బకాయిల వసూళ్లపై కఠినంగా వ్యవహరించాలి
కర్నూలు(సెంట్రల్): పెండింగ్ పన్ను వసూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్‌ను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జీఎస్టీ వసూళ్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా 20వ తేదీలోపు రిటర్న్స్ ఫైల్ చేయాలన్నారు. లావాదేవీలు లేకపోయినా నిల్ రిటర్న్స్ దాఖలు చేయడం మరువకూడదన్నారు. నకిలీ బిల్లులతో వ్యాపారం చేస్తూ పన్ను ఎగ్గొడుతున్న బోగస్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మైనింగ్ లైసెన్సులు ఇచ్చే ముందే రిజిస్ట్రేషన్ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. బకాయిలు ఉన్న వారి ఆస్తులు బదిలీ జగరకుండా రిజిస్ట్రేషన్ శాఖ, నిధుల రికవరీకి బ్యాంకర్లు కమర్షియల్ ట్యాక్స్ శాఖ తగిన సహకారం అందించాలన్నారు. జీఎస్‌టీ రేట్లు తగ్గినప్పుడు ఆ ప్రయోజనం నేరుగా వినియోగదారులకు అందుతుందో లేదో లీగల్ మెట్రాలజీ అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. కమర్షికల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ మాట్లాడుతూ పన్ను వసూళ్లు, బకాయిలు తదితర అంశాలను వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


