బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు ఉపయోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు ఉపయోగించుకోవాలి

Feb 8 2026 4:02 AM | Updated on Feb 8 2026 4:02 AM

బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు ఉపయోగించుకోవాలి

బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు ఉపయోగించుకోవాలి

ఏపీ టెలికాం

చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ శేషాచలం

కర్నూలు (హాస్పిటల్‌): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఏపీ టెలికాం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.శేషాచలం అన్నారు. కర్నూలు బిజినెస్‌ ఏరియా సాధిస్తున్న ఫలితాలను సమీక్షించేందుకు శనివారం ఆయన కర్నూలు వచ్చారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌ కార్యాలయంలో ఉద్యోగులు, వ్యాపార భాగ స్వాముల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు బిజినెస్‌ ఏరియాలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ హబ్‌ అభివృద్ధికి తగిన టెలికాం సౌకర్యాలను బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోందని, పారిశ్రామికవేత్తలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఎఫ్‌టీటీహెచ్‌ ప్లాన్‌లో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పార్క్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో కేవలం రూ.399కే 50 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో 3300 జీబీ డేటాను, అపరిమితమైన కాల్స్‌ సౌకర్యాలను సంవత్సరం పాటు అందిస్తుందన్నారు. సంవత్సరం తర్వాత నెలకు రూ.449గా ప్లాన్‌ మారుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రాంచైజీలు, టీఐపీల సమస్యలను తెలుసుకుని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గడచిన మూడ త్రైమాసికాలకు మంచి ప్రతిభ చూపిన డివిజన్‌ ఇంజినీర్లు, బీబీఎంలు, ఫ్రాంచైజీలు, టీఐపీలకు ప్రోత్సా హాక సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కర్నూలు బిజినెస్‌ ఏరియా ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ జి.రమేష్‌, డీజీఎం కె.రాజేశ్వరరావు, ఐఎఫ్‌ఏ డి.శ్రీలత, అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ టెలికాం

చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ శేషాచలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement