పద్మావతికే.. ఫలహారం! | - | Sakshi
Sakshi News home page

పద్మావతికే.. ఫలహారం!

Feb 6 2026 7:58 AM | Updated on Feb 6 2026 7:58 AM

పద్మావతికే.. ఫలహారం!

పద్మావతికే.. ఫలహారం!

శ్రీశైలంటెంపుల్‌: వడ్డించే వాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏంటి.. అన్న చందంగా తయారైంది శ్రీశైలంలో పద్మావతి ఏజెన్సీ పరిస్థితి. రాష్ట్రంలో ముఖ్యమైన నాయకుడికి బంధువు సంస్థ అని చెప్పుకుంటూ ఏడు ప్రముఖ ఆలయాల్లో పద్మావతి ఏజెన్సీ శానిటేషన్‌, హౌస్‌కీపింగ్‌ పనులు దక్కించుకుంది. శ్రీశైలంలో కూడా ఆ సంస్థ చేపట్టిన శానిటేషన్‌, హౌస్‌కీపింగ్‌పై భక్తుల్లో 40 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వానికి కావాల్సిన వ్యక్తికి చెందిన ఏజెన్సీ కావడంతో అధికారులు ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ..నిబంధనలకు విరుద్ధగా దేవస్థాన అధికారులు వ్యవహరిస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు 11రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల నిర్వహణలో శానిటేషన్‌ అతి ముఖ్యమైనది. శానిటేషన్‌ పనుల నిర్వహణ కోసం ప్రతి ఏడాది జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో టెండర్లు నిర్వహించి, 1000 మందితో 11 రోజుల పాటు శానిటేషన్‌ పనులు చేపడతారు. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా శ్రీశైలంలో శానిటేషన్‌ పనులు నిర్వహిస్తున్న పద్మావతి ఏజెన్సీకే అప్పగించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభు త్వ పెద్దలతో పద్మావతి ఎండీకి సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఎవరు నో చెప్పకుండా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. బ్రహ్మోత్సవాల శానిటేషన్‌ పని విలువ సుమారు రూ.45 లక్షలు వరకు ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో జిల్లా పంచాయతీ అధికారుల ద్వారానే టెండర్లు నిర్వహించి శానిటేషన్‌ పనులు చేశారు. అయితే ఈ ఏడాది మాత్రం గత నిబంధనలకు భిన్నంగా పద్మావతి ఏజెన్సీకే మల్లన్న ఫలహారం అందేలా ట్రస్ట్‌బోర్డు, అధికారులు చక్రం తిప్పారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కలెక్టర్‌ ఆధ్వర్యంలో

శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు

ఏటా జిల్లా పంచాయతీ అధికారి

ఆధ్వర్యంలో శానిటేషన్‌ టెండర్ల

నిర్వహణ

ఈ ఏడాది టెండర్లు

నిర్వహించకుండా

పద్మావతి ఏజెన్సీకే అప్పగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement