చౌడేశ్వరి మాతా.. రక్షమాం!
శ్రీ చౌడేశ్వరీ దేవి తిరునాల సందర్భంగా సోమవారం సాయంత్రం కోడుమూరులో వైభవంగా రథోత్సవం నిర్వహించారు. తొలుత అమ్మవారి రథానికి దైవచార అటకార సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవం ప్రారంభమైంది. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు ‘చౌడేశ్వరి మాతా.. రక్షమాం’ అంటూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోడుమూరు సీఐ తబ్రేజ్, ఎస్‌ఐ ఎర్రిస్వామి తమ సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
– కోడుమూరు రూరల్
చౌడేశ్వరి మాతా.. రక్షమాం!


