అత్యాచార యత్నం కేసులో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అత్యాచార యత్నం కేసులో నిందితుడి అరెస్ట్‌

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

అత్యాచార యత్నం కేసులో నిందితుడి అరెస్ట్‌

అత్యాచార యత్నం కేసులో నిందితుడి అరెస్ట్‌

బనగానపల్లె: యనకండ్ల గ్రామానికి చెందిన ఎస్సీ వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన నిందితుడు దాట్ల అమర్‌నాథ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం డోన్‌ డీఎస్పీ శ్రీనివాసులు కేసు వివరాలను మీడియాకు వివరించారు. ఈ నెల 15వ తేదీన ఘటన జరగడంతో ఆమె మానసికంగా కుంగిపోయి వారం రోజుల తర్వాత మృతి చెందిందన్నారు. కేసు నమోదు చేసిన సీఐ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్‌ఐ కల్పన దర్యాప్తు చేపట్టారన్నారు. నిందితుడు దాట్ల అమర్‌నాథ్‌ రెండు కేసులు ఉన్నాయని, గ్రామంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విచారణలో తెలిందన్నారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, అత్యాచార యత్నం కేసులు నమోదు చేసి, అరెస్టు చేశామన్నారు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేసి సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement