పాణ్యం ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా విజయభాస్కర్‌ | - | Sakshi
Sakshi News home page

పాణ్యం ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా విజయభాస్కర్‌

Feb 13 2026 3:49 AM | Updated on Feb 13 2026 3:49 AM

పాణ్య

పాణ్యం ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా విజయభాస్కర్‌

బొమ్మలసత్రం: పాణ్యం నియోజకవర్గం ఎస్సీ వి భాగం అధ్యక్షులుగా విజయభాస్కర్‌(యువరాజ్‌)ను నియమిస్తూ వైఎస్సార్‌సీపీ కేంద్ర కా ర్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

కారును ఢీకొన్న ప్రైవేటు బస్సు

ఆలూరు రూరల్‌: ప్రైవేటు ట్రావెల్‌ బస్సుల ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌తో హైవేల్లో ఎక్కడో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హులేబీడు గ్రామ సమీపంలో హైవే –167పై బుధవారం అర్ధారాత్రి 12.30 గంటలకు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ నుంచి ఆలూరు మీదుగా మంత్రాలయం వెళ్తున్న కారును ఆదోని నుంచి బళ్లారి వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో కారు డ్రైవర్‌ విజయ్‌ కుమార్‌కు స్వల్పగాయాలయ్యాయి. బస్సులో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ రంగయ్య విలేకరులకు తెలిపారు.

విద్యుదాఘాతంతో డ్రైవర్‌ మృతి

దొర్నిపాడు: విద్యుదాఘాతంతో ఓ టిప్పర్‌ డ్రైవర్‌ మృతి చెందాడు. అర్జునాపురం – నందింపల్లె గ్రా మాల మధ్య రోడ్డు నిర్మా ణ పనులు జరుగుతున్నా యి. బనగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామానికి చెందిన హరికృష్ణ(25) టిప్పర్‌లో కంకర అన్‌లోడ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది. లిఫ్ట్‌ద్వారా టిప్పర్‌ ట్రాలీ ఎత్తే క్రమంలో పైన ఉన్న కరెంట్‌ తీగలను గమనించ లేదు. దీంతో విద్యుత్‌ సరఫరా కావడంతో విద్యుదాఘాతంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ప్రవళ్లిక ఉన్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు రూరల్‌ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

వెల్దుర్తి: జాతీయ రహదారిపై మదార్‌పురం సమీపంలోని కోళ్ల ఫారం ఆవరణలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డోన్‌ పట్టణానికి చెందిన అల్లాబకాష్‌ మదార్‌పురం వద్ద కోళ్ల ఫారంలో నాటు కోళ్ల పెంపకం చేపట్టాడు. ఇతని మిత్రులు డోన్‌ పట్టణం సుందర్‌సింగ్‌ కాలనీకి చెందిన సురేష్‌(24), అమ్రేశ్‌ నాయక్‌లు బుధవా రం రాత్రి అక్కడికి చేరుకుని మద్యం సేవించారు. మద్యం అయిపోవడంతో సురేష్‌, నాయక్‌లు వెల్దుర్తికి వచ్చి మద్యం తీసుకువెళ్లి మళ్లీ తాగారు. వీరిలో అల్లాబకాష్‌, నాయక్‌ ఇద్దరు గురువారం ఉదయం 9 గంటల సమయంలో నిద్రలేచారు. ఈ సమయంలో సురేష్‌లో చలనం లేకపోవడంతో 108కు సమాచారమిచ్చారు. వారు సంఘట నా స్థలికి చేరుకుని సురేష్‌ అప్పటికే మృతి చెందినట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సీఐ యుగంధర్‌, ఎస్‌ఐ నరేశ్‌ సంఘటనాస్థలి కి చేరుకుని విచారించారు. ఆ సమయంలో అమ్రే శ్‌ నాయక్‌ హైవే రోడ్డు దాటే సమయంలో కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు తల్లి ఎల్లవేణమ్మ అనుమానం వ్యక్తం చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేశారు. క్లూస్‌ టీం అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించింది.

పాణ్యం ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా విజయభాస్కర్‌ 1
1/1

పాణ్యం ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా విజయభాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement