మయూర వాహనాధీశా పాహిమాం | - | Sakshi
Sakshi News home page

మయూర వాహనాధీశా పాహిమాం

Feb 12 2026 7:39 AM | Updated on Feb 12 2026 7:39 AM

మయూర

మయూర వాహనాధీశా పాహిమాం

శ్రీశైలంటెంపుల్‌: ఇల కైలాసమైన శ్రీగిరి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవరోజు బుధవారం శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయాల ప్రాంగణంలోని అలంకార మండపంలో మయూర వాహనాన్ని సుగంధ పుష్పాలతో ముస్తాబు చేశారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను తోడ్కొనివచ్చి మయూర వాహనంపై ఉంచారు. ఉభయదేవాలయల ప్రధాన అర్చకులు, వేదపండితులు అర్చనలు, ప్రత్యేక హారతులు ఇచ్చారు. మయూరవాహన సేవ పూజా కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేయించారు. ఆలయంలోని పరివార దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మయూర వాహనంపై దర్శనమిచ్చిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు.

శాస్త్రోక్తంగా పట్టువస్త్రాల సమర్పణ

శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవా ల్లో బుధవారం ఉదయం కాణిపాకం శ్రీవరసిద్ది వినా యకస్వామి దేవస్థానం తరఫున ధర్మకర్తల మండలి అధ్యక్షులు మణినాయుడు, ఈఓ పెంచలకిషోర్‌, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు ఉదయం ఆ దేవస్థాన ఈఓ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శ్రీస్వామిఅమ్మవార్లకు సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ డీఈఓ ముద్దాడ రవిచంద్ర పట్టువస్త్రాలు తీసుకు రాగా శ్రీశైల దేవస్థాన ఈవో, అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగ తం పలికారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.

శ్రీశైలంలో నేడు: గురువారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు రావణవాహన సేవ నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభు త్వం తరుఫున స్వామిఅమ్మవార్లకు దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

శ్రీగిరిలో వైభవంగా

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

స్వామిఅమ్మవార్లను దర్శించుకుని

పరవశించిన భక్తులు

కాణిపాకం, టీటీడీ తరఫున

మల్లన్నకు పట్టువస్త్రాల సమర్పణ

నేడు రావణవాహనంపై

దర్శనమివ్వనున్న స్వామిఅమ్మవార్లు

మయూర వాహనాధీశా పాహిమాం1
1/1

మయూర వాహనాధీశా పాహిమాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement