సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం
కర్నూలు(సెంట్రల్): నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియ ప్రాంగణంలో నవోదయ 2.0 లో భాగంగా రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యామ్నాయ ఉపా ధి కల్పనకు సంబంధించిన కర్నూలు నగరంలోని 20 మంది బంగారుపేట వాసులకు ఇండియన్ బ్యాంకు ద్వారా మంజూరైన ఆటోలు, తోపు డు బండ్లు, కంకర మిల్లర్లను కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరూ గౌరవంగా బతకాలని సూచించారు. నాటుసారా తయారీ మాని ముందుకు వచ్చిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపుతామని చెప్పారు. ఎకై ్సజ్ శాఖ డీసీ శ్రీదేవిమాట్లాడుతూ.. బంగారుపేటలో ఇంకా మిగిలిపోయిన వారందరూ సారాను కాయడం మాని స్వయం ఉపాధితో బతికేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం ద్వారా అర్థిక సాయం అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రూ.20 లక్షల విలువైన వాహనాలను కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబు, మెప్మా పీడీ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.


