రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

Feb 4 2026 7:07 AM | Updated on Feb 4 2026 7:07 AM

రేషన్

రేషన్‌ బియ్యం పట్టివేత

కర్నూలు(సెంట్రల్‌) : మండల పరిధిలోని ఈ తాండ్రపాడు సమీపంలో బొలెరో వాహనంలో 23 బ్యాగుల్లో తీసుకెళ్తున్న 1050 కేజీల రేషన్‌ బియ్యాన్ని సివిల్‌ సప్‌లై అధికారులు వెంబడించి పట్టుకున్నారు. ఎరుకల రాముడు అనే వ్యక్తి పందుల కోసం బియ్యం తీసుకెళ్తన్నట్లు మంగళవారం సమాచారం రావడంతో డీఎస్‌ఓ ఎం.రాజారఘవీర్‌ ఆధ్వర్యంలో బృందం దాడి చేసింది. బియ్యం స్వాధీనం చేసుకొని నిందితుడిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

శతాధిక వృద్ధుడి మృతి

కొలిమిగుండ్ల: కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా స్వయంగా తన పనులు తానే చేసుకునే తిమ్మనాయినపేటకు చెందిన శతాధిక వృద్దుడు ఖాశీం సాహెబ్‌ (103) మంగళవారం సహజ మరణం చెందాడు. మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేసి నిద్ర కు ఉపక్రమించే సమయంలో కన్ను మూశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 1923లో ఆయ న జన్మించాడు. స్వగ్రామం కొలిమిగుండ్ల మండలంలోని అబ్దులాపురం కాగా తిమ్మనాయినపేటకు చెందిన నూరూబ్‌ను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. భార్య పన్నెండేళ్ల క్రితం మృతి చెందింది. వీరికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. నాలుగు తరాలను చూసిన ఖాశీం సాహెబ్‌ చివరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తానే చేసుకునేవారు. బీపీ,షుగర్‌ వంటి వ్యాధులు కూడ లేకపోవడం గమనార్హం.

అక్రమ మద్యం ధ్వంసం

డోన్‌ టౌన్‌: వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యా న్ని మంగళవారం డోన్‌ ఎక్స్‌జ్‌ పోలీసులు ధ్వంసం చేశారు. పట్టణ శివారులో ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 680 లీటర్ల నాటు సారా, దాదాపు 261 లీటర్ల మద్యంను అసిస్టెంట్‌ ఎక్స్‌జ్‌ సూపరింటెండెంట్‌ రాముడు, నంద్యాల,డోన్‌ ఎక్స్‌జ్‌ సీఐలు లక్ష్మణ్‌, వరలక్ష్మి, ఎస్‌ఐ సోమశేఖర్‌, పట్టణ సీఐ ఇంతియాజ్‌బాషా ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. అలాగే పట్టుబడిన 8 వాహనాల్లో 7 వేలం వేయగా రూ.96,200 ఆదాయం సమకూరినట్లు వారు తెలిపారు. ఎవరైనా అక్రమ మద్యం తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

వైన్‌షాపులో చోరీ

కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెలోని చింతలాయిపల్లె రోడ్డులో ఉన్న పీఆర్‌ వైన్‌ షాపులో సోమవారం అర్ధారాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు నల్లటి దుస్తులు ధరించి వైన్‌ షాపునకు చెందిన రేకుల షెడ్డు రేకు తొలగించి లోపలకు వెళ్లారు. రూ.40 వేలు విలువ చేసే మద్యం బాటిళ్లు, రూ.1.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు వైన్‌షాపులో క్యాషియర్‌గా పని చేసే పుట్ట బాలమద్దిలేటి మంగళవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు.

రేషన్‌ దుకాణాల్లో

విజిలెన్స్‌ తనిఖీ

నంద్యాల(అర్బన్‌): పట్టణంలోని చాంద్‌బాడ, సరస్వతి నగర్‌లలో ఉన్న 52, 119 రేషన్‌ షాపుల్లో మంగళవారం ఉమ్మడి కర్నూలు జిల్లా విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బియ్యం నిల్వల్లో తేడాలు ఉండటంతో సంబంధిత డీలర్లపై 6ఏ కేసు నమోదు చేశారు.

రేషన్‌ బియ్యం పట్టివేత 1
1/2

రేషన్‌ బియ్యం పట్టివేత

రేషన్‌ బియ్యం పట్టివేత 2
2/2

రేషన్‌ బియ్యం పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement