డీఎస్పీ కార్యాలయం పక్కనే చోరీ యత్నం
ఆదోని అర్బన్: ఆదోని ఎస్‌కేడీ కాలనీలో డీఎస్పీ కార్యాలయం పక్కన నివాసముంటున్న ఇల్లులో దొంగలు చోరీ యత్నం చేశారు. ఇంట్లో నివాసం ఉంటున్న కృష్ణ, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గత గురువారం రోజున పని నిమిత్తం బెంగళూరుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న దొంగలు ఆదివారం రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టారు. మెయిన్ ద్వారం రాకపోవడంతో మెల్లగా జారుకున్నారు. చుట్టుపక్కల వారు సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందజేశారు. డీఎస్పీ కార్యాలయం పక్కనే దొంగలు పడితే ఇతర ప్రాంతాల్లో భద్రత ఉంటుందా అనే ఆందోళన ఆదోని ప్రజల్లో నెలకొంది.
ఐదేళ్లకే నూరేళ్లు
● రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
ప్యాపిలి: కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై వెంగళాంపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. అనంతపురం పట్టణం సిండికేట్ నగర్‌కు చెందిన ధనుంజయ, చంద్రకళ దంపతులతో పాటు ధనుంజయ సోదరి యమున, ఆమె పిల్లలు లాస్యశ్రీ, శశాంక్(5)తో కలసి సొంత కారులో హైదరాబాదుకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి అనంతపురం పట్టణానికి బయలుదేరారు. మార్గమధ్యలో వెంగళాంపల్లి వద్ద వెనుక నుంచి వచ్చిన ఐచర్ వాహనం కారును వేగంగా ఢీ కొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ సమయంలో కారులో నుంచి శశాంక్ ఎగిరి కింద పడటంతో తలకు బలమైన గాయాలైన అక్కడికక్కడే మృతి చెందాడు. ధనుంజయ, చంద్రకళ, యమున లాస్యశ్రీకి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలులో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చంద్రకళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న ప్యాపిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శతాధిక వృద్ధురాలి మృతి
మద్దికెర: పెరవలి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు పరమేశ్వరమ్మ (110) సోమవారం మృతిచెందారు. ఈమెకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వందేళ్ల వయస్సులోనూ తన తల్లి చాలా ఽఆరోగ్యంగా ఉండేవారని, తన పనులు తనే సొంతంగా చేసుకునేవారని కుమారుడు రామిరెడ్డి తెలిపారు. మృతిచెందే ముందు రోజు మాత్రం అన్నం తినలేకపోయారని చెప్పారు. తాను చిన్నతనంలో ఉన్న సమయంలో పెరవలికి మహాత్మాగాంధీ వచ్చారని తాను చూశానని అమ్మ చెప్పేవారని గుర్తు చేశారు.
పాదయాత్ర మార్గంలో నిషేధిత వస్తువులు సీజ్
ఆత్మకూరురూరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తుల నుంచి పలు నిషేధిత వస్తువులను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. నాగలూటి వద్ద ఏర్పాటు చేసిన చెక పోస్టులో యాత్రికుల బ్యాగ్‌లను తనిఖీ చేసి పంపుతున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులను అనుమతించడం లేదు. చివరకు బిస్కెట్ ప్యాకెట్ కవర్లకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. కవర్లు తీ సేసి, పేపర్లలో పెట్టి పంపుతున్నారు. రెండు లీటర్లు పైబడిన నీళ్ల బాటిళ్లకు అనుమతి ఇస్తున్నారు. పలువురు యాత్రికుల నుంచి గుట్కా ప్యాకెట్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
మంత్రాలయం రూరల్: ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మేకల రాఘవేంద్ర(22) అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన చెట్నెహళ్ళి గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. చెట్నెహాళ్లి గ్రామ సమీపంలో 167వ జాతీయ రహదారిలో ఇసుకను తరలిస్తూ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ రాఘవేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోర్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రాఘవేంద్రకు భార్య పద్మావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
డీఎస్పీ కార్యాలయం పక్కనే చోరీ యత్నం
డీఎస్పీ కార్యాలయం పక్కనే చోరీ యత్నం
డీఎస్పీ కార్యాలయం పక్కనే చోరీ యత్నం


