అహోబిలేశుడికి నీరాజనం
ఆళ్లగడ్డ: అహోబిలేశుని పార్వేట పల్లకీ గురువారం చింతకుంటకు చేరింది. ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లె నుంచి తెల్లవారు జామున ఎంవీనగర్‌కు చేరుకుంది. అక్కడ ఎంపీడీఓ కార్యాయలయం, డీఎస్పీ, పోలీస్ సర్కిల్ కార్యాలయాల్లో విశేష పూజలు అందుకున్న అనంతరం చింతకుంట గ్రామం చేరుకుంది. గ్రామ పొలిమేరకు చేరుకున్న ఉత్సవమూర్తులకు సంప్రదాయ ప్రకారం వీఆర్వో బారెడ్డి రాజగోపాల్‌రెడ్డి పెద్ద ఎత్తున గ్రామస్తులతో కలిసి వెళ్లి స్వాగతం పలికారు అనంతరం పల్లకీని భుజాలపై మోస్తూ మొదటి తెలుపుపై కొలువుంచారు. ఉత్సవ మూర్తులు శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాదవరదస్వాములను గ్రామస్తులు బారులు దీరి దర్శించుకున్నారు. గ్రామంలోని పలు తెలుపులపై కొలువుదీరిన ఉత్సవ పల్లకీకి ప్రజలు విశేష పూజలు చేశారు. ప్రధాన వీధుల్లో బొమ్మలు, గాజుల అంగళ్లు, రంగుల రాట్నాలు ఏర్పాటు చేయడంతో గ్రామంలో తిరునాల వాతావరణం నెలకొంది.
ఇద్దరు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు అరెస్ట్
● మద్యం మత్తులో బస్సు డ్రైవింగ్
● ప్రయాణికుల ఫిర్యాదుతో అరెస్ట్
పాణ్యం: మద్యం మత్తులో ఉన్న ఇద్ద రు ప్రైవేటు ట్రావె ల్స్ బస్సు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి 26 మంది ప్రయాణికులతో కావేరి ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. మార్గమధ్య లో గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పాణ్యం సమీపంలో బస్సు డ్రైవర్ రహదారిపై ఉన్న బారికేడ్స్‌ను ఢీకొని, ర్యాష్ డ్రైవింగ్ చేయడాన్ని ప్రయాణికులు గమనించారు. వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బలపనూరు వద్ద బస్సును నిలిపేశారు. ఇద్దరు డ్రైవర్లను బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం సేవించినట్లు గుర్తించారు. ప్రయాణికులను వేరే బస్సుల్లో హైదరాబాద్‌కు పంపించి కావేరి బస్సును స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్‌కు చెందిన డ్రైవ ర్లు ఆంజినేయులు, విశ్వనాథ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు.
అహోబిలేశుడికి నీరాజనం


