గో సంరక్షణనిధికి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

గో సంరక్షణనిధికి విరాళాలు

Feb 6 2026 7:58 AM | Updated on Feb 6 2026 7:58 AM

గో సం

గో సంరక్షణనిధికి విరాళాలు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ నిధి పథకానికి పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. గురువారం కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన దాత శ్రీరామమూర్తి రూ.1,23,456 విరాళాన్ని పర్యవేక్షకులు టి.హిమబిందుకు అందజేశారు. అలాగే అనంతపురానికి చెందిన బి.రూపేష్‌సింగ్‌ రూ.5 లక్షల విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్‌కు అందజేశారు. విరాళాలను అందించిన దాతలను దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలు, జ్ఞాపికలు అందించి సత్కరించారు.

గూడూరు బార్‌ లైసెన్స్‌ కోసం లాటరీ

కర్నూలు(సెంట్రల్‌): గూడూరులోని బార్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ తీసినట్లు డీఆర్వో సి.వెంకట నారాయణ మ్మ తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో జిల్లా ప్రొమిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధి కారి ఎం.సుధీర్‌బాబుతో కలసి వచ్చిన నాలుగు దరఖాస్తులను పరిశీలించారు. వారి సమక్షంలోనే సక్సెస్‌ఫుల్‌ అండ్‌ రిజర్వ్‌ దరఖాస్తులను నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ సూపరిటెండెంట్‌ రామకృష్ణారెడ్డి, సీఐలు మంజుల, చంద్రహాస్‌ పాల్గొన్నారు.

105 ఏళ్ల వృద్ధురాలి మృతి

కొత్తపల్లి: ఎం.లింగాపురం గ్రామంలో 105 ఏళ్ల చిమ్మె రత్న మ్మ వృద్ధాప్య సమస్యలతో మృతి చెందింది. ఈమె 1921లో జన్మించినట్లు కుటుంబీకులు తెలిపారు. దాదాపు 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం వయస్సు పైబడడంతో గురువారం ఆమె మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఈమెకు నలుగురు కుమారులుగా, ప్రస్తుతం కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు 40కిపైగా ఉంది.

బైక్‌ల దొంగ అరెస్ట్‌

నంద్యాల: బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న దొంగను నంద్యాల వన్‌టౌన్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. వన్‌టౌన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద గత నెల 25వ తేదీన కర్నూలు పట్టణానికి చెందిన నరసప్ప అనే వ్యక్తి బస్టాండ్‌ బయట బైక్‌ పార్కింగ్‌ చేసి బస్సు విచారణ కోసం వెళ్లి వచ్చేలోపు బైక్‌ కనిపించలేదు. ఈ చోరీపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నంద్యాల పట్టణానికి చెందిన షేక్‌ మహమ్మద్‌వలి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. గురువారం పట్టణంలోని చెరువు కట్ట వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా మహమ్మద్‌ వలిని గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు. అతని వద్ద నుంచి స్కూటీ, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు వలిపై గతంలో కర్నూ లు, ఓర్వకల్లు, ఆత్మకూరు, బేతంచెర్ల, నంద్యాల పోలీసు స్టేషన్ల పరిధిలో 9 కేసులు నమో దు అయ్యాయన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి నంద్యాల కోర్టులో మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరుచగా రిమాండ్‌కు ఆదేశించారన్నారు.

పురాతన శివాలయం పరిశీలన

నందవరం: రాయచోటి గ్రామంలోని పశ్చిమ చోళుల కాలం నాటి చరిత్ర కలిగిన పురాతన శివాలయాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. గురువారం గ్రామంలోని శివాలయంలో పురావస్తు శాఖ సహాయ సంచాలకులు స్వామి నాయక్‌ ఆదేశాల మేరకు టెక్నికల్‌ అసిస్టెంట్‌ మహేంద్రనాయుడు, సైట్‌ ఇంజనీర్‌ జి.పి శ్రీనివాసులు గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆలయాన్ని సందర్శించి కొలతలు చేపట్టారు. ఈ సందర్భంగా టెక్నికల్‌ అసిస్టెంట్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర పురావస్తు శాఖ గ్రామంలో వెయ్యేళ్లు పైగా చోళుల కాలం నాటి శివాలయ పునరుర్ధణ చర్యలు చేపడుతునట్లు తెలిపారు.

గో సంరక్షణనిధికి  విరాళాలు 1
1/4

గో సంరక్షణనిధికి విరాళాలు

గో సంరక్షణనిధికి  విరాళాలు 2
2/4

గో సంరక్షణనిధికి విరాళాలు

గో సంరక్షణనిధికి  విరాళాలు 3
3/4

గో సంరక్షణనిధికి విరాళాలు

గో సంరక్షణనిధికి  విరాళాలు 4
4/4

గో సంరక్షణనిధికి విరాళాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement