గొప్ప లక్ష్యాలను ఎంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గొప్ప లక్ష్యాలను ఎంచుకోవాలి

Feb 8 2026 4:02 AM | Updated on Feb 8 2026 4:02 AM

గొప్ప లక్ష్యాలను ఎంచుకోవాలి

గొప్ప లక్ష్యాలను ఎంచుకోవాలి

సినీ నటుడు

పద్మశ్రీ డాక్టర్‌ బ్రహ్మానందం

కర్నూలు సిటీ: విద్యార్థులు గొప్ప లక్ష్యాలను ఎంచుకుని పట్టుదలతో సాధించాలని సినీ నటుడు పద్మశ్రీ డా.బ్రహ్మానందం అన్నారు. శనివారం కర్నూలు నగరంలోఓ ఫంక్షన్‌ హాలులో రెసోనెన్స్‌ స్కూల్స్‌, కాలేజీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందంతో పాటు, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, రాజ్యసభ మాజీ సభ్యులు టీ.జి వెంకటేష్‌, రెసోనెన్స్‌ విద్యా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌, రాగమయూరి విద్యా సంస్థల అధినేత కె.జే రెడ్డిలు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బ్రహ్మానందం మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మార్కులు తక్కువ వచ్చాయని, పక్కంటి పిల్లలతో పోల్చీ తిట్టకూడదన్నారు. ఏ విషయాన్నైన ఒత్తిడితో కాకుండా ప్రేమగా చెప్పి ఒప్పించాలన్నారు. అక్కినేని నాగేశ్వరరావుకు చదువు రాకపోయినా సినీరంగంలో ఆయన ఎంతో గొప్పగా రాణించారన్నారు. రాయలసీమ ముఖ్య ద్వారం అయిన కర్నూలులో రెసోనెన్స్‌ విద్యా సంస్థలు 11 ఎకరాల్లో సువిశాలమైన ప్రాంతంలో సీబీఎస్‌ఈ సిలబస్‌ నర్సరీ నుంచి పదవ తరగతి వరకు డే స్కాలర్‌, రెసి డెన్షియల్‌ విధానంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రెసోనెన్స్‌ ఎండీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. హైదరాబాదులో ఏడేళ్లలోనే తిరుగులేని విజయాలను రెసోనెన్స్‌ విద్యా సంస్థలు సాధించాయన్నారు. అదే ప్రమాణాలతో ఇక్కడ కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement