గోరుకల్లు..కనిపించని పర్యాటక పరవళ్లు | - | Sakshi
Sakshi News home page

గోరుకల్లు..కనిపించని పర్యాటక పరవళ్లు

Feb 9 2026 7:26 AM | Updated on Feb 9 2026 7:26 AM

గోరుకల్లు..కనిపించని పర్యాటక పరవళ్లు

గోరుకల్లు..కనిపించని పర్యాటక పరవళ్లు

ఆదేశాలు రాలేదు

పర్యాటక ప్రదేశంగా గుర్తించని

చంద్రబాబు ప్రభుత్వం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో

భూమిని గుర్తించిన అధికారులు

పాణ్యం: జల సోయగాలతో అలరించే గోరుకల్లు జలాశయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భూమిని సేకరించినా పట్టించుకోవడం లేదు. భారీగా పర్యాటకులు వచ్చి తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని గోరుకల్లు గ్రామస్తులు ఆశించినా ఫలితం లేకుండా పోయింది. గోరుకల్లు జలాశయం వద్ద 86.43ఎకరాల భూమి అందుబాటులో ఉందని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు, యువకులు ఎంతో సంతోషించారు. అప్పట్లోనే గోరుకల్లుతో పాటు పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఐదు ఎకరాల్లో పర్యాటక అభివృద్ధి చేసేందుకు భూమిని కేటాయించారు. అయితే గత ప్రభుత్వంలో మొదలైన ప్రక్రియ ఎన్నికల కారణంగా 2024లో వాయిదా పడింది.

పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

గోరుకల్లును సందర్శించేందుకు వచ్చేవారు స్వల్పదూరంలో ఉన్న శ్రీ దుర్గాభోగేశ్వర స్వామి, శ్రీవల్లి సుబ్రమణ్యం స్వామి, శ్రీచౌడేశ్వరి అమ్మవారి ఆలయాలను చూడవచ్చు. నూతన పర్యాటక ప్రాంతాలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వంలో ఇంత వరకు ఎలాంటి సమీక్షలు చేపట్టలేదు. ఫైళ్లు కదలకపోవడంతో గోరుకల్లు గ్రామస్తులు నిరాశ చెందుతున్నారు.

ఉన్నతాధికారుల సూచనల మేరకు గోరుకల్లు వద్ద భూమి ఉందని ప్రతిపాదనలు పంపించాం. వాటికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదు.

– శుభకుమార్‌ ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement