దిగుబడి భళా..ధర డీలా!
మండల పరిధిలోని ముక్కమల్ల గ్రామంలో ఓ రైతు శనగ పంట ఇరగ్గాసింది.ఈ ఏడాది రబీ సీజన్‌లో వేసిన శనగ విత్తనానికి వాతవారణం అనుకులించడంతో రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చింది. ముక్కమల్ల గ్రామానికి చెందిన పోచ వెంకట రామిరెడ్డి రైతు ఐదు ఎకరాల్లో శనగ సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టాడు. నూర్పిడి చేశాక ఎకరాకు 14 క్వింటాలు దిగుబడి వచ్చింది. మంచి దిగుబడి అయినప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు దిగాలు చెందుతున్నాడు. ప్రభుత్వ స్పందించి శనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు
– సంజామల


