నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
● ఆర్టీసీ, ఏపీఎన్‌జీఓలతో పాటు ఉద్యోగులు, కార్మికులు, కర్షకుల మద్దతు
● కర్నూలు నగరంలో ఆటోల బంద్‌కు పిలుపు
కర్నూలు(సెంట్రల్): లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలైన సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఏఐయూటీయూసీ సంఘాలు సర్వం సన్నద్ధమయ్యాయి. సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా మద్దతు కూడగట్టారు. ఏపీఎన్‌జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, అన్ని వర్గాల కార్మికులు, కర్షకులు, పెన్షనర్లు మద్దతు ప్రకటించారు. దీంతో తెల్లావారుజామున 5 గంటల నుంచే జనజీవనం స్తంభించే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. మరోవైపు అన్ని వర్గాల ప్రజలు సమ్మెలో పాల్గొంటుండడంతో ప్రైవేట్, ప్రభుత్వ వాణిజ్య సంస్థలు స్తంభించనున్నాయి. కర్నూలు నగరంలో ఆటోల బంద్‌కు పిలుపునిచ్చారు.


