రాష్ట్రంలో అరాచక పాలన
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు రూరల్: రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అరాచన పాలన సాగిస్తోందని, టీడీపీ గుండాలు విధ్వాంసాన్ని సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. మాజీ మంత్రి, గుంటూరు జిల్లా అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు శనివారం హత్యాయత్నానికి పాల్పడి, ఆయన కారుకు నిప్పటించి కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఆదివారం ఆలూరులోని అంబేడ్కర్ సర్కిల్‌లో ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. అంబటి రాంబాబుపై అక్రమ కేసులు బానాయించి అరెస్టు చేయడం అమానుష చర్యగా అభివర్ణించారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమన్నారు. దేశంలో అంబేడ్కర్ రాజ్యాంగం నడుస్తుంటే రాష్ట్రంలో మాత్రం లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకు
అంబటి అక్రమ అరెస్టు
కలియుగదైవం వేంకటేశ్వర స్వామి ప్రమాదం లడ్డూలో కల్తి జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. సిట్ ఆధికారుల విచారణలో భాగంగా లడ్డూలో కల్తీ జరగలేదని కోర్టుకు నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు అంబటి రాంబాబుపై దాడికి పాల్పడి అక్రమ అరెస్టు తెరలేపారనన్నారు. అరెస్టులతో ఒక్క కార్యకర్త కూడా భయపడే ప్రసక్తి లేదని చెప్పారు.
పోలీసుల అత్యుత్సాహం
చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల అత్యుత్సాహం చేస్తున్నారని ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేసి రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడిపిస్తున్నారని విమర్శించారు. ఎల్లాకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదని పోలీసులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. నిరసనలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున కో–ఆప్షన్ మెంబర్ బాషా, జిల్లా నాయకులు చిన్న ఈరన్న, నాయకులు వెంకటేషులు, శివ, హనుమంతప్ప, భాస్కర్, నెట్టెకల్లు, బి.మల్లికార్జు, ఎల్లప్ప, వరుణ్, జే.వీరేష్, ధనుంజయ, ఈరన్న, రొక్కప్ప, చంద్ర, నాగేష్, బి.ఈరన్న, నాగప్ప, రామలింగ, మల్లప్ప, వీరభద్రి, వీరేష్, మునెప్ప, సురేంద్ర, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.


