రెవెన్యూ సమస్యలే అధికం
కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) సోమవారం నిర్వహించారు. మొత్తం 238 అర్జీలు రాగా అందులో రెవెన్యూ క్లినిక్‌లకు సంబంధించినవి అధికంగా 136 ఉన్నాయి. అర్జీలు ఇచ్చినవారు సంతృప్తి చెందేలా పరిష్కారాలు చూపాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఏఒక్క అర్జీ కూడా నిర్ణీత సమయంలోపు పరిష్కారం కాకుండా ఉండకూడదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని ఆదేశించారు. అర్జీలకు సరైన ఎండార్స్‌మెంట్ ఇస్తే పరిష్కారానికి సులభం అవుతుందని తెలిపారు. ప్రజల నుంచి జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ అర్జీలను స్వీకరించారు.కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చిరంజీవి పాల్గొన్నారు.


