ప్చ్.. ఇది చంద్రన్న మందే!
ఇది కూల్‌డ్రింకేనా! తాగుదామా, వద్దా..
బ్రహ్మగుండంలో కోతులెక్కువ. ఏ ద్విచక్ర వాహనం ఆలయ ప్రాంతంలో పార్క్ చేసి వెళ్లినా వాహనాల బ్యాగులు చించి మరీ అందులో ఏమున్నా ఎత్తుకెళ్తుంటాయి. ప్రస్తుతం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న బ్రహ్మగుండంలో వ్యాపారులు అంగళ్లు వేసుకోవడంలో, ఉత్సవ నిర్వాహకులు, అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. గురువారం ఓ కోతికి ఏదో ఓ ద్విచక్ర వాహనం బ్యాగ్‌లో ఓ నైన్‌టీ మద్యం బాటిల్ దొరికింది. బాటిల్ తీసుకుని వెళ్లి చెట్టుపై కూర్చుంది. అలవాటైన కూల్ డ్రింక్ అనుకుందేమో బాటిల్ మూత తీసేందుకు విఫల ప్రయత్నం చేసింది. రాకపోవడంతో పళ్లతో కొరికింది. చిన్న ధారలా మద్యం చిమ్మడంతో తాగేందుకు ప్రయత్నించింది. వాసన నచ్చలేదో, లేక నాసిరకం అనుకుందో కానీ విసిరికొట్టి వెళ్లిపోయింది. – వెల్దుర్తి
మూత తీసి టేస్ట్ చూద్దాం..
ఇది చంద్రన్న
మందులా ఉంది.. ప్చ్!
ప్చ్.. ఇది చంద్రన్న మందే!
ప్చ్.. ఇది చంద్రన్న మందే!


