రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
ఆదోని రూరల్: ఆదోని–ఎమ్మిగనూరు జాతీయ రహదారిలో స్కూటర్‌కు కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. తాలూకా ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకు.... ఆదోని పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పవన్‌కుమార్ (30) ఎర్రకోటలోని ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. ఇతను బుధవారం స్కూటీపై ఆదోని మండలంలోని పెసలబండ దేవరకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఎమ్మిగనూరు నుంచి ఆదోని వైపు వస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారు (కేఏ41 ఎంఏ3367) అతివేగంగా వచ్చి వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న పవన్‌కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పవన్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రులు జయలక్ష్మి, హనుమంతు ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
టిప్పర్‌కు రూ. 2.45 లక్షల జరిమాన
డోన్ టౌన్ : జాతీయ రహదారిలో దత్తాత్రేయ స్వామి గుడి వద్ద బుధవారం ఓ టిప్పర్‌ను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. వెల్దుర్తి వద్ద జరుగుతున్న రైల్వే పనులకు వినియోగిస్తున్న ఈ వాహనానికి సంబంధించి రెండేళ్లుగా ఫిట్‌నెస్, రోడ్డు ట్యాక్స్ చెల్లించలేదు. అధికారులు బుధవారం దత్తాత్రేయ స్వామి తనిఖీలు నిర్వహిస్తుండగా కనిపించడంతో రూ. 2.45 లక్షల జరిమాన విధించి టిప్పర్‌ను డోన్ ఆర్టీసీ డిపోకు తరలించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు తిప్పరాదని, ఈ నిబంధనను ఎవరైనా అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తామని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్ హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం


