పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు | - | Sakshi
Sakshi News home page

పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు

Feb 3 2026 7:20 AM | Updated on Feb 3 2026 7:20 AM

పిల్ల

పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు

ఉద్యోగాల పేరుతో మోసం

కర్నూలు(హాస్పిటల్‌): జాతీయ డీవార్మింగ్‌ డే సందర్భంగా ఈనెల 17న విద్యార్థులందరికీ నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రోగ్రామ్‌ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రైవేటు కాలేజీల్లోని విద్యార్థులకు మాత్రలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా మాతా శిశు మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. పుట్టిన బిడ్డకు 0–5 ఏళ్ల వరకు అందించాల్సిన వ్యాధి నిరోధక టీకాలను ఇచ్చేలా చూడాలన్నారు. సమావేశంలో రాష్ట్ర అధికారులు డాక్టర్‌ నాగేంద్ర బాబు, డాక్టర్‌ మల్లికార్జున, డీపీఎంఓ డాక్టర్‌ శైలేష్‌ కుమార్‌, డెమో ప్రకాష్‌ రాజ్‌ పాల్గొన్నారు.

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించండి

కర్నూలు(అగ్రికల్చర్‌): డయల్‌ యువర్‌ సీఎండీ, డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాలకు వచ్చే విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరువ తీసుకోవాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్‌ భవన్‌లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించారు. బిల్లింగ్‌, పోల్స్‌ తదితరాలకు సంబంధించిన సమస్యలను వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఎస్‌ఈ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్‌ పాల్గొన్నారు.

కర్నూలు: రైల్వే, ఆదాయ పన్ను శాఖలో నా అల్లుడు, స్నేహితుడి కుమారుడికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముంబైకి చెందిన ప్రవీణ భద్రినారాయణ ఖండేల్‌వాల్‌, మిథున్‌ దాస్‌లు రూ.20 లక్షలు తీసుకుని మోసం చేశారని కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన మన్సూర్‌ అహ్మద్‌, దేవదాయ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.10 లక్షలు తీసుకుని ఇద్దరు వ్యక్తులు మోసం చేశారని పత్తికొండ లక్ష్మీనగర్‌కు చెందిన లోకేష్‌ బాబు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ను కలసి ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పక్కనున్న క్యాంప్‌ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 125 ఫిర్యాదులు వచ్చాయి. ఉద్యోగాల పేరుతో మోసాలు, ఆన్‌లైన్‌ నగదు దోపిడీ, కుటుంబంలో వేధింపులు, ఆస్తి తగాదాలపై ఎక్కువమంది ఫిర్యాదు చేశారు. వాటన్నిటిపై చట్ట పరి ధిలో విచారణ జరిపి పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్‌, సీఐలు శివశంకర్‌, రమేష్‌, విజయలక్ష్మి తదితరులు కూడా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

పీజీఆర్‌ఎస్‌లో తమ సమస్యలు

చెప్పుకుంటున్న అర్జీదారులు

పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు  1
1/1

పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement