నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో త్వరలో జన ఔషధి
నంద్యాల: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో జన ఔషధి మెడికల్ షాప్ అందుబాటులోకి రానుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి జన ఔషధి మెడికల్ షాప్ రూమును బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన మందులను తక్కువ ధరకే ప్రతి ఒక్కరికీ అందించాలనే లక్ష్యంతో ఈ షాపులను ప్రారంభిస్తోందన్నారు. రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ రాజకుమారి, జిల్లా చైర్మన్ దస్తగిరి, జిల్లా సెక్రెటరీ, జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జిలాని బాషా, రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్‌బాష, రెడ్ క్రాస్ డీఎఫ్‌ఓ సమీ, ఫార్మసిస్టు ఇంద్రజ, మున్సిపల్ ఇంజినీర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.


