్డ్, ఫిఫ్త్ ఇయర్స్ 2, 4, 6, 8, 10 సెమిస్టర్ల ఫలితాల కోసం https://rayalaseemauniversity.ac.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు. హంద్రీ–నీవాకు నిలిచిపోయిన నీరు దేవనకొండ: హంద్రీ– నీవా కాలువకు అధికారులు నీటిని అర్ధాంతరంగా ఆపేశారు. మార్చి 15 వరకు నీటిని వదులుతారని అధికారులు ప్రకటించినా మార్చి 12వ తేదీనే నిలిపివేశారు. దీంతో పంట తుది దశకు చేరుకున్న రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. దేవనకొండ మండలంలో హంద్రీ–నీవా కాలువ కింద రబీలో 8 వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు. మొత్తం 3 వేల ఎకరాల్లో పంటలు చివరి దశకు చేరుకోనున్నాయి. ఇంతలోనే కాలువకు నీరు బంద్ కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. -
చెమటలు పట్టిస్తున్న ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మార్చి మొదటి పక్షంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. గురువారం కర్నూలులో 40.1 డిగ్రీలు, నంద్యాలలో 40.2 డిగ్రీలు నమోదు కావడం వేసవి తీవ్రతను స్పష్టం చేస్తోంది. 2024లో ఫిబ్రవరి చివరి నాటికే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎండలు, వడగాలుల నుంచి ఊరట కల్పించేందుకు కర్నూలులోని ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటయ్యాయి. చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు నిర్వహించారు. ఈ సారి గత ఏడాది కంటే ముందుగానే ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కర్నూలులో 40.1, నంద్యాలలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు -
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
పాణ్యం: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. గురువారం పాణ్యం సీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ల నైట్ డ్యూటీ రోస్టర్ పట్టికను తనిఖీ చేశారు. ప్రతి నెలకు ఎన్ని కాన్పులు చేస్తున్నారని వైద్యులను ప్రశ్నించి సిజేరియన్ కాన్పులు అధికంగా జరుగుతుండడంతో కారణాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో నలుగురు డాక్టర్లు ఉండగా అనస్తీయా డాక్టర్ మునిస్వామి మాత్రమే విధుల్లో ఉండగా మిగిలిన వారు ఎక్కడని ప్రశ్నించగా, ఒకరు నైట్ డ్యూటీ, మరొకరు ట్రైనింగ్ వెళ్లారని బదులిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అనంతరం పాణ్యం ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఎస్ఎం భవనం కోసం ఎకరా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాగులు ఎకరాల భూమికి సంబంధించి ప్రతిపానదలు త్వరగా పంపాలని తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. చెంచుకాలనీలో గృహనిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్ రాజకుమారి -
పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు
శిరివెళ్ల: యర్రగుంట్ల 2వ గ్రామ సచివాలయ గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శి సురేష్‌బాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్న పీరయ్య గురువారం తెలిపారు. గతంలో కార్యదర్శి సామాజిక పింఛన పంపిణీ అనంతరం మిగిలిన రూ. 8.48 లక్షలను తిరిగి ఏంపీడీఓ కార్యాలయానికి అప్పగించలేదు. పింఛన్ల డబ్బులు చెల్లించక పోవడంపై ఎంపీడీఓ శివమల్లేశ్వరప్ప ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇద్దరు నిందితులకు జైలు శిక్ష నంద్యాల (వ్యవసాయం): హత్యాయత్నం, దాడి కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి గురువారం తీర్పునిచ్చారు. పాణ్యం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల గ్రామానికి చెందిన సందొలి అంజి, మాదిగ హరినాథ్‌లో ఒకరు పాణ్యం మండలం తమ్మరాజుపల్లికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో మహిళ అత్త శివమ్మ గుర్తించి హెచ్చరించింది. అయితే నిందితులిద్దరూ 2017 ఏప్రిల్‌లో శివమ్మపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో నిందితులకు ఒక్కొక్కరికి ఏడేళ్లు జైలు శిక్ష, రూ.11 వేలు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. కారు బోల్తా చాగలమర్రి: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై నగళ్లపాడు గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి వాగులో బోల్తా పడింది. బనగానపల్లెకు చెందిన నలుగురు వ్యక్తులు తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నగళ్లపాడు వద్ద కారు అదుపు తప్పి భవనాసి వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రాజారెడ్డి, హర్షకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయ పడ్డారు. క్షతగాత్రులను టోల్ ప్లాజా సిబ్బంది ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చాగలమర్రి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. 8 నెలలుగా గైర్హాజరు ● ఉపాధ్యాయుడికి నోటీసులు జారీ చేసిన ఎంఈఓలు హొళగుంద: హొన్నూరు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శివశంకర్‌రెడ్డి ఎనిమిది నెలలుగా విధులకు హాజరు కావడం లేదు. ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలకు డీఈఓ దృష్టికి తీసుకెళ్లి నోటీసులు జారీ చేసినట్లు ఎంఈఓ–1, 2 సత్యనారాయణ, జగన్నాధం గురువారం విలేకరులకు తెలిపారు. కడపకు చెందిన శివశంకర్‌రెడ్డి 2023లో విధుల్లో చేరారని, 2024 జూలై 5వ తేదీ నుంచి గైర్హాజరవుతున్నారన్నారు. షోకాజ్ నోటీసులు, మెమోలు పోస్ట్ ద్వారా ఆయన ఇంటికి పంపినా ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. విద్యాశాఖాధికారులకు నివేదిక చేయని పక్షంలో ప్రభుత్వ నియామవళి ప్రకారంగా శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఎంఈఓలు చెప్పారు. -
రాష్ట్రంలోని టీడీపీ నేతలు కపట రాజకీయాలు చేస్తున్నారు. ఇందుకు టమాట ప్రాసెసింగ్ యూనిట్‌ను వాడుకుంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనే ఈ పరిశ్రమకు ఊపిరి వచ్చింది. పనులు కూడా చకచకా సాగుతున్నాయి. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి అంతా మారిపోయింది. అ‘ధనం’
మార్కెట్లో ధర లేక నిల్వ ఉన్న టమాట (ఫైల్)● దురుద్దేశంతో దూదెకొండకు టమాట ప్రాసెసింగ్ యూనిట్ మార్పు ● మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరు రాకుండా ఉండాలన్నదే ఉద్దేశం ● వైఎస్సార్సీపీ హయాంలోనే టమాట ప్రాసెసింగ్ యూనిట్‌కు శ్రీకారం ● రూ.15 లక్షలు ఖర్చు చేసి పిల్లర్లు కూడా ఏర్పాటు ● ప్రభుత్వం మారడంతో ముడుపుల కోసం టీడీపీ నేతల ఒత్తిళ్లు ● తట్టుకోలేక పారిపోయిన కాంట్రాక్టర్ టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ హయాంలోనే పనులు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతలు ముడుపుల కోసం కాంట్రాక్టర్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో ఉక్కిరిబిక్కిరైన కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. దీంతో పిల్లర్లకు కట్టిన కడ్డీలు కట్ చేసుకోవడంతో పాటు సిమెంటు ఇతర మెటీరియల్ మొత్తం తరలించుకుపోయారు. హోసూరులో కేటాయించిన భూమిపై లేని వివాదాన్ని టీడీపీ నేతలు సృష్టించారు. అక్కడే ప్రాసెసింగ్ యూనిట్ పెడితే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందనే ఉద్దేశంతో స్థలాన్ని దూదెకొండ ప్రాంతానికి మార్పు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరుగున పడిపోయాయి. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఉల్లి, టమాట సోలార్ డ్రైయర్లు నిర్వహించే పొదుపు మహిళలను నిర్లక్ష్యం చేశారు. దీంతో వారు అప్పుల ఊబిలో కూరకుపోయారు. చివరికి సోలార్ డ్రైయర్లను సరఫరా చేసిన ఎస్4ఎస్ సంస్థ వాటిని వెనక్కి తీసుకెళ్లింది. ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటును పట్టించుకోని కూటమి ప్రభుత్వం నేడు టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు భూమి పూజ అంటూ హడావుడి చేస్తోంది. పత్తికొండ మండలం దూదేకొండ గ్రామంలోని సర్వే నెంబర్ 63/3లోని 2.50 ఎకరాల్లో టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఈ నెల 5న జీవో జారీ అయ్యింది. ఈ నెల 14న భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్లు, విభజన తర్వాత ఏర్పాటైన రాష్ట్రానికి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అ 14 ఏళ్లలో ఏ నాడు కూడా జిల్లాలో టమాట ప్రాసెసెంగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయలేదు. రైతుల కష్టాలు, కన్నీళ్ల గురించి పట్టించుకోలేదు. పత్తికొండ ప్రాంతంలో టమాట జ్యూస్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మాటను సైతం చంద్రబాబు మరచిపోయారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పత్తికొండలో టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పరిశ్రమ పూర్తయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందనే భయంతో ప్లేటు మార్చారు. హడావుడిగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు జీవో ఇచ్చారు. కర్నూలు ఎమ్మెల్యే, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ చేయనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పట్టించుకోని కూటమి ప్రభుత్వం హడావుడిగా భూమి పూజ కార్యక్రమం చేపట్టడంపై రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనులు ఇలా.. టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు ప్రక్రియ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే మొదలైంది. అప్పట్లో పత్తికొండ సమీపంలోని హోసూరు గ్రామం సర్వే నంబరు 286/1ఏ3, 286/1ఏ4, 286/1ఏ5ల్లోని 3.60 ఎకరాల భూమిని కేటాయించారు. రూ.12.05 కోట్ల నిధులతో బిల్డింగ్ నిర్మాణంతోపాటు మిషనరీలు ఏర్పాటు చేసే విధంగా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిర్మాణపు పనులు కూడా మొదలై చురుగ్గా జరిగే స్థాయికి వచ్చాయి. దాదాపు రూ.15 లక్షలు ఖర్చు చేసి పిల్లర్స్ కూడా వేశారు. అయితే గత ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతోనే సమీకృత టమాట ప్రాసెసింగ్ యూనిట్ గ్రహణం పట్టినట్లు అయింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల దుస్థితి ఇదీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి, టమాట రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున సోలార్ డ్రైయర్లు ఏర్పాటయ్యాయి. మహిళలు వాటిని సద్వినియోగం చేసుకొని రాణించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పట్టించుకునే దిక్కులేక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. అప్పట్లో కల్లూరు, గూడూరు, గోనెగండ్ల తదితర మండలాల్లో 322 సోలార్ డ్రైయర్ల యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇవి 2024 మే నెల వరకు ఇవి పనిచేశాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రోత్సాహం లేక మూలనపడ్డాయి. సోలార్ డ్రైయర్లను ఎస్4ఎస్ సంస్థ వెనక్కి తీసుకెళ్లింది. రైతులు నమ్మరు రాష్ట్ర ప్రభుత్వం టమాట రైతులను ఎప్పుడూ పట్టించుకోలేదు. మార్కెట్లో టమాట ధర పడిపోయినప్పుడు కనీసం స్పందించలేదు. పొలాల్లోనే పంటలను వదిలేస్తున్నా అధికారులను పంపించలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన టమాట ప్రాసెసింగ్ యూనిట్‌కు ఆపేసి ఇప్పుడు హంగామా చేస్తున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులను రైతులు ఎవరూ నమ్మరు. వారు చెప్పే మాటలన్నీ బూటకమే అని అర్థమవుతోంది. – టి. శ్రీనివాసులు, హోసూరు, పత్తికొండ మండలం టమాట రైతుల దుస్థితి ఇదీ..రబీ సీజన్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,700 ఎకరాల్లో టమాట పంట సాగైంది. కర్నూలు జిల్లాలో 1,250, నంద్యాల జిల్లాలో 450 ఎకరాల్లో టమాట పంట సాగు చేశారు. మార్కెట్లో క్వింటాకు కనిష్టంగా రూ.100 వరకు, గరిష్టంగా రూ.600 వరకు ధర లభించింది. కిలో రూ.4 నుంచి రూ.5 పలుకుతుండడంతో విధిలేని పరిస్థితిలో కర్నూలు మండలం పడిదెంపాడు, ఈ.తాండ్రపాడు, నందనపల్లె, పూడూరు, శివరామాపురం గ్రామాల్లో టమాట పంటను పశువులకు మేతగా వదిలేశారు. కృష్ణగిరి పెనుమాడ సమీపంలో పొలాలను ఇలాగే వదిలేశారు. పెట్టుబడి రాక నష్టం పోయినా ప్రభుత్వం సాయం కూడా అందించలేదని రైతులు ఆరోపించారు. ప్రస్తుత కుట్ర ఇదీ.. అంతా హడావుడి -
రూ.210 కోట్లతో ‘పందికోన’ పనులు
● అధికారులు ప్రతిపాదనలు పంపాలి ● జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు (సెంట్రల్): పందికోన రిజర్వాయర్‌లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు రూ.210 కోట్లతో ప్రతిపాదనలను త్వరితగతిన ప్రభుత్వానికి పంపించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. ఈ నిధులతో పనులు చేపడితే ఆయకట్టు విస్తీర్ణాన్ని పెంచవచ్చని తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల పరిస్థితిపై జలవనరుల శాఖ అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సుంకేసుల జలాశయం, గాజులదిన్నె ప్రాజెక్టు, పందికోన రిజర్వాయర్, కృష్ణగిరి రిజర్వాయర్, హంద్రీనీవా విస్తరణ పనులు, పులికనుమ రిజర్వాయర్, 68 ట్యాంకులు నింపడం, గుండ్రేవుల రిజర్వాయర్ గురించి కలెక్టర్ జలవనరుల శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. హంద్రీ–నీవా విస్తరణ పనులను జూన్ లోపు పూర్తి చేయాలన్నారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా 68 ట్యాంకులను నీరు నింపాల్సి ఉండగా ఇప్పటివరకు 33 చెరువులకు నింపారని, మిగిలిన ట్యాంకులను కూడా త్వరితగతిన నింపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలు, అవసరమైన నిధుల వివరాలు అందజేయాలని జలవనరుల శాఖ ఏసీని ఆదేశించారు. డబ్బులిస్తేనే తుంగభద్ర దిగువ కాలువ చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు ఇస్తామని పత్రికల్లో వచ్చిన వార్తలపై కలెక్టర్ వివరణ అడిగారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జలవనరుల శాఖ ఎస్ఈ ద్వారకానాథ్ రెడ్డి, హంద్రీనీవా ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈలు, డీఈలు శైలేష్, రామకృష్ణ, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే దళితుడని.. ఎంపీ మహిళని!
● ప్రజాప్రతినిధులను కాదని టీడీపీ నాయకుడితో ప్రారంభోత్సవాలు ● ప్రొటోకాల్ ఉల్లంఘించిన టీడీపీ నంద్యాల పార్లమెంటరీ ఇన్చార్జి నందికొట్కూరు: పట్టణంలో ప్రొటోకాల్ పాటించకుండా టీడీపీ నంద్యాల పార్లమెంటరీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి గురువారం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు రూ.7 లక్షలతో విద్యుత్ ట్రాన్ఫార్మర్ నిర్మించారు. అక్కడే ముఖద్వారం కూడా నిర్మించారు. ఆ రెండింటినీ శివానందరెడ్డి ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే గిత్తా జయసూర్య దళితుడు కావడం, ఎంపీ బైరెడ్డి శబరి మహిళా కావడం, మున్సిపల్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి ఎంపీ వర్గానికి చెందిన వారు కావడంతో అంతా తానై శివానందరెడ్డి ప్రారంభోత్సవాలు చేయడం గమనార్హం. విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ చైర్మన్ పట్ల ఏమాత్రం గౌరవం ఉందో ఈ ఘటన అద్దం పడుతోందని స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. -
ఎమ్మెల్యే చెప్పారని రూ.కోటి స్థలం ధారాదత్తం
డోన్: ప్రజోపకరమైన ప్రభుత్వ స్థలాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ధారాదత్తం చేస్తున్నారు. డోన్ మున్సిపల్ పరిధిలోని కేవీఎస్ పార్కు ఆవరణలో ఐదు సెంట్ల స్థలాన్ని గత ఏడాది పిరమిడ్ ధ్యానకేంద్రం నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు కౌన్సిల్ తీర్మానం చేసింది. అయితే ఆ స్థలాన్ని కాదని కొత్తపేటలోని అన్న క్యాంటీన్‌తో పాటు ఓవర్‌హెడ్ ట్యాంకు ఉన్న సర్వే నంబర్ 281లో పిరమిడ్ ధ్యానకేంద్రం నిర్వాహకులు వారంరోజుల క్రితం ధ్యానకేంద్రం నిర్మాణానికి ఏకంగా భూమిపూజ చేశారు. దీంతో మున్సిపల్ చైర్మన్‌తో పాటు కౌన్సిల్ సభ్యులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. కేవలం ఎమ్మెల్యే మౌఖికంగా చెప్పారని కమిషనర్ ఏకపక్ష నిర్ణయంతో ప్రజోపకరమైన స్థలాలను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు కట్టబెట్టడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎవరికి వారు కౌన్సిల్ ఆమోదం లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కోటి రూపాయల విలువైన స్థలాన్ని ప్రైవేటు సంస్థకు ఽఅప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ధార్మిక సంస్థకు పట్టణంలో ఏ మూలకై నా స్థలం కొనుగోలు చేసే శక్తి ఉండగా.. ప్రజలకు ఉపయోగపడే స్థలాన్ని ఉచితంగా కేటాయించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతోంది. ఎమ్మెల్యే చెబితే నిర్మించుకోమన్నాం 281 సర్వే నంబర్లోని అన్న క్యాంటీన్ వద్ద పిరమిడ్ ధ్యానకేంద్రాన్ని అనధికారికంగా నిర్మించుకోమన్నాం. గత కౌన్సిల్లో పిరమిడ్ ధ్యాన కేంద్రానికి కేవీఎస్ పార్కులో స్థలం కేటాయించిన విషయం నాకు తెలియదు. స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకే నిర్ణయం తీసుకున్నాం. – ప్రసాద్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్, డోన్పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్మాణానికి కేటాయింపు గతంలో కేవీఎస్ పార్కులో స్థలం కేటాయింపునకు కౌన్సిల్ ఆమోదం ప్రస్తుతం అన్న క్యాంటీన్ వద్ద అనుమతులు ప్రజోపకరమైన స్థలాలను ప్రైవేటు సంస్థలకు కేటాయించడం పట్ల ప్రజల ఆగ్రహం -
బీసీ రుణాలపై ‘పచ్చ’ గద్దలు
‘‘ ఎంపీడీఓ గారు ... బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి నేను ఒక లిస్ట్ పంపుతున్నాను. మిగిలిన వాటన్నింటిని పక్కన పెట్టి ఈ లిస్ట్‌లో ఉన్న వాళ్లకి బీసీ కార్పొరేషన్ లోన్లు వచ్చేలా చూడు ! అవసరమైతే బ్యాంకర్లతో కూడా మాట్లాడు.. ఎలాగైనా మనవాళ్లకు రుణాలు అందే తీరాలి’’ అంటూ ఎంపీడీఓలను జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ఆదేశిస్తున్నారు.● తాము పంపిన జాబితాలనే ఓకే చేయాలని హుకుం ● ఎంపీడీఓలను ఆదేశిస్తున్న ఎమ్మెల్యేలు ● టీడీపీ నేతల సిఫారసుతో అర్హులకు మొండిచెయ్యి ● జనరిక్ షాపులకు భలే డిమాండ్ ● జనాభాలో సింహభాగం ఉన్నా 4,201 యూనిట్లే! కర్నూలు (అర్బన్): బీసీ కార్పొరేషన్ రుణాలను తన్నుకుపోయేందుకు ‘పచ్చ’ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాము సిఫారసు చేసిన వారిని కాదని, ఏ ఒక్కరికీ రుణం మంజూరైనా పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం అందజేయనున్న సబ్సిడీ రుణాలపై టీడీపీ నేతల కన్ను పడింది. తమ వారికే అందించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. పేదలకు పారదర్శకంగా సబ్సిడీ రుణాలు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వేలాది మంది నిరుద్యోగులు ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ... ఆయా మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో జరిగిన ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇంతలో అందరి ఎంపీడీఓలకు ఎమ్మెల్యే కార్యాలయాల నుంచి లబ్ధిదారుల ఎంపిక జాబితాలను తామే పంపిస్తామని, మీరు ఎలాంటి ఎంపిక జాబితా తయారు చేయవద్దని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో రాజకీయ సిఫారసు లేకుంటే అర్హత ఉన్నా, రుణం అందని పరిస్థితి నెలకొనింది. సిఫారసు ముందు పారదర్శకత అనే పదం మంటగలిసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధినేత బాటలోనే తమ్ముళ్ల ప్రయాణం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే టీడీపీ నాయకులు కూడా ప్రయాణిస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే వైఎస్సార్సీపీకి చెందిన వారికి ఏ పనులు చేయకండని చెప్పడంతో దాన్ని స్థానిక ఎమ్మెల్యేలు ‘ తుచ ’తప్పకుండా పాటిస్తున్నారు. రుణాల విషయంలో కూటమిలోనూ అధిక శాతం పోటీ నెలకొనడంతో జనసేన, బీజేపీ నేతలను పక్కనపెట్టి లబ్ధిదారుల ఎంపికలో టీడీపీ విధేయులకే పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ, ఈబీసీ, కాపు రుణాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం చోటు చేసుకోవడంతో అర్హులకు రుణాలు అందని పరిస్థితి నెలకొనింది. జనరిక్ షాపులకు భలే డిమాండ్ జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు సంబంధించి 50 శాతం సబ్సిడీ ఉండడంతో చోటా నేతల దృష్టి అంతా ఈ రుణాలపై పడింది. తమ ప్రాంతంలో బీఫార్మసీ, ఎంఫార్మసీ పూర్తి చేసిన వారి చిరునామాలను గుర్తించి ఎలాగైనా మీకు రుణాలు ఇప్పిస్తామని నమ్మబలుకుతూ కమీషన్లు గుంజుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 62 జనరిక్ మెడికల్ షాపులను మంజూరు చేసింది. ఒక్కో షాపు ఏర్పాటుకు రూ.8 లక్షలు అవసరం కాగా, ఇందులో 50 శాతం అంటే రూ.4 లక్షలను సబ్సిడీ ఉన్న నేపథ్యంలో టీడీపీ నేతల చూపు వీటిపై పడింది. అలాగే అన్ని పథకాల ఏర్పాటుకు గరిష్టంగా రూ.2 లక్షలు సబ్సిడీ ఉన్నందున రుణాలను ఎలాగైనా తమ వారికి ఇప్పించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. జనాభాలో సింహభాగం ఉన్నా ... ఉమ్మడి కర్నూలు జిల్లాలో సింహభాగం జనాభా బీసీ, ఈబీసీలు ఉన్నా, కేవలం 4201 యూనిట్లను మాత్రమే మంజూరు చేశారనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.77.19 కోట్ల రుణాలను అందించనున్నారు. ఇందులో కర్నూలు జిల్లాకు 1,673 మంది బీసీలకు, 171 మంది ఈబీసీలకు రూ.31.35 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,156 మంది బీసీలు, 171 మంది ఈబీసీలకు రూ.45.84 కోట్లను అందించనున్నారు. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా కర్నూలు జిల్లాలో 190 యూనిట్లకు రూ.6.40 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.6.35 కోట్లతో 189 యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వేచ్ఛ కోల్పోయిన అధికారులుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘నవరత్నాల ’ పేరుతో కులం, మతం, రాజకీయం చూడకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించిన అధికారులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో స్వేచ్చ లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఎంపీడీఓల పర్యవేక్షణలోనే లబ్దిదారుల ఎంపిక జరిగేది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకపోవడం వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి అప్పట్లో సంక్షేమ పథకాలు అందాయని, ప్రస్తుతం తమ చేతులు కట్టేసి పనులు చేయమంటున్నారని పలువురు ఎంపీడీఓలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హౌసింగ్ ఇంజినీర్లు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ అమెనిటీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రతి లబ్ధిదారుని ఇంటింటికి వెళ్లి అదనపు ఆర్థిక సహాయం గురించి తెలియజేయాలని ఆదేశించారు. సర్వే సిబ్బంది సంబంధిత లాగిన్‌లో వివరాలు పొందుపరిచి లబ్ధిదారులతో జియో టాగింగ్ చేసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద జిల్లాకు 21,711 గృహాలు మంజూరయ్యాయన్నారు. లబ్ధిదారులకు గతంలో ఒక యూనిట్‌కి రూ. 1.80 లక్షల రూపాయలు వచ్చేదన్నారు. వీటికి అదనంగా ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ. 75 వేలు, పీవీటీజీలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. జిల్లాలో గృహాలు నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీల లబ్ధిదారులకు రూ. 114.24 కోట్ల అదనపు సాయం అందుతుందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి 7,069 గృహాలు పూర్తిచేయాలని లక్ష్యంలో భాగంగా ప్రతి రోజు ప్రతి మండలంలో మూడు గృహాల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ మేర పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పీఎం జన్మన్ కింద ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, పాణ్యంలోని చెంచుగూడేలలో 527 గృహాలు నిర్మించాల్సి ఉందని అందుకు యూనిట్ విలువ 2.29 లక్షల రూపాయలకు అదనంగా మరో లక్ష రూపాయలు అదనపు సాయం అందుతుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ శ్రీహరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎండలో ఎక్కువగా తిరగొద్దు ● డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ కర్నూలు (హాస్పిటల్): వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎండల్లో ఎక్కువ తిరగరాదని డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రజలు ఉదయం 11 గంటల లోపు తమ పనులు ముగించుకుని నీడ గల ప్రదేశాల్లో ఉండాలని తెలిపారు. ఎండలో తప్పరిసరిగా తిరగాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలన్నారు. వెంట నీళ్ల బాటిల్ ఉంచుకుని గంటగంటకూ తాగుతూ ఉండాలని సూచించారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యసహాయం అందేలా చూడాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్ని సచివాలయాలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు తరచూ పరిశుభ్రమైన నీటిని తాగాలన్నారు. -
మూత్ర సమస్యలుంటే నిర్లక్ష్యం చేయొద్దు
చాలా మంది మూత్రసమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. కొన్నిసార్లు అవి సాధారణమే అయినా ఒక్కోసారి అది ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్య గా మారుతుంది. ముఖం ఉబ్బరం, మూత్రంపోయినప్పుడు చురుకు, మంట, ఎరుపు రంగు లో మూత్రం రావడం, మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, చిన్న వయస్సులోనే రక్తపోటు లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. –డాక్టర్ పీఎల్. వెంకట పక్కిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు నేడు వైద్యవిజ్ఞాన సదస్సు అంతర్జాతీయ కిడ్నీ దినో త్సవాన్ని పురస్కరించుకు ని నేడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఓల్డ్ క్లినికల్ లెక్చర్ గ్యాలరీలో వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించనున్నాము. లూపస్ నెఫ్రైటిస్ కరెంట్ ట్రీట్మెంట్ అండ్ వే ఫార్వర్డ్ అనే అంశంపై హైదరాబాద్‌కు చెందిన సీనియర్ నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎ. శశికిరన్ ప్రసంగిస్తారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ప్రారంభిస్తారు. –డాక్టర్ ఎస్. అనంత్, ఇన్చార్జ్ హెచ్ఓడీ, నెఫ్రాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు ● -
జీవనశైలితో కిడ్నీ కుదేల్!
● పెరుగుతున్న కిడ్నీ వ్యాధి బాధితులు ● 10 నుంచి 17 శాతానికి పెరిగిన రోగుల సంఖ్య ● బీపీ, షుగర్‌తోనే కిడ్నీకి ఇబ్బంది ● కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెలా 1300 మందికి డయాలసిస్ ● 30 ఏళ్ల లోపు బీపీ వస్తే కిడ్నీ సమస్యలు ఉన్నట్లు అనుమానం ● నేడు వరల్డ్ కిడ్నీ డే మానవశరీరంలో గుప్పెడంత పరిమాణంలో ఉండే కిడ్నీలు రక్తాన్ని వడపోసి, మలిన పదార్థాలను వేరుచేసి వాటిని మూత్రం ద్వారా విసర్జిస్తాయి. దేహంలో నీటి శాతాన్ని అవసరమైన పరిమాణంలో క్రమబద్ధంగా ఉంచి ఎక్కువైన నీటిని బయటకు పంపిస్తాయి. లవణ పరిమాణాన్ని, రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. ఇలా మనిషి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించే ఈ అవయవం పనితీరు మందగించి అది విఫలమవ్వడం ఆరంభమైతే దానిని పూర్తిగా నయం చేయడం కష్టం. అయితే, ప్రస్తుతం మారిన మనిషి జీవన శైలి ఆ పరిస్థితిని తీసుకొస్తుంది. అవగాహన లేమితో కిడ్నీ సంబంధ వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఈ నెల 13న వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ప్రత్యేకం కథనం. ఆరేళ్లలో కిడ్నీ రోగుల వివరాలు కర్నూలు(హాస్పిటల్): నిరంతరం పనిచేసే కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర నష్ట జరుగుతుంది. కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని నెఫ్రాలజి విభాగంలో ప్రతి వారం సోమ నుంచి శుక్రవారం వరకు ఓపీ చూస్తారు. ఇక్కడ గత జనవరి నెల 665 ఓపీ, 138 ఐపీ, ఫిబ్రవరిలో 450 ఓపీ, 137 ఐపీ రోగులు చేరి చికిత్స పొందారు. ఈ విభాగంలో సగటున ప్రతి నెలా 1300 మంది దాకా కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు నలుగురికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి విజయవంతం చేశారు. ఈ ఆసుపత్రితో పాటు నగరంలోని పలు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ(వైద్యసేవ) ద్వారా ఉచితంగా డయాలసిస్, పలు రకాల ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దల్లో కిడ్నీ వ్యాధులు చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధులు, ఇన్ఫెక్షన్ వల్ల మూత్రపిండాల వ్యాధులు కలుగుతాయి. పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధుల వల్ల పిల్లలు ఎదుగుదల లేకపోవడం, మూత్రం ఎక్కువగా, తక్కువగా పోవడం, కాళ్లు, చేతులు వంకర్లు పోవడం వంటివి జరుగుతాయి. ఇన్ఫెక్షన్తో వచ్చే వ్యాధుల వల్ల పిల్లలకు మూత్రం ఎరుపు రంగులో రావడం, కాళ్లవాపులు రావడం, ఒళ్లు దద్దుర్లు రావడం వంటివి జరుగుతాయి. పెద్దల్లో రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల ఇన్ఫెక్షన్ వల్ల సాధారణంగా మూత్రపిండాలు చెడిపోతాయి. ఈ వ్యాధులు ఉన్న వాళ్లు మూత్రపిండాల వైద్యుల పర్యవేక్షణలో ఉండటం మంచిది. కిడ్నీలు పాడయ్యేందుకు కారణాలు బీపీ, షుగర్, ఉబ్బు కామెర్లు, అధిక మొత్తంలో నొప్పుల మాత్రలు వాడటం, కిడ్నీల్లో రాళ్లు, జన్యుపరంగా పుట్టుకతో వచ్చే వ్యాధులు, మూత్రకోశ, మూత్రనాళ వ్యాధులు, వాంతులు, విరేచనాలు, పాముకాటు, మలేరియా, పచ్చకామెర్లు, లెప్టోస్పైరా, గర్భం సమయంలో మూత్రం ఇన్ఫెక్షన్, రక్తపోటు రావడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. సంవత్సరం ఓపీ ఐపీ రోగుల సంఖ్య రోగుల సంఖ్య 2019 9,034 1,830 2020 2,640 630 2021 1,546 1,010 2022 5,228 1,337 2023 5,575 1,493 2024 6,943 1,771కిడ్నీ జబ్బు లక్షణాలు నిస్సత్తువ, వాంతి వచ్చినట్లు ఉండటం, ఆకలి లేకపోవడం, దురద, ఒళ్లునొప్పులు, మూత్రం ఎక్కువగా పోవడం, అతి తక్కువగా పోవడం, రాత్రిపూట మూత్రం ఎక్కువగా పోవడం, శరీర వాపు, చిన్నపిల్లల్లో మూత్రం ఎర్రగా రావడం, ఒళ్లు దద్దుర్లు, చిన్నపిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, కాళ్లు వంకరలు పోవడం, అధిక రక్తపోటు. వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స మూత్రపిండాలకు వచ్చిన వ్యాధి లక్షణాలు, దాని తీవ్రతను బట్టి వైద్యులు రకరకాల చికిత్సలను చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని వ్యాధులు ఆహార నియమావళి పాటించి మందులు తీసుకుని తగ్గించుకోవచ్చు. కొన్ని వ్యాధుల్లో డయాలసిస్, కిడ్నీ మార్పిడి అవసరం రావచ్చు. –డాక్టర్ ఎం. శ్రీధరశర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు -
24 గంటల్లో భవన నిర్మాణాలకు అనుమతులు
● టౌన్ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ విజయభాస్కర్ కర్నూలు (టౌన్): పట్టణాల్లో భవనాల అనుమతులకు సంబంధించి 24 గంటల వ్యవధిలో అనుమతులు మంజూరు చేస్తున్నట్లు టౌన్ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ విజయభాస్కర్ అన్నారు. బుధవారం స్థానిక నగర పాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో జిల్లాలోని మున్సిపాల్టీల పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, లైసెన్సు ఇంజినీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు అనుమతుల్లో జాప్యాన్ని నిరోధిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. దీని ప్రకారం దరఖాస్తును పోర్టల్‌లో అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు పొంది పనులు ప్రారంభించవచ్చన్నారు. అక్యుపెన్సీ సర్టిఫికెట్ సైతం పొందవచ్చని చెప్పారు. అయితే, నిర్మాణానికి సర్వే రిపోర్టు, స్థలం విలువ ఆధారిత సర్టిఫికెట్ తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆకస్మిక తనిఖీల్లో అనుమతులను రద్దు చేస్తామన్నారు. టెక్నికల్ పర్సన్లు తప్పులు చేస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్‌కుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్ శోభన్ బాబు, డీటీసీపీ శశిలత, నంద్యాల అసిస్టెంట్ సిటీ ప్లానర్ మూర్తి, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ అధికారులు ఎల్టీపీలు పాల్గొన్నారు. -
క్రీడలపై కూటమి నేతల దుష్ప్రచారం సిగ్గుచేటు
నందికొట్కూరు: ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో ఒకరేమో రూ.300 కోట్ల స్కామ్ అంటారు, మరొకరేమో రూ.400 కోట్ల స్కామ్ అని నోటికొచ్చినట్లు మాట్లాడటం చూస్తే వాళ్ల ఆరోపణల్లో నిజం లేదనే విషయం తెలుస్తోందని రాష్ట్ర శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నంద్యాల జిల్లా నందికొట్కూరులో విలేకరులు అడిగిన ప్రశ్నలకు పైవిధంగా సమాధానమిచ్చారు. తెలుగు దేశం పార్టీ ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు నోటికి వచ్చినట్లు ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో స్కామ్ జరిగినట్లు దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. క్రీడల శాఖ మంత్రి ఆడుదాం ఆంధ్రకు బడ్జెట్లో రూ.119 కోట్లు కేటాయించినట్లు అసెంబ్లీలో చెబుతుంటే ఆరోపణలు చేసేవారికి వినిపించకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రమంతా చంద్రబాబు, భువనేశ్వరి కన్నీటితో ప్రచారం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి పది నెలలైనా మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదన్నారు. నాలుగేళ్ల వరకూ జగనన్న పాలనపై ఇదే విమర్శలు చేసుకుంటూ ఒక్కపథకం కూడా అమలు చేయకుండా కాలం గడపటమే చంద్రబాబు నైజమన్నారు. రైతు భరోసా, తల్లికి వందనం ఇవ్వాలని ప్రజలు అడుగుతుంటే ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించడం తగదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల సచివాలయాలకు రూ.38 కోట్లతో క్రీడా కిట్లను పంపిణీ చేశామని గుర్తు చేశారు. గత జగనన్న పాలనలో సచివాలయాలలో 1.30 లక్షల ఉద్యోగాలు ఇస్తే కూటమి నేతలకు కనిపించకపోవడం విడ్డూరమన్నారు. -
సాధారణ కాన్పులో బాలభీముడు జననం
కోడుమూరు రూరల్: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళకు సాధారణ కాన్పులో 4.25 కిలోల బరువు గల పండంటి మగ శిశువు మంగళవారం రాత్రి జన్మించాడు. కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన సులోచన ప్రసవ నొప్పులతో మంగళవారం స్థానిక ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఆరోగ్య పరీక్షలు చేసిన గైనకాలజిస్ట్ పుష్పలత సాధారణ కాన్పు చేశారు. సహజంగా అప్పుడే పుట్టిన పిల్లలు రెండున్నర కిలోల నుంచి మూడున్నర కిలోల బరువు ఉంటారని ఈ బిడ్డ 4.25 కిలోలు ఉండటం అది కూడా సాధారణ కాన్పులో జన్మించడం విశేషమని వైద్యాధికారి డా.నాగరాజు తెలిపారు. సులోచనకు ఇది నాలుగో కాన్పు. అన్ని కూడా నార్మల్ డెలివరీలు కావడం గమనార్హం. ముగ్గురు అమ్మాయిల తర్వాత కుమారుడు జన్మించడం పట్ల సులోచన, నారాయణ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఉల్లి రైతు కంట కన్నీరు!
మార్కెట్లో వ్యాపారుల ఇష్టారాజ్యం ● కొన్ని లాట్లకు ధర కోట్ చేయని వైనం ● నాణ్యత సాకుగా చూపి అన్యాయం ● విధిలేక ఎంతోకొంతకు అమ్ముకుంటున్న రైతులు మార్కెట్లో రైతులకు తీరని అన్యాయం ఎకరాకు రూ.30 వేల వరకు ఖర్చు పెట్టి ఉల్లి సాగు చేశాం. 60 ప్యాకెట్ల దిగుబడి వచ్చింది. ఎంతో వ్యయ ప్రయాసలతో కర్నూలు మార్కెట్‌కు తీసుకొచ్చి మంగళవారం టెండరుకు పెట్టాం. ఉల్లి నాణ్యత సంతృప్తికరంగానేనే ఉంది. కానీ వ్యాపారులు టెండరు వేయలేదు. అలాగని సరుకును వెనక్కు తీసుకుపోలేం. మార్కెట్లో రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఏదో ఒక ధరకు అమ్ముకుపోయే పరిస్థితి కల్పిస్తున్నారు. – సుంకులమ్మ, చిట్యాల గ్రామం, క్రిష్ణగిరి మండలం మూడు రోజులైనా కొనే దిక్కులేదు ఈ నెల 9న రాత్రి 100 ప్యాకెట్ల ఉల్లిని కర్నూలు మార్కెట్‌కు తీసుకొచ్చాం. నాణ్య త కూడా బాగుంది. సోమవారం టెండరు కు పెట్టారు. వ్యాపారులెవ్వరూ టెండరు వేయలేదు. మంగళవారం కూడా టెండరుకు పెట్టారు. అయినా వ్యాపారులు స్పందించలేదు. మార్కెట్‌కు ఉల్లి గడ్డలు తీసుకరావడానికి దాదాపు రూ.7వేల నుంచి రూ.8వేలు ఖర్చయింది. వెనక్కి తీసుకపోవాలంటే మళ్లీ అదే స్థాయిలో ఖర్చు వస్తుంది. టెండరు వేయకపోతే అనామతుపై అతి తక్కువ ధరకు విక్రయించుకోవాల్సిందే. – దేవేంద్ర ఆచారి, గువ్వలదొడ్డి గ్రామం, ఎమ్మిగనూరు మండలం కర్నూలు(అగ్రికల్చర్): పంట దిగుబడులను గిట్టుబాటు ధరతో అమ్ముకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి రైతులు వ్యయ ప్రయాసలకోర్చి కర్నూ లు మార్కెట్‌కు చేరుకుంటున్నారు. సరుకు మార్కెట్లోకి ప్రవేశించే సమయంలోనే లాట్ నెంబర్ అలాట్ అవుతుంది. పంట నాణ్యతను బట్టి వ్యాపారులు ఈ–నామ్లో ఆన్లైన్ టెండరు ద్వారా ఏదో ఒక ధర కోట్ చేయాల్సి ఉంది. ఎక్కువ ధర కోట్ చేసిన వారికి ఆ లాట్ దక్కుతుంది. రైతు ఆ ధరకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మరుసటి రోజు మళ్లీ టెండరుకు పెట్టుకోవచ్చు. కానీ మార్కెట్లో కొన్ని లాట్లకు వ్యాపారులు అస్సలు టెండరు వేయరు. ప్రధానంగా ఉల్లిగడ్డల విషయంలో ప్రతి రోజు 20 నుంచి 30 లాట్లకు వ్యాపారులు టెండరు వేయని పరిస్థితి. ఈ కారణంగా రైతులు రోజుల తరబడి మార్కెట్లోనే ఉండాల్సి వస్తోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి కొన్ని లాట్లకు ధర కోట్ చేయరనే ప్రచారం జరుగుతోంది. టెండరు వేయకపోతే రైతు లు ఏదో ఒక ధరకు అమ్ముకుంటారని, అప్పుడు నాణ్యత బాగోలేదని చెబితే తక్కువ ధరతో లాట్‌ను దక్కించుకోవచ్చనే కుట్ర కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు 20 నుంచి 30 మంది రైతులు అనామతుపై నామమాత్రపు ధరకు అమ్ముకొని కన్నీళ్లతో ఇంటిముఖం పడుతుండటం గమనార్హం. -
యాపదిన్నె సర్పంచ్‌పై కేసు నమోదు
డోన్ టౌన్: మండలపరిధిలోని యాపదిన్నె గ్రామానికి చెందిన తెలుగుదేశం సర్పంచ్ రామిరెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. వాటర్ షెడ్ పనుల్లో తనకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వరని మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో వాటర్ షెడ్ ఏపీఓ విజేత,ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి విధులకు ఆటంకం కల్గించి అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. దీనిపై సదరు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామిరెడ్డిపై కేసు నమోదు చేసి చేసి రిమాండ్‌కు పంపతున్నట్లు బుధవారం సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి అవుకు: మండల పరిధిలోని చెన్నంపల్లె గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేతంచర్ల మండలం బలపాలపల్లె గ్రామానికి చెందిన చిన్న తిమ్మిగాళ్ల వేణుగోపాల్ (37) భార్యాపిల్లలతో సహా గత రెండేళ్లుగా అవుకులో నివాసం ఉంటూ గౌండ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం చెన్నంపల్లె గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్‌ను కూలుస్తుండగా ప్రమాదవశాత్తు పైన ఉన్న కరెంట్ తీగలు తగిలి కిందపడ్డాడు. దీంతో 108 అంబులెన్స్ ఈఎంటీ జనార్దన్ రెడ్డి అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య చిన్న తిమ్మగాళ్ల ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ క్రిష్ణయ్య తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు సంతానం. రంగాపురం జెడ్పీ హైస్కూలు విద్యార్థిని ఆత్మహత్య బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం జెడ్పీ హైస్కూలో 10 వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల మేరకు గ్రామానికి చెందిన తిరుమలేశ్వరెడ్డి, లావణ్య దంపతుల పెద్ద కుమార్తె మధు లత(15) గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. కుటుంబ సమస్యలో మరే కారణం చేతనో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో బుధవారం ఉదయం ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన తల్లి లావణ్య ఇంటికి వచ్చి చూసి వెంటనే వేలాడుతున్న కుమార్తెను కిందికి దింపి చూడగా అప్పటికే మృతి చెందింది. మరో 5 రోజుల్లో పబ్లిక్ పరీక్షలకు హాజరు కావలసిన విద్యార్థిని మృతి పట్ల తోటి విద్యార్థులు కన్నీరు, మున్నీరుగా విలపించారు. హెచ్ఎం మల్లికార్జున, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. -
సారా తయారీ మానుకోకపోతే పీడీ చట్టం
కర్నూలు: నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు మానుకోకపోతే పీడీ చట్టంతో జైలుకు పంపుతామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి హెచ్చరించారు. నవోదయం 2.0లో భాగంగా కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని గుడంబాయి తండా, గుమ్మితం తండాల్లో మంగళవారం నాటుసారా వినియోగం వల్ల కలిగే అనర్థాలపై సీఐ చంద్రహాస్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.హనుమంతరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సారీ తయారీని మానుకుని ప్రత్యామ్నాయ ఉపాధితో గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని సూచించారు. సీఐ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కాలకూట విషం
పొలాల్లో, ఇంటి పరిసరాల్లో పెరిగిన కలుపు తీసేందుకు వాడే పారాక్వాట్ క్రిమిసంహారక మందు ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీసేందుకు ఎక్కువగా ఉపయోగపడుతోంది. గ్రామాల్లోని రైతుల ఇళ్లల్లో, పొలాల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఈ మందు, ఇప్పుడు పట్టణాల్లోని వారికి సైతం సులభంగా ఫెర్టిలైజర్స్ షాపుల్లో లభ్యమవుతోంది. దీంతో క్షణికావేశంలో దీనిని తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు. యాసిడ్ కంటే పదుల రెట్ల గాఢత కలిగిన ఈ ద్రావణాన్ని తాగిన వారు 99 శాతం మరణిస్తారని వైద్యులు చెబుతున్నారు. – కర్నూలు(హాస్పిటల్) ● కర్నూలు మెడికల్ కాలేజీకి చెందిన ఓ వైద్యవిద్యార్థిని గత నెల 14న పారాక్వాట్ అనే విషరసాయనం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కర్నూలు, అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆమెను బతికించేందుకు తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే కొన్ని రూ.లక్షలలు ఆమె వైద్యం కోసం ఖర్చు చేశారు. అయినా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ● కర్నూలు నగరంలోని బి.క్యాంపునకు చెందిన ఓ యువతి(19) ప్రేమించిన వాడు దూరమవుతాడన్న ఆందోళనతో ఈ నెల 9న పారాక్వాట్ రసాయన మందు తాగింది. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. పారాక్వాట్ రసాయనం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఓపీ పాయిజన్ కేసులుగా వచ్చే వాటిలో అధిక శాతం పారాక్వాట్ క్రిమిసంహారక రసాయన మందు నమోదవుతోంది. పంట పొలాల్లో కలుపు తీయడానికి రైతులు ఈ మందును ఎక్కువగా వాడుతుంటారు. వేల లీటర్ల నీటిలో రెండు, మూడు మూతల ద్రావణాన్ని కలిపి ఎకరాల కొద్దీ పొలాల్లో రైతులు ఈ మందును పిచికారీ చేస్తారు. కొద్ది నిమిషాల్లోనే కలుపు మొక్కలు మాడిపోతాయి. అలాంటిది నేరుగా ద్రావణాన్ని తాగితే పరిస్థితి ఎలాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. తాగేందుకు డబ్బా నోట్లో పెట్టుకున్నా గుక్కెడు తాగగానే తట్టుకోలేక పారేసే పరిస్థితి ఉంటుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ ద్రావణం వేగంగా శరీరంలోని జీవకణాలను, అంతర్భాగాల్లోని పైపొరలను దెబ్బతీస్తూ వెళ్లి ప్రాణాలను తీస్తుంది. ఇంతటి ప్రమాదకరమైన ఈ రసాయాన్ని కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు. కానీ ఇక్కడ పప్పు, బెల్లాల్లా దుకాణాల్లో లభ్యమవుతోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఈ మందు తాగి గత ఏడాది 69 మంది, ఈ యేడాది రెండు నెలల్లోనే 35 మంది చికిత్స కోసం వచ్చారు. ఇందులో కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు పక్కనున్న ఉమ్మడి అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల వారూ ఉన్నారు. ఈ ఆసుపత్రితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, పత్తికొండ, డోన్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఏటా వంద మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 99 శాతం మంది మరణిస్తుండగా తక్కువ మోతాదులో తాగిన వారు మాత్రమే బతికిపోతున్నారు. పలు దేశాల్లో పారాక్వాట్ నిషేధం ఒడిస్సా రాష్ట్రంలోని బుర్లా జిల్లాలో ఐదేళ్ల క్రితం ఈ విషం భారిన 177 మంది పడ్డారు. ఇందులో ముగ్గురు మాత్రమే జీవించి ఉన్నారు. 2019 సెప్టెంబర్‌లో అక్కడి వైద్యులు నిరసన చేయగా ఒడిస్సా ప్రభుత్వం దీనిని పూర్తిగా నిలిపివేస్తామని హామీ ఇచ్చింది. కేరళ రాష్ట్రంలో మాత్రమే దీనిని పూర్తిగా నిషేధించారు. అభివృద్ధి చెందిన 32 దేశాల్లోనూ పారాక్వాట్‌ను పూర్తిగా నిషేధించారు. దీని జన్మస్థానమైన స్విట్జర్లాండ్‌లోనూ ఈ రసాయాన్ని నిషేధించారు. మన దేశంలో కేవలం 9 రకాల పంటలకు మాత్రమే వాడాలని సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు, రిజిస్ట్రేషన్ కమిటీ పేర్కొన్నా 25 రకాల పంటలకు వాడుతున్నారు. ప్రాణాలు తోడేస్తున్న పారాక్వాట్ ఏటా వందల మంది మృతి కర్నూలు జీజీహెచ్‌లో 14 నెలల్లో 104 మందికి చికిత్స పారాక్వాట్‌కు విరుగుడు లేదు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు కేరళలో నిషేధం పారాక్వాట్‌కు విరుగుడు లేదు పారాక్వాట్ విష రసాయన పదార్థానికి విరుగుడు లేదు. దీని ప్రభావానికి గురైన వారి లక్షణాలను బట్టి వైద్యం చే స్తాం. దానివల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ విషం తీసుకున్న వారిలో 99 శాతం మంది మరణిస్తున్నారు. – డాక్టర్ రామశివనాయక్, ఎమర్జెన్సీ మెడిసిన్ హెచ్ఓడీ, జీజీహెచ్, కర్నూలు పీల్చినా విషప్రభావమే పారాక్వాట్ మింగినా, తాకినా చివరకు పీల్చినా విషప్రభావానికి గురైనట్లే. కేవలం ఒక టీ స్పూన్ పారాక్వాట్ తీసుకోవడం వల్ల మరణం సంభవించవచ్చు. ఈ రసాయనం దుస్తులు, కళ్లు, చర్మాన్ని తాకినా తీవ్ర అనారోగ్యం లేదా మరణానికి కారణం కావచ్చు. దీనిని తాగిన కొన్ని నిమిషాల్లోనే శరీరంలోని ఇతర భాగాల్లోకి వెళ్లి గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులను నాశనం చేస్తుంది. – డాక్టర్ పి.సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, జీజీహెచ్, కర్నూలు -
పన్నులు చెల్లించకుంటే సేవలు బంద్
● డ్రస్ సర్కిల్ షాపు వద్ద నిరసన వ్యక్తం చేసిన మున్సిపల్ సిబ్బంది కర్నూలు (టౌన్): ఈనెల 31లోపు పన్నులు చెల్లించకపోతే సేవలు నిలిపేస్తామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్జీవీ క్రిష్ణ హెచ్చరించారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది మంగళవారం బకాయిలు ఉన్న వ్యాపార దుకాణాల వద్దకు వెళ్లి యాజమాన్యాల తీరును నిరసించారు. అందులో భాగంగా అబ్దుల్లాఖాన్ ఎస్టేట్‌లోని డ్రస్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టగా రూ.6.79 లక్షల బకాయిలు చెల్లిస్తామని యాజమాన్యం లిఖిత పూర్వకంగా రాసివ్వడంతో వెనుదిరిగారు. మేడం కాంపౌండ్‌లోని వాణిజ్య సముదాయాలకు సంబంధించి రూ.5.57 లక్షల బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ఆదేశాలను పట్టించుకోకపోతే శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్లు జునీద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు భార్గవ్, తిప్పన్న, రాజు పాల్గొన్నారు. -
మత్స్య సహకార సంఘాల బలోపేతానికి కృషి
● జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ నవీన్‌కుమార్ కర్నూలు(అగ్రికల్చర్): మత్స్యకారుల సంక్షేమానికి, మత్స్య సహకార సంఘాల పటిష్టతకు చర్యలు తీసుకుంటామని ఉమ్మడి కర్నూలు జిల్లా మత్స్య సహకార సంఘం(డీఎఫ్‌సీఎస్) చైర్మన్ బీఎస్ నవీన్‌కుమార్ తెలిపారు. మంగళవారం కర్నూలు బంగారుపేటలోని మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సవరించిన బైలాను అన్ని సహకార సంఘాలకు త్వరలోనే తెలుగులోనే అందజేస్తామన్నారు. మత్స్యకారులందరు ఎన్ఎఫ్డీపీ, ఈ–శ్రామిక్‌లలో పేర్లను నమోదు చేసుకోవా లని సూచించారు. కొత్త సంఘాల ఏర్పాటుకు ఇప్పటికే ఉన్న సంఘాలలో సభ్యత్వాలను పెంచుకోవడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌సీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ సంధ్యారాణి, డైరెక్టర్లు శేఖర్, నాగశేషులు, శ్రీనివాసు లు, మల్లీశ్వరుడు, మద్దిలేటి, నగేష్ పాల్గొన్నారు. -
కర్ణాటక బస్సు ఢీకొని వ్యక్తి మృతి
నందవరం: కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తుతెలి యని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండల పరిధిలోని హాలహర్వి – చిలకడోణ గ్రామాల మధ్య కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. మతిస్థిమిత్తం లేని, గుర్తు తెలియని వ్యక్తి కేజీబీవీ వద్ద జాతీయ రహదారి దాటుతుండగా బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి కాళ్లకు, తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కొండముచ్చు దాడిలో ఇద్దరికి గాయాలు కొలిమిగుండ్ల: బందార్లపల్లెలో కొండ ముచ్చు గ్రామస్తులను హడలెత్తిస్తోంది. మంగళవారం ఎస్సీ కాలనీకి చెందిన ఓబులేసుపై దాడి చేయడంతో చెంపకు, మక్కల నాగేంద్ర వీపుపై రక్తగాయాలయ్యాయి. వారం రోజుల నుంచి కొండముచ్చు గ్రామంలో తిష్టవేయడంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బయటకు వెళ్లాలంటే ఎప్పుడు వచ్చి దాడి చేస్తోందనని ఆందోళన చెందుతున్నారు. వీధుల్లో సంచరిస్తూ ఇళ్ల ముందు తిష్టవేస్తుండటంతో మహిళలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అటవీ శాఖాధికారులు స్పందించి గ్రామంలో నుంచి కొండముచ్చును తరలించే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. నేడు వాహనాల వేలం కర్నూలు: వివిధ ఎకై ్సజ్ నేరాల్లో పట్టుబడిన వాహనాలను బుధవారం వేలం వేయనున్నట్లు కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆసక్తి ఉన్నవారు దరావత్ సొమ్ము చెల్లించి వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్లో వేలం ప్రక్రియ ఉంటుందని సీఐ వెల్లడించారు. -
చౌడేశ్వరీ మాతను దర్శించుకున్న బాలనటి శ్రీదేవి
బేతంచెర్ల: పట్టణానికి సమీపంలోని కొలుములపల్లె రహదారిలో వెలసిన చౌడేశ్వరీ మాతను బింబిసారలో బాలనటిగా నటించిన శ్రీదేవి మంగళవారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా చౌడేశ్వరీ మాత ఆలయంలో తల్లిదండ్రులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేతంచెర్ల పట్టణానికి చెందిన శ్రీహరి గౌడ్, భార్య లక్ష్మి వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. నందమూరి కళ్యాన్‌రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో బాలనటిగా శ్రీదేవి నటించింది. మాటీవీలో చిన్ని, జీటీవీలో కళ్యాణ వైభోగం సీరియల్తోపాటు కొత్తగా రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శాంతి భద్రతలకువిఘాతం కలిగిస్తే చర్యలు ● ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆలూరు రూరల్: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణాన్ని పరిశీలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వేసి ఉంచాలన్నారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించి శాంతి భద్రతలపై సీఐ వెంకటచలపతి, ఎస్ఐ దిలీప్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రాణం తీసిన మలుపు ● బైకు అదుపుతప్పి యువకుడి మృతి కొత్తపల్లి: మూల మలుపు వద్ద బైకు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని శివపురం గ్రామానికి చెందిన హరికృష్ణయాదవ్(37) ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు గ్రామ సమీపంలో లింగమయ్య స్వామిని దర్శించుకుని పల్సర్ బైకుపై ఇంటికి తిరుగు పయనం అయ్యాడు. శివపురం గ్రామ పోలిమేరలోని జమ్ములమ్మ గుడి వద్ద మలుపు ఉండటంతో బైకు అదుపు తప్పి రోడ్డు పక్కన పిచ్చి మొక్కల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో పడి ఉండగా అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని కొత్తపల్లికి, అక్కడి నుంచి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య శ్రావణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొత్తపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. -
అమ్మానాన్నలను మింగేసి.. ఆనందాలను చిదిమేసి!
● ఐదుగురిని బలిగొన్న బస్సు కర్ణాటక రాష్ట్రం గంగావతి డిపోకు చెందిన బస్సు మంత్రాలయానికి మంగళవారం 14 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఆదోని మండలం పాండవగల్ సమీపంలో కల్వర్టు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. బస్సు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లి నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు కుటుంబాల్లో చీకటి కమ్ముకుంది. – ఆదోని టౌన్ -
బ్యాంకుల సమ్మెను విజయవంతం చేద్దాం
● యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా నాయకులు కర్నూలు (అగ్రికల్చర్): న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయు) పిలుపు మేరకు ఈ నెల 24, 25 తేదీల్లో చేపట్టనున్న బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని వివిధ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు కోరారు. మంగళవారం వివిధ బ్యాంకుల రీజినల్ కార్యాలయాల ఎదుట ఆయా బ్యాంకుల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రీజినల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజు, కెనరా బ్యాంకు రీజినల్ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆ బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ రీజినల్ సెక్రటరీ కే.పుష్పక్ మాట్లాడారు. ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బ్యాంకు ఉద్యోగులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. గ్రాట్యూటీ చట్టాన్ని సవరించి రూ.25 లక్షల వరకు గరిష్ట పరిమితిని పెంచాలని కోరారు. కెనరా బ్యాంకు వర్క్‌మెన్ ఎంప్లాయీస్ యూనియన్ సెంట్రల్ కమిటీ సభ్యుడు అనిల్‌రెడ్డి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని కేడర్లలో తగిన నియామకాలు చేపట్టాలని, తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ వాటా 51 శాతం ఉండేలా చూడాలని కోరారు. ఈ నెల 13, 18వ తేదీల్లో ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిగే చర్చలకు యూఎఫ్‌బీయూ నేతలు హాజరవుతున్నారని, చర్చలు ఫలించకపోతే రెండు రోజుల సమ్మెకు సిద్ధం కావాలని సూచించారు. -
ఇప్పటికిప్పుడే పునాదులు ఎలా తీసుకోవాలి
● అధికారులను ప్రశ్నించిన జగనన్న కాలనీ లబ్ధిదారులు కోసిగి: ఇప్పటికిప్పుడే పునాదులు తీసుకోవాలంటే తమ చేత అయ్యే పనేనా అని మండల కేంద్రంలోని జగనన్న కాలనీ లబ్ధిదారులు అధికారుల ఎదుట వాపోయారు. మండల కేంద్రంలోని సజ్జలగుడ్డం రోడ్డులో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ పేరుతో 909 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఎంత మంది పునాదులు తీసుకున్నారు, ఎంత మంది పునాదులు తీసుకోలేదనే వివరాలు సేకరించి నివేదికను తయారు చేసేందుకు మంగళవారం వీఆర్వోలు బలరాం, వీరేష్ కలిసి జగనన్న కాలనీకి రాగా లబ్ధిదారులు కామలదొడ్డి వీరేష్, బసవరాజు, మల్లి, వేమారెడ్డి, మరి కొందరు అక్కడకి చేరుకుని తమ ఆవేదన వెలిబుచ్చారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈరోజే గడువు పూర్తయిందంటే ఎలా అని, ఇప్పటికిప్పుడే పునాదులు వేసుకోవాలంటే తమ ఆర్థిక పరిస్థితి సరిపోతుందా అని నిలదీశారు. ఇప్పటికై నా ప్రభుత్వమే ఇళ్లు మంజూరు చేసి, బిల్లులు విడుదల చేస్తే నిర్మాణాలు ప్రారంభించుకుంటామని బాధితులు విన్నవించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఇక్కడికి వచ్చామని చెప్పి వీఆర్వోలు వెళ్లిపోయారు. అలాగే 16 మంది కుమ్మరి కులస్తులకు కేటాయించిన స్థలంలోనూ ప్రైవేట్ వ్యక్తులు ప్లాట్లు వేసుకున్నారని బాధితులు కుమ్మరి కోసిగయ్య, బజారి, నాగరాజు, నరసింహ, అంబమ్మ ఆరోపించారు. ఇదే విషయమై ఫిబ్రవరి 6న తహసీల్దార్‌ను కలిసి ఫిర్యాదు చేసినా పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలపై తహసీల్దార్ రుద్రగౌడను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీఆర్వోలు జగనన్న కాలనీలో సర్వే చేపట్టారని, కుమ్మరి కులస్తులకు ఇచ్చిన స్థలాలు ఎక్కడికీ పోవని, ప్రైవేట్ వ్యక్తులు వేసిన లేఅవుట్లను రీసర్వే చేసి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చెప్పారు. -
ఆగని మట్టి అక్రమ తవ్వకాలు
● చూసీచూనడట్లు వదిలేస్తున్న రెవెన్యూ అధికారులు రుద్రవరం: మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాగులు, వంకలు, లే అవుట్లలో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తుండటంతో అక్రమార్కులది అడిందే ఆట పాడిందే పాటలా తయారైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొందరి నుంచి భూమిని కొనుగోలు చేసి పేదల కోసం కేటాయించింది. అప్పటి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి కొంత మంది పేదలకు ఇళ్ల స్థలాలు కూడా పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలోపే ప్రభుత్వం మారడంతో అంతా తలకిందులైంది. ఆ భూమిలో ఇప్పుడు కూటమి నేతలు ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. లబ్ధిదారులు అడ్డుకునేందుకు వెళ్లగా తమ పూర్వికుల భూమి అని, తమకు పూర్తి హక్కులు ఉన్నాయని గదమాయిస్తున్నారు. చేసేదేమీ లేక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకునే నాథుడే లేరు. మంగళవారం పేరూరు సమీపంలోని వక్కిలేరులో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో ఆళ్లగడ్డ, శిరివెళ్ల మండలాల్లోని బత్తలూరు, ఎర్రగుంట్ల గ్రామాలకు తరలిస్తున్నండగా స్థానికులు సంబంధిత వీఆర్వోకు సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని మట్టి తవ్వకాలు నిలిపేయాలని చెబుతూనే స్థానికులు వెళ్లిపోయిన తర్వాత తిరిగి తవ్వేకోవచ్చన్న సంకేతాలు ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. దీంతో కూటమి నేతలు తిరిగి జేసీబీతో వాగులోని మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా వేర్వేరు గ్రామాలకు తరలించారు. మట్టి తవ్వకాలపై తహసీల్దారు మల్లికార్జునరావును వివరణ కోరగా తాము ఎవ్వరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పుకోచ్చారు. -
రూ.139.90 కోట్లు
4,66,348 జిల్లాలోని గృహాల సంఖ్య నెలకు రూ.3వేల చొప్పున చెల్లించాల్సిన నిరుద్యోగ భృతి విద్యారంగం.. అస్తవ్యస్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినా.. నేటి వరకు ఒక్క నయాపైసా విడుదల చేయలేదు. అదిగో, ఇదిగో డీఎస్సీ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. – డీ సోమన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు విద్యార్థులకు ఆర్థిక కష్టాలు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులపై కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలన్నా, సర్టిఫికెట్లు తీసుకోవాలన్నా పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు అనేక ఆర్థిక కష్టాలకు గురవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. – అబ్దుల్లా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఉన్నత విద్య ప్రశ్నార్థకం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా నేటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. యువగళం పాదయాత్రలో అన్ని ఇవ్వగలం అని నమ్మించిన మంత్రి నారా లోకేష్ నేడు నోరుమెదపడం లేదు. ఫీజు రీయంబర్స్మెంట్ను విడుదల చేయకుండా బకాయి పెట్టడంతో విద్యార్థుల ఉన్నత విద్య ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే విద్యార్థులతో కలసి ఉద్యమాలు చేస్తాం. – ఆర్ చంద్రప్ప, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ అందించకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. ఫీజు బకాయిలపై నోరు మెదపకుండా విద్యార్థుల చదువులకు చంద్రబాబు ప్రభుత్వం ఆటంకం కల్పిస్తోంది. ఫీజులు చెల్లించాలని విద్యార్థులను వివిధ కళాశాలల యాజమాన్యాలు పట్టిపీడిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం నాలుగు విడతలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి అదే ఏడాది మార్చి 2వ తేదీన మొదటి విడతగా జిల్లాలోని 35,618 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.23.95 కోట్లను అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన మూడు విడతల ఫీజును ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను అధికారంలోకి వచ్చిన వెంటనే 2019–20 విద్యా సంవత్సరంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేసింది. అప్పట్లో జిల్లాలో 32,162 మంది విద్యార్థులకు సంబంధించిన అరియర్స్ అందాయి. గతంలో కుటుంబ వార్షిక ఆదా యం రూ. లక్ష ఉండగా వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరాలనే సదుద్దేశంతో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.2.50 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలోనే వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేల ప్రకారం అందించింది. ● గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన సమయంలో బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు విద్యార్థుల ఇంజనీరింగ్ విద్యకు ఏడాదికి రూ.35 వేలు మాత్రమే విడుదలయ్యేవి. కానీ, కొన్ని పెద్ద కళాశాలల్లో (గ్రేడ్ –1) ఇంజినీరింగ్ ఫీజు ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంది. ఆయా కళాశాలల్లో చదువుతున్న సంబంధిత సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసే రూ.35 వేలను మినహాయించి మిగిలిన ఫీజు వారి తల్లిదండ్రులే చెల్లించాల్సి వచ్చేది. ఈ ఆర్థిక భారాన్ని కూడా తొలగించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పెంచారు. దీంతో గ్రేడ్–1 కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కింది. ● ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ తదితర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.501.60 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఘరానా మోసం ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా విద్యార్థులను, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. రూ.3,900 కోట్ల ఫీజు బకాయిలను పెట్టి, విద్యార్థి సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో రూ.780 కోట్లను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. నెలకు రూ.3 వేల ప్రకారం నిరుద్యోగులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.72 వేలు అప్పుపడింది. 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉన్నా.. ఎలాంటి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టలేదు. – రెడ్డిపోగు ప్రశాంత్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వైద్య విద్యకు మోకాలడ్డు ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో వైద్య రంగానికి పెద్దపీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలను కూడా ప్రారంభించారు. అందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని, నంద్యాల ప్రాంతాల్లో మెడికల్ కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. నంద్యాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభం కాగా, ఆదోనిలో చురుగ్గా జరుగుతున్న మెడికల్ కళాశాల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డువేసింది. కరువు ప్రాంతమైన ఆదోనిలో మెడికల్ కళాశాల నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో దాదాపు 80 శాతం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు పూర్తియితే ఈ ఏడాది 150 సీట్లతో కళాశాల ప్రా రంభయ్యేది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్మాణాలకు బ్రేకులు వేసింది. దీంతో ఆదోని మెడికల్ కళాశాల కలగానే మిగిలిపోయింది.పైపెచ్చు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటై న మెడికల్ కళాశాలలను ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రూ.1678.85కోట్లు అమలు చేయకపోతే ఏడాదికి నష్టం నేడు యువత పోరు కర్నూలు(టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహిస్తున్న యువత పోరు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలో ఉదయం 10 గంటలకు స్థానిక గౌరి గోపాల్ ఆసుపత్రి వద్దనున్న ధర్నా చౌక్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లాలో వేడుకలు నిర్వహిద్దామని పిలుపు నిచ్చారు. ప్రస్తుతం ఇలా.. జిల్లాలో 35,618 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, క్రిస్టియన్ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా రూ.71.86 కోట్లను బకాయి పడింది.చంద్రబాబుకు నిరుద్యోగులను మోసం చేయడం ఆనవాయితీగా మారింది. 2014లో కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తానని, అప్పట్లో రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని చెత్తబుట్టలో పడేశారు. 2019 ఎన్నిలకు ముందు రాజకీయ లబ్ధి కోసం 2018 అక్టోబర్ నుంచి నెలకు రూ.వెయ్యి కొంతమందికి మాత్రమే నిరుద్యోగ భృతి వేసి చేతులుదులుపుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తానని, ఉద్యోగం ఇచ్చే వరకూ ‘యువనేస్తం’ పేరిట నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఈ లెక్కన జిల్లాలో నెలకు రూ.139.90కోట్లు ఇవ్వాలి. ‘కూటమి’ మాటలు నమ్మి ఉద్యోగాలపై ఆశతో కోచింగ్ సెంటర్లకు వెళ్లే విద్యార్థులకు ప్రతి నెలా వేల రూపాయలు ఖర్చవుతోంది. ప్రభుత్వం భృతి ఇవ్వకపోవడంతో వారిపై భారీగా ఆర్థిక భారం పడుతోంది. ఓ వైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. మరో వైపు భృతి లేకపోవడంతో నిరుద్యోగులు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. యువనేస్తం.. నిలువునా మోసం -
ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టాలి
● వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కర్నూలు (సెంట్రల్): వర్షపు ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకుని వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఆయన సోమవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి పొదుపు, వినియోగం, నిర్వహణపై కొన్ని ప్రాంతాల కలెక్టర్ల పనితీరును సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, పారిశ్రామికవేత్తల ఆర్థిక సాయం, సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులతో మాట్లాడారు. ఫారం పాండ్స్, అమృత సరోవర్ తదితర పనులపై డ్వామా పీడీ వెంకటరమణయ్యను, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్స్‌పై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావును, చెరువులు, మైనర్ డ్యామ్‌ల పునరుద్ధరణ పై ఇరిగేషన్ ఎస్ఈ ద్వారకానాథ్‌రెడ్డిని నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. -
మోహినీ అలంకారంలో అహోబిలేశుడు
అమృతం అసురుపాలు కాకుండా లోక సంరక్షణ కోసం మహా విష్ణువు దాల్చిన జగన్మోహిని అలంకరణలో ప్రహ్లాదవరుడు భక్తులకు దర్శనమిచ్చారు. అహోబిలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో సోమవారం ప్రహ్లాదవరుడు జగన్మోహిని అలంకారంలో కనువిందు చేశారు. పట్టు వస్త్రాలు, మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ధరించి పల్లకీలో మాడ వీధుల్లో విహరించారు. ఎగువ అహోబిలంలో వెలసిన జ్వాలా నరసింహస్వామి పొన్నచెట్టు వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. – ఆళ్లగడ -
రాజకీయ కక్షతో వేధిస్తే ప్రజలే తిరగబడతారు
కర్నూలు: రాజకీయ కక్షతో ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధిస్తే ప్రజలే తిరగబడతారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లను దుర్భాషలాడారన్న అభియోగంపై ఆదోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ప్రముఖ సినీనటుడు పోసాని మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 5వ తేదీన రిమాండ్‌పై ఆయనను కర్నూలు శివారులోని జిల్లా కారాగారానికి తరలించారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోమవారం జిల్లా జైలుకు వెళ్లి పోసాని మురళీకృష్ణతో ములాఖత్ అయి పరామర్శించారు. అనంతరం కారాగారం గేటు బయట కాటసాని మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకుల మీద కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని, అధికారం ఉంది కదా అని రాజకీయ కక్షతో ఒకే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేసులు పెట్టి వేధించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకు లు ఏది మాట్లాడినా అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని, అదే టీడీపీ నాయకులు మాట్లాడితే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. చట్టం అనేది ఒకరి సొత్తు కాదని, అందరికీ సమానంగా ఉండాలన్నారు. ఎళ్లకాలం ఒకేలా ఉండదని, కూటమి నాయకులు గుర్తు పెట్టుకుని నడుచుకోవాలన్నారు. ప్రముఖ సినీనటుడు పోసాని మురళీకృష్ణతో ములాఖత్ సందర్భంగా కాటసాని -
నిబంధనలకు ‘నీళ్లు’
ఆలూరు: నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో సర్పంచ్ అరుణాదేవి.. నిబంధనలకు నీళ్లు వదిలారు. ప్రజలకు ఇబ్బందులు తెస్తూ తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ‘జీతభత్యాలు ఇస్తున్నాం..మేం చెప్పిన పనులు చేయాల్సిందే’ అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు తిప్పలు పెడుతున్నారు. ఆలూరులోని ఇందిరా నగర్, అంబేడ్కర్ నగర్, గాంధీనగర్‌తో పాటు పలుకాలనీల్లో చేస్తున్న పనులకు శుద్ధమైన జలాన్ని వాడుతున్నారు. సీసీ రోడ్డుకు కంకర వేసే మిషన్‌లోకి శుద్ధమైన జలాన్ని నింపుతున్నారు. ఆలూరు మేజర్ పంచాయతీ కాగా.. 16 గ్రామ వార్డులు ఉన్నాయి. గతంలో రూ. 5 లక్షలను ఖర్చు చేసి ప్రజలకు శుద్ధమైన జలాన్ని అందించేందుకు ఏర్పాటు చేశారు. అయితే నేడు పంపులు చెడిపోవడంతో నీటిని అభివృద్ధి పనులకు వాడుకోవడంలో ఆంతర్య మేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ కార్మికులతో కంకర డస్ట్ తొలగించే పనిని చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆలూరు సర్పంచ్ అరుణాదేవి చేయిస్తున్న పనులు బాగున్నాయని గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే బి.రామాంజనేయులు మెచ్చుకోవడాన్ని చూసి ప్రజలు అవాక్కయ్యారు. -
నేడు వాతావరణ మార్పులపై వర్క్‌షాపు
కర్నూలు(అగ్రికల్చర్): నాబార్డు ఆధ్వర్యంలో వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై ఎమ్మిగనూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 11న ప్రత్యేక వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంటు జనరల్ మేనేజర్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ వర్క్‌షాపునకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన నాన్ గవర్నమెంటు ఆర్గనైజేషన్లు(ఎన్జీవో), రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, ఆర్‌ఏఆర్‌ఎస్, వీవీకే శాస్త్రవేత్తలు పాల్గొంటారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలు, పంటల గురించి శాస్త్రవేత్తలు తగిన సలహాలు, సూచనలు ఇస్తారని ఆయన పేర్కొన్నారు.సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరిట మోసం ● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు కర్నూలు: హైదరాబాద్‌లో బిందు కన్సల్టెన్సీ పేరిట సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అశ్విని, సాయికృష్ణ, హిమబిందు కలసి రూ.60 వేలు తీసుకుని మోసం చేశారని కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రమేష్‌కుమార్ రెడ్డి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పీజీఆర్ఎస్కు మొత్తం 122 ఫిర్యాదులు రాగా.. వీటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా కూడా కార్యక్రమంలో పాల్గొని వినతులను స్వీకరించారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సెల్)లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదక(పీజీఆర్ఎస్)ను నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పరిష్కారం అయ్యాయా లేదా అనే అంశంపై ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆడిట్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ పాల్గొన్నారు. ప్రతి భక్తుడితో మర్యాదగా మెలగాలి శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రానికి విచ్చేసే భక్తులందరితో మర్యాదగా మెలగాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. సోమవారం ఈ నెల 27 నుంచి 31వ తేది వరకు నిర్వహిస్తున్న ఉగాది మహోత్సవాలపై దేవస్థాన వివిధ శాఖాధిపతులు, పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారని, ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలలో ఆయా కై ంకర్యాలన్నీ సమయానుకూలంగా, పరిపూర్ణంగా చేపట్టాలన్నారు. నల్లమల అటవీప్రాంతంలో పాదయాత్ర భక్తులకు తాగునీటి సదుపాయం, సేదతీరేందుకు షా మియానాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల్లో 12లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. శాశ్వత మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. -
‘సూపర్ సిక్స్’ మోసంపై సమష్టి పోరు
కర్నూలు (టౌన్): ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలందరినీ టీడీపీ నేతలు మోసం చేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ‘సూపర్ సిక్స్’ మోసంపై సమష్టిగా అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు రెడ్డిపోగు ప్రశాంత్ అధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. సమావేశంలో ఎస్వీ మాట్లాడుతూ.. హామీలు నేరవేర్చకుంటే కాలర్ పట్టుకోవాలని అన్న మంత్రి నారా లోకేష్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. గత ఏడాది ఆందోళనల కారణంగానే ఫీజు బకాయిలు రూ.700 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఇప్పటికీ రూ.3,200 కోట్లు విడుదల చేయాల్సి ఉందని, పేద, బడుగు, బలహీన, మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. ఓటాన్ అకౌంట్, వార్షిక బడ్జెట్లో విద్యకు అరకొర నిధులు కేటాయించారన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేలు భృతి ఇస్తామని చెప్పి ఏడాది కావస్తున్నా.. బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12న కర్నూలులో చేపడుతున్న యువత పోరు నిరసన కార్యక్రమాన్ని అన్ని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, యువతీ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ● వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు రెడ్డి పోగు ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పి ఇప్పటికే మూడు నెలలు అవుతుందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ధనుంజయ ఆచారి, షరీఫ్, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి షాపీర్‌బాషా, ఏఐఎస్ఎఫ్ రాయలసీమ యూనివర్సిటీ అధ్యక్షుడు శరత్‌కుమార్, వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మణిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు కటికె గౌతం, ఆర్వైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రంగముని నాయుడు పాల్గొన్నారు. ఎవరు ఏం మాట్లాడారంటే.. 12న ‘యువత పోరు’కు భారీగా తరలి రావాలి రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించడం లేదు. విద్యార్థుల చదువులకు ఇబ్బందికరంగా మారింది. – సునీల్ రెడ్డి, రాయలసీమ యువజన విద్యార్థి సంఘాల జేఏసీ నాయకుడు ఇంట్లో అందరి విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తామన్నారు. నిధులు కేటాయించకుండా మళ్లీ మోసం చేశారు. – శ్రీరాములు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నిరుద్యోగులకు ఉపాధి లేదు. ఖాళీగా ఉండలేక ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయింలేదు. – సూర్యకుమార్, లైబ్రరీ యూనియన్ అధ్యక్షుడు డీగ్రీలు, పీజీలు చదివిన వేలాది మంది ఆటోలు నడుపుతూ జీవితం సాగిస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని అందరికీ అర్థమైంది. – రవికుమార్, రాయలసీమ యువజన విద్యార్థి సంఘాల నాయకుడు విద్యార్థులను, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. కచ్చితంగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాల్సిందే. ఫీజు బకాయిలు, నిరుద్యోగ భృతి కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం. – చంద్రప్ప, టీఎన్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యువగళం పేరుతో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలయ్యాయి. ఏమని ప్రశ్నిస్తే అక్రమ కేసులు అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు డీఎస్సీ ఇవ్వలేదు. – కటారు కొండ సాయి కుమార్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఈ ప్రభుత్వం వద్దు
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లాపై సవతి తల్లి ప్రేమను చూపుతోందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.జగన్నాథం విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లా పేరు లేకుండానే కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వం దుర్ణీతికి నిదర్శనమని ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ‘ఈ ప్రభుత్వం మాకు వద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులైనా వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాలకు నిధులు కేటాయించలేదన్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు వలస వెళ్తున్నా పట్టించుకోవడంలేదన్నారు. జిల్లాలో పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలన్నారు. నాయకులు ఎస్.మునెప్ప, పి.రామకృష్ణారెడ్డి, నాగరాజు, శ్రీనివాసులు, ఈశ్వర్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం●
● కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాలు ● ఇళ్ల స్థలాల కోసం పేదల నిరసన ● కామన్ పీజీసెట్‌ను రద్దు చేయాలన్న విద్యార్థులు ● హిందూ సంఘాల నాయకుల ఆందోళన ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో సమస్యలు.. ప్రతి రోజూ అవస్థలే.. అయినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్పందించకోపవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భారీగా కలెక్టరేట్‌కు వచ్చి ధర్నాలు, నిరసనలు తెలిపారు. ప్రజల కష్టాలు పట్టవా అంటూ పాలకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ అధినేత స్పందించకపోతే ప్రతిరోజు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కామన్ పీజీసెట్ ఎంట్రెన్స్తో తమకు నష్టం వాటిల్లుతోందని, దానిని రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వరా.. ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందని వివిధ సంఘాల నాయకులు మండిపడ్డారు. కర్నూలు జిల్లా పేరు లేకుండానే రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వం దుర్ణీతికి నిదర్శనమని సీపీఐ నాయకులు ఆరోపించారు. జిల్లాకు జరిగిన అన్యాయంపై ధర్నా నిర్వహించారు. కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో జరుగుతున్న కూల్చి వేతలను వెంటనే నిలపుదల చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని హిందూ సంఘాల నాయకులు హెచ్చరించారు. – కర్నూలు(సెంట్రల్) -
చంద్రబాబు చెప్పారు కాబట్టే అడుగుతున్నాం
సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇల్లు లేనిపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పారు. కాబట్టే ఇప్పుడు ఇంటి స్థలం ఇవ్వాలని అడుగుతున్నాం. మాకు సొంతిల్లు లేదు. అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్నాం. ఇంటి స్థలంతోపాటు నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాల్సిందే. పేదల ఆశలతో ఆడుకుంటే రోడ్డెక్కి ఆందోళనలు చేపడతాం. – సరిత, అమీర్ హైదర్ఖాన్నగర్, కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న పేద మహిళలుపేదలకు అన్యాయం కర్నూలు, కల్లూరు పరిధిలోని పేదలకు 15 రోజుల్లో సర్వే నంబర్ 70/2బీలో ఉన్న 16.85 ఎకరాలు, సర్వే నంబర్ 68లో ఉన్న 12.75 ఎకరాల భూమిలో లే అవుట్ వేసి పట్టాలు ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ముట్టడికి పేదలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 2 గంటల పాటు సీపీఎం ఆధ్వర్యంలో ఽనిరసన చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా అధ్యక్షుడు డి.గౌస్‌దేశాయ్ మాట్లాడుతూ..పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూంటే ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ పెద్దలు భూములను ఆక్రమిస్తూ ఉంటే ఏమి అనని అధికారులు...పేదలు అటువైపు వెళ్లితే నిబంధనలు చెబుతున్నారని విమర్శించారు. 15 రోజుల్లో పట్టాలు ఇవ్వకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాజశేఖర్, వై.నగేష్, అలివేలు, అరుణ, విజయరామాంజనేయులు పాల్గొన్నారు. -
మంత్రి లోకేష్.. పట్టించుకోరా?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాల్లో ప్రవేశం కోసం నిర్వహించి కామన్ పీజీ సెట్ ఎంట్రెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమన్న, షాబీర్‌బాషా డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కామన సెట్‌తో విద్యార్థులకు ఎంతో నష్టం వాటిల్లుతోందన్నారు. ఇష్టమున్నా లేకున్నా ఇతర యూనివర్సిటీలకు వెళ్లి చదువుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే జీఓ నంబర్ 77ను రద్దుచేస్తానని చెప్పిన మంత్రి లోకేష్ పట్టించుకోవడంలేదన్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. కామన్ సెట్‌తో డిగ్రీ, పీజీ కళాశాలను మూసివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శరత్‌కుమార్, అభి, అశోక్, అక్షర తదితరులు పాల్గొన్నారు. -
ఏపీఎస్పీ రెండవ పటాలంలో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
మేనేజర్, స్టోర్ ఎన్సీఓ పోస్టులకు భారీ పోటీ ప్రతి కంపెనీలో ఒక మేనేజర్, స్టోర్ ఎన్సీఓ ఉంటాడు. ఆయా పోస్టులను దక్కించుకునేందుకు సిబ్బంది పోటీ పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఆయా పోస్టుల్లో విధులు నిర్వహించాలంటే అందుకు సంబంధించిన శిక్షణ తప్పనిసరి. గతంలో ఇదే విధులు నిర్వహించిన వారికి మళ్లీ నియమించకూడదనే నిబంధన కూడా ఉంది. అయితే కొందరు రెండోసారి కూడా ఆయా పోస్టుల్లో పనిచేశారు. కర్నూలు: ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధమైంది. నూతన కమాండెంట్ బాధ్యతలు చేపట్టిన దీపిక పాటిల్ ఆదేశాల మేరకు బదిలీల జాబితా సిద్ధమైనట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. గత నెల 25న కమాండెంట్ సంబంధిత కంపెనీ ఆర్ఐలకు(ఆఫీసర్ కమాండింగ్) బదిలీలకు సంబంధించిన మెమో (ఉత్తర్వులు) ఇచ్చా రు. బెటాలియన్‌లో తొమ్మిది కంపెనీలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఏళ్ల తరబడి బయటి కంపెనీల్లో పనిచేసిన వారిని హెడ్ క్వార్టర్‌కు బదిలీ చేయాల్సి ఉంది. మొత్తం పటాలంలో దాదాపు 1100 మంది సిబ్బంది ఉన్నారు. టర్న్ ప్రకారం ప్రతి ఒక్కరికీ హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలి. ఇందుకు అనుగుణంగా కమాండెంట్ చర్యలు చేపట్టడంతో ఫెవికాల్ వీరులు పైరవీలు ముమ్మరం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో బదిలీల జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆఫీసర్ కమాండెంట్లు చేతివాటం ప్రదర్శించి బదిలీల జాబితా తయారీలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, జాబితాను సమగ్రంగా పరిశీలించి ఏళ్ల తరబడి బయటి కంపెనీలో పనిచేస్తున్న వారికి కమాండెంట్ న్యాయం చేస్తారనే ఆశాభావం సిబ్బందిలో వ్యక్తమవుతోంది. వీరు ఫెవికాల్ వీరులు ● స్టోర్ ఎన్సీఓగా ఎమ్టీ గ్రూప్‌లో హెడ్ కానిస్టేబుల్ రంగసామిరెడ్డి 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు. దీపిక పాటిల్ కమాండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిబ్బంది సమస్యలపై దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగసామిరెడ్డిపై పలువురు సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో అతడి స్థానంలో బాల హుసేన్ (హెచ్‌సీ 817)ను నియమించారు. అవమానంగా భావించిన రంగసామిరెడ్డి ద్వితీయ శ్రేణి అధికారి సహాయంతో సిక్ లీవ్‌లో వెళ్లారు. ఇందుకు ఓ అధికారికి పి–క్యాప్ స్టిక్ కానుకగా బహుకరించినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. ఈయన ఏఎంటీఓ ద్వారా హెడ్ క్వార్టర్‌లోనే కొనసాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ● సమరసింహారెడ్డి (కళ్యాణ మండపం నిర్వహణ) 20 ఏళ్లుగా హెడ్ క్వార్టర్‌లోనే కొనసాగుతున్నారు. ● తిరుమల్‌రెడ్డి 30 ఏళ్లుగా ట్రైనింగ్ గ్రూప్‌లోనూ, బందె నవాజ్ 20 ఏళ్లుగా బెటాలియన్ హాస్పిటల్లో, హెడ్ కానిస్టేబుల్ మౌలాలి పదేళ్లుగా హాస్పిటల్ విధులు, టైలరింగ్ గ్రూప్‌లో 15 ఏళ్లుగా జిలానీ బాషాతో పాటు మరో పది మంది దాకా వివిధ గ్రూపుల్లో హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తుండటం వల్ల బయటి కంపెనీల్లో పనిచేసేవారికి అవకాశం దక్కడం లేదని సిబ్బంది వాపోతున్నారు. ● అసిస్టెంట్ కమాండెంట్ల దగ్గర విధులు నిర్వహించే పీఏలు కూడా ఏళ్ల తరబడి హెడ్ క్వార్టర్‌లోనే కొనసాగుతున్నట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. ● కానిస్టేబుల్ కిరణ్ 20 ఏళ్లుగా అసిస్టెంట్ కమాండెంట్ దగ్గర పనిచేస్తున్నారు. ● విశ్వనాథ్ రెడ్డి ట్రెజరీలో ఎనిమిదేళ్లుగా హెడ్ క్వార్టర్‌లోనే ఉంటున్నారు. ● డీఎస్పీలు ఎస్ఎం బాషా దగ్గర హుసేనయ్య, రమణ దగ్గర రియాజ్, రవికిరణ్ దగ్గర రాజు కొన్నేళ్లుగా సీట్లకు అతుక్కుని విధులు నిర్వహిస్తున్నారు. ● హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథ్ రెడ్డి కూడా అసిస్టెంట్ కమాండెంట్, గతంలో కమాండెంట్ దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి హెడ్ క్వార్టర్‌లోనే కొనసాగుతుండటంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలకు రూ.లక్షల్లో వసూలు నచ్చిన చోటుకు పంపేందుకు, ఉన్న చోటనే కొనసాగించేందుకు ఉద్యోగుల నుంచి గతంలో మామూళ్లు వసూలు చేశారని ఫిర్యాదుల నేపథ్యంలో పదవీ విరమణ పొందిన ఓ ఉన్నతాధికారిపై విచారణ జరిగింది. పదవీ విరమణకు ఒక రోజు ముందు బదిలీల పేరుతో ఇద్దరు అధికారులు చక్రం తిప్పి ముడుపులు వసూలు చేశారు. వివిధ హోదాల్లో ఉన్న వంద మందికి స్థానచలనం కల్పించి గత కమాండెంట్ రూ.లక్షల్లో దండుకున్నారు. ఈ తరహా బదిలీలపై సిబ్బంది నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డీఐజీ రాజకుమారి ఆదేశాల మేరకు 16వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాస్ గతంలో విచారణ జరిపి ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. అయితే చర్య ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తోంది. మార్గదర్శకాలతో మెమో జారీ చేసిన కమాండెంట్ అర్హుల జాబితాను సిద్ధం చేసిన కంపెనీ ఆర్ఐలు -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
పత్తికొండ రూరల్/ఆస్పరి: రోడ్డు ప్రమాదంలో పందికోన గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పందుల బాలరాజు (34) మృతి చెందారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో బాలరాజు చురుగ్గా పాల్గొనేవాడు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో ముగ్గురు సంతానంలో పెద్దకుమార్తె పేరు షర్మిల, చిన్నకుమారుడి పేరు జగన్ అని పెట్టుకున్నారు. ఆస్పరి మండలం కై రుప్పల సమీపంలో ఆదివారం దేవరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తూ అదుపుతప్పి ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బాలరాజు మృతితో భార్య సరోజ, బంధువులు బోరున విలపించారు. మృతి వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సోమవారం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
టీడీపీ డీలరా.. మజాకా..!
పగిడ్యాల: పేద ప్రజలకు చౌకదుకాణాల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కార్డుదారుల వేలిముద్రలను తీసుకుని బియ్యం వేయకుండా మోసం చేసిన వైనం పడమర ప్రాతకోట గ్రామం 21వ షాపు పరిధిలో వెలుగు చూసింది. గత జగనన్న ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ ఇంటింటికి పంపిణీ చేయగా.. కూటమి ప్రభుత్వం అధికార పార్టీ నేతలను డీలర్లు మార్చి పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తోంది. ఇందుకు పడమర ప్రాతకోట 21వ షాపు నిర్వాకుడే నిదర్శనం. ఈ షాపు పరిధిలో 709 కార్డులు ఉన్నా యి. ప్రతి నెల ఏఏవై కార్ుడ్సకు 13.30 క్వింటాళ్లు, తెల్లరేషన్‌కార్డులకు 90.50 క్వింటాళ్లు కాగా క్లోజింగ్ బ్యాలెన్స్ (సీబీ) పోగా ఓపెనింగ్ బ్యాలెన్స్ 55.84 క్వింటాళ్లు సరాఫరా చేస్తున్నామని సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ నివేదిక అందజేశారు. కార్డుదారులకు టోకరా కొట్టేందుకే ఎండీయూ వాహన డ్రైవర్‌తో బయోమెట్రిక్ మిషన్ ఆన్ చేయించుకుని డీల ర్లే స్వయంగా కార్డుదారుల థంబ్ తీసుకుని బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వం మాది మేము బియ్యం పంచుకుంటాం.. కేవలం థంబ్ వేయించి పోండి’ అంటూ ఎండీయూ డ్రైవర్లపై డీలర్లు పెత్తనం చెలాయిస్తున్నట్లు సమాచారం. అందుకే ఫిబ్రవరి నెలకు సంబంధించి బియ్యం కోటా తక్కువ వచ్చిందని మార్చి నెలలో రెండు నెలల బియ్యం ఒకేసారి వేస్తానని కార్డుదారుల వేలిముద్రలు తీసుకుని దాదాపు 80 ప్యాకెట్ల బియ్యాన్ని డీలర్ మాయం చేసినట్లు సమాచారం. ఎక్కువగా 20 కేజీలు, 25 కేజీలు, 35 కేజీలు కలిగిన కార్డుదారుల వ్రేలిముద్రలను తీసుకుని బియ్యం వేయనట్లు తెలుస్తోంది. పేదల నోటి కాడి బియ్యాన్ని పక్కదారి పట్టించిన అధికార పార్టీ డీలర్‌పై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. బియ్యం వేయకుండానే వేలిముద్రలు తీసుకున్నాడు పోయిన నెలలో నా కార్డుకు బియ్యం వేసి మా కొడుకుల కార్డులకు బియ్యం వేయలేదు. వేలిముద్రలు తీసుకున్నావ్ కదా అని అడిగితే వచ్చే నెలలో వేస్తానని చెప్పినాడు. ఈనెల బండి ఇంకా రాలేదు. – హజరాంబీ, పడమర ప్రాతకోట 5 కేజీలు, 10 కేజీల కార్డులకు మాత్రమే వేశారు కార్డులో ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉన్న వాళ్లకు మాత్రమే 5 కేజీలు, 10, 15 కేజీల బియ్యం వేశారు. 20, 25, 30 కేజీల ఉన్న వారికి ఇవ్వలేదు. నా కొడు కు తలారి అయినా బియ్యం వేయలేదు. ముస్లిం కాలనీలో చాలా మందికి వేయలేదు. రెండు నెలల బియ్యం వేస్తానని వ్రేలిముద్రలు వేయించుకున్నాడు. – మొల్ల జైబున్బీ,పడమర ప్రాతకోట నా దృష్టికి రాలేదు పడమర ప్రాతకోటలోని 21వ షాపు డీలర్ బియ్యం సరిగా పంపిణీ చేయని విషయం నా దృష్టికి రాలేదు. మార్చి నెల కోటా బియ్యం పంపిణీ జరుగుతోంది. ఆర్ఐతో విచారణ చేయించి రెండు నెలల బియ్యం వేసేలా చర్యలు తీసుకుంటాం. – శివరాముడు, తహసీల్దార్, పగిడ్యాల వినియోగదారుల థంబ్ తీసుకుని రేషన్ ఇవ్వని వైనం ఫిబ్రవరి నెలలో దాదాపు 80 బస్తాల బియ్యం మాయం లబోదిబోమంటున్న కార్డుదారులు -
రాళ్ల ట్రాక్టర్ బోల్తా పడి బాలుడి మృతి
పాములపాడు: మండలంలోని చెలిమల గ్రామ సమీపంలో రాళ్ల ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. లింగాల గ్రామానికి చెందిన మోహన్‌రావు కుమారుడు జస్వంత్ (17) 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం పని మీద పాములపాడుకు వచ్చిన జస్వంత్ తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వెళ్తున్న రాళ్ల లోడు ట్రాక్టర్ ఎక్కాడు. మార్గమధ్యలో చెలిమిల గ్రామ సమీపంలో ఎద్దుల వంక వాగు వద్ద ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో రాళ్లపై కూర్చున్న బాలుడు జస్వంత్‌పై రాళ్లుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో బాలుడు సంగీత రాజు క్షేమంగా బయటపడ్డాడు. ప్రస్తుతం డ్రైవర్ స్వాములు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య కొలిమిగుండ్ల: నందిపాడుకు చెందిన గుండ్ర గుర్రప్ప(48) అప్పుల బాధతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ బాబా ప్రకృద్దీన్ తెలిపారు. గుర్రప్ప నాపరాళ్ల వ్యాపారం చేస్తూ నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. కుమారుడు చదువు, కుమార్తె వివాహం కోసం ఫైనాన్స్ సంస్థల వద్ద రూ.9లక్షలు అప్పు చేశాడు. ఇందులో రూ.3 లక్షలు వాయిదాల రూపంలో చెల్లించాడు. మిగిలిన బకాయి చెల్లించే అవకాశం లేక ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాడు. దీతో మనస్తాపం చెంది తిమ్మనాయినపేట జంక్షన్ సమీపంలోని పొలంలోకి వెళ్లి శనగ మాత్రలు మింగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గుర్తించి తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. చెట్టుపై నుంచి కిందపడి యువకుడి మృతి ఆదోని అర్బన్: పెద్దకడబూరు మండలం నెమలికల్లు గ్రామానికి చెందిన అల్తాఫ్(26) అనే యువకుడు చెట్టుపై నుంచి కిందపడి సోమవారం మృతిచెందాడు. బంధువులు తెలిపిన వివరాలు మేరకు .. ఉదయం పొలంలోని టెంకాయ చెట్టు ఎక్కి టెంకాయలను తెంపుతుండగా అకస్మాత్తుగా పై నుంచి కింద పడ్డాడు. కిందకు పడిన యువకుడిని వెంటనే స్థానికులు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అల్తాఫ్ మృతిచెందాడు. మృతుడికి భార్య సునీత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు వలస వెళ్లి ఇటీవలే గ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో రోదనలు మిన్నంటాయి. -
చాగలమర్రిలో దంపతులపై దాడి
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలోని మంగలి వీధిలో షేక్ బీబీ, మహబూబ్‌బాషా దంపతులపై అదే కాలనీకి చెందిన వారు దాడి చేశారు. సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే..మహబూబ్‌బాషా ఇంటి ఎదురుగా తాజు, తాహెర్ అనే వ్యక్తులు నివసిస్తారు. ఇళ్ల ముందు వాహనాలు నిలిపే విషయంలో ఇరుకుటుంబాల మధ్య గొడవ ఉంది. ఈ క్రమంలో సోమవారం తాజు, తాహెర్ మరికొంత మంది మహబూబ్‌బాషా దంపతుల ఇంటిపైకి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బీబీతో పాటు భర్తను స్థానిక ఓ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులపై దాడి విషయం తెలుసుకున్న కుమార్తె అబీదా, బంధువు ఇనాయతుల్లా పరామర్శించేందుకు ప్రొద్దుటూరు నుంచి ఆసుపత్రికి వచ్చారు. నిందితులు మరో పదిమందితో కలిసి అక్కడికి చేరుకొని వారిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే తీవ్రంగా గాయపడిన షేక్ బీబీని వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు. -
ఈత కొట్టి.. ఒడ్డుకు చేరి!
భానుడు ఉగ్ర రూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకు ఎండలు మండుతున్నాయి. ప్రజలతో పాటు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. వైఎస్సార్ జిల్లా పొన్నంపల్లె, అవుకు మండలం కొండమనాయుని పల్లె నుంచి జీవాల మందను కాపరులు మేత కోసం దొర్నిపాడు పొలాల వైపు తీసుకొచ్చారు. ఎండలు అధికంగా ఉండటంతో క్రిష్టిపాడు గ్రామ సమీపంలో ఉన్న కుందూ నదిలో జీవాలకు దించేందుకు తెచ్చారు. మందంతా ఒకేసారి బ్రిడ్జిపైకి వచ్చిన తర్వాత జీవాలను నదిలోకి తోసేశారు. అవి ఈదుతూ ఒడ్డుకు చేరుకుని వేసవి తాపాన్ని తీర్చుకున్నాయి. – దొర్నిపాడుమాకె‘వరు స’రిలేరు.. వంతెనపై జీవాలు -
శాసీ్త్రయ పద్ధతులతో పాడిపరిశ్రమ లాభసాటి
కర్నూలు(అగ్రికల్చర్): శాసీ్త్రయ పద్ధతులను అవలంబిస్తే పాడిపరిశ్రమను లాభసాటిగా మార్చుకోవచ్చని ఆర్‌ఏహెచ్‌టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధాకర్‌రెడ్డి తెలిపారు. కర్నూలు కొండారెడ్డిబురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల ప్రాంగణంలోని ట్రైనింగ్ సెంటర్లో పాడిరైతులకు 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా వాణిజ్య సరళిలో పాడిపశువుల పెంపకం అనే అంశంపై సోమవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాడి రైతులనుద్దేశించి ఏడీ డాక్టర్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా పాడిపశువుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అరుణశ్రీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అంతంత మాత్రమే కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము ధర ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ రైతులకు అంతంతమాత్రం ధర లభిస్తోంది. సోమవారం మార్కెట్‌కు 254 మంది రైతులు 802 క్వింటాళ్ల వాము తెచ్చారు. గరిష్ట ధర రూ.28,888 ఉన్నట్లు ప్రకటించినప్పటికి.. దాదాపు 240 మంది రైతులకు అంతంతమాత్రం ధరే లభించింది. సగటు ధర రూ.12,399 పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ● ఉల్లి ధరలు పడిపోయాయి. మార్కెట్‌కు ఉల్లి 2,873 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.517, గరిష్ట ధర రూ.1537 లభించగా... సగటు ధర రూ.1,187 నమోదైంది. మిర్చికి గరిష్టంగా రూ.12769 లభించింది. సగటు ధర కేవలం రూ.8,720 మాత్రమే నమోదైంది. మార్కెట్‌కు 1,768 క్వింటాళ్ల కందులు వచ్చాయి. కనిష్ట ధర రూ.3,100, గరిష్ట ధర రూ.7,158 లభించగా.. సగటు ధర రూ.6,909 మాత్రమే పలికింది. ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం ● బస్సును ఢీకొన్న ట్రాక్టర్ వెల్దుర్తి: ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ యశ్వంత్ (23) మృతిచెందారు. ఈ దుర్ఘటన వెల్దుర్తి సమీపంలోని హైవే 44పై సోమవారం చోటుచేసుకుంది. ఉదయం 6గంటల సమయంలో కర్నూలు నుంచి అనంతపురం వైపు ఏపీఎస్ ఆర్టీసీ కర్నూలు డిపో అల్ట్రా డీలక్స్ బస్సు వెళ్తోంది. అదే సమయంలో పసుపుల నుంచి వెల్దుర్తికి సొప్పలోడు కోసమని ట్రాక్టరు వస్తోంది. బస్సును పక్కనుంచి ఢీకొనడంతో ట్రాక్టరు ట్రాలీతో విడిపోయి రహదారిపై బోల్తాపడింది. బస్సు డివైడర్ పైకెక్కి, ముందు టైర్లు పగిలిపోయి ఆగిపోయింది. బస్సు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో పసుపులకు చెందిన ట్రాక్టరు డ్రైవర్ యశ్వంత్ మృతిచెందారు. ట్రాక్టర్ క్లీనర్ అదే గ్రామానికి చెందిన సంజీవ్ గాయపడ్డాడు. బస్సు డ్రైవర్, 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వెల్దుర్తి ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. -
రోగాలు వస్తున్నాయి
బాపురం రిజర్వాయర్ ను ంచి 15, 20 రోజులకో సారి నీరు వస్తోంది. పెద్ద ల కాలంలో తవ్వించిన ఒక్కిరేణి రక్షణ గోడలు పడిపోవడంతో పశువులు, కుక్కలు నీరు తాగి పోతున్నాయి. కలుషిత నీటితే తాగుతుండటంతో రోగాలు వస్తున్నాయి. మమ్మల్ని అధికారులు పట్టించుకోవడం లేదు. – రామాంజినేయులు రిజర్వాయర్ నిర్మించాలి మా గ్రామానికి ఐదు కిలో మీటర్లు దూరంలో హంద్రీ నీ వా కాలువ ఉంది. ఆ కాలువ నీటిని మళ్లించి జొహరాపురం సమీపంలో రిజర్వాయర్ నిర్మిస్తే ఆస్పరి, చిన్నహోతూరు, శంకరబండ, చిరుమాన్‌దొడ్డి, హలిగేర గ్రామాలకు కూడా మంచి నీటిని సరఫరా చేయవచ్చు. – లక్ష్మన్న అధికారులు పర్యటించాలి మా గ్రామంలో జిల్లా అధికారుల ఒక్కసారి పర్యటిస్తే సమస్య ఏమిటో తెలుస్తుంది. తరతరాలు గా మేం ఒక్కిరేణి నీటినే తాగుతున్నాం. ప్రస్తుతం ఒక్కిరేణిలో ఉన్న నీరు ఒక నెల మాత్రమే సరిపోతుంది. తరవాత బిందెడు మంచి నీళ్ల కోసం పక్క గ్రామాలైన ఆస్పరి, దేవనబండకు వెళ్లాలి. – బంగారు సంజప్ప -
రాయలసీమ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా లక్ష్మీకర్‌రెడ్డి
కడప వైఎస్ఆర్ సర్కిల్: రవాణాశాఖలో రాయలసీమ స్థాయిలో నాన్ టెక్నికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీటీడీ ఎన్టీఈఏ)కు సంబంధించి సీమ అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి లక్ష్మీకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఎన్నికకు సంబంధించి ఫిబ్రవరి 22న నోటిఫికేషన్, 9న నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కడపలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఎన్నిక కార్యక్రమంలో అధ్యక్షుడిగా లక్ష్మీకర్‌రెడ్డి, జోన్ అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఈవై ప్రకాశ్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్,కడప), జోన్ వైస్ ప్రెసిడెంట్–1గా కె.సువర్ణకుమారి (అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అనంతపురం), జోన్ వైస్ ప్రెసిడెంట్–2గా టీఎన్ పురుషోత్తంరెడ్డి (సీనియర్ అసిస్టెంట్, చిత్తూరు), జోన్ వైస్‌ప్రెసిడెంట్–3గా ఎస్.మనోహర్‌బాబు (జూనియర్ అసిస్టెంట్, ఆదోని), జోన్సెక్రటరీగా టి.విజయ్‌కుమార్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మదనపల్లె), జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఓ.యువ కిశోర్ (సీనియర్ అసిస్టెంట్, తిరుపతి), జోన్ జాయింట్ సెక్రటరీ–1గా డి.నసీరుద్దీన్ (సీనియర్ అసిస్టెంట్, కర్నూలు), జోన్ జాయింట్ సెక్రటరీ–2 ఓ.నాగరాజ (సీనియర్ అసిస్టెంట్, మదనపల్లె), జోన్ జాయింట్ సెక్రటరీ–3 పి.చక్రపాణి (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, చిత్తూరు), జోన్ ట్రెజరర్‌గా ఎన్.రవిప్రకాశ్ (సీనియర్ అసిస్టెంట్, హిందూపురం)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికై న 11 మందిని పలువురు రవాణాశాఖలో పనిచేసే ఉద్యోగులు, టెక్నికల్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై గుర్తు తెలియని దుండగుల దాడి
బేతంచెర్ల: మండల పరిధిలోని సిమెంట్ నగర్ గ్రామ సమీపాన బేతంచెర్ల – నంద్యాల రహదారిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గాయపరిచారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. బేతంచెర్ల పట్టణానికి చెందిన చంద్ర కుమారుడు జశ్వంత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.ఈ యువకుడు ఆదివారం నంద్యాలకు వెళ్లి ద్విచక్ర వాహనం కొనుగోలు చేసుకొని బేతంచెర్లకు బయలు దేరాడు. సిమెంట్ నగర్ సమీపాన బేతంచెర్ల నుంచి నంద్యాల వైపు వెళ్తున్న కోళ్లఫారానికి సంబంధించిన బొలెరో వాహనం ఎదురొచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై నుంచి జశ్వంత్ కింద పడగానే బొలెరోలో ఉన్న గుర్తు తెలియని దుండగులు కిందకు దిగి రాళ్లు, రాడ్డుతో తలపై దాడి చేసి ఆ యువకుడి చేతికి ఉన్న నాలుగు తులాల బంగారు కడియం, రెండు రింగులను బలవంతంగా లాక్కున్నారు. తర్వాత ఆ యువకుడు ఆర్టీసీ బస్సు ఎక్కి బేతంచెర్లకు వెళ్లాడు. అక్కడ స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకొని విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్ఐ రమేష్ బాబు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బంగారం కోసం దాడి చేశారా లేక మరేదైనా కారణం ఉందా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది. -
ముక్క.. మారిన మక్కువ
‘బర్డ్‌ఫ్లూ’ పూర్తిగా తగ్గిపోయినా మాంసం ప్రియులు చికెన్ కొనుగోలుకు ఇష్టం పడటం లేదు. ఖరీదైనా మటన్పైన మక్కువ చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో చికెన్ షాపులు వెలవెల బోతున్నాయి. అధికారులు సైతం అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో వ్యాపారులు నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. కర్నూలు నగరంలో రెవెన్యూ కాలనీలో ఆదివారం కనిపించిన దృశ్యమిది. మటన్ సెంటర్ వద్ద మాంసం ప్రియులు పోటెత్తగా చికెన్ కేంద్రం వద్ద కొనుగోళ్లు కనిపించలేదు. –సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో 17 సంవత్సరాల్లోపు బాలబాలికలకు జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బయ్య, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు నిజాముద్దీన్ పోటీలు ప్రారంభించి మాట్లాడారు. చెస్ క్రీడ ఏకాగ్రతను పెంచుతుందని, తద్వారా చదువులో కూడా రాణించడానికి వీలవుతుందన్నారు. పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా వారి దృష్టిని ఆటలపై మళ్లించాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి, రామకృష్ణ డిగ్రీ కళాశాల డైరెక్టర్ ప్రగతిరెడ్డి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం ఓర్వకల్లు: కర్నూలు–కడప జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గడివేముల మండలం ఒండుట్ల గ్రామానికి చెందిన తలారి రంగస్వామి కొడుకు రంగనాయకులు (50) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తాడు. ఈ క్రమంలో పొగాకు దిగుబడులను విక్రయించేందుకు మండలంలోని నన్నూరు సమీపాన గల డెక్కన్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. పంట నాణ్యత సరిగాలేదని కొనుగోలు దారులు పొగాకు బేళ్లను రీబేల్ చేయడంతో స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ట్రాక్టర్లో వేసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో రెడ్డి డాబా వద్ద ట్రాక్టర్ నిలబెట్టి డాబా వైపునకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా నంద్యాల నంచి కర్నూలు వైపు వెళుతున్న లారీ రంగనాయకులును ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు హైవే పెట్రోలింగ్ వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. -
పంట మార్పిడి ఎంతో మేలు
కర్నూలు(అగ్రికల్చర్): ఎప్పుడూ ఒకే పంట వేస్తుండటంతో చీడపీడల బెడద పెరుగుతుందని, విధిగా పంట మార్పిడి చేపట్టే విధంగా రైతులను ప్రోత్సహించాలని నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధానశాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారావు సూచించారు. కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ సమావేశ మందిరంలో దేశీ డిప్లొమా కోర్సు కింద ఇన్పుట్ డీలర్లకు ఆదివారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు వేసవి దుక్కుల ప్రాధాన్యతపై అవగాహన పెంచాలన్నారు. ఎకరానికి 5 నుంచి 10 వరకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విశ్రాంత జేడీఏ జయచంద్ర పలు సూచనలు చేశారు. -
బరితెగించిన టీడీపీ శ్రేణులు
కొలిమిగుండ్ల: టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. తాజాగా ఓ భూమి విషయంలో కొలిమిగుండ్ల మండలం చింతలాయిపల్లెకు చెందిన నలుగురిపై దాడి చేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే.. చింతలాయిపల్లెలోని 144/1 సర్వే నెంబర్లో 9.72 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విషయంలో దూదేకుల రహంతుల్లా, అంకిరెడ్డిపల్లెకు చెందిన బత్తుల లక్ష్మన్న మధ్య చాలా రోజుల నుంచి వివాదముంది. దీనిపై కోర్టులో వ్యాజ్యం జరుగుతుంది. రహంతుల్లా సోదరులు ఆ భూమిలో చీని చెట్లు నాటుకున్నారు. ఫిబ్రవరి 28న అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి కొలతలు వేసి మూడు ఎకరాల భూమిని లక్ష్మన్నకు అప్పగించారు. జేసీబీ సాయంతో చింతలాయిపల్లెకు చేరుకున్న టీడీపీ శ్రేణులు దౌర్జన్యంగా చీనిచెట్లను తొలగించడంతో రహంతుల్లా కుటుంబానికి చెందిన మహిళలు అడ్డుపడ్డారు. ఇందుకు రెచ్చిపోయిన అధికారపార్టీ నాయకులు లక్ష్మన్న, రంగనాయకులు, సుబ్బులతో పాటు మరి కొంత మంది మహిళలు అని చూడకుండా అమీనాబీ, జైన్‌బీ, ఇమాంబీతో పాటు బాలిక హాసినిపై కట్టెలు, రాళ్లతో ఇష్టానుసారంగా దాడి చేసి గాయపర్చారు. క్షతగాత్రులను కుటుంబ సభ్యులు బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి క్షతగాత్రులను పరామర్శించి ఘటనపై ఆరాతీశారు. చింతలాయిపల్లెలో కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ నేత నీలం సంజీవకుమార్‌రెడ్డికి చెందిన 400 మునగ చెట్లను పూర్తిగా నేలమట్టం చేశారు. ఆకేసులో నిందితులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి అండతోనే దాడులు దౌర్జన్యంగా మహిళలపై దాడి నలుగురికి గాయాలుబనగానపల్లె రూరల్: బీసీ జనార్దన్‌రెడ్డి మంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. మంత్రి అండతోనే ఆ పార్టీ నాయకులు చింతలాయిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడి చేశారన్నారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి బీసీ ప్రోద్బలంతో కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాధితులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి కోర్టు వ్యాజ్యంలో ఉన్నటువంటి పొలాన్ని బత్తుల లక్ష్మన్న కుటుంబసభ్యులకు అప్పగించాలని ఒత్తిడికి గురిచేసినట్లు ఆరోపించారు. అంగీకరించకపోవడంతో చీని చెట్లను జేసీబీ సహాయంతో తొలగించడమే కాక దాడి చేశారన్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు అన్ని విధాలుగా తాను అండగా ఉంటానన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాది అబ్దుల్‌ఖైర్ ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
● ఇద్దరి పరిస్థితి విషమం ఆళ్లగడ్డ: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై ఆళ్లగడ్డ సమీపంలోని హైవే ఢాబా సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కడప పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మహానంది క్షేత్రానికి వెళ్లి దర్శనం చేసుకుని కారులో తిరిగి ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ఆళ్లగడ్డ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బ్రిడ్జిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న సుధాకర్ (28) అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటేఽశ్వర్లు, మనీష్‌కుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రమోద్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల వైద్యశాలకు తరలించారు. -
మూడు రోజుల వైద్య శిబిరం
వెల్దుర్తి: చిన్నారులు అనారోగ్యం పాలయ్యారన్న సమాచారం తెలుసుకుని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శాంతికళ, డీపీఓ భాస్కర్ ఆదివారం వెల్దుర్తి సీహెచ్‌సీ, రత్నపల్లె గ్రామాన్ని సందర్శించారు. చిన్నారులకు విషజ్వరాలు కావని తేల్చుకుని మూడు రోజుల పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎంపీడీఓ డీఐఓ నాగప్రసాద్, సంచార వైద్య చికిత్స నోడల్ అధికారి రఘు, రామళ్లకోట పీహెచ్సీ వైద్యాధికారి భువనతేజ, రత్నపల్లె సర్పంచ్ ఫక్కీరమ్మ పాల్గొన్నారు. -
మాజీ సైనికుడి మృతి
కర్నూలు(అగ్రికల్చర్): నగర శివారులో నివాసం ఉంటున్న మాజీ సైనికుడు ప్రేమ్‌కుమార్(45) ఆనారోగ్య కారణా లతో ఆదివారం మరణించారు. ఈయన భారత సైన్యంలో ఎంఈజీ 22 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసి హవల్దారుగా పదవీ విరమణ తీసుకున్నారు. నగర శివారులోని వెంకాయపల్లి ఎల్లమ్మ దేవస్థానం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించడంతో పలువురు మాజీ సైనికులు సంతాపం ప్రకటించారు. మృతుడి స్వగ్రామమైన ఆళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. సైన్యంలో విశేషంగా సేవలు అందించిన ప్రేమ్‌కుమార్ మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు నర్రా పేరయ్య చౌదరి ఆదివారం ఓ ప్రకటనలో తన సంతాపం తెలిపారు. బైక్ అదుపు తప్పి.. ● కానాలా గ్రామ వాసి మృతి ఉయ్యాలవాడ: మాయలూరు– కానాల ఆర్అండ్బీ రహదారిలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపు తప్పి కింద పడి మృతి చెందాడు. ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు... సంజామల మండలం కానాల గ్రామానికి చెందిన కమలాకర్ (45) పనిమీద గోవిందపల్లె గ్రామానికి వెళ్లాడు. తర్వాత తిరిగి తన స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గ మధ్యంలో మాయలూరు– కానాల ఆర్అండ్బీ రోడ్డులో రైల్వే ట్రాక్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పక్కనున్న గుంతలో పడింది. ఈఘటనలో కమలాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శోభ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. గోనెగండ్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని మండల పరిధిలోని ఒంటెడుదిన్నె గ్రామానికి చెందిన కురువ ఈరన్న (30) అనే యువకుడు మృతిచెందాడు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల మేరకు.. కురువ చిన్న ఉరుకుందు, గంగమ్మ కుమారుడు అయిన ఈరన్న శనివారం రాత్రి గోనెగండ్ల నుంచి స్వగ్రామానికి నడుచుకుంటూ వెలుతున్నాడు. అయితే, గాజులదిన్నె ప్రాజెక్టు స్టేజ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో ఈరన్న తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు 108 అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక రాత్రి మృతిచెందినట్లు తెలిపారు. మృతిడి అక్క కురువ నరసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బియ్యం పట్టివేత నందికొట్కూరు: పట్టణంలోని సంగయ్యపేటలో పగడం పక్కిరయ్య అనే వ్యాపారి ఇంటి ముందు 37 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి బియ్యాన్ని స్టేషన్‌కు తరలించినట్లు టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఎవరైనా పీడీఎస్ బియ్యం విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా చట్ట పరమైన చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. -
క‘న్నీటి’ కష్టాలు
● జొహరాపురం గ్రామానికి ఒక్కిరేణి నీరే దిక్కు ● పిల్లల నుంచి పెద్దల వరకు తప్పని అవస్థలు ● పిలిచినా ఊరికి రాని బంధువులు ఒక్కిరేణిలో నీరు తీసుకెళ్తున్న గ్రామస్తులు ఆస్పరి: ఎండలు మండుతూ దాహం వేసినా చుక్క నీరు తాగలేని దుస్థితి వారిది. మంచినీరు కావాలంటే దూరం వెళ్లాలి. అక్కడ వేల మంది జనం.. చాలా కష్టం పడితేనే బిందె నీరు దొరుకుతుంది. ఇంట్లో ఉండే మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులను తమతోపాటు తప్పని తీసుకెళ్లాల్సిన దుస్థితి. ఆస్పరి మండలంలోని జొహరాపురం ప్ర‘జల’ కష్టాలు ఇవీ.. గ్రామంలో 1,200 ఇళ్లు ఉండగా 7,000 మంది నివాసం ఉంటున్నారు. యాభై ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం జొహరాపురానికి 50 కిలో మీటర్లు దూరంలో ఉన్న బాపురం రిజర్వాయర్ నుంచి మంచి నీటి సరఫరా చేసేందుకు పైపులైన్ వేసింది. అయితే పై గ్రామాలైన ఆలూరు, మొలగలవల్లి, కొట్టాల గ్రామాల వారు నీటి అవసరాలు తీర్చుకున్న తరువాతే జొహరాపురం గ్రామానికి బాపురం రిజర్వాయర్ నీరు వస్తుంది. అది కూడా ప్రతి ఒక్క కాలనీకి నీటిని సరఫరా చేయరు. దీంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో గ్రామ సమీపంలో కలుషితంగా ఉన్న ఒక్కిరేణి నీటితోనే దాహం తీర్చుకుంటున్నారు. కొందరు జ్వరం, విరేచనాలు, నొప్పులు ఎక్కువై అస్పత్రుల పాలవుతున్నారు. ఒక్కిరేణిలో నీరు లేకపోతే ఆలూరు, ఆస్పరి నుంచి వచ్చే మినిరల్ వాటర్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఎక్కడ బోరు వేసినా ఫ్లోరైడ్ నీరే! వేసవి వచ్చిందంటే జొహరాపురంలో చదువుకునే పిల్లలు నుంచి వయో వృద్ధు లు వరకు నీటి కోసం వెళ్లాల్సిందే.ఈ గ్రామ పరిసరాలు మొత్తం నల్లరేగడి భూములున్నాయి. దీంతో ఎక్కడ బోరు వేసినా ఫ్లోరైడ్ నీరే పడుతోంది. బోర్లు, రిజర్వాయర్లు లేని కాలంలో దాహం తీర్చుకునేందుకు వందల ఏళ్ల క్రితం పెద్దలు వర్షపు నీరు వెళ్లే ప్రధాన కాలువ సమీపంలో ఒక్కిరేణి నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఒక్కిరేణి నీటినే గ్రా మస్తులు తాగుతున్నారంటే పరిస్థితి ఎంత దారణంగా ఉందో అర్థమవుతోంది. గ్రామంలో మంచి నీటి సమస్య ఉండటంతో దాదాపు వంద కుటుంబాలు భూములను కౌలుకిచ్చి కర్నూలు, బళ్లారి, ఆదోని పట్ణణాలకు వెళ్లి స్థిర పడ్డారు. ఇంకా చాలా మంది వేళ్లే ఆలోచనలో ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతి ఇంటికీ సంపు గ్రామంలో కొత్తగా నిర్మించుకునే ప్రతి ఇంటికి సంపు ఏర్పాటు చేసుకుంటున్నారు. మిద్దె పై నుంచి వచ్చే నీటిని పైపులు ద్వారా సంపును నింపుకుంటున్నారు. కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలన్నా నీరు దొరక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క ట్యాంకర్ నీరు రూ.800 కొనుగోలు చేస్తున్నారు. ఇది అదనపు ఖర్చు అని బాధపడుతున్నారు. నీటి సమస్య ఉండడంతో గ్రామంలో శుభ కార్యాలు కూడా చేయక పట్టణాలలోని ఫంక్షన్ హల్లో చేసుకుంటున్నారు. -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
కొలిమిగుండ్ల: బెలుం శింగవరంలో భార్యను హత్య చేసిన కేసులో భర్తను అరెస్ట్ చేసినట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం నిందితుడి వివరాలను విలేకరుల సమావేశంలో సీఐ వెల్లడించారు. గ్రామానికి చెందిన బిజ్జం చిన్న వెంకట్రామిరెడ్డి, మనోహరమ్మ దంపతులు వ్యవసాయ పనులకు వెళ్తూ జీవనం సాగించేవారు. కాగా చిన్న వెంకట్రామిరెడ్డి మద్యానికి బానిస కావడం, ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుని ఆస్తులతో పాటు డబ్బులు పొగొట్టుకున్నాడు. పూర్తిగా మద్యానికి బానిసై పనికి పోకుండా ఖాళీగా ఉంటూ భార్యతో గొడవ పడేవాడు. మనోహరమ్మ కూలీ పనుల ద్వారా వచ్చిన డబ్బుల కోసం ఘర్షణ పడి లాక్కునేవాడు. పైగా భార్యపై రోజు రోజుకు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన భార్యను రోకలి బండతో బలంగా కొట్టడంతో దుర్మరణం చెందింది. మృతురాలి తండ్రి గడ్డం తిమ్మా రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితు డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
తండ్రి మృతి.. తనయుడికి గాయాలు
కల్లూరు/ వెల్దుర్తి: బైక్‌ను గుర్తుతెలియన వాహనం ఢీకొనడంతో తండ్రి మృతి చెందగా తనయకుడికి గాయలయ్యాయి. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద హైవే 44పై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఉలిందకొండ ఎస్ఐ ధనుంజయ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి ఎల్లమ్మ గుడి పూజారి అయిన ఎల్లమద్దిలేటి టైలర్ పనిచేస్తూ తన కుమారుడు ఎల్లస్వామిని బీటెక్ చదివిస్తున్నారు. కుమారుడితో కలిసి బైక్‌పై వెల్దుర్తి నుంచి కర్నూలుకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తుండగా చిన్నటేకూరు సమీపంలో గుర్తుతెలియన వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలుకొట్టింది. బైక్ వెనుక కూర్చున్న తండ్రి ఎల్లమద్దిలేటి రోడ్డుపై పడ్డి తీవ్ర రక్తగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ నడుపుతున్న ఎల్లస్వామి స్వల్పగాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న ఉలిందకొండ పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటనా ప్రాంతంలో తండ్రి మృతదేహం వద్ద కుమారుడి రోదన కంటతడి పెట్టించింది. మృతునికి భార్య లక్ష్మిదేవి, కుమారుడు, డిగ్రీ చదువుతున్న కుమార్తె ఉన్నారు. బైక్‌ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం -
చూపును హరించే ‘గ్లకోమా’
● జిల్లాలో అధికమవుతున్న కేసులు ● నేటి నుంచి ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు కర్నూలు(హాస్పిటల్): కంటి అద్దాలను తరచూ మార్చాల్సి రావడం.. మసక వెలుతురులో వస్తువులను గుర్తించడం ఆలస్యం అవడం.. లైట్ల చుట్టూ రంగుల వలయాలు కనిపించడం.. ఇలా ఎన్నో లక్షణాలు గ్లకోమా వ్యాధిలో భాగంగా ఉంటాయి. ఈ వ్యాధికి ప్రాథమిక దశలో చికిత్స తీసుకుంటే చూపును కాపాడుకోవచ్చు. ఆలస్యం చేస్తే మాత్రం అంధకారమే మిగులుతుంది. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు గ్లకోమా వారోత్సవాలు నిర్వహించనున్నారు. పెరుగుతున్న బాధితులు కర్నూలులోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి వైద్యశాల, నంద్యాల కంటి ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లలో కంటి సమస్యలకు చికిత్స చేస్తారు. గతంలో 2 శాతం వరకు గ్లకోమా బాధితులు ఉంటున్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య పెరిగింది. ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ప్రతి రోజూ 250 నుంచి 300 మంది దాకా చికిత్స కోసం వస్తుండగా అందులో గ్లకోమా బాధితులు 5 నుంచి 10 మంది దాకా ఉంటున్నారు. గ్లకోమా వారోత్సవాలను పురస్కరించుకుని కర్నూలులోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ప్రత్యేక ఓపీ నిర్వహిస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన వైద్యులు అవగాహన కల్పించనున్నారు. చికిత్స ఇలా.. గ్లకోమాకు శాశ్వత చికిత్స లేదని, మందులతో వ్యాధిని అదుపు చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. కొందరికి లేజర్ చికిత్స చేయవచ్చు. అలాగే శస్త్రచికిత్సతో చూపును కాపాడుకోవచ్చు. సాధారణ ఆంగిల్ క్లోజర్ గ్లకోమా చికిత్సలో డాక్టర్ లేజర్‌ను ఉపయోగించి ద్రవం ప్రవహించడానికి మరో మార్గం తయారు చేస్తారు. కానీ బాగా ముదిరిన దశలో రోగికి మందులు, శస్త్రచికిత్సల అవసరం ఉంటుంది. వారోత్సవాలు ఎక్కడంటే.. గ్లకోమాపై ఆదివారం అవగాహన వారోత్సవాల ప్రారంభం కార్యక్రమాన్ని కంటి ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు.జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ ఎం. సంధ్యారెడ్డితో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 10వ తేదీన పడిగిరాయి పీహెచ్సీలో, 11న వాక్‌థాన్, 12న పోలకల్ పీహెచ్సీలో, 13న కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో, 14న హర్దగేరి పీహెచ్సీలో, 15న కంటి ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్లకోమా కు కంటి ఆసుపత్రిలో ప్రతిరోజూ ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో కంటి వైద్యులు డాక్టర్ సత్యనారాయణరెడ్డి, డాక్టర్ యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘యువత పోరు బాట’ను విజయవంతం చేద్దాం
బనగానపల్లె రూరల్: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో నిర్వహించే ‘యువత పోరు బాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బనగానపల్లెలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇంత వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఏటా డీఎస్సీ నోటిఫికేషన్, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి హామీలు చేయకపోవడంతో యువత మోసపోయిందన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పి మహిళలను దగా చేశారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని విమర్శించారు. 2014–19 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద సుమారు రూ.3,200 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఈనెల 12న చేపట్టే యువత పోరు బాట కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అదే రోజు ముందుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రచార కార్యదర్శి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం బనగానపల్లె, కోవెలకుంట్ల సంజామల, మండలాల అధ్యక్షులు తూర్పింటి శ్రీనివాసరెడ్డి, అంబటి రవికుమార్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, తోట వెంకటేశ్వరరెడ్డి, కోవెలకుంట్ల వాణిజ్య విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి -
సాంకేతిక విద్య.. ఉజ్వల భవిత
నంద్యాల(న్యూటౌన్): ఉన్నత చదువులు రోజు రోజుకు భారమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో పేద విద్యార్థులు సాంకేతిక విద్య వైపు అడుగులు వేస్తే భవిష్యత్ బంగారు బాట అవుతుంది. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య పూర్తి చేసి ఆ తర్వాత దాని పునాదిగా చేసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందు కోవచ్చు. పదో తరగతి ఉత్తీర్ణతతో సాంకేతిక విద్యకు పునాది వేసే ‘పాలిసెట్’కు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగానే పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకుని జిల్లాలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక విషయ నిపుణులు పేర్కొంటున్నారు. పాలిసెట్–2025 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తుల తుది గడువు ప్రకటించలేదు. కోర్సులు ఇలా... ప్రస్తుతం సరికొత్త కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులోకి తెచ్చాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సు లు అందుబాటులో ఉన్నాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచ్‌కు 60 నుంచి 120 వరకూ సీట్లు ఉన్నాయి. నంద్యాల జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉండగా, జిల్లా వ్యాప్తంగా మరో ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ 30, మెకానికల్ 30 సీట్లు ఉన్నాయి. ఐదు ప్రైవేట్ కళాశాలల్లో సుమారు 1,500 వరకు సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పాలిసెట్ ఎంట్రెన్స్‌లో క్వాలిఫై మార్కులు 35గా నిర్ణయించారు. ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పాలిసెట్ ఎంట్రెన్స్ ఇలా.. పాలిసెట్ ఎంట్రెన్స్‌ను 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు. పాలిటెక్నిక్ కోర్సులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏప్రిల్ 30న పాలిసెట్ సద్వినియోగం చేసుకోవాలి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో చదువుకునేందుకు ఉపకరించే పాలిసెట్–2025కు దరఖాస్తు చేసుకోవాలి. పాలిటెక్నిక్ చదివితే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధికి అవకాశముంటుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు ఉచిత కోచింగ్‌తో పాటు, సంబంధిత మెటీరియల్ ఉచితంగా సరఫరా చేస్తున్నాం. – శ్రీనివాసప్రసాద్, పాలిసెట్ జిల్లా కన్వీనర్, నంద్యాల విద్యార్థులకు ప్రయోజనాలెన్నో.. పాలిటెక్నిక్‌లో ఏ కోర్సును పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా లభిస్తుంది. ఈ కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్ లో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. -
నాణ్యమైన విద్యకు చిరునామా ‘బనవాసి ఏపీఆర్జేసీ’
దరఖాస్తుకు ఈ నెల 31 ఆఖరు ● ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష ● నాలుగు జిల్లాల విద్యార్థినులకు అవకాశం ఎమ్మిగనూరు రూరల్: బనవాసి ఏపీ గురుకుల జూనియర్ కాలేజీ క్రమ శిక్షణకు, నాణ్యమైన విద్యా బోధనకు పెట్టింది పేరు. కాలేజీలో సీటు రావటం విద్యార్థినులు అదృష్టంగా భావిస్తారు. ఏపీ గురుకుల కాలేజీలో చదువుకున్న విద్యార్థిని ఉన్నత విద్యలో రాణిస్తుందనే నమ్మకం. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థినులకు ఇక్కడ రెండు సంవత్సరాల విద్యాబోధన అందుతుంది. ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే సీటు వచ్చినట్లే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, క్రీడాకారులు, అనాథలు, ఎన్సీసీ కేడెట్లకు రిజర్వేషన్ వర్తిస్తుంది. సీటు దక్కించు కున్న విద్యార్థినులకు హాస్టల్ వసతి కూడా ఉంటుంది. కాలేజీలో బాలికలకు ఎంపీసీలో 60 సీట్లు, బైపీ సీలో 40 సీట్లు, ఎంఈసీలో 30 సీట్లు ఉంటాయి. ఆన్లైన్లో దరఖాస్తు: ఇంటర్మీడియట్ ప్రవేశానికి పదో తరగతి విద్యార్థి నీలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https//aprs.apcfss.in వెబ్‌సైట్‌ను చూడవచ్చును. ఈనెల 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే.. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న (మధ్యా హ్నం 2.30 నుంచి 5 గంటల) నిర్వహిస్తారు. బాలికలకు మంచి అవకాశం రాయలసీమలోని నాలుగు జిల్లా విద్యార్థినులకు ఇది మంచి అవకాశం. కాలేజీలో సీటు వస్తే రెండు సంవత్సరాలు బోధన అందిస్తాం. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వి.గీర్వాణి, జిల్లా కో–ఆర్డినేటర్, ప్రిన్సిపాల్ ఏజీఆర్జేసీ బనవాసి -
ఏఈఓల సంఘం జిల్లా కోశాధికారిగా నరసింహుడు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం(ఏఈఓలు) కోశాధికారిగా వి.నరసింహుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖాళీగా ఉన్న ఈ పోస్టు భర్తీకి శనివారం కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. మంత్రాలయం మండలంలో ఏఈఓగా పని చేస్తున్న నరసింహుడుని కార్యవర్గసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపికకు పరిశీలకుడిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.నాగేశ్వరరెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షుడు చాంద్‌బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, ఇతర కార్యవర్గసభ్యలు పాల్గొన్నారు. కొలనుభారతి దేవికిప్రత్యేక పూజలు కొత్తపల్లి: రాష్ట్రంలో ఏకైక సరస్వతి క్షేత్రంగా విరాజిల్లుతున్న కొలనుభారతి దేవి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి మహాన్యా స పూర్వక రుద్రాభిషేకం, మహామంగళహారతి వంటి విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కల్యాణం, ప్రజలు పాడి పంటలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రధాన అర్చకుడు గంట్యాల శ్రీనివాస శర్మ సరస్వతి హోమం నిర్వహించారు. బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య పగిడ్యాల: తండ్రి బైక్ కొనివ్వనందుకు ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్త ముచ్చుమర్రి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లుది నిరుపేద కుటుంబం. వ్యవసాయ పనులకెళ్తూ జీవనం సాగించే ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివరామ్ (21) బోలెరో వాహనానికి డ్రైవర్‌గా వెళ్తున్నాడు. కొద్ది రోజుల నుంచి తనకు బైక్ కొనివ్వాలని తండ్రిని వేధించేవాడు. శుక్రవారం రాత్రి తండ్రితో గొడవపడి ఆవేశంతో ఇంట్లోకి వెళ్లి ఉరేసున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి ఉరికి వేలాడుతున్న యువకుడిని కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ముచ్చుమర్రి పోలీసులు కేసు నమోదు చేశారు. -
ముట్టుకుంటే షాక్
● విద్యుత్ వినియోగదారుల నిలువు దోపిడీ ● 2022, 2023, 2025 సంవత్సరాల్లో వాడిన విద్యుత్‌కు ప్రతి యూనిట్‌పై 40పైసల వడ్డింపు ● ట్రూ అప్ చార్జీలతో మరో అదనపు భారం ● బిల్లులను చూసి బెంబేలెత్తుతున్న ప్రజలు కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలపై టీడీపీ, జనసేనలు చేసిన దుష్ప్రచారం అంతాఇంతా కాదు. అడ్డుగోలుగా చార్జీలు పెంచి మోయలేని భారం వేస్తున్నారని ప్రజలను నమ్మించి ఎన్నికల్లో లబ్ధి పొందడం తెలిసిందే. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వి నియోగదారులపై విద్యుత్ చార్జీల భారం మోపం, చార్జీలు తగ్గిస్తాం తప్ప పెంచబోమనే ప్రచారాన్ని ఊదరగొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల్లోనే విద్యుత్ వినియోగదారులు చుక్కలు చూస్తున్నారు. సామాన్య ప్రజలు మొదలు అన్ని వర్గాల వారిపై మోపిన విద్యుత్ చార్జీల భారం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొదటి ఏడాదిలోనే విద్యుత్ చార్జీల భారం ఈ స్థాయిలో ఉంటే, రానున్న నాలుగేళ్లలో పరిస్థితి ఊహించుకుంటేనే షాక్ కొడుతోంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నా.. ఒక్కరోజు ఆలస్యమైతే చాలు సర్‌చార్జీ పేరిట జరిమానా విధిస్తున్నారు. మళ్లీ సర్దుబాటు తదితర పేర్లతో 2022, 2023 సంవత్సరాల్లో వినియోగించిన విద్యుత్‌కు కూడా నేడు చార్జీ వేస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వ ‘షాక్’ ఇలా వినియోగదారుడు ఒక నెలలో 125 యూనిట్లు వినియోగిస్తే మొదటి మూడు శ్లాబ్‌ల ప్రకారం బిల్లు రూ.417 వస్తుంది. దీనికి కస్టమర్ చార్జీ రూ.45, ఫిక్స్డ్ చార్జీ రూ.20, ఈడీ చార్జీ రూ.7.50 వసూలు చేస్తారు. అన్నీ కలిపి 125 యూనిట్లకు చెల్లించాల్సిన బిల్లు రూ.489.5 మాత్రమే. ఇదే 125 యూనిట్లకు కూటమి ప్రభుత్వం వసూలు చేస్తున్న మొత్తం రూ.850. అంటే బిల్లుపై అదనంగా రూ.361 భారం మోపుతోంది. విద్యుత్ వినియోగం పెరిగే కొద్దీ భారం తడిచి మోపెడవుతుంది. భారం ఇలా పడుతోంది.. విద్యుత్ చార్జీల భారం వివిధ రూపాల్లో పడుతోంది. 2022, 2023, 2025 సంవత్సరాలకు సంబంధించి సర్దుబాటు పేరుతో ఎఫ్‌పీపీసీఏ వసూలు చేస్తున్నారు. ఆయా సంవత్సరాల్లో నెల వారీగా వినియోగించిన యూనిట్లపై 40 పైసల ప్రకారం భారం పడుతోంది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ట్రూ అప్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ప్రజలను ఈ చార్జీలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సగటున ప్రతినెలా రూ.95కోట్లకు పైనే భారం సంక్షేమ పథకాల ఊసే లేకపోవడం వల్ల ప్రజల్లో నగదు సర్క్యులేషన్ గణనీయంగా తగ్గిపోయింది. మళ్లీ పేదరికం పురుడుపోసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల హామీలను పక్కనపెట్టిన ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీల పేరిట అదనపు భారం మోపుతోంది. ఉమ్మడి జిల్లాలో 15.85 లక్షల గృహ విద్యుత్ కలెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో కనెక్షన్‌కు సగటున రూ.600 అదనపు భారం లెక్కకట్టినా ప్రతి నెలా రూ.95కోట్లకు పైనే ముక్కుపిండి వసూలు చేస్తుండటం గమనార్హం. రూ.542 అదనపు బిల్లు ఫిబ్రవరి నెలలో 145 యూనిట్లు వినియోగించాం. విద్యుత్ చార్జీ రూ.537 వచ్చింది. ఫిక్స్డ్ చార్జీ రూ.50, కస్టమర్ చార్జీ రూ.50 వేశారు. మామూలుగా అయితే రూ.637 బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎఫ్‌పీపీసీఏ రూ.307.07, 2023 సంవత్సరం ఫిబ్రవరి నెల ఎఫ్‌పీపీసీఏ రూ.166.20, 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల ఎఫ్‌పీపీసీఏ రూ.59.60, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.8.70 ప్రకారం అదనపు భారం పడింది. మొత్తంగా వచ్చిన బిల్లు రూ.1,179. – బి.నాగలక్ష్మి, కర్నూలు -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
కర్నూలు(సెంట్రల్): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ది అన్నారు. ప్రమాదం ఎటునుంచి వచ్చినా తట్టుకోగలిగే సామర్థ్యాన్ని మహిళలు పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షుడు ఎం.వెంకట హ రినాథ్, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి భూపాల్‌రెడ్డి, ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి లక్ష్మీరాజ్యం, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జ్యోత్స్నదేవి, ఎకై ్సజ్ కోర్టు సరోజమ్మ హాజరయ్యారు. మహిళా జడ్జీలను సన్మానించారు. లోక్ అదాలత్‌లో పది వేల కేసుల పరిష్కారం కర్నూలు (టౌన్): జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పది వేలకు పైగా కేసులు పరిష్కారం జరిగినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 చోట్ల జాతీయ లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి కక్షిదారుల కేసులు పరిష్కారం చేసినట్లు చెప్పారు. కర్నూలులో 5 బెంచీలు ఏర్పాటు చేసి న్యాయమూర్తులు జి.భూపాల్ రెడ్డి, లక్ష్మిరాజ్యం, జ్యోత్స్నదేవి, ఎం.సరోజనమ్మ, విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మీనరసింహారెడ్డి 4,500 కేసులు పరిష్కారం చేశారన్నారు. నంద్యాలలో 1,021, ఆదోనిలో 432, ఆళ్లగడ్డలో 554, ఆలూరులో 291, ఆత్మకూరులో 319, బనగానపల్లెలో 714, డోన్‌లో 630, కోవెలకుంట్లలో 402, నందికొట్కూరులో 266, పత్తికొండలో 427, ఎమ్మిగనూరులో458 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. పొట్టేళ్లు అ‘ధర’ హో.. కోడుమూరు రూరల్: బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో చాలామంది ప్రజలు చికెన్‌ను వదిలేసి మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పొట్టేళ్లకు గిరాకీ పెరిగింది. శనివారం కోడుమూరులో జరిగిన సంతలో ఒక్కో పొట్టేలు సైజును బట్టి రూ.10వేల నుంచి రూ.20వేలకు పైగా పలికింది. పొట్టేళ్ల ధరలు భారీగా ఉన్నప్పటికీ ప్రజలు కొనేందుకు ఎగబడ్డారు. నేడు జూడో ఎంపిక పోటీలు కర్నూలు (టౌన్): ఆలూరు పట్టణంలోని ప్రభు త్వ బాలుర పాఠశాలలో ఆదివారం ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జూడో సంఘం కార్యదర్శి చంద్రయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 15, 16 తేదీల్లో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.