పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులు

Feb 13 2026 3:49 AM | Updated on Feb 13 2026 3:49 AM

పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులు

పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులు

టెక్నాలజీ సహాయంతో

సకాలంలో స్పందన

నంద్యాల: భార్యతో గొడవపడి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బయటకు వెళ్లిన వ్యక్తి ఆచూకీని టూటౌన్‌ పోలీసులు కనుగొని పిల్లలను రక్షించారు. టూటౌన్‌ ఎస్‌ఐ సురేష్‌ తెలిపిన మేర కు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పట్టణంలో బుధవారం గిరినాథ్‌ సర్కిల్లో నివాసముండే శివకుమార్‌ ఉదయం కుటుంబ కలహాలతో భార్యతో గొడవపడి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బైక్‌పై వెళ్లాడు. అనంతరం పిల్లలను స్కూల్‌ వద్ద నుండి తీసుకొని వచ్చి తన స్కూటీపై ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో హుటాహుటిన పిల్లల తల్లి సుబ్బలక్ష్మి, ఆమె తరఫు బంధువులు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు శివకుమార్‌ ఫోన్‌ను ట్రాక్‌ చేయగా శివకుమార్‌ పిల్లలను తీసుకొని గుత్తి రోడ్డులో వెళ్తున్నట్లు చూపించింది. వెంటనే స్పందించిన పోలీసులు పిల్లల తల్లిని, వారి బంధువులతో పాటు వెహికల్‌లో వెళ్లి శివకుమార్‌ గుత్తిలో వారి సోదరుని ఇంటికి వెళ్లడంతో అక్కడికి చేరుకొని కుటుంబ సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలని పిల్లలను ఇలా బెదిరించి తీసుకురావడం నేరమని మందలించి పిల్లలను నంద్యాలకు తీసుకొని వచ్చి వారి బంధువులకు అప్పగించారు. పిల్లలను కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఏదైనా చేస్తాడని భయపడిన స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, పోలీసులు వెంటనే స్పందించి క్షేమంగా తన పిల్లలను నాకు అప్పగించినందుకు తల్లి సుబ్బలక్ష్మి ఈ సందర్భంగా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల జిల్లాలో కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు జరుగుతున్న క్రమంలో వెంటనే పోలీసులు స్పందించి వారిని క్షేమంగా ఇంటికి తీసుకొని రావడంతో టూ టౌన్‌ పోలీసులను పట్టణ ప్రజలు, అభినందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement