వడివడిగా.. శ్రీగిరి వైపు | - | Sakshi
Sakshi News home page

వడివడిగా.. శ్రీగిరి వైపు

Feb 12 2026 7:39 AM | Updated on Feb 12 2026 7:39 AM

వడివడ

వడివడిగా.. శ్రీగిరి వైపు

ఇలకై లాసంలో బ్రహ్మోత్సవ శోభ

నల్లమల అడవుల్లో పాదయాత్ర చేస్తున్న భక్తులు

కాలినడకన శ్రీగిరి చేరుకుంటున్న భక్తులు

శ్రీశైలంటెంపుల్‌: ఇలకై లాసం భక్తుల శివనామస్మరణతో మార్మోగుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. క్షేత్ర సందర్శనకు భక్తుల సంఖ్య పెరగడంతో శ్రీగిరిలో బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. క్షేత్రానికి విచ్చేసిన భక్తులు మల్లన్న దర్శనానికి బారులుతీరారు. వేలాది మంది భక్తులు నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్రగా తరలివస్తున్నారు. శివమాలధారణ చేసిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి జ్యోతిర్ముడి కలిగిన భక్తులకు మల్లన్న స్పర్శదర్శన భాగ్యం కల్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం ఉచిత, రూ.200, రూ.500, వృద్ధులు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు వేచి ఉండే ఉచిత కంపార్ట్‌మెంట్లలో తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, పాలు పంపిణీ చేస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలు నిండిపోయాయి.

తరలివస్తున్న భక్తజనం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు నల్లమల అటవీప్రాంతం నుంచి పాదయాత్రగా శ్రీగిరి చేరుకుంటున్నారు. భక్తిశ్రద్ధలతో ఈ పాదయాత్ర వెంకటాపురం నుంచి నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కై లాస ద్వారం మీదుగా 40 కిలోమీటర్ల మేర సాగుతుంది. కాగా భక్తుల శివనామస్మరణతో నల్లమల అటవీప్రాంతం మార్మోగుతోంది

శివస్వాములకు మల్లన్న స్పర్శదర్శనం

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివమాల ధరించిన భక్తులకు దేవస్థానం విస్త్రత ఏర్పాట్లు చేసింది. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు చంద్రావతి కల్యాణ మండపంలో నాలుగు కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేసింది. అలాగే విడతల వారీగా జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. గురువారం సాయంత్రం 7.30 గంటల వరకు మాత్రమే స్పర్శదర్శనాన్ని కల్పిస్తారు.

జ్యోతిర్ముడి సమర్పించేందుకు

ప్రత్యేక ఏర్పాట్లు

శివమాలధారణ ఆచరించిన భక్తులకు జ్యోతిర్ముడి సమర్పించేందుకు పాతాళగంగ మార్గంలోని శివదీక్ష శిబిరాలలో జ్యోతిర్ముడి సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా అర్చకులను ఏర్పాటు చేశారు. అలాగే శివదీక్ష శిబిరాల వద్ద శివస్వాములు సేదతీరేందుకు తాత్కాలిక వసతి, తాగునీరు, టాయిలెట్స్‌ ఏర్పాటు చేశారు.

మల్లన్న దర్శనానికి

పోటెత్తుతున్న భక్తజనం

పాదయాత్రగా తరలివస్తున్న భక్తులు

జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు

విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనం

వడివడిగా.. శ్రీగిరి వైపు1
1/2

వడివడిగా.. శ్రీగిరి వైపు

వడివడిగా.. శ్రీగిరి వైపు2
2/2

వడివడిగా.. శ్రీగిరి వైపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement