కమ్ముకొస్తున్న క్యాన్సర్‌! | - | Sakshi
Sakshi News home page

కమ్ముకొస్తున్న క్యాన్సర్‌!

Feb 4 2026 7:07 AM | Updated on Feb 4 2026 7:07 AM

కమ్ముకొస్తున్న క్యాన్సర్‌!

కమ్ముకొస్తున్న క్యాన్సర్‌!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన వారు

పెరుగుతున్న క్యాన్సర్‌ బాధితుల సంఖ్య వంశపారంపర్యం, కాలుష్యం, జీవన శైలిలో మార్పులే కారణం

కర్నూలు(హాస్పిటల్‌):రంగు రంగులతో అందంగా కనిపించే పదార్థాలు, గుమగుమలాడే ఘాటైన సువాసనలు మనిషిని ఇట్టే ఆకర్షిస్తాయి. ఆకర్షణీయంగా ఉన్న నిషేధిత రంగులను దట్టించి తయారు చేసిన పదార్థాలను చిన్నా పెద్దా తేడా లేకుండా ఆరగించేస్తున్నారు. అవి శరీరంలోకి వెళ్లాక క్రమంగా విషతుల్యం చేస్తున్నాయి. కొన్నిరోజులకు అవి క్యాన్సర్‌గా రూపాంతరం చెంది మనిషి ఆయువు తీస్తున్నాయి. ఇలాంటి పదార్థాల్లో స్వీట్స్‌, బేకరి ఐటమ్స్‌, ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌, ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింకులు, ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ఫుడ్‌లు, రంగులు కలిపిన చికెన్‌ పకోడీలు, గోబీమంచూరియాలు, బజ్జీలు, బిర్యానీలు, గ్రేవీ పదార్థాలు, పొగాకు ఉత్పత్తులు తదితరవి ఉంటున్నాయి. ఇటీవల కాలంలో వైద్యులు నిర్వహిస్తున్న శస్త్రచికిత్సల్లో ఈ విషయం వెల్లడైంది. నేడు ప్రపంచ క్యాన్సర్‌ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం.

క్యాన్సర్‌పై అవగాహన పెరగడంతో ప్రజలు లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. క్యాన్సర్‌ కేసుల సంఖ్య కూడా ఏటా పెరుగుతూనే ఉంది. కర్నూలులోని స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించే ఓపీకి 60 నుంచి 70 మంది వరకు రోజూ చికిత్స కోసం వస్తున్నారు. ఇన్‌పేషంట్లుగా నిత్యం 120 పడకలకు గాను 150 నుంచి 170 మంది చికిత్స పొందుతున్నారు. ప్రతిరోజూ మూడు మేజర్‌, మూడు మైనర్‌ కలిసి నెలకు 180 నుంచి 200 ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఆధునిక యంత్రాల ద్వారా 50 నుంచి 55 మంది దాకా రేడియోథెరపీ చేస్తున్నారు. ఇవేగాక ఒమెగా హాస్పిటల్‌, అమీలియో హాస్పిటల్‌, విశ్వభారతి క్యాన్సర్‌ హాస్పిటల్‌లలోన్లూ రోజూ 250 నుంచి 300 మంది దాకా క్యాన్సర్‌ రోగులు చికిత్స కోసం వెళ్తున్నారు. వీరిలో ఎక్కువగా నోటి క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌, జీర్ణకోశ క్యాన్సర్‌, పేగు క్యాన్సర్‌ కేసులు ఉంటున్నాయి.

క్యాన్సర్‌ రావడానికి కారణాలు

క్యాన్సర్‌ వ్యాధి రావడానికి 4 శాతం జన్యుపరంగా, 6 శాతం తీసుకునే నీరు, ఆహారం, 15 శాతం స్థూలకాయం (రొమ్ము, గర్భాశయం, పేగు, మూత్రపిండాల క్యాన్సర్లు), 40 శాతం పొగాకు (నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లు), 10 శాతం ఇన్‌ఫెక్షన్లు(హెచ్‌పీవీ, హెపటైటిస్‌ బి వల్ల వచ్చే కాలేయ క్యాన్సర్‌) కారణం. మిగిలిన 25 శాతం క్యాన్సర్ల (రక్తం, ఎముక, ప్యాంక్రియాస్‌ల క్యాన్సర్‌)లకు సరైన కారణాలు లేవు.

సంవత్సరం సర్జికల్‌ ఆంకాలజి మెడికల్‌ ఆంకాలజి రేడియేషన్‌ ఆంకాలజి

2019-20 8,596 10,846 8,306

2020-21 9,564 12,325 9,325

2021-22 10,396 14,214 10,103

2022-23 12,659 15,045 12,435

2023-24 14,269 16,568- 13,993

2024-25 13,326 17,245- 14,328

2025-26 11,325 14,239- 11,958

క్యాన్సర్‌ లక్షణాలు

ముక్కు, నోటి నుంచి రక్తస్రావం, గడ్డలు ఏర్పడటం, రొమ్ము క్యాన్సర్‌లో రొమ్ము వద్ద చను మొనలో ద్రవం కారడం, చర్మంలో మార్పు, పేగుల్లో బల్లలు ఏర్పడటం, పురీషనాళంలో నొ ప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో నిరంతర దగ్గు, కఫంలో రక్తం పడటం, ఛాతినొప్పి, బ్రెయిన్‌ క్యాన్సర్‌లో భరించలేని తలనొప్పి, వికారం, వాంతులు, అవయవాల్లో బలహీనత. క్యాన్సర్‌ లక్షణాలు దాని రకంపై ఆధారపడి ఉంటాయి.

స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితంగా వైద్యం

నేడు ప్రపంచ క్యాన్సర్‌

అవగాహన దినం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement