అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌పై క్రిమినల్‌ కేసు? | - | Sakshi
Sakshi News home page

అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌పై క్రిమినల్‌ కేసు?

Feb 7 2026 10:13 AM | Updated on Feb 7 2026 10:13 AM

అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌పై క్రిమినల్‌ కేసు?

అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌పై క్రిమినల్‌ కేసు?

ఆలూరు: హాలహర్వి మండలం నిట్రవట్టి రైతుసేవా కేంద్రంలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం. విజయ్‌పై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని జిల్లా మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌ రాజు, ఆలూరు ఏడీఏ చెంగల్‌రాయుడు నుంచి ఉత్తర్వులు వచ్చాయి. శుక్రవారం ఈ విషయాన్ని ఏఓ జిలానీ బాషా తెలిపారు. అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌గా నంద్యాల జిల్లాకు చెందిన ఎం. విజయ్‌ 2020 ఆగస్టు 17న నిట్రవట్టి రైతుసేవా కేంద్రానికి వచ్చాడు. రైతులకు అందుబాటులో ఉంటూ తొలుత రెండేళ్లు సక్రమంగా విధులు నిర్వర్తించాడు. ఎరువులు, సబ్సిడీ విత్తనాలు ఇస్తామని గ్రామ రైతుల నుంచి కొంత మొత్తం వసూలు చేసి గత ఏడాది నుంచి అదృశ్యమయ్యాడు. ఈ–క్రాప్‌ బుకింగ్‌లోనూ డబ్బులు వసూలు చేశాడు. గ్రామ రైతుల వద్ద రూ. 5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసి మార్క్‌ఫెడ్‌ అధికారులకు చెల్లించకుండా ఎగనామం పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని ఆలూరు ఏడీఏ, హాలహర్వి ఏఓకు మార్క్‌ఫెడ్‌ అధికారులు చెప్పారు. దీనిపై ఏఓ జిలానీ బాషా శుక్రవారం విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement