బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల ఆర్థిక స్థితిగతులను
వైఎస్సార్‌సీపీ హయాంలో 6,97,147 మందికి రూ.2049.22 కోట్లు
బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు రుణాలు అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎస్సీ, బీసీ రుణాలను అందిస్తున్నట్లు గత ఏడాది ఏప్రిల్ నెలలో హడావిడి చేసింది. ఆయా కార్పొరేషన్లకు బడ్జెట్‌ను కూటా కేటయించినట్లు నమ్మబలికింది. పేదలు అనేక అకష్టాల మధ్య దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అయితే నేటి వరకు రుణాలపై ఎలాంటి స్పష్టత కనిపించడం లేదు. జగనన్న పాలనలో అనేక పథకాల ద్వారా ఆన్ని వర్గాల ప్రజలకు నగదు బదిలీ జరిగింది.
– ఆర్ వెంకటేశ్వర్లు,
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు
చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర కార్పొరేషన్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. ఆయా కార్పొరేషన్లకు పాలక వర్గాలను నియమిస్తున్నారే కానీ, నిధులు కేటాయించడం లేదు. ఇప్పటి వరకు ఆయా కార్పొరేషన్ల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన దాఖాలాలు లేవు. నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఆచరణలో శూన్యం. ఆయా కార్పొరేషన్ల కార్యాలయాలు బోసి పోయాయి. అధికారులకు కేవడం రికవరీకే పరిమితమవుతున్నారు. ప్రస్తుత బడ్జెట్‌లోనైనా ఆయా కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి.
– గౌస్‌దేశాయ్, సీపీఎం జిల్లా కార్యదర్శి
కర్నూలు(అర్బన్): స్వయం ఉపాధికి రుణాలు ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఉత్తిదే అని తేలిపోయింది. పేద వర్గాలను సంతృప్తి పరిచేందుకు గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పూర్తి స్థాయిలో రుణాలు అందిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించింది. కష్టాల మధ్య ఆన్‌లైన్ చేసిన తమ దరఖాస్తులు ఏ దశలో ఉన్నాయో, కూడా తెలుసుకోలేని పరిస్థితి నెలకొనింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్భాటాన్ని చూసి పేద వర్గాలకు చెందిన యువత పోటీపడి వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే చివరకు ఎస్సీ రుణాలకు యూనిట్లు మారుస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మాట మార్చింది. బీసీ రుణాలకు సంబంధించి కూడా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత, పేద వర్గాలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.
సైట్‌ను క్లోజ్ చేసి చోద్యం!
జిల్లాలోని 2,034 మంది బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.41.23 కోట్ల మేర సబ్సిడీపై రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం 2025 ఏప్రిల్ నెలలో ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనను నమ్మి దాదాపు 27 వేల మంది అనేక కష్టాల మధ్య దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన, మండలాలు, మున్సిపాలిటీల వారీగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. తీరా నేడో, రేపో రుణాలు అందుతాయనే సంతోషంతో ఉన్న బీసీ వర్గాలకు రుణాలకు సంబంధించిన సైట్ క్లోజ్ చేశారనే చావు కబురును చల్లగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీసీ రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మండలాలు, మున్సిపాలిటీల నుంచి కూడా ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకోరాదని తేల్చేశారు. దీంతో గత తొమ్మిది నెలలుగా దరఖాస్తు చేసుకున్న వారందరు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
దిక్కుతోచని స్థితి
జిల్లా షెడ్యూల్డు కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తం 973 మందికి రూ.40.73 కోట్ల మేర సబ్సిడీ రుణాలను అందిస్తున్నట్లు గత ఏడాది ఏప్రిల్ 4న వార్షి ప్రణాళికలను విడుదల చేశారు. అర్హులైన ఎస్సీలకు రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ( 40 నుంచి 60 శాతం వరకు సబ్సిడీ ) రుణాలను అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన వారు ఏప్రిల్ 14 నుంచి మే 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేసింది. దీంతో వేల సంఖ్యలో నిరుద్యోగులు తమకు అనుభవం ఉన్న రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఉన్నా మే నెల 11న దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్ ఓబీఎంఎంఎస్ క్లోజ్ అయ్యింది. అయితే సైట్‌ను ఎందుకు క్లోజ్ చేశారంటే ... లబ్ధిదారులకు అనుకూలమైన యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా యూనిట్లను మారుస్తున్నామంటూ ప్రభుత్వం బుకాయిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వివిధ యూనిట్ల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
పథకం లబ్ధిపొందిన వివిధ వర్గాలు జమ అయిన మొత్తం
(రూ.కోట్లలో)
వైఎస్సార్ చేయూత 1,24,045 రూ.905.80
వైఎస్సార్ ఆసరా 2,49,976 రూ.568.28
కళ్యాణమస్తు, షాదీ తోఫా 2952 రూ.23.71
జగనన్న తోడు 92,739 రూ.126.81
వైఎస్సార్ బీమా 4578 రూ.45.49
వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు 29,520 (గ్రూపులు) రూ.140.36
జగనన్న చేదోడు 1,02,452 రూ.102.45
వైఎస్సార్ కాపునేస్తం 26,152 రూ.39.22
ఈబీసీ నేస్తం 64,733 రూ.97.10
మొత్తం: 6,97,147 రూ.2,049.22
అదే దారిలో మైనారిటీ, గిరిజన రుణాలు..
బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా అందించాల్సిన రుణాల్లో జాప్యం చోటు చేసుకోగా, మైనారిటీ కార్పొరేషన్‌లో అరకొరగా దరఖాస్తులను స్వీకరించి వెంటనే నిలిపివేసినట్లు సమాచారం. గిరిజన కార్పొరేషన్ ద్వారా అందించాల్సిన రుణాలకు సంబంధించిన వార్షిక ప్రణాళిక నేటికి కూడా రూపొందించనట్లు తెలుస్తోంది.
ఎస్సీ, బీసీలకు తొమ్మిది నెలలుగా
అందని రుణాలు
మైనారిటీ, గిరిజన రుణాలపై
పెదవి విప్పని చంద్రబాబు ప్రభుత్వం
ఎస్సీలకు రూ.40.73 కోట్లు, బీసీలకు
రూ.41.23 కోట్లు అంటూ ఆర్భాటం
గతేడాది ఏప్రిల్, మే నెలల్లో
ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ
ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్న
ఎస్సీ, బీసీ వర్గాలు
దరఖాస్తులపై నేటికి స్పష్టత కరువే
బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల ఆర్థిక స్థితిగతులను
బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల ఆర్థిక స్థితిగతులను


