46 ఏళ్ల తర్వాత.. | - | Sakshi
Sakshi News home page

46 ఏళ్ల తర్వాత..

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

46 ఏళ్ల తర్వాత..

46 ఏళ్ల తర్వాత..

కర్నూలు(సెంట్రల్‌): కోడుమూరు మండలం లద్దగిరి జెడ్పీ పాఠశాలకు చెందిన 1979–80వ బ్యాచ్‌ పూర్వపు విద్యార్థులు 46 ఏళ్ల తరువాత అపూర్వ సమ్మేళనం ద్వారా కలుసుకున్నారు. ఆదివారం కర్నూలు నగరంలోని ఎస్‌ కన్వెన్షన్‌ హాలులో అప్పటి విద్యార్థి, నేటి అనంతపురం డిప్యూటీ కలెక్టర్‌ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. 46 ఏళ్ల తరువాత మళ్లీ ఒకే వేదికపైకిరావడంతో బాల్య స్నేహితులందరూ ఆనాటి జ్ఞాపకాలను తలచుకొని భావోద్వేగానికి లోనయ్యా రు. పాఠశాల తరగతి గదులు, ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యార్థి జీవితంలోని మధుర క్షణాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్నారు. హోదాలు, బాధ్యతలను పక్కనబెట్టి మళ్లీ విద్యార్థులుగా మారిన ఆ మధుర క్షణాలు సమ్మేళానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒక్కటే నవ్వులు, కన్నీళ్లు, ఆనందం కలసి ఈ సమావేశాన్ని మరపురాని జ్ఞాపకంగా మార్చాయి. కాగా.. ఈ సమ్మేళనంలో 15 మంది పూర్వ విద్యార్థుల ఆత్మలకు శాంతి కలుగాలని కోరుకుంటూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా అప్పటి విద్యార్థి, సాహిత్యాభిమాని ఉమ్మరాజు చిన్న ఓబులేసు రచించిన శ్రీషిరిడి సాయి స్తోత్ర శతకాన్ని స్నేహితులు ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement