రికార్డుల నిర్వహణ ఇలాగేనా? | - | Sakshi
Sakshi News home page

రికార్డుల నిర్వహణ ఇలాగేనా?

Feb 6 2026 7:58 AM | Updated on Feb 6 2026 7:58 AM

రికార్డుల నిర్వహణ ఇలాగేనా?

రికార్డుల నిర్వహణ ఇలాగేనా?

హార్టికల్చర్‌పై అవగాహన

ఎక్కడ కల్పించారు?

డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

సూర్యనారాయణ ఆగ్రహం

కొత్తపల్లి: ఉపాధి హామీ అధికారులపై డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎంపీడీఓ మేరి అధ్యక్షతన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అనుబంధ సంస్థలలో జరిగిన పనులపై 18వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనుల నిర్వహణ అంతా అస్తవ్యస్థంగా ఉందన్నారు. చేసిన పనుల ఫొటోలు లేకపోవడంతో ఎక్కడ, ఎప్పుడు పనులు చేశారో తనిఖీ అధికారులు గుర్తించలేకపోయారన్నారు. రికార్డుల నిర్వహణ పనితీరుపై మండిపడ్డారు. హార్టికల్చర్‌పై రైతులకు అవగాహన ఎవ్వరూ కల్పించినట్లు లేదన్నారు. తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త్తలు తీసుకోవాలన్నారు. 2024–25లో రూ.9.90 కోట్లతో జరిగిన 961 పనులపై సామాజిక తనిఖీ చేయగా 1.79 కోట్ల అవకతవకలు జరిగినట్లు గుర్తించారన్నారు. హార్టికల్చర్‌ కింద రైతుల పొలాల్లో మొక్కలు లేనందున మొక్కలు లేని చోట రీ ప్లాంటేషన్‌ చేయకపోతే రైతుల నుంచి రీప్లాంటేషన్‌కు రూ.96,796 రీకవరి చేయాలని ఆదేశించారు. మిగిలిన వాటిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో ఏపీడీ వెంకటరామిరెడ్డి, అడిషనల్‌ విజిలెన్స్‌ అధికారి పరమేశ్వరుడు, సామాజిక తనిఖీ ఎస్‌ఆర్పీ చంద్రమోహన్‌, ఏపీఓ విమలమ్మ, పీఆర్‌ఏఈ మద్దిలేటి, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement