అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్‌ఐ కేసీ తిరుపాలు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రంగారెడ్డి, చిన్నమ్మ దంపతుల కుమారుడు పార్థసారధిరెడ్డి (33) ఎంసీఏ పూర్తి చేసి హైదారబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం తల్లి చిన్నమ్మ చనిపోవడంతో రెండు నెలల క్రితం హైదరాబాద్ నుంచి గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. శనివారం ఉదయం గ్రామంలోని కొత్తపల్లె హుసేన్ పశువుల పాక వద్ద పార్థసారధిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని శరీరంపైన ఎలాంటి గాట్లు లేకపోవడంతో అనారోగ్యమా, ఇతర కారణమా అనేది పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి చూడాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌ఐ తిరుపాలు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, తండ్రి రంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


