శ్రీగిరిలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కుతోంది. శివరాత్రి బ
అత్యాచారం కేసులో
నిందితుడికి యావజ్జీవం
కోవెలకుంట్ల: 65 ఏళ్ల మతిస్థిమితం సరిగా లేని ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ కామాంధుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. గురువారం కోవెలకుంట్ల ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. 2023 సెప్టెంబర్ 24వ తేదీన సంజామలకు చెందిన ఓ వృద్ధురాలు కోవెలకుంట్ల బస్టాండ్ వద్ద ఊరికి వెళ్లేందుకు వేచి ఉంది. ఇంటి వద్ద వదిలిపెడతానని అదే గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరి మద్యం మత్తులో బైక్‌పై ఎక్కించుకున్నాడు. స్థానిక గుంజలపాడు రహదారిలో వైపు తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ వృద్ధురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఘటన జరిగిన తర్వాత రాత్రి సమయంలో రైల్వేస్టేషన్ మీదుగా నడుచుకుంటూ వెళుతూ వృద్ధురాలు తీవ్రరక్తస్రావంతో ఓ పెట్రోల్ బంకు సమీపంలో కింద పడిపోయింది. గుర్తించిన పెట్రోల్‌బంకు నిర్వాహకులు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు వృద్ధురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుౖగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజి ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కేసు విచారణ సమయంలో నిందితుడు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో నంద్యాల మేజిస్ట్రేట్ ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయడంతో కోవెలకుంట్ల సీఐ హనుమంతునాయక్, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నాగన్న, కానిస్టేబుల్ చాంద్‌బాషా నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్ ఖైదీగా ఉంచి కేసుకు సంబంధించిన సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ మేరకు అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో కర్నూలు న్యాయమూర్తి లక్ష్మిరాజ్యం నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే లా చేసిన సీఐ హనుమంతునాయక్, ఎస్‌ఐలు మల్లికార్జునరెడ్డి, మౌలానీ, పోలీసు సిబ్బందిని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ అభినందిస్తూ రివార్డుకు ప్రతిపాదించారు.
శ్రీగిరికి చేరుకుంటున్న పాదయాత్ర భక్తులు
రావణ వాహన సేవ పూజలు నిర్వహిస్తున్న అర్చకులు
ఆలయం ..
పుష్పశోభితం
ఇరుముడితో
పూజల్లో పాల్గొన్న మంత్రి ఆనం, కలెక్టర్, ఈఓ, చైర్మన్, ఎమ్మెల్యే తదితరులు
శివ శివ శంకరా..